ఖరీఫ్ సాగుపై ‘సూపర్ ఎల్​నినో’ పిడుగు

ఖరీఫ్ సాగుపై ‘సూపర్ ఎల్​నినో’ పిడుగు

వానలు కురవడకపోవడానికి అదే కారణమా? ? నిపుణులు ఏం అంటున్నారు?

వర్షాలు కురవకపోవడానికి కారణం సూపర్ ఎల్​నినో అని చెబుతున్న పర్యావరణవేత్తలు- మన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని వివరణ- సూపర్ ఎల్​నినో విషయంపై … ప్రముఖ మీడియా సంస్థ తో తన అభిప్రాయాలు వెల్లడించిన Nitin సింఘ్వీ

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పెద్ద దెబ్బ కొట్టేలా భయపెడుతున్నాయి. రైతాంగం ఇప్పటికే వర్షాభావం దెబ్బకి బెంబేలెత్తిపోతున్నారు. ఇక రానున్న రోజులలో వర్షాలు మొహం చాటేస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో రైతన్నలు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు.

 దేశంలోకి ముందుగానే ప్రవేశించి రైతుల్లో ఆశలు నింపిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నాయి. జూన్ 5వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తొలి దశలో వేగంగా విస్తరించినప్పటికీ, ఆ తర్వాత వాటి కదలికలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా జూన్ మధ్య నాటికి దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేయాల్సిన రుతుపవనాలు ఈసారి మధ్యలోనే స్తంభించడంతో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు తీవ్రంగా పెరిగింది. ఇదే సమయంలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, బలహీనమైన సముద్ర గాలులు కలిసి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.

జూన్ 5న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు జూన్ 16నాటికి దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలను తాకాయి. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా వాటి పురోగతి ఆగిపోయింది. జూన్ 1 నుంచి జూన్ 18 వరకు దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దేశానికి అన్నపూర్ణగా భావించే మధ్య భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఏకంగా 62 శాతం వర్షపాత లోటు నమోదైంది.

రుతుపవనాల అరేబియా సముద్ర శాఖ జూన్ 8 నుంచి దాదాపు ఒకే ప్రాంతంలో నిలిచిపోగా, బంగాళాఖాతం శాఖ మాత్రమే కొద్దిపాటి చురుకుదనం ప్రదర్శిస్తోంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం సముద్రాలపై మేఘాల సాంద్రత చాలా తక్కువగా ఉంది. జూన్ 23 వరకు కూడా రుతుపవనాల పురోగతిలో పెద్దగా మార్పు కనిపించే సూచనలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒకటి లేదా రెండు కారణాల వల్ల వర్షాలు ఆలస్యమవుతుంటాయి. కానీ ఈసారి ఏకకాలంలో ఐదు ప్రతికూల వాతావరణ అంశాలు ప్రభావం చూపుతుండటమే ఆందోళనకు కారణమవుతోంది.

రుతుపవనాలను అడ్డుకుంటున్న Main కారణాలు

  • రుతుపవనాల బలహీనతకు ప్రధాన కారణంగా ఎల్‌నినోను నిపుణులు పేర్కొన్నారు పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ. ఆయన అభిప్రాయం ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలను ప్రభావితం చేస్తుంది. అమెరికా వాతావరణ సంస్థలు ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నాయని ప్రకటించాయి.
  • రెండో కారణం మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) బలహీనంగా ఉండటం. ఉష్ణమండల ప్రాంతాల్లో మేఘాల ఏర్పాటుకు, వర్షాల కురిసేందుకు కీలకమైన ఈ వ్యవస్థ ప్రస్తుతం హిందూ మహాసముద్రానికి దూరంగా ఉండటంతో భారతదేశానికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.
  • మూడో కారణం ఉత్తర భారతదేశంలో ఏర్పడిన బలమైన పశ్చిమ అలజడులు. వీటి కారణంగా పొడి గాలులు దక్షిణ దిశగా విస్తరించి తేమతో కూడిన గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో మేఘాలు ఏర్పడే ప్రక్రియ దెబ్బతింటోంది.
  • నాలుగో కారణం బలహీనమైన సోమాలి జెట్. సాధారణంగా హిందూ మహాసముద్రం నుంచి భారతదేశానికి భారీగా తేమను తీసుకొచ్చే ఈ గాలులు ఈసారి బలహీనంగా ఉండటంతో రుతుపవనాలకు అవసరమైన శక్తి అందడం లేదు.
  • ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థ స్థితిలో ఉండటం. ఇది పాజిటివ్ దశలో ఉంటే భారతదేశంలో వర్షపాతం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రస్తుతం తటస్థంగా ఉండటంతో రుతుపవనాలకు అదనపు బలం లభించడం లేదు.

తేమ ఉంది- కానీ వర్షం లేదు!
దేశంలోకి తేమతో కూడిన గాలులు ప్రవేశిస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదని దీనికి ప్రధాన కారణం ‘అట్మాస్ఫిరిక్ సబ్సిడెన్స్’ అని పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ ‘ఈటీవీ భారత్’​తో చెప్పారు. “అంటే గాలి పైకి ఎగసి మేఘాలు ఏర్పడే బదులు కిందికి అణచివేస్తోంది. దీంతో మేఘాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు సరైన విధంగా కలవడం లేదు. దీనివల్ల రుతుపవన ద్రోణి ఆకారం కూడా మారిపోయింది. ఫలితంగా ఈశాన్య భారతదేశంలో మాత్రమే అక్కడక్కడా వర్షాలు పడుతుండగా, దేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాలు పొడిగా మారుతున్నాయి” అని ఆయన తెలిపారు

సూపర్ ఎల్‌నినో లేదా గాడ్జిల్లా ఎల్‌నినో అంటే ఏమిటి?
ప్రస్తుతం ప్రపంచం మరో బలమైన ఎల్‌నినో దిశగా అడుగులు పడుతున్నాయని పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ ఈటీవీ భారత్​కు చెప్పుకొచ్చారు. ‘2026-27 కాలంలో ఏర్పడే అవకాశం ఉన్న ఈ పరిస్థితిని కొందరు శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోగా అభివర్ణిస్తున్నారు. దీన్నే సూపర్ ఎల్‌నినో అంటారు. సాధారణంగా ఎల్‌నినో 2 నుంచి 7 సంవత్సరాల మధ్య వ్యవధిలో పునరావృతమవుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది అత్యంత బలంగా మారి ప్రపంచ వాతావరణ వ్యవస్థను కుదిపేస్తుంది’ అని ఆయన అన్నారు.

చరిత్రను పరిశీలిస్తే 1976-78 మధ్య కాలంలో సంభవించిన బలమైన ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు, ఆహార కొరత, వ్యాధులకు కారణమైంది. ఆ సమయంలో ప్రపంచ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ఫలితంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు ప్రపంచ జనాభా భారీగా పెరిగిన నేపథ్యంలో మరో సూపర్ ఎల్‌నినో వస్తే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?
భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. భారీ వరదలు, తుఫానులు, ఆకస్మిక వర్షాలు, నీటి కొరత వంటి సమస్యలు పెరగొచ్చు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆహార భద్రత, తాగునీటి సరఫరా, వ్యవసాయ ఉత్పత్తిపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నితిన్ సింఘ్వీ హెచ్చరిస్తున్నారు.

ఆశాజనక సంకేతాలు కూడా!
ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ జూన్ చివరి వారంలో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మాడెన్-జూలియన్ ఆసిలేషన్ భారత్‌కు అనుకూల దశలోకి రావడం, క్రాస్- ఈక్వటోరియల్ గాలులు బలపడటం వల్ల పొడి వాతావరణం తగ్గి వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

రైతులు ఏం చేయాలి?
ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలను ధాన్యాగారాలుగా పరిగణిస్తారు. అక్కడ రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు భారత వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలపై స్పష్టత వచ్చే వరకు విత్తనాలు, ఎరువులు పెద్ద ఎత్తున వినియోగించకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ అంచనాలు కూడా చాలాసార్లు విఫలమవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

“1850 నుంచి జరిగిన పారిశ్రామికీకరణ కారణంగా విడుదలైన గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల ఉత్పన్నమైన అదనపు వేడిలో దాదాపు 90 శాతం భాగాన్ని సముద్రాలు గ్రహించాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల మరింత తేమ వాతావరణంలోకి చేరుతుంది. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తేమ భారీ వర్షాలు లేదా తీవ్ర వాతావరణ ఘటనలకు దారితీయవచ్చు. అందుకే భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి బలమైన ఎల్‌నినో ఘటనలు మరింత తరచుగా సంభవించే అవకాశం ఉంది”
— పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ

అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న నగరాలు
కాంక్రీట్ భవనాలు, డాంబర్ రహదారులు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రి విడుదల చేయడం వల్ల నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్​లుగా మారుతున్నాయని నితిన్ సింఘ్వీ చెప్పారు. దీనికి పరిష్కారంగా నగరాల్లో పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్టులు అభివృద్ధి చేయాలని సూచించారు. మియావాకీ పద్ధతిలో వేగంగా పెరిగే చెట్లను నాటడం ద్వారా నగర ఉష్ణోగ్రతలను 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గించే అవకాశం ఉందన్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీట్ షోల్డర్లు, పేవర్లను తొలగించి వర్షపు నీరు భూమిలోకిచేరేలా చర్యలు చేపట్టాలని అయన సూచిస్తున్నారు.

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

” ”అమరావతిని డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.. భవిష్యత్తులో మరిన్ని తీసుకువస్తాం..” అని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

సీఆర్‌డీఏ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో వేగంగా బ్యాంక్‌స్ట్రీట్ నిర్మాణ పనులు అవుతున్నాయని తెలిపారు.

హైదరాబాద్ లో జనసేన Office… ప్రారంభించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ లో జనసేన Office… ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య విజయం సాధించి రాజకీయంగా దూసుకుపోతున్న జనసేన పార్టీ కార్యకలాపాలు ఇక నుంచి తెలంగాణలోనూ సాగనున్నాయి. పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆ రాష్ట్రంలో జనసేనాని ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ సమక్షంలో Janasena పార్టీలో పలువురు Leaders చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.

Telanga రాష్ట్రంలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండ (మల్కం చెరువు సమీపంలో) నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.