by Ram Maddipati | Jun 19, 2026 | తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య విజయం సాధించి రాజకీయంగా దూసుకుపోతున్న జనసేన పార్టీ కార్యకలాపాలు ఇక నుంచి తెలంగాణలోనూ సాగనున్నాయి. పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆ రాష్ట్రంలో జనసేనాని ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ సమక్షంలో Janasena పార్టీలో పలువురు Leaders చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.
Telanga రాష్ట్రంలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండ (మల్కం చెరువు సమీపంలో) నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
by Ram Maddipati | Jul 2, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కొత్త అధ్యక్షుల నియామకంతో మారనున్న రాజకీయ పరిణామాలు
బీజేపీ వ్యూహం వెనుక 2029 లక్ష్యం కనిపిస్తోందా ? ?
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో తాజాగా వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది.
కాషాయ పార్టీ మొదటినుంచీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో తనదైన విలక్షణతను చాటుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినవారిని పార్టీలోకి చేర్చుకున్నా వారిని అధ్యక్ష పదవుల్లో నియమించడం లేదు. తొలినుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని మాత్రమే అందుకు ఎంచుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేయడం దీనినే సూచిస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారిని తప్పక గుర్తిస్తామని చాటుతూ పార్టీ క్యాడర్లో మొరాలిటీని పెంచేందుకు ఈ విధానం ఆపార్టీకి ఉపకరిస్తోంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ నియమించిన అధ్యక్షులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగానే ఎంచుకుంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్నవారే. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ది కూడా అదే సామాజికవర్గమన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గం మొదటినుంచీ అధికశాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూవస్తోంది. ఇక సంఖ్యాప్రకారం తక్కువే ఐనా రాజకీయంగా ఆ ప్రాంతంలో గట్టి ప్రభావం చూపగల సత్తా వెలమలది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌ను మరింత బలహీనపరచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వెలమలతో పాటు.. బీసీలు, ఇతర సామాజికవర్గాల మద్దతుతో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో అధికారం సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. కాళేశ్వరంలో అవినీతి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ఆయుధంగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోలేకపోతే అది తనకే మేలు చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ మీదే విమర్శల దాడిని పెంచుతోంది. ప్రజలపై ప్రభావం చూపే అంశాలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైనా భారీ స్థాయిలో ప్రచారం, పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ప్రజలు భావించేలా పార్టీని బలోపేతం చేయడం. ఇందుకు అనుగుణంగా కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీ విషయం తర్వాత చూసుకుందాం..
ఏపీలో ఇప్పటికిప్పుడు బలపడకపోయినా పరవాలేదు. అక్కడ తాను భాగస్వామిగా ఉన్న కూటమే అధికారంలో ఉంది. కనుక బీజేపీ అధిష్ఠానం ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించి ఉంటే తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా నష్టమని ఆ పార్టీ భావించినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిని ఆయుధంగా మలుచుకుని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ లాభపడేందుకు ప్రయత్నిస్తాయని బీజేపీ భావించింది. ఇదే అంశంపై ఇప్పటికే ఆ పార్టీలు రెండూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఆ అవకాశం లేకుండా చేసింది.
ఏపీలో “సైలెంట్ గ్రోత్ష మోడల్
నిజానికి 2024 ఎన్నికలకు కొద్దికాలం ముందుదాకా ఏపీలో బీజేపీ- టీడీపీ సంబంధాలు ఏమంత సజావుగా లేవు. నాటి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఉందన్న భావం జనంలో సైతం విస్తృతంగా ఉన్న సమయమది. టీడీపీ- బీజేపీ కలిసి నడవడం సాధ్యమేనా అన్న అభిప్రాయం ఉండేది. అయితే జనసేనాని పవన్‌కల్యాణ్ టీడీపీతో కలిసినడవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతోపాటు మూడు పార్టీల కూటమి ఏర్పాటుకు గట్టిప్రయత్నం చేయడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ పరిస్థితి తెలంగాణకు భిన్నంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా తిరుగులేని విజయం పొందినప్పటికీ, పార్టీకి అక్కడ మద్దతు స్వల్పమే. అందుకే పార్టీ బలోపేతానికి నెమ్మదిగా అడుగులు వేయాలనుకుంటోంది. భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టిందని అర్థమవుతోంది.
పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబం మొదటినుంచీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిఉంది. ఆయన తండ్రి కూడ ఆర్ఎస్ఎస్‌లో కీలకంగా పని చేశారు. మాధవ్ 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్‌కు సౌమ్యుడిగా పేరుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా మిత్రపక్షాలతో సమన్వయం, సంయమనం పాటిస్తూ సొంత పార్టీ బలోపేతానికి కృషి చేయగల సత్తా ఆయనకుందని బీజేపీ భావించడంతోనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అందించినట్టు తెలుస్తోంది.
by Rama Chandra P | Jun 27, 2025 | తెలంగాణ
- ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపి తుది తీర్పు వెల్లదించిన తెలంగాణ హైకోర్టు
- రాయదుర్గంలో 3.5 ఎకరాల కేటాయింపుపై జారీచేసిన జీఓల కొట్టివేత
- నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న పిటిషనర్లు
- సదరు భూమి విలువ రూ.350 కోట్ల ఉంటుందని అంచనా
తెలంగాణలో భారీ భూకేటాయింపును ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర సంచలనం కలిగించాయి . హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు అత్యంత విలువైన ప్రాంతంలో చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓలను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయవాది రఘునాథ్‌రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. న్యాయస్థానాల వెలుపల వివాదాలు పరిష్కారమవ్వాలని కోర్టులే ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు ఈ ఏడాది జనవరిలోనే ముగియడంతో, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తూ, ఐఏఎంసీకి భూమిని కేటాయించడంతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను సైతం పూర్తిగా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి.
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గల సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ భూమి విలువ రూ. 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని న్యాయవాది కె. రఘునాథ్‌రావు, వెంకటరామ్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి . దీనిపై తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది .
by Ram Maddipati | Jun 18, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
జగన్ కోసం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించినట్లు కేసీఆర్ పై బలమైన ఆరోపణలు
రాజకీయమా.. అరాచకమా..? కేసిఆర్ వ్యవహారశైలిపై తెలుగు రాష్ట్రాలలో ఛీ కొడుతున్న జనం
ఫోన్ ట్యాపింగ్. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలై ఆ తర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచకం విస్తరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ దర్యాప్తులో వెలుగుచూసినట్టు వస్తున్న వార్తలు అటు రాజకీయ పార్టీల నాయకులతోపాటు ఇటు సామాన్య ప్రజలను కూడా నివ్వెరపరచేవే. రాజకీయ ప్రత్యర్థులతోపాటు పలువురుపారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘటనలో బాధితులేనని వార్తలు వెలువడుతుండటం వర్తమాన రాజకీయాల్లో కొందరు నేతల కారణంగా విలువలు ఎంతగా దిగజారిపోయాయో స్పష్టం అవుతోంది .
రాజకీయ ప్రత్యర్థుల వేటే లక్ష్యంగా . .
గతంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో నాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఓటుకు నోటు కేసు. రాజకీయంగా అప్పట్లో అదో సంచలనం. తెలంగాణలో తమ పార్టీని శాశ్వతంగా అంతం చేయాలని జరిగిన రాజకీయ కుట్రగా టీడీపీ ఆ ఘటనను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మచ్చగా మిగిలిందనే చెప్పాలి. ఈ కేసు కారణంగానే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగతి తెలుగు ప్రజలు అంత తేలికగా మరచిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాడు కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్రబాబునాయుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా హైదరాబాద్ ను వదిలి ఏపీ నుంచే పాలన సాగించేందుకు సిద్ధపడ్డారన్న విశ్లేషణలు వచ్చాయి.
రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే వెలుగులోకి..
అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ సహాయంతో చేసిన కుట్రగా భావించిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన సీఎం అయిన నాటినుంచి గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గట్టిగా దృష్టి సారించారు. నాటి ప్రభుత్వంలో దీనికి సంబంధించి పనిచేసిన కీలక అధికారుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .
ఫోన్ ట్యాపింగ్ ప్రాథమిక హక్కుల హననమే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .
by Rama Chandra P | Jun 11, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలుగు రైతాంగానికి ఉగాదే కాకుండా . .. ఏరువాక పౌర్ణమి కూడా చెప్పుకోదగ్గ పండగే. అయితే ఇటీవల దీని ప్రాధాన్యత క్రమంగా రైతాంగం తగ్గిస్తూ వస్తున్నారు . కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు .
ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.
సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ‘ఏరువాక పున్నమి’ పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది?
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి అంటే?
రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.
కర్షకుల పండుగ
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.
ఏరువాక పూజ
ఏరువాక పున్నమి రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.
by Abhi Correspondent | May 28, 2025 | తెలంగాణ, బిజినెస్
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా 200, 300 శాతం ధరలు కృత్తిమంగా పెంచేసి హైప్ చేసిన మార్కెట్లు ఎప్పటికైనా కిందకు దిగి వాస్తవ ధరలకు రావలిసి0దే కదా . …
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే గత పాలకులు కేసీఆర్, కెటిఆర్ వంటి వారి స్వార్ధ్య ప్రయోజనాల కోసం ఉన్న ధరలకు హెచ్చు చూపించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెడకు ఉరితాడు పడినట్లయింది .
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నాలుగైదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఇటీవల వరకు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాస్తవ ధరలతో పోలిస్తే మార్కెట్ ధర చాలా ఎక్కువ . . ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ – రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్‌లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక తెలిపింది . ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు మొదలయ్యాయి . అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారేళ్ళ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .