ఆపరేషన్ సిందూర్.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్‌కు భారీ షాక్

Abhi Correspondent

May 7, 2025

10 మంది కుటుంబసభ్యులు, అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్‌ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్‌పూర్‌లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి మరణించారు.

 భారత్ చేపట్టిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబసభ్యులు హతమయ్యారు. 10 మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. భారత్ దాడుల్లో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్యతో పాటు మరో ఐదుగురు మరణించినట్లు చెప్పాడు. జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం బహవల్​పుర్​లోని జామియా మస్జీద్​ సుబాన్​ అల్లాహ్​ ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించినట్లు తెలిపాడు.

ఉగ్ర స్థావరాలే టార్గెట్ :

భారత దళాలు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోగల ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబాప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలుగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.

ఈ దాడిలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ 25 నిమిషాలపాటు బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అత్యంత కచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. పీఓకే ఉగ్రస్థావరాలతోపాటు పాక్‌లోని ఐదు ఉగ్రక్యాంపులను కూడా భారత్ ధ్వంసం చేసింది.

భారత్ చర్యలపై స్పందించిన పాక్..

ఈ ఆపరేషన్‌ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. అయితే, భారత్ తన చర్యలను కట్టిపెడితే తాము ప్రతి దాడికి దిగబోమని కాళ్లబేరానికి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్‌ కూడా పాక్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజార్చేలా దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామనని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. స్వీయ రక్షణ భారత దేశ హక్కు అని ముక్తకంఠంతో పేర్కొన్నాయి.

You May Also Like…