12 గంటల సమయం . . 15 లక్షల మొక్కలు . . గిన్నిస్ ప్రపంచ రికార్డు- మొక్కల సంరక్షణకు జియో ట్యాగింగ్-
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఏటేటా వాతావరణం వేడెక్కుతోంది. బెంగళూరు వంటి హరిత నగరాలలోను ఉష్టోగ్రతలు భరించరానివిగా ఉంటున్నాయి . గ్లోబల్ వార్మింగ్ నుంచి బెంగళూరు నగర ప్రజలకు రక్షణ కవచంగా బెంగళూరు డెవలప్మెంట్ అధారిటీ నడుంబిగించింది .
బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) 12 గంటల్లో 12.40 లక్షలకు పైగా మొక్కలను నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు సంపాదించింది. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందింతచింది. అందుగానూ ఈ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని గిన్నిస్ సంస్థ అధికారికంగా జారీ చేసింది.
2024 జులైలో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరం కేవలం 12 గంటల్లో 12.40 లక్షలకు పైగా మొక్కలను నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు సంపాదించింది. ఇప్పుడు బీడీఏ అదే వ్యవధిలో 15 లక్షల మొక్కలను నాటి ఆ రికార్డును అధిగమించింది. నాదప్రభు కెంపెగౌడ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బీడీఏ అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో కేవలం 12 గంటల్లో 15 లక్షల స్థానిక జాతి మొక్కలను నాటారు. ఈ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని గిన్నిస్ సంస్థ ఆదివారం అధికారికంగా జారీ చేయనుందని బీడీఏ అధికారులు తెలిపారు.
హరిత బెంగళూరు నిర్మాణానికి కృషి
వేలాది మంది పౌరులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వాలంటీర్లు, పర్యావరణ సంస్థలు పాల్గొన్నారు. పచ్చని, సుస్థిరమైన బెంగళూరు నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. నాదప్రభు కెంపెగౌడ లేఅవుట్, బనశంకరి ఆరో దశ, శివరామ కారంత్ లేఅవుట్, ఆక్సిజన్ ట్రీ పార్కులు, మియావాకీ అడవులు వంటి బీడీఏ అభివృద్ధి చేసిన పలు ఏరియాలలో ప్రాంతాల్లో మొక్కలను నాటారు.
350కిపైగా వివిధ జాతుల మొక్కలు
ఇందులో మామిడి, పనస, వేప, మర్రి, కానుగ, మారేడు, మహోగని వంటి వివిధ రకాల పండ్ల, ఔషధ మొక్కలతో సహా 350కిపైగా స్థానిక జాతుల మొక్కలను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పచ్చదనాన్ని విస్తరించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని బీడీఏ పేర్కొంది. “ఒక ఇల్లు – ఒక ఔషధ మొక్క” అనే నినాదంతో ఈ హరిత కార్యక్రమాన్ని నిర్వహించారు
జియో-ట్యాగింగ్
ప్రత్యేకంగా నాటిన 15 లక్షల మొక్కలకు జియో-ట్యాగింగ్ చేశారు. దీంతో ప్రతి మొక్క పెరుగుదలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో పాటు వెయ్యి మందికి పైగా సిబ్బంది మొక్కలను లెక్కించి రికార్డును ధ్రువీకరించారు. అలాగే మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణపై కూడా బీడీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ బాధ్యతను మూడేళ్లపాటు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో మొక్కల సంరక్షణ చేపట్టనుండగా, వాటికి అవసరమైన నీటిని బీడీఏ అందించనుంది.
‘గార్డెన్ సిటీ’గా బెంగళూరు
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిపై స్పందించారు. కెంపెగౌడ జయంతి సందర్భంగా 15 లక్షల మొక్కలు నాటడానికి నగరం మొత్తం ఏకమైందని అన్నారు. ఈ మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా, బెంగళూరుకు ‘గార్డెన్ సిటీ’గా ఉన్న గుర్తింపును తిరిగి తీసుకువచ్చే దిశగా మనం ఒక అడుగు వేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.


