ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

భారత్ పౌరసత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైనం

ఒకప్పుడు అతను పాకిస్థాన్ పార్లమెంట్ మెంబర్ . అంటే ఎంపీ అన్న మాట . పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇతని ఉదంతం ఒక ఉదాహరణ . ఆ ​ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్​లో ఐస్​క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్​, హరియాణాలోని ఫతేబాద్​లో ఐస్​క్రీమ్​ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్​కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్​కు ఎందుకు వచ్చారు? జీవనం సాగించేందుకు ఐస్​క్రీములు వ్యాపారం ఎంచుకున్నారు .

పాకిస్థాన్​కు చెందిన దివాయా రామ్​ 1989లో మైనార్టీల రిజర్వ్​ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్​ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్​ కూతురిని కిడ్నాప్​ చేసినా, పోలీస్ వ్యవస్థ కూడా ఈయనకు సహకరించలేదు . దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్​కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్​ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నారు . అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.

పాకిస్థాన్​లో వేధింపులు తాళలేక దివాయా రామ్​ బంధువు రామ్ ప్రకాశ్​ కుటుంబం కూడా 2006లో భారత్​కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్​లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్​లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్‌ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్​కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్​ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్​ కుటుంబం శరణార్థిగా భారత్​లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా పాకిస్తాన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆ దేశ పౌరులైన . . దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న వారికి భారత్ పౌర సత్వం విషయంలో మానవత్వంతో ఆలోచించి . .. నిర్ణయం తీసుకోవాలి .

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

జమ్మూ కాశ్మీర్ సమీపంలో  పహల్గాంలో జరిగిన మారణహోమం   తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది.  పాకిస్థాన్‌ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా   ఉన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్‌ పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.

చర్చల ద్వారానే పరిష్కారం!
ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.

 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .

భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు- భరతముని రచించిన నాట్యశాస్త్రానికి గుర్తింపు

 హిందువుల ఆరాధ్య గ్రంథం … ఆధునిక వ్యక్తిత్వ వికాస గ్రందంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కింది. అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీని సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈనెల 17న కొత్తగా 74 డాక్యుమెంటరీలు యునెస్కో మెమోరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చేరాయి. ఫలితంగా మొత్తం సంఖ్య 570కి చేరింది.


ప్రధాని నరేంద్రమోదీ భగవత్ గీత కు యునెస్కో గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. యునెస్కో మెమోరీ ఆ ఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రానికి చోటు దక్కటం కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు.

ఉజ్జయినిలో వరల్డ్ రికార్డ్  ఒకేసారి 50వేల మందికి భోజనాలు

ఉజ్జయినిలో వరల్డ్ రికార్డ్ ఒకేసారి 50వేల మందికి భోజనాలు

వెయ్యి మందికి భోజనాలు పెట్టాలంటేనే పెద్ద హంగామా చేయాలి. పదిమంది ఆ పనిలో నాలుగైదు రోజులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి . అలాంటిది ఏకంగా 50 వేల మందికి ఏకకాలంలో భోజనాలు పెట్టడమంటే మాటలా … అందుకే ఇది వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.

ఆంజనేయ స్వామి జయంతి సందర్బంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని.. అంబాపూర్‌లో ఈ ఘనత చోటుచేసుకుంది . ఆ ఊరిలో ఉన్న పురాతన ‘జై వీర హనుమాన్’ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్తానం సంపాదించింది. ఈ కార్యక్రమానికి ‘నాగర్ భోజ్’ అని పేరు పెట్టారు . ఇందులో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది వాలంటీర్లు , కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.


ఆహార పదార్దాల తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించారు.

— సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది.

-ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.

టారిఫ్ లలో ఏ దేశానికీ మినహాయింపు లేదట

టారిఫ్ లలో ఏ దేశానికీ మినహాయింపు లేదట

“అమెరికా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు కలిగిన, నాన్‌ మానిటరీ టారిఫ్‌ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి మినహాయింపు లభించదు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎలాంటి టారిఫ్‌ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు అన్నీ 20% ఫెంటనిల్‌ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్‌ బకెట్‌లోకి మారాయి.” డొనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వాళ్ళ చేతిలో బందీలుగా ఎందుకు ఉండాలి ?
“నేషనల్‌ టారిఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సెమీకండెక్టర్లు సహా, అమెరికా ప్రజలకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ సామగ్రిని పరిశీలించాం. దీనిని బట్టి దేశీయంగా వాటిన్నింటినీ ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి, గతంలో ఇతర దేశాలు ఎలా వ్యవహరించాయో చూశాం. ముఖ్యంగా చైనా, అమెరికా పట్ల ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే, మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా, బలమైందిగా మార్చబోతున్నాం.అప్పుడు మాత్రమే మనం చైనా కబంద హస్తాల్లో బందీగా మారకుండా ఉంటాం. డ్రాగన్‌ అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని బాగా వాడుకొంటోంది. దానిని నేను కొనసాగనీయను. ఇక ఆ రోజులు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను నియంత్రణ వల్ల భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

అమెరికాలో తయారీపై ఫోకస్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై చైనాతో సహా పలు దేశాలపై ఆధారపడుతూ వస్తుంది . ఇకపై వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడంపై దృష్టిపెట్టినట్లు లుట్నిక్‌ చెప్పారు. “మాకు సెమీకండక్టర్లు, చిప్స్‌, ఫ్లాట్‌ ప్యానల్స్‌ చాలా అవసరం. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇకపై మాకు అవసరమైన వస్తువుల కోసం, ఆగ్నేయాసియాపై ఆధారపడదల్చుకోలేదు. అందుకే వారిని రివెంజ్ టారిఫ్‌ల నుంచి మినహాయించి, సెమీకండక్టర్‌ పన్నుల పరిధిలోకి తీసుకొద్దామని ట్రంప్‌ అంటున్నారు. బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సెమీకండక్టర్ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది” అని లుట్నిక్‌ పేర్కొన్నారు.

 

నాసా బంపర్ ఆఫర్​! ఆ  సలహా ఇస్తే రూ.25కోట్లు

నాసా బంపర్ ఆఫర్​! ఆ సలహా ఇస్తే రూ.25కోట్లు

చంద్రుడిపై దాగి ఉన్న విశ్వ రహస్యాలను శోధించేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు.