జగన్ జపం.. ఆపండి బాబూ..

జగన్ జపం.. ఆపండి బాబూ..

అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్ పై ఎందుకంత ఫోకస్

మీరు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నా . .. నిత్యం జనంలో చర్చ జరిగేలా చేస్తున్నారు

”బాబాయ్ వివేకానంద్ రెడ్డిని చంపించి ఆ నెపాన్ని నాపై మోపారు . .. నారా సుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో రాసారు.”

”మద్యం కుంభకోణంలో భారీగా దోచుకున్నారు . ఇసుక తిన్నారు . . మైన్స్ ను దోచుకున్నారు.”

” జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లారు . వీళ్ళు చేసిన ఆర్ధిక అరాచకాలకు ఇంకా ఇబ్బందులు పడుతున్నాం . ..”

ఇలా ప్రతి సందర్భంలోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,, వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు , కూటమి నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనేది పక్కన పెడితే… జనం కూడా జగన్ అరాచకాలు , అక్రమాలపై ఆందోళన చెంది వైసీపీని ఘోరంగా ఓడించారు.

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల వరకు జగన్ అండ్ కో అరాచకాలు , అక్రమాలు గురించి చెపుతూ ఉంటె జనం కూడా కాస్త ఓపిగ్గా విన్నారు. ఏడాది దాటుతున్నా ఈ పాటను చంద్రబాబు అండ్ కో వదలకపోతే జనంలోనూ చులకనయ్యే ప్రమాదం పొంచి ఉంది .

జనానికి కావలసింది అదికాదు : జగన్ పై రోజు విమర్శలు చేయడం కాదు జనానికి కావలసింది. అభివృద్ధి , సంక్షేమం , శాంతి , భద్రతల పరిరక్షణ వంటివి కోరుకుంటారు. ఇవన్నీ కూటమి పాలనలో చెప్పుకోదగ్గ రీతిలోనే సాగుతున్నాయి . అయితే జనంలో ఎక్సపెటేషన్స్ పెంచడంవల్ల ఇంకా ఏవేవో కావాలని కోరుకునే జనం సంఖ్య పెరుగుతోంది. దీన్ని రీచ్ అవ్వడం ఏ సర్కార్ కైనా సవాలే . జగన్ ప్రభుత్వంతో పోలిస్తే . .. కూటమి పాలన ఎన్నో రేట్లు మెరుగే . అయినా . .. జనానికి సంతృప్తి మాత్రం ఇంకా చాలడంలేదనే అనిపిస్తోంది . అంటే చంద్రబాబు . .. అవి చేస్తాం . . ఇవి చేస్తాం . . అని ఏ మీటింగులోను వదలకుండా చేస్తున్న ప్రచారం కూడా కూటమి పాలిట ఇబ్బందిగా తయారయిందని చెప్పాలి .

రీకాల్ పిలుపు… జగన్ మూర్ఖత్వమే…

రీకాల్ పిలుపు… జగన్ మూర్ఖత్వమే…

గంజాయి స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం . . వారికి మాత్రం వైసీపీ అధినేత జగన్ పరామర్శలు . .. ఎక్కడికిపోతున్నాం . .. అంటూ సమాజం లో కొన్ని వర్గాలు ఆ పార్టీని , సదరు నేతను ఛీత్కరించుకుంటున్నా ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు .

వైఎస్ఆర్‌సీపీ “రీకాల్” కార్యక్రమం రాజకీయ దాడిగా కనిపిస్తున్నప్పటికీ, శాసనసభ బహిష్కరణ, చట్టవ్యతిరేక ఆరోపణలు, సమీక్షా రాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సరిదిద్దకపోతే, పార్టీ రాజకీయంగా మరింత బలహీనపడే అవకాశం ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ప్రకటించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో” కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు1 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్ఆర్‌సీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు వారాల పాటు ఇంటింటికీ వెళ్లి, క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతలకు ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తూ, ప్రజాతీర్పును అవమానిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం చవిచూసింది. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు సాధించి, రాష్ట్రంలోని 13 జిల్లాలకు 8 జిల్లాల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈ ఓటమి తర్వాత పార్టీలో సమగ్ర సమీక్ష జరగలేదు. ఓటమికి కారణాలను విశ్లేషించడం, లోపాలను సరిదిద్దుకోవడం జరగలేదు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మొక్కుబడి ప్రకటన కూడా చేయలేదు. బదులుగా, “రీకాల్” కార్యక్రమం పేరుతో ప్రతిపక్షంపై దాడిని ఉధృతం చేసింది. ఈ వైఖరి పార్టీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేని అసమర్థతను సూచిస్తుంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా, శాసనసభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారి బాధ్యత. అయితే, ఈ బాధ్యతను విస్మరించి, సభను బహిష్కరించడం ద్వారా ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. శాసనసభ బహిష్కరణ ద్వారా పార్టీ తన రాజకీయ అసమర్థతను బహిర్గతం చేసుకుంటోంది, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోంది.

గతంలో నిర్వహించిన “గడపగడపకూ” కార్యక్రమం ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, అది విఫలమైంది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిరస్కరించి, వైఎస్ఆర్‌సీపీని ఓడించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, “రీకాల్” కార్యక్రమంతో మళ్లీ ప్రతిపక్షంపై దూషణలకు దిగింది. ఈ వైఖరి వైఎస్ఆర్ సిపి వ్యూహాత్మక లోపాన్ని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని లోటును బయటపెడుతోంది.

వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలకు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటువంటి చర్యలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, శాసనసభ బహిష్కరణ ద్వారా వైఎస్ఆర్‌సీపీ ఈ బాధ్యతను విస్మరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో “రీకాల్” ప్రకటించడం పార్టీ నైతిక అర్హతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు పార్టీ వైఖరిపై బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో జగన్ నిర్ణయాలపై విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు నిశ్శబ్దం వహించడం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తుంది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్యకర్తలు జగన్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతివిశ్వాసం, పోల్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలు ఓటమికి కారణమని ఆరోపించారు. అయినప్పటికీ, ఈ అసంతృప్తిని పరిష్కరించే చర్యలు తీసుకోలేదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సవాలు చేయకపోతే, పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సర్వోన్నతం. ఓడిన పార్టీలు తమ లోపాలను సమీక్షించుకుని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలి. అయితే, వైఎస్ఆర్‌సీపీ ఈ మార్గాన్ని విస్మరించి, శాసనసభను బహిష్కరించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, “రీకాల్” ద్వారా ప్రతిపక్షంపై దూషణలకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. “గడపగడపకూ” కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో, “రీకాల్” కూడా విఫలమైతే, పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. ఈ వైఖరి పార్టీ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు .. అంటూ పలువురు జగన్ అంటే ఇష్టపడే వాళ్ళు సైతం సూచిస్తున్నారు . అయినా అతని వైఖరిలో మార్పు వస్తుందని భావించడం వీరి అమాయకత్వమే అవుతుంది .

కూటమి హామీలపై వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయాలని జగన్ ఆదేశం. స్థానికంగా వైసీపీ చోటా నేతలు ఈ పనిని చేయ్యపట్టాల్సి ఉంటుంది . అయితే ఇప్పటికే జనంలో స్థానిక వైసీపీ వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం గురించి తెలిసిందే. ఈ ప్రభావంతో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అభాసుపాలవుతుందని మెజార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

రూ.350 కోట్ల భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

రూ.350 కోట్ల భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

  • ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపి తుది తీర్పు వెల్లదించిన తెలంగాణ హైకోర్టు
  • రాయదుర్గంలో 3.5 ఎకరాల కేటాయింపుపై జారీచేసిన జీఓల కొట్టివేత
  • నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న పిటిషనర్లు
  • సదరు భూమి విలువ రూ.350 కోట్ల ఉంటుందని అంచనా

తెలంగాణలో భారీ భూకేటాయింపును ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర సంచలనం కలిగించాయి . హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)కు అత్యంత విలువైన ప్రాంతంలో చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓలను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయవాది రఘునాథ్‌రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. న్యాయస్థానాల వెలుపల వివాదాలు పరిష్కారమవ్వాలని కోర్టులే ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు ఈ ఏడాది జనవరిలోనే ముగియడంతో, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తూ, ఐఏఎంసీకి భూమిని కేటాయించడంతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను సైతం పూర్తిగా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి.

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గల సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ భూమి విలువ రూ. 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని న్యాయవాది కె. రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి . దీనిపై తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది .

దగ్గు, జలుబుకు నేచురల్ మెడిసన్.. వాము

దగ్గు, జలుబుకు నేచురల్ మెడిసన్.. వాము

వామ్మో . .. ఎన్ని ప్రయోజనాలా . .

అమ్మమ్మలు , నానమ్మల కాలంలో కాస్త అజీర్తిగా అనిపిస్తే… కాస్త వాము వేయండి .. అనేవారు . వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలలో తేలింది.

వాము . .. కేవలం వంటలలో రుచిని అందించడంతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది .  

అజీర్తి, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు, అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుండి . వాములోని థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్, కడుపు ఇబ్బరం వంటివి . అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుండు , ఇది కడుపులోని ఆమ్లాలను తటస్థీకరించి, ఎసిడిటీ, గుండెల్లో మంటను తగ్గింస్తుంది . వాములో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు కండరాల నొప్పులు, కడుపు నొప్పి, తిమ్మిర్లను నియంత్రిస్తాయి .

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : వాములో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక ఓషధ గుణాలు వాములో ఉన్నాయి . దగ్గు , జలుబుతో బాధపడేవాళ్లు . .. కాసింత వామును నమిలితే ఉపశమనం కలుగుతుంది .

ఆస్తమా : ఇది శ్వాసనాళాలను సడలించి, గాలి ప్రవాహాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి ఇస్తుంది . వీటిలో ఉండే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది .

శ్వాసకోశ వ్యవస్థ : వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని థైమోల్ ముక్కు రంధ్రాలను శుభ్రం చేస్తుందని, శ్లేష్మాన్ని తొలగించడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుందని వివరించారు. ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం. ఆయాసం , విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగించే వారని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ స్పష్టం చేస్తుంది .

మౌత్ వాష్ నర్ గా ….వాము నూనెను టూత్​పేస్ట్, మౌత్ వాష్​ల్లో వాడతారని, ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి . . నోటి దుర్వాసన రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వాము వేసి మరిగించినా నీటిని గోరువెచ్చగా వేడి చేసుకోని, ఆ తర్వాత ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు దూరమవుతాయి .

బాలింతలకు మేలు! : గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుందని, అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా గర్భవతులు వామును రోజూ తీసుకుంటే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని పేర్కొన్నారు.

గ్యాస్ ట్రబుల్ : కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్యాస్ ట్రబుల్​తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టిన నీరును గోరువెచ్చగా తాగితే పొట్టలోని గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా వాము పొడిని నమిలితే కూడా గ్యాస్ తగ్గిపోతుందని చెపుతున్నారు .

వాము ఆకులతో . .. వాము ఆకులతో బజ్జీలు వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి . వాము ఆకలి కాషాయం కొన్ని వ్యాధులకు పరిస్కారం చూపుతుంది .

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

విభజన తర్వాత చ‌ట్ట స‌భ‌ల్లో ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ– భ‌విష్య‌త్తుపైనే నాయ‌కుల ఆశ‌లు

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ద‌శాబ్దాల‌పాటు శాసించిన ఘ‌న‌ చ‌రిత్ర‌ కాంగ్రెస్ పార్టీది. అయితే కేంద్రంలో తాను అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర‌ విభజన చేసిన‌ త‌ర్వాత ఆ పార్టీ ఆశించిన రాజ‌కీయ ప్రయోజ‌నాలు తెలంగాణ‌లో సైతం ద‌క్కించుకోలేక‌పోయింద‌న్న‌ది నిజం. ప‌దేళ్ల త‌ర్వాత రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆయ‌న పోరాటంతోపాటు ప‌లు అంశాలు క‌లిసివ‌చ్చి అధికారం ద‌క్కించుకోవ‌డం వేరే సంగ‌తి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజకీయ పటంలో ఆ పార్టీ దాదాపు క‌నుమ‌రుగైన‌ స్థాయికి క్షీణించిందని చెప్పాలి. 2004, 2009 ఎన్నిక‌ల్లో వరుసగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి స్వ‌యంకృత‌మే. గ‌తంలో దేశ‌మంతా కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన స‌మ‌యంలోనూ ఆ పార్టీకి అండ‌గా నిలిచింది తెలుగు ప్ర‌జ‌లే. తిరిగి ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర ఉమ్మ‌డి ఏపీది. అయితే ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ప్రాతినిధ్యంలో కూడా ఏపీలో ఆ పార్టీ నామ‌మాత్రంగా మిగిలింది.

విభజన గాయ‌మా.. ప్ర‌త్య‌ర్థుల వ్యూహ‌మా..?

2014లో తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం తీవ్రం కావ‌డం, ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే అంశంగా మార‌డంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని నాటి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర విభ‌జ‌న‌కు పూనుకుంది. అయితే సీమాంధ్ర ప్ర‌జ‌ల అభ్యంత‌రాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోపాటు పార్ల‌మెంటులో విభ‌జ‌న బిల్లు ఆమోదించిన తీరు ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విధంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు శిక్షించారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ద‌శాబ్ద‌కాలం గ‌డ‌చినా ఆ పార్టీ ఇక్క‌డ ఒక మోస్త‌రు స్థాయిలోనైనా కోలుకోలేక‌పోవ‌డానికి కార‌ణం మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం నిర్ల‌క్ష్యమేన‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా తెలంగాణ‌లో నాటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌రిష్ట ప్ర‌యోజ‌నం ద‌క్కించుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అనుస‌రించిన‌ త‌ప్పుడు వ్యూహాలే కార‌ణం. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే కాంగ్రెస్‌కి ఘోర పరాభవాన్ని తేటతెల్లం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ త‌ప్పిదాలే వైసీపీ పునాదులు

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు తాను ఏంచేసినా చెల్లుతుంద‌ని, భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప‌రిణామాలు తాను ఆశించిన‌ట్టే ఉంటాయ‌ని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మ‌రోప‌క్క బీజేపీ నుంచి దేశ‌వ్యాప్తంగా ఎదుర‌య్యే ముప్పును కూడా చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేసింది. తెలంగాణ ఇచ్చింది తానే కాబ‌ట్టి అక్క‌డి ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని భావించింది. కేసీఆర్ త‌న‌ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌న్నా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు విని చేతులారా వ‌దుల‌కుంది. ఇక ఏపీలో తాత్కాలికంగా న‌ష్ట‌పోయినా సంప్ర‌దాయ ఓటు బ్యాంకు భ‌విష్య‌త్తులో తిరిగి త‌న నీడ‌కే చేరుతుంద‌ని భావించింది. వైఎస్సార్ త‌న‌యుడైన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీ ఈ ప‌రిణామం ద్వారా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి తెలుసు. తాను అమ‌లు చేసే వ్యూహం ప్రకారం జ‌గ‌న్ తిరిగి త‌న‌గూటికే చేర‌క త‌ప్ప‌ద‌ని అనుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యాల‌న్నీ ఘోర త‌ప్పిదాలుగా మారి పార్టీ దుస్థితికి కార‌ణ‌మ‌య్యాయి.

కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓటుబ్యాంకే వైసీపీకి పునాది

వైసీపీ పేరుతో సొంత కుంప‌టి పెట్టుకున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ ప‌రిణామాల‌ను, అవ‌కాశాన్ని తెలివిగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడ‌ర్‌ను గంప‌గుత్త‌గా సొంతం చేసుకుని ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ‌నేత‌గా ఆవిర్భ‌వించారు.2014 అసెంబ్లీ ఎన్నికలు: 175 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు షేర్ 2% కంటే తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికలు: ఓటింగ్‌లో పార్టీ ఉనికే కన్పించలేదు – రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ 1% లోపే. 2024 ఎన్నికలు: కాంగ్రెస్ పోటీ చేసినా, ఫలితాలు నామమాత్రమే. టీవీ చర్చల్లోనైనా పేరు వినిపించనంత స్థాయిలో వెనుకబడిపోయింది.

నాయకత్వ లోపం – నిస్సత్తువగా పునర్నిర్మాణం

విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు మిగల్లేదు. పార్టీ క్యాడ‌ర్ నిస్తేజంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన లోటును పార్టీ ఇప్ప‌టికీ పూడ్చుకోలేక‌పోయింది. అంతేకాదు.. వైఎస్సార్ హ‌యాంలో ఆయ‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇత‌ర నాయ‌కుల‌ను ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డం తాలూకు దుష్ప‌రిణామాల‌ను ఇప్పుడు అనుభ‌విస్తోంది. ఆయన వారసుడైన జగన్‌ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా నియ‌మించినా పార్టీ కోలుకుంటున్న సూచ‌న‌లు ఏమాత్రం కాన‌రావ‌డం లేదు.

భవిష్యత్ లో పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలేవీ..?

కేంద్రంలో వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోలేక‌పోవ‌డం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెనుశాపంగా మారింది. గ‌తంలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించిన స‌మ‌యంలోనూ ఏపీకి ఏమంత ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంలోని ఆంత‌ర్యం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీల్లో ఒక‌రైనా కొన్నిరోజుల‌పాటు ఏపీలో ప‌ర్య‌టించి గ‌తంలో పార్టీ త‌ర‌పున రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం స‌రిదిద్దుకునే అవకాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను కోర‌క‌పోవ‌డం వారి రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌గానే భావించాలి. ఏదేమైనా గ‌తంలో బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను క‌లిగిఉన్నరాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించే విధానాలు, స్థానిక నేతల ప్రోత్సాహం, ఓర్పుతో కేడర్ మళ్లీ తయారు చేయడం.. విభజనపై బాధ్యతను అంగీకరించి, ప్రజల్లో విశ్వాసం కలిగించగల సామర్థ్యం ఉన్న ఓ మానవీయమైన నాయకత్వం..ఇవన్నీ కలిస్తేనే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగలదు. కానీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ దిశ‌గా తొలి అడుగులు వేసే ప్ర‌య‌త్నం కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం వ‌హించిన పీసీసీ కార్యాలయాల్లో చురుకైన కార్యకలాపాలు లేవు. జిల్లాల్లో పాత నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.

ముగింపు మాట

ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రాజకీయ విశ్లేషకులు హాస్పాస్ప‌దంగా స్పందించే ప‌రిస్థితి ఉంది. అయితే, రాజకీయాల్లో శాశ్వతంగా ఇదే ముఖ‌చిత్రం ఉంటుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు క‌మ్యూనిస్టు పార్టీల‌ను క‌లుపుకుని ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మార‌గ‌లిగే గొప్ప అవ‌కాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయం మార్చుకుంటే పార్టీల త‌ల‌రాతలు తిరిగి రాయ‌గ‌ల‌రు. ఆ దిశ‌గా పార్టీ చేసే కృషి మాత్ర‌మే ప్ర‌జాద‌ర‌ణ‌కు ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌దు అందుకు త‌గిన సంస్కరణలు, కొత్త దారులు అవసరం. లేకపోతే “ఒకప్పుడు ఏపీని పాలించిన అభ‌య‌ హస్తచిహ్నం… ఇప్పుడు జాడలు మిగలని జ్ఞాపకమే..”! అన్న‌ట్టుగా చరిత్రలో మిగిలిపోతుంది.