రికార్డ్ దిగుబడి సాధించి చూపించిన ఉపాధ్యాయురాలు –
ఎకరాకు 43 బస్తాల దిగుబడి అంటేనే కొన్ని ప్రాంతాలలో గొప్ప. అలాంటిది ఏకంగా అర ఎకరంలోనే ఈ దిగుబడి సాధించి రైతు లోకం నుంచే ఔరా అనిపించుకుంటున్నారు ఓ ఉపాధ్యాయురాలు . …
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది.
అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు కళాశాలలో లో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని గమనించి నిత్యం పొలానికి తీసుకెళ్లేవాడు.
అంతేకాదు ఆమె కళాశాలలో చేరినా రోజూ పొలానికి వెళ్లి వచ్చాకే కాలేజీకి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఎమ్మెస్సీ బీఈడీ కూడా పూర్తి చేసి టీచర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది.
అయితే వ్యవసాయం మీద మక్కువ ఉండడంతో ఓ రైతునే పెళ్లి కూడా చేసుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్తగా శ్రీవరి అనే వంగడాన్ని కనిపెట్టడంతో సదరు విత్తనం గురించి తెలుసుకుని దాన్ని పండించాలని నిర్ణయం తీసుకుంది.
అలా ప్రసన్న అనుకున్నదే తడవుగా సంబంధిత అధికారులను కలిసి విత్తనాలను తీసుకుని పంటలు వేసింది. కానీ మొదటి రెండు సార్లు విఫలమైంది.
అయితే ఈ సారి ఎలాగైనా సదరు విత్తనంతో మంచి దిగుబడి రాబట్టాలనుకుంది. ఈ క్రమంలో కృత్రిమ ఎరువుల జోలికి పోకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఎరువులను వాడింది.
అయితే ఈ సారి ఆమె అనుకున్నట్టుగానే అత్యంత ఎక్కువగా దిగుబడి సాధించింది. సాధారణంగా ఒక ఎకరా వరి పొలానికి దాదాపుగా 40 బస్తాలు పండుతాయి, కానీ ప్రసన్న చేసిన సాగుతో, శ్రీవరి విత్తనం కారణంగా ఆమె అర ఎకరం పొలంలోనే ఏకంగా 43 బస్తాలు (3223 కిలోలు) వరి పండింది.ఇప్పుడు ప్రసన్న దృష్టి బిందు సేద్యంపై పడింది. ఈ విధానంలో పంటలను పండిస్తూ పేరు తెచ్చుకోవాలన్నది ఆమె కోరిక. ఆమె ఆశ నెరవేరాలని మనమూ ఆశిద్దాం.
ఈ క్రమంలో మొదట్నుంచీ ప్రసన్న చేస్తున్న సాగును, ఆమె వ్యవసాయ పద్ధతులను అధికారులు రిజిస్టర్‌లలో నమోదు కూడా చేశారు.
దీంతో చివరికి ఆమె సాధించిన దిగుబడి రికార్డు స్థాయిలో ఉండడంతో ఆమెకు రూ.5 లక్షల నగదు కూడా ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చారు . అందించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తున్నారు . బోయింగ్ 787 కి ఇటువంటి దుర్ఘటన జరగడం ఇదే ప్రధమం అని చెపుతున్నారు . ..
-విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే కూలిపోయింది . .. ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ప్రకటించిన టాటా గ్రూప్ . .
అహ్మదాబాద్ లో ఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా . .. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
మృతులలో 169 మంది భారతీయులు . .53 మంది బ్రిటీషర్లు – ఏడుగురు పోర్చుగల్ దేశీయులు . ఒక కెనడియన్ .. మొత్తం 230 మంది . ఇద్దరు పైలెట్స్ , పదిమంది విమాన సిబ్బంది ఉన్నారు .
విమాన ప్రమాదం నుంచి 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు బయటపడ్డారు
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787 విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘ఏఏఐబీ డెరెక్టర్ జనరల్, ఏజెన్సీలోని ఇన్వెస్టిగేషన్ డైరెక్టరర్ సహా ఇతర అధికారులు ఇప్పుడు అహ్మదాబాద్ బయలుదేరుతారు’ అని సదరు అధికారి తెలిపారు.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఏఏఐబీ – భారత గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు, అలాగే ఇండియన్ ఎయిర్ స్పేస్‌లో జరిగే విమాన ప్రమాదాలకు, తీవ్రమైన ఘటనలకు బాధ్యత వహిస్తుంది. వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలను సూచిస్తుంది.
ఇనీషియల్ రిపోర్ట్! ‘విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు మాకు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి మేము కృషి చేస్తున్నాం’ అని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాద స్థలంలో ….
విమాన ప్రమాదం నుంచి ఒకరు మృత్యుంజయులైనట్టు అహ్మదాబాద్ CP జీఎస్ మాలిక్ తెలిపారు. 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. విమాన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న అహ్మదాబాద్ CP, నివాస ప్రాంతంలో కూలినందువల్ల సంఖ్య ఎక్కువే ఉండే అవకాశముందన్నారు. విమానం కూలిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికుడు బయటికొచ్చినట్టు తెలుస్తోంది
హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటల్లో చెప్పలేని హృదయ విదారకఎం . .” అని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు . బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని, బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు అధికారులతో మాట్లాడినట్లు మోదీ చెప్పారు.
పాకిస్తాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ, బ్రహ్మోస్ క్షిపణులను విరివిగా ఎందుకు తయారు చేయలేము ?
ఏ దేశానికి మనం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలన్నా . .. రష్యా అనుమతి తీసుకోవాల్సిందే . అనుమతి అంటే కండిషన్ లాగా కాకుండా . .. మిత్రత్వంతో కూడినదిగా… అని కూడా చెప్పుకోవచ్చు . ..
”ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని తొమ్మిది వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసినప్పుడు, ఆ ప్రభావం ఉపఖండం దాటి చాలా దూరం ప్రతిధ్వనించింది. ఈ సూపర్‌సోనిక్ క్షిపణుల వల్ల కలిగే ఖచ్చితత్వం, వేగం మరియు విధ్వంసం బిగ్గరగా మరియు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. భారతదేశం ఇక ముందు ప్రపంచ స్థాయి భారీ ఆయుధాల కొనుగోలుదారు మాత్రమే కాదు, అది ఉత్పత్తిదారు కూడా అయింది .
అత్యంత ఖచ్చితమైన, అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో పేరొందిన బ్రహ్మోస్, సైనిక వర్గాలలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను పొందింది. దీనిని భూమి, గాలి లేదా సముద్రం నుండి ప్రయోగించవచ్చు, మాక్ 3 వేగంతో (ధ్వని వేగం కంటే మూడు రెట్లు) ప్రయాణిస్తుంది మరియు దాని లక్ష్యం నుండి ఒక మీటర్ లోపల దాడి చేయగలదు. రఫీకి మరియు మురీద్ వంటి పాకిస్తాన్ స్థావరాలపై దాని భీకర దాడి వారి వైమానిక రక్షణలను నిస్సహాయంగా చేసింది. పాకిస్తాన్ ఒక్క బ్రహ్మోస్‌ను కూడా ఎగురవేయకుండా ఆపగలదు.
2022లో మొదటి అధికారిక కొనుగోలుదారుగా మారిన ఫిలిప్పీన్స్ వంటి దేశాలు త్వరలోనే వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్ట్, యుఎఇ, సౌదీ అరేబియా మరియు బ్రెజిల్‌లను అనుసరించాయి – ఇవన్నీ పాకిస్తాన్ రక్షణలను దెబ్బతీసిన క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.అయితే, ఒక ముఖ్యమైన అడ్డంకి ఉంది. క్షిపణి పూర్తిగా భారతీయమైనది కానందున భారతదేశం బ్రహ్మోస్‌ను స్వేచ్ఛగా అమ్మకూడదు.
భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) మరియు రష్యా యొక్క NPO మాషినోస్ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ ఫలితంగా బ్రహ్మోస్ ఏర్పడింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణి ఉత్పత్తిని పర్యవేక్షిస్తుంది, కానీ మూడవ దేశానికి ప్రతి అమ్మకానికి రష్యా ఆమోదం అవసరం. రెండు దేశాలకు క్షిపణి సాంకేతికతలో 50-50 వాటా ఉంది. అందువల్ల, రష్యా అధికారిక అనుమతి లేకుండా భారతదేశం దానిని ఎగుమతి చేయదు.
ఈ వీటో అధికారం ప్రధాన వ్యూహాత్మక చిక్కులను కలిగి ఉంది. ఉదాహరణకు, ఇండోనేషియా వంటి దేశం ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రష్యా దాని భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు లేదా ఇప్పటికే ఉన్న పొత్తుల కారణంగా సంకోచిస్తే చర్చలు నిలిచిపోవచ్చు. సౌదీ అరేబియా లేదా UAE వంటి మధ్యప్రాచ్య దేశాలు, మాస్కోతో సన్నిహిత US సంబంధాలు మరియు సంక్లిష్ట సంబంధాలు కలిగిన దేశాల విషయంలో, రష్యాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉండవచ్చు. మరియు దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలలో, ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, రష్యా బ్రహ్మోస్ అమ్మకాల ద్వారా పరోక్షంగా ఒక వైపు ఆయుధాలు సమకూర్చుకోవడం ద్వారా ఘర్షణలు పెరగకుండా ఉండటానికి ఇష్టపడవచ్చు.
భారతదేశం కీలక రక్షణ భాగస్వాములుగా భావించే దేశాలు కూడా క్రెమ్లిన్ ఆమోదం కోసం వేచి ఉండాలి.
ఈ సంక్లిష్టతకు తోడుగా, భారతదేశం క్షిపణి సాంకేతిక నియంత్రణ పాలన (MTCR) పట్ల నిబద్ధత ఉంది, ఇది సభ్య దేశాలు కాని దేశాలకు 300 కిలోమీటర్లకు మించి పరిధి కలిగిన క్షిపణులను ఎగుమతి చేయడాన్ని నిరోధించే ప్రపంచ ఒప్పందం. కట్టుబడి ఉండటానికి, బ్రహ్మోస్ ఎగుమతి వెర్షన్ 290 కి.మీ పరిమిత పరిధిని కలిగి ఉంది – భారతదేశం ఇప్పుడు ఉపయోగించే విస్తరించిన-శ్రేణి వేరియంట్‌ల కంటే చాలా తక్కువ, వీటిలో కొన్ని 800 కి.మీ వరకు చేరుకోగలవని నివేదించబడింది.
కాబట్టి, భారతదేశానికి రష్యన్ ఆమోదం అవసరం మాత్రమే కాదు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు క్షిపణి సామర్థ్యాలను కూడా పరిమితం చేయాలి.
ఈ ద్వంద్వ పరిమితి, రష్యా సహ-యాజమాన్యం మరియు MTCR నియమాలు, భారతదేశ రక్షణ ఆశయాలలోని వైరుధ్యాన్ని బహిర్గతం చేశాయి. ఒక వైపు, భారతదేశం ప్రపంచ ఆయుధ ఎగుమతిదారుగా మారాలని మరియు విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటుంది.
వ్యంగ్యం ఇంతకంటే పదునుగా ఉండదు. పాకిస్తాన్‌పై భారతదేశం యొక్క సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిన అదే క్షిపణి ఇప్పుడు దాని ఆధారపడటాన్ని గుర్తు చేస్తుంది. న్యూఢిల్లీ దౌత్యం మరియు నిరోధ సాధనంగా బ్రహ్మోస్‌ను ఉపయోగించాలనుకుంటే, అది మాస్కోతో ఎగుమతి నిబంధనలను తిరిగి చర్చించుకోవాలి లేదా ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా స్వదేశీ ప్రత్యామ్నాయ అభివృద్ధిని వేగవంతం చేయాలి.అప్పటి వరకు, బ్రహ్మోస్ భారతదేశం యొక్క అత్యంత ప్రాణాంతక ఆయుధంగా ఉంటుంది, కానీ అది ప్రపంచ వేదికపై పూర్తిగా విడుదల చేయలేనిది.
5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా
మాకెప్పుడూ జబ్బులు రాలేదు..
6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు…
7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా
మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..
8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము.
బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము,
9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..
10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు…..
బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే.
మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు…..
అయినప్పటికీ..
మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము…
మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము…..
అందుకే మా విన్నపము ఏమంటే..
*భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి, ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.…….
మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు,
మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,
ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతామేమో . …. ఈ కధ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది . ఇలాంటి ఆలోచింపచేసే కధలు , వాస్తవాలను నేటి తరం పిల్లలకు ఏదోలా చేరవేయాలి . కనీసం ఒక్క్కసారైనా దీనిపై ఆలోచన చేస్తారు . అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తే . .. అటుగా అడుగులు వేసే ప్రయత్నం అయినా మొదలెడతారు . . పాజిటివ్ గా ఆలోచిద్దాం . ..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదంలో 99 శాతాన్ని పేదల కోసం వెచ్చించాలని నిర్ణయించారు . ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్‌కు (Gates Foundation) విరాళంగా ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్‌ను పూర్తిగా మూసెయ్యాలని నిర్ణయించుకున్నారు.గేట్స్ ఫౌండేషన్‌ను బిల్‌గేట్స్, మిలిందా 2000 సంవత్సరంలో స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్.
ప్రస్తుత లెక్కల ప్రకారం బిల్‌గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు. అలాగే దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి రాబోయే 20 ఏళ్లలో మరో 200 బిలియన్ డాలర్లు (రూ.16 లక్షల కోట్ల రూపాయలకు పైగా)ను కూడా ఖర్చుపెట్టబోతున్నారు. ఈ డబ్బును పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్‌కు ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ బఫెట్ కూడా భారీగా విరాళాలు అందజేస్తుంటారు.
10 మంది కుటుంబసభ్యులు, అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడి
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్‌పూర్‌లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి మరణించారు.
భారత్ చేపట్టిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతమయ్యారు. 10 మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. భారత్ దాడుల్లో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్యతో పాటు మరో ఐదుగురు మరణించినట్లు చెప్పాడు. జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం బహవల్‌పుర్‌లోని జామియా మస్జీద్ సుబాన్ అల్లాహ్ ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించినట్లు తెలిపాడు.
ఉగ్ర స్థావరాలే టార్గెట్ :
భారత దళాలు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోగల ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబాప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలుగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.
ఈ దాడిలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ 25 నిమిషాలపాటు బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అత్యంత కచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. పీఓకే ఉగ్రస్థావరాలతోపాటు పాక్‌లోని ఐదు ఉగ్రక్యాంపులను కూడా భారత్ ధ్వంసం చేసింది.
భారత్ చర్యలపై స్పందించిన పాక్..
ఈ ఆపరేషన్‌ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. అయితే, భారత్ తన చర్యలను కట్టిపెడితే తాము ప్రతి దాడికి దిగబోమని కాళ్లబేరానికి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్ కూడా పాక్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజార్చేలా దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామనని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. స్వీయ రక్షణ భారత దేశ హక్కు అని ముక్తకంఠంతో పేర్కొన్నాయి.