వాతావరణ  మార్పులపై ఈ   అధ్యయనం అమోఘం

వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం అమోఘం

2058లో తలెత్తబోయే దుష్ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ తో స్టడీ

ఎన్జీటీ సూచనలతో అమరావతిలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం – వచ్చే నెల చివరికి నివేదిక సిద్ధం

” వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది . రాజధాని అమరావతిలో రానున్న దశాబ్దాలలో ఎదురు కాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి …. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచన మేరకు రాజధాని నగరానికి సంబంధించి వాతావరణ మార్పులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా సంభవించే దుష్ఫలితాలను నివారించేందుకు CRDA తయారు చేయిస్తోంది. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బహుళ జాతి సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ లోకల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇనీషియేటివ్స్‌- ఇక్లీ(ICLEI) ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధ్యయనం సాగుతోంది. అక్టోబరు చివరి నాటికి పూర్తి నివేదికను సమర్పించనుంది.

అమరావతి వాతావరణంపై విశ్లేషణ : రాజధాని అమరావతి నగరంలో వాతావరణంపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి గత వాతావరణ గణాంకాలను ఇక్లీ సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వాయు నాణ్యతపై ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా 0.22 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర పెరుగుదల కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రతి దశాబ్దానికి 0.32 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గణాంకాలు వివిరించారు . 2015 – 2024 కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా 4.5 మిల్లీమీటర్ల చొప్పున వార్షిక వర్షపాతం పెరుగుతోంది. పెరుగుదల ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో కనిపించింది. వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి. ప్రతి దశాబ్దానికి 2.6 రోజుల చొప్పున తరుగుదల నమోదైంది. కానీ వర్ష తీవ్రత మాత్రం పెరుగుతోంది.

2058 నాటికి వాతావరణ మార్పులు : రాజధానికి సంబంధించి నీటి సరఫరా, వృథా నీరు, వర్షపు నీరు, ఘన వ్యర్థాలు, రవాణా, విద్యుత్తు, భవనాలు, ఆరోగ్యం, హరితం, జీవవైవిధ్యం, గాలి నాణ్యత అంశాలపై ఇక్లీ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వనుంది. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతికి మొదటి దశలో 386 MLD నీరు, వైకుంఠపురం నుంచి రెండో దశలో 539 MLD చొప్పున 2058 నాటికి మొత్తం 925 MLD నీరు అవసరమవుతుందని అంచనా. 15 శాతం మేర నీటి నష్టాలు ఉంటాయని లెక్కగట్టారు.

2058 నాటికి వృథా నీరు 723 MLD వస్తుందని, ఈ నీటిని శుద్ధి చేసేందుకు 12 STPలు, 1 CETP నిర్మించాల్సి ఉంది. శుద్ధి చేసిన నీటిలో పచ్చదనం కోసం వినియోగించుకోవచ్చు. రాజధాని నగరంలో 2058 నాటికి రోజుకు 3,956 టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉంది. ఇందులో తడి చెత్త 2,028 టన్నులు కాగా, పొడి చెత్త 1,436 టన్నులు. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో విద్యుత్తు వినియోగం 220.5 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌. 2058 నాటికి డిమాండ్‌ 10,756 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌కు చేరుకోవచ్చని అధ్యయనంలో గుర్తించారు. సౌరవిద్యుత్తు డిమాండ్‌ 7,954 మిలయన్‌ కిలోవాట్‌ అవర్‌గా ఉంటుందని అంచనా.

అమరావతిలో సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీలు : అమరావతిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీల సెంటిగ్రేడ్‌. రాజధానిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేయాలన్నది బృహత్‌ ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి పచ్చదనం పెంచితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర తగ్గే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. పచ్చదనం తక్కువగా ఉన్న అనంతవరం, లింగాయపాలెం, నేలపాడు, వెంకటపాలెం, నవులూరులో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తేలింది.

H- 1బీ వీసాలకు ప్రత్యామ్నామ్మ్ ఏమిటి

H- 1బీ వీసాలకు ప్రత్యామ్నామ్మ్ ఏమిటి

అమెరికా చదువులలో ఉన్న యువత ఆందోళన… ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో టెన్షన్

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలని కళలు కంటున్నా యువత కలలకు బ్రేక్ పడినట్లవుతోంది . టెక్‌ సంస్థలకు కూడా విదేశీ నిపుణులను అమెరికాలోని శాఖల్లో నియమించుకోవాలన్న కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టెక్‌సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. దీంతో ఇప్పడు అందరీ దృష్టి ఎల్‌-1, ఓ-1 పడింది. అసలు ఈ వీసాలు ఏంటి? వాటి ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి హెచ్‌-1బీ వీసా కీలకమార్గంగా ఉంది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును రూ.లక్ష డాలర్లకు ట్రంప్ సర్కార్ పెంచింది. దీంతో ఫీజు భారం ఎక్కువగా మారడంతో టెక్‌ కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎల్‌-1, ఓ-1 వీసాలపై పడ్డాయి. పెరిగిన హెచ్‌-1బీ వీసా ఫీజుతో పోల్చుకుంటే వీటి ఫీజులు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. అటు దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కుడా హెచ్‌-1బీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నా వీటి ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. ఓ-1 వీసా కోసం 12 వేల డాలర్లు ఖర్చవుతుంది. వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసినవారిలో 93శాతం మందికి లభించింది. అదే హెచ్‌-1బీకి వచ్చిన దరఖాస్తుల్లో 73శాతం తిరస్కరణకు గురయ్యాయి.

ఎల్‌-1 వీసాలను బహుళజాతి సంస్థలు తమ విదేశీ శాఖల నుంచి అమెరికాలోని శాఖల్లో పనిచేయడానికి ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఎగ్జిక్యుటివ్స్‌, మేనేజర్లకు ఎల్‌-1ఏ, ఆ రంగంలో నిపుణులకు ఎల్‌-1బీ రకం వీసాలను జారీ చేస్తారు. అయితే ఎల్‌-1ఏ వీసా పొందే ఉద్యోగి సంస్థకు సంబంధించిన విదేశీ శాఖలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. అది కూడా ధరఖాస్తు చేసే నాటికి ముందు మూడేళ్లలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. కంపెనీ పేరంట్‌-సబ్సిడరీ బ్రాంచ్‌కి సంబంధం ఉండాలి. ఈ వీసా వస్తే భవిష్యత్తులో EB-1C గ్రీన్‌ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆర్థికఏడాదిలో అమెరికా జారీ చేసిన ఎల్‌-1 వీసాల్లో 26శాతం భారతీయులకు దక్కాయి. ఓ-1 వీసాలు ఆర్ట్స్‌, సైన్స్‌, విద్యారంగం, వ్యాపారం, అథ్లెటిక్స్‌ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే నాన్‌ఇమిగ్రెంట్‌ వీసా. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడ రంగంలోని వారికి ఓ-1ఏ వీసాలుజారీ చేస్తారు. కళలు, సినిమా, టెలివిజన్‌ రంగంలోని వారికి ఓ-1బీ జారీ చేస్తారు. దీనికి ఉన్న 8 ప్రమాణాల్లో కనీసం మూడింటినైనా అందుకోగలగాలి. ఈ వీసాను తొలుత మూడేళ్లకు జారీ చేసినా ఆ తర్వాత ఏడాది చొప్పున ఎంతకాలమైనా పొడిగిస్తారు. పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతేడాది 19,457 వీసాలను అమెరికా జారీ చేసింది. కాకపోతే హెచ్‌-1బీని భర్తీ చేసే స్థాయిలో ఇది ఉండదు. ఈ వీసా కోసం ఆయా రంగాల్లో అత్యంత నిష్ణాతుడిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

తిరుమల ప్రతిష్ఠకు కవచం: నకిలీ వార్తలపై  ఉక్కుపాదం

తిరుమల ప్రతిష్ఠకు కవచం: నకిలీ వార్తలపై ఉక్కుపాదం

చివరికి దేవుడ్ని కూడా వదలడంలేదు సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ . ఇపుడు అలాంటి దుర్మార్గులకు టీటీడీ ఉక్కుపాదం మోపబోతోంది .

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తితిదే కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇకపై తితిదేపై నకిలీ వార్తలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు

బ్రహ్మోత్సవాల సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు తితిదే పటిష్టమైన చర్యలు చేపట్టింది. తితిదే విజిలెన్స్ విభాగం, తిరుపతి పోలీసులు సంయుక్తంగా ఒక “ప్రత్యేక సామాజిక మాధ్యమ బృందాన్ని” ఏర్పాటు చేశారు. ఈ బృందం 24 గంటలూ సామాజిక మాధ్యమాలను పర్యవేక్షిస్తుంది. నకిలీ వార్తలను గుర్తించి, వాటిని వ్యాప్తి చేసే వారిపై దృష్టి సారిస్తుంది.

గత అనుభవాలతో కఠిన నిర్ణయం

గతంలో తితిదే అనేక దుష్ప్రచారాలను ఎదుర్కొంది. శ్రీవారి ఆభరణాల్లో ఒకటైన పింక్ డైమండ్ మాయమైందని జరిగిన ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణలో ఆ ఆరోపణలు అవాస్తవమని తేలింది. అలాగే, తితిదే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లిస్తున్నారని, అన్యమత ప్రచారం జరుగుతోందని తరచూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. శ్రీవారి దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసగించే నకిలీ వెబ్సైట్ల బెడద కూడా తీవ్రంగా ఉంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు, మోసాలు సంస్థ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగించాయి. ఈ నేపథ్యంలోనే తితిదే ఇప్పుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.

చట్టపరమైన చర్యలు గ్యారెంటీ

తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని తితిదే ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అసత్య ప్రచారం చేసే వారిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద కేసులు నమోదు చేస్తారు. ప్రజా శాంతికి భంగం కలిగించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై చర్యలు ఉంటాయి.

ఈ కొత్త విధానం ద్వారా తితిదే రెండు లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. ఒకటి, దుష్ప్రచారం చేయాలనుకునే వారికి ఇదొక బలమైన హెచ్చరిక. రెండు, భక్తులకు సరైన, అధికారిక సమాచారం మాత్రమే చేరేలా చూడటం. తిరుమల పవిత్రతను కాపాడటంలో, భక్తులను మోసాల నుంచి రక్షించడంలో తితిదే రాజీపడబోదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగ దైవంపై ఇష్టానుసారం సోషల్ మీడియా వికృత చేష్టలకు ఇక చెక్ పడినట్లే భావించాలి .

ఏపీ   లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్

ఏపీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్

ఏమిటి? ఎందుకు? ఎలా? క్లారిటీగా తేల్చేసిన ED

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ₹3,500 కోట్ల మద్యం కుంభకోణంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనుసరించిన పక్కా ప్రణాళికను ఈడీ ఛేదించింది. డొల్ల కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌లు, బంగారు దుకాణాల ద్వారా సాగిన ఈ భారీ మనీలాండరింగ్ వ్యవహారం, దర్యాప్తు సంస్థలనే ఆశ్చర్యపరిచింది.

అక్రమ సంపాదనకు పునాది ఇదే . .

ఈ కుంభకోణం మూలాలు 2019 నాటి ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్నాయి. ప్రైవేట్ దుకాణాలను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా ప్రభుతమే మద్యం అమ్మకాలు చేపట్టింది. ఈ కేంద్రీకృత విధానం ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు ఒక వరంగా మారింది. మద్యం సరఫరా ఆర్డర్లను తమకు అనుకూలమైన డిస్టిలరీలకు ఇచ్చేందుకు, ఆటోమేటెడ్ వ్యవస్థను పక్కనపెట్టి మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రముఖ బ్రాండ్లను కాదని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. ఈ ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైంది.

నల్లధనాన్ని ఎలా వైట్ చేశారు

అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి సిండికేట్ రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుంది. ఈ మార్గాలను ఛేదించడంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.

1. డొల్ల కంపెనీల వ్యూహం:

ఈ కుంభకోణంలో 30కి పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు. వీటికి సరైన చిరునామా గానీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ గానీ లేదు. డిస్టిలరీలు ముడుపుల డబ్బును నేరుగా ఇవ్వకుండా, ఈ డొల్ల కంపెనీలకు బదిలీ చేసేవి. ప్యాకేజింగ్, రవాణా వంటి సేవలు అందించినట్లు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించేవారు. ఉదాహరణకు, ఒకే ఒక్క వాహనం ఉన్న రవాణా సంస్థ, లక్షల మద్యం కేసులను తరలించినట్లు పత్రాలు చూపించడం ఈ మోసం తీవ్రతను తెలియజేస్తుంది. ఈ నకిలీ లావాదేవీల ద్వారా డబ్బు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరేది. అక్కడి నుంచి దాన్ని నగదు రూపంలో డ్రా చేయడం లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేసేవారు.

2. బంగారం కొనుగోళ్ల మార్గం:

ఇది అత్యంత తెలివైన, క్లిష్టమైన పద్ధతి. డిస్టిలరీలు తమ బ్యాంకు ఖాతాల్లోని “తెల్ల ధనాన్ని” నేరుగా హైదరాబాద్, చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారులకు బదిలీ చేసేవి. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్‌లు తీసుకునేవి. దీంతో ఆ లావాదేవీ చట్టబద్ధమైన వ్యాపార ఖర్చుగా వారి లెక్కల్లో. కానీ, కొనుగోలు చేసిన భౌతిక బంగారం మాత్రం సిండికేట్ సభ్యులకు చేరేది. ఈ పద్ధతి ద్వారా, బ్యాంకుల్లో గుర్తించడానికి వీలైన డబ్బును, లెక్కల్లోకి రాని భౌతిక ఆస్తిగా (బంగారం) మార్చారు.

ఈడీకి ఎలా చిక్కారు?

ఈ క్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఈడీకి, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అందించిన సమాచారం కీలకంగా మారింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లు ఈడీకి ఒక మార్గదర్శిగా ఉపయోగపడ్డాయి. డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుండి నగల వ్యాపారులకు, డొల్ల కంపెనీలకు జరిగిన వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలను సిట్ గుర్తించింది. ఈ ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగింది.

దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెలర్స్, మోహన్ లాల్ జ్యువెలర్స్ వంటి బంగారు దుకాణాలు, వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి డొల్ల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సోదాల్లో కీలకమైన ఆర్థిక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, నకిలీ ఇన్వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో పురోగతి

స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. డిస్టిలరీల నుండి డబ్బు ఎప్పుడు, ఎలా బదిలీ అయింది, దానికి సరిగ్గా సరిపోయేలా నగల దుకాణాలు, డొల్ల కంపెనీలు ఇన్వాయిస్‌లు ఎలా జారీ చేశాయో ఈడీ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. ఈ పత్రాల ఆధారంగా, డబ్బు ప్రయాణించిన మార్గాన్ని పూర్తిస్థాయిలో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఆధారాల విశ్లేషణ పూర్తయ్యాక, ఈ కుంభకోణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ దర్యాప్తు, ప్రభుత్వ విధానాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యవస్థీకృత నేరగాళ్ల వెన్ను విరిచే దిశగా సాగుతోంది.

కార్ల కంటే ఏసీ ఉద్గారాలూ డేంజరే – 2035 నాటికి రెట్టింపు

కార్ల కంటే ఏసీ ఉద్గారాలూ డేంజరే – 2035 నాటికి రెట్టింపు

”మన దేశంలో ఏసీల వినియోగం ఏటేటా గణనీయంగా పెరుగుతోంది . ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి . .. ” అని ఒక ప్రముఖ సంస్థ సర్వ్ వెల్లడించింది .  

2030 నాటికి భారతదేశంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే గృహోపకరణాలుగా ఏసీలు ప్రధమ స్థానంలో ఉంటాయని . .. ఓ సర్వే తెలిపింది. అంతేకాకుకండా 2035 నాటికి మొత్తం ఉద్గారులు రెండింతలు పెరిగి 329 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్​కు సమానంగా చేరుతాయని దిల్లీ కేంద్రంగా ఉన్న థింక్ ట్యాంక్ iFOREST తాజా సర్వేలో వెల్లడించింది.

‘2024లో మాత్రమే ఏసీల వల్ల 156.9 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దేశంలోని అన్ని ప్రయాణీకుల కార్ల ఉద్గారాలకు సమానం. ఇందులో 52 మిలియన్ టన్నులు రిఫ్రిజిరేటర్ల లీకేజీల వల్ల వచ్చాయి. జాతీయ రిఫ్రిజరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేసి, ఉద్గారాలను తగ్గించడానికి కఠినంగా అమలు చేయాలి. ఈ చర్యల ద్వారా రానున్న దశాబ్దంలో 500 నుంచి 640 మిలియన్ టన్నుల కార్బన ఉద్గారాలను నివారించవచ్చు. ఇవి 25-32 బిలియన్ డాలర్లు ఉంటాయి. కార్బన్ క్రెడిట్ల విలువత పాటు వినియోగదారులకు 10 బిలియన్ డాలర్ల రీఫిల్లింగ్ ఖర్చులను ఆదా చేస్తాయి’ అని నివేదిక తెలిపింది.

భారత్​లో ఒక ఏసీని రెండు సంవత్సరాలకోసారి రీఫిల్ చేస్తే, అది ఒక కారు విడుదల చేసే ఉద్గారాలంత నష్టం చేస్తుందని ఢిల్లీలోని ప్రముఖ ఎన్అజీవి నిర్వాహకుడు సిద్దర్ సూకీ తెలిపారు. ‘వాతావరణ మార్పులకు ఏసీ కూడా కారు మాదిరిగానే హానికరం. ప్రజలు ఎనర్జీ ఎఫిషెన్సీ పట్ల జాగ్రత్తగా ఉన్నారు కానీ రిఫ్రిజిరేటర్ల విషయంలో అవగాహన తక్కువ. ప్లాస్టిక్‌లకు ఉన్నట్లే రిఫ్రిజిరేటర్ల లైఫ్‌సైకిల్‌పై కూడా సమగ్ర నియంత్రణ అవసరం’ అని అయన అన్నారు.

AC వినియోగం స్పీడ్ గా పెరుగుతోంది’
సర్వే ప్రకారం, భారత్​లో ఏసీల సంఖ్య 2024లో 62 మిలియన్ ఉన్నాయి. 2035 నాటికి 245 మిలియన్​కు పెరుగనుంది. వార్షిక విక్రయాలు 14 మిలియన్ నుంచి 40 మిలియన్​కు పెరుగుతాయి. 2020 నుంచి ఏసీ అమ్మకాలు సంవత్సరానికి 15-20శాతం వృద్ధి సాధిస్తున్నాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 3,100 కుటుంబాల సర్వే ప్రకారం,80శాతం ఏసీలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగివి ఉన్నాయి. 87శాతం కుటుంబాలు ఒక్క ఏసీ కలిగి ఉంటే, 13శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. చెన్నై, జయపుర్, కోల్‌కతా, పుణెలో బహుళ ఏసీ వినియోగం ఎక్కువగా ఉంది.

డేంజర్ . .. డేంజర్ . .. HFC-32 దేశంలో విస్తృతంగా వాడుతున్న రిఫ్రిజిరేటర్. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు అధిక వేడి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.లీకేజీ కారణంగా ఉద్గారాలు 2024లో 52 మిలియన్ టన్నులు కాగా, 2035 నాటికి 84 మిలియన్ టన్నులు పెరుగుతాయని అంచనా. సగటున కుటుంబాలు రోజుకు 4 గంటలు ఏసీలు వాడుతున్నారు.