‘బెంగాల్​ బీజేపీ’ భారీ విజయం

Ram Maddipati

May 4, 2026

ఈ భారీ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే!

కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అనేక మంది నేతల కృషి-

– అత్యధికంగా 66 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్​ షోలు నిర్వహించిన అమిత్ షా

15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు పశ్చిమ బెంగాల్ లో .. బీజేపీ చెక్ పెట్టగలిగింది . చరిత్రలో తొలిసారిగా బంగాల్​లో కమలం పార్టీ పాగా వేయడం రికార్డ్ . కాషాయదళానికి దక్కిన ఈ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు > అనేది రాజకేయన్గా ఆసక్తికరం . ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయడం బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది . ఈ క్రమంలోనే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన బంగాల్ మాస్టర్ మైండ్స్​ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ .

ప్రధాని మోదీ

బెంగాల్ లో అధికారం చేపట్టాలని మోడీ ముందు నుంచీ బలంగా ప్రయత్నించారు . బీజేపీ గెలుపు బాధ్యతలను ప్రధాని మోదీ తన భుజాలపై వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. బంగాల్ సంప్రదాయంలో భాగమైన ఝాల్​మురి తినడంతో పాటు కాలీ మాత ఆలయాలను సందర్శించి ప్రజలను ఆకర్షించారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ క్యాడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అభివృద్ధి పనులతో పాటు డబుల్ ఇంజిన్​ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు .

అమిత్ షా చాణిక్యము . ..
బంగాల్​ గెలుపులో అమిత్ షా చాణక్య వ్యూహాలు ఎక్కువ ఫలితాలు నిచ్చాయి . బంగాల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అత్యధికంగా 65 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్​ షోలు నిర్వహించారు. ‘మిషన్ బంగాల్​’తో పార్టీ బూత్​ స్థాయి నుంచి బలోపేతం కోసం పనిచేశారు. స్థానిక నేతలను సమంవ్యం చేయగలిగారు . అమిత్‌షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే బీజేపీ ఏ స్థాయిలో దృష్టిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని తెలిపారు.

భూపేంద్ర యాదవ్​ ఇంచార్జ్ బాధ్యతలు . ..
బంగాల్​ గెలుపులో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​. ఎన్నికల నేపథ్యంలో గతేడాది బంగాల్​ ఇంఛార్జ్​గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​ను నియమించింది అధిష్ఠానం. సంస్థాగత వ్యవహరాలు, సమన్వయం చేయడంలో తెర వెనుక ఎంతో కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి ఏర్పాటు వరకు పాలుపంచుకున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలను గుర్తించి, తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేశారు. నెలరోజులపాటు బెంగాల్ లో ఎక్కువ సమయం గడిపి . .. ఎన్నికల నిర్వహణలో భూపేంద్ర యాదవ్​ కీలక పాత్ర పోషించారు.

శామిక్ భట్టాచార్య,, సువెందు అధికారి . ,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయంతో పాటు వ్యూహాలను అమలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, బూత్​ స్థాయి సన్నద్ధత, పార్టీ సంస్థాగత వ్యవస్థ పనితీరు విషయంలో సాయం అందించారు. అటు అమిత్ షా లాంటి నేతల ప్రసంగాలను స్థానిక బంగాలీలోకి అనువాదం చేస్తూ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్న సువేందు అధికారి, బంగాల్​లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దూకుడు ప్రచారం, అవినీతి, రాజకీయ హింస వంటి సమస్యలపై దృష్టి పెట్టడం, కీలక ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి కృషి చేశారు.

సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్‌ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్‌లో వేలాది ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. నందిగ్రామ్‌తోపాటు సింగూర్‌ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి, 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. తృణమూల్‌ సర్కారులో ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమత ప్రధాన అనుచరుడిగా, పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా సువేందు అధికారి ఎదిగారు. ఆ తర్వాత కాలక్రమేణా మమతతో సువేందుకు విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో ఆయన 2020లో టీఎంసీతో 22 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నారు . ఇవన్నీ బిజెపి గెలుపులో కీలకంగా ఉపయోగపడ్డాయి .

You May Also Like…