‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్  చెప్పిన ఎన్టీఆర్

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్ చెప్పిన ఎన్టీఆర్

ఈ స్క్రిప్ట్ త‌న‌ను బాగా ఆక‌ర్షించింద‌న్న తార‌క్‌

ఏదైనా కధ నచ్చితే వెనక్కి చూడకుండా నటించడానికి అంగీకరిస్తారు జూనియర్ ఎన్టీఆర్ . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2’ గురించి నోరు విప్పారు . ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌ ‘ఎస్క్వైర్‌ ఇండియా’ తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సిని అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు ‘వార్ 2’ స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. “భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త ఫీలింగ్ ని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. ‘వార్ 2’లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. 

ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌గా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే” అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ పీక్శ్చర్ లో హృతిక్ రోషన్ పోషిస్తున్న ‘కబీర్’ పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘విక్రమ్’ అనే శక్తిమంతమైన స్పెషల్ ఫోర్సెస్ అధికారి క్యారెక్టర్ లో తెరపై దర్శనం ఇవ్వబోతున్నారు .

పవన్ ‘హరి హర వీరమల్లు’ పూర్తయినట్లే . .

పవన్ ‘హరి హర వీరమల్లు’ పూర్తయినట్లే . .


ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో చూపిస్తుందని హామీ ఇస్తుంది. నటుడు ఒక యోధుడు దొంగగా నటించాడు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు-రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన రెండు భాగాల చిత్రం ”హరి హర వీర మల్లు” షూటింగ్‌ పూర్తీ చేసుకున్నారు . ఐదేళ్లుగా ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . అయితే పవన్ 2024 సార్వత్రిక ఎన్నికలతో అంతకుముందు బిజీ అయ్యారు . అలా ఈ సినిమా సూటి0గ్ వాయిదా పడుతూ వస్తోంది .

2020లో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, చాలా ఆలస్యం తర్వాత చివరకు దాని షూటింగ్‌ను తాగాజా పూర్తి చేసింది.

ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో ప్రదర్శిస్తుందని హామీ ఇస్తుంది.ఇందులో పవన్ యోదుడిగాం దొంగగా నటించారు .

హరి హర వీర మల్లు పార్ట్-1: స్వోర్డ్ vs స్పిరిట్ మే 9న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది, ఇది పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా మారింది.

ఈ వార్తలను పంచుకుంటూ, మేకర్స్ Xలో ఇలా రాశారు: “పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారు #హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. షూటింగ్ అట్టహాసంగా ముగిసింది మరియు తరువాత రాబోయేది తెరలను రంజింపజేస్తుంది! భారీ ట్రైలర్ మరియు బ్లాక్‌బస్టర్ పాటలు రాబోతున్నాయి!”

బాలీవుడ్ తారలు అనుపమ్ ఖేర్ మరియు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన తారాగణంలో ప్రముఖ నటులు నాసర్, రఘు బాబు, అయ్యప్ప పి శర్మ, సునీల్, నర్రా శ్రీను, నిహార్ ఉన్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మరియు VFX సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఈ చిత్ర బృందంలో ఉన్నారు. హరి హర వీర మల్లు చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత. ప్రముఖ స్వరకర్త MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ చిత్రం దృశ్యకావ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, హరి హర వీర మల్లు నిర్మాత ఎఎమ్ రత్నం ఇది రెండు భాగాల చిత్రం అని ప్రకటించారు. మే 2024లో, నిర్మాతలు ఒక టీజర్‌ను విడుదల చేశారు, ఇది తీవ్రమైన కత్తి యుద్ధాలు మరియు యుద్ధ కళలతో అభిమానులు మరియు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

రామ్ చరణ్ మైనపు బొమ్మ.. ఎక్కడ ?  ఎందుకు ?

రామ్ చరణ్ మైనపు బొమ్మ.. ఎక్కడ ? ఎందుకు ?

మేడమ్​ టూస్సాడ్స్​లో రామ్​ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ –  అరుదైన ఘనత దక్కించుకున్న స్టార్ హీరో

టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేసి… గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడం టుస్సాడ్స్ (లండన్ ) లో చెర్రీ మైనపు బొమ్మ ఆవిష్కరిస్తున్నారు .

రామ్ చరణ్​తో ‘రైమ్​’ స్పెషల్!

సినిమా రంగ0లో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ మేడమ్​ టూస్సాడ్స్​ వారి మైనపు విగ్రహాలను తయారుచేసి మ్యూజియంలో ఏర్పాటు చేస్తుంది . అయితే, సెలబ్రిటీల విగ్రహాలు మాత్రమే ఆవిష్కరిస్తుంది. కానీ ప్రస్తుతం రామ్​ చరణ్​తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్​ కూడా ఇందులో భాగం కాబోతోంది. రామ్​ చరణ్​తో పాటు రైమ్​ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించోతున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీల పెంపుడు జంతువులకు ఇలా చేయలేదు. గతంలో క్వీన్ ఎలిజబెత్​ 2 మాత్రమే తన పెంపుడు జంతువుతో కనిపించారు. కాగా, ఆవిష్కరణ తర్వాత విగ్రహాన్ని మేడమ్​ టూస్సాడ్స్​ సింగపూర్​కు తరలిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మెగా ఫ్యామిలీ మే 11న ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్​ హాల్​లో ఆర్​ఆర్​ఆర్​ లైవ్​ ఆర్కెస్ట్రా ప్రదర్శనలో పాల్గొననున్నారు.

 దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్​ చరణ్. ఇప్పుడు ఈ స్టార్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు. రామ్​చరణ్​కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ లండన్​కు పయనం అయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్​ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్​ కారా, పెంపుడు శునకం రైమ్​ లండన్​కు బయలుదేరి వెళ్లారు .

రామ్ చరణ్ ‘పెద్ది ‘ లో ఆ బిగ్ స్టార్ ఎవరు ?

రామ్ చరణ్ ‘పెద్ది ‘ లో ఆ బిగ్ స్టార్ ఎవరు ?

2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…  ‘ఉప్పెన’ ఫేమ్ సానా  బుచ్చిబాబు  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్  రెస్పాన్స్ వచ్చింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న  ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు.   పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్.   కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో  కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు.  ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
 ఆ స్టార్  సూర్య అని ఇటీవల  ప్రచారం సాగుతోంది.   నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.

‘అదుర్స్ – 2’ ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పాడు

‘అదుర్స్ – 2’ ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పాడు

ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?

టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.

”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .