ఇరాన్‌కు ఆ ద్వీపం  ఎందుకంత కీలకం?

ఇరాన్‌కు ఆ ద్వీపం ఎందుకంత కీలకం?

”ఖర్గ్‌ ద్వీపం‌” ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరో ప్రాణం అంటారు . ..ఎందుకు ?

 ఇరాన్ ముడి చమురు బిజినెస్ లో అత్యంత కీలకమైనది . .. ఖర్గ్ ద్వీపం. ఆ దేశ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటాయి. అటువంటి కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఖర్గ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, తమ నెక్ట్స్ టార్గెట్‌లో అక్కడి చమురు మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖర్గ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఐలాండ్ ఇరాన్‌లో ఎక్కడుంది ? ఇది ఇరాన్‌కు అంతగా ముఖ్యమైందా ? దీన్ని అమెరికా ఎందుకు లక్ష్యంగా చేసుకుంది ? అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది ? ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ . ..?

ఖర్గ్ ద్వీపం ఎక్కడుంది ?
ఖర్గ్ ద్వీపం ఇరాన్ నైరుతి సముద్ర తీరానికి 26 కి.మీ దూరంలో ఉంది. కీలకమైన హర్మూజ్ జలసంధికి వాయవ్య దిశలో దాదాపు 483 కి.మీ దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఇరాన్ ఓడరేవు నగరం బుషెహర్‌కు వాయవ్య దిశలో 55 కి.మీ దూరంలో ఖర్గ్ ఉంది. ఈ ద్వీపం చుట్టూ సహజసిద్ధంగానే చాలా లోతు వరకు సముద్రజలాలు ఉన్నాయి. దీంతో భారీ సైజు ముడి చమురు ట్యాంకర్లను పార్కింగ్ చేసేందుకు ఈ ద్వీపంలోని తీర ప్రాంతం అనువైంది. ఆయిల్ ట్యాంకర్లు, నౌకల పార్కింగ్ కోసం ఖర్గ్ ద్వీపం చుట్టూ పెద్దసంఖ్యలో టెర్మినళ్లను ఇరాన్ నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఇరాన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పహారాలో ఖర్గ్ ఉంది. ఎందుకంటే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటుంది. ఈవిధంగా దేశ ముడి చమురు వాణిజ్యంపైనా ఐఆర్‌జీసీకి బలమైన పట్టు ఏర్పడింది.

ఖర్గ్ ఇరాన్‌కు అత్యంత ముఖ్యమైంది? ఎందుకంటే . .
అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సేకరించిన 1984 నాటి డీక్లాసిఫైడ్ నోట్ ప్రకారం, ఖర్గ్ ద్వీపం ఇరాన్ పెట్రోలియం వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం టైంలో, 2003లో జరిగిన అమెరికా – ఇరాక్ యుద్ధం వేళ ఖర్గ్ ద్వీపం ప్రధాన టార్గెట్‌గా మారింది. ఆనాడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇరాక్ వందలాది సార్లు ఖర్గ్ ద్వీపంపై బాంబు దాడులు చేసింది. ఈ ద్వీపంలోని టెర్మినళ్లకు భారీ చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఇరాన్‌లోని అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ చమురు, సహజ వాయువు క్షేత్రాల నుంచి ఖర్గ్ వరకు పైప్‌లైన్‌లు విస్తరించి ఉన్నాయి. ఈ పైప్‌లైన్ల వ్యవస్థ సముద్ర జలాల అడుగున ఉంది. దీని ద్వారా ఖర్గ్‌కు చేరుకునే చమురు, సహజ వాయువును భారీ నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తూ ఉంటారు .

ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్‌‌కు ఇక్కట్ల
ఖర్గ్ ద్వీపం ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ ఖర్గ్‌లో ముడి చమురు వాణిజ్యం ఆగిపోతే ఇరాన్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా సైనికశక్తి కూడా బలహీనపడుతుంది. అమెరికా కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ ఖర్గ్‌పై అమెరికా దాడులు తీవ్రతరమైతే, ఇరాన్ కూడా బలంగా ప్రతిఘటించే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

హర్మూజ్‌తో ఇరాన్- ఖర్గ్‌తో అమెరికా ఒత్తిడి

ఖర్గ్ ద్వీపంలో చమురు వాణిజ్యం స్తంభిస్తే ఇరాన్ ఆర్థికంగా బలహీనపడటం ఖాయం. ఎందుకంటే ఇరాన్ చమురు వాణిజ్యంలో 90 శాతం ఆ ఒక్క ద్వీపం నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఖర్గ్‌పై అమెరికా ఫోకస్ పెట్టింది. తద్వారా హర్మూజ్ విషయంలో ఇరాన్ వైఖరిని మార్చాలని భావిస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచేందుకు ఇరాన్ యత్నిస్తోంది. దీనికి ప్రతిగా ఖర్గ్‌పై దాడులతో, ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని జేపీ మోర్గాన్ కంపెనీకి చెందిన గ్లోబల్ కమోడిటీ రీసెర్చ్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ చమురు శాఖకు చెందిన మూడు ప్రధాన ఇంధన సౌకర్యాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు ఫలాత్ ఇరాన్ ఆయిల్ కంపెనీ. ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లో చమురును ఉత్పత్తి చేసే నాలుగు శుద్ధి కర్మాగారాలలో ఇదే అతిపెద్దది. ఈ ద్వీపంలోనే ఖర్గ్ పెట్రోకెమికల్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ యూనిట్లలోనే చమురు, ద్రవీకృత సహజ వాయువును నిల్వ చేస్తారు, ఎగుమతి చేస్తారు. ఇరాన్ ప్రభుత్వం ఖర్గ్‌లోని చమురు టెర్మినల్ నిల్వ సామర్థ్యాన్ని 2 మిలియన్ బ్యారెళ్లకు విస్తరించిందని 2025లో నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ప్రతీ చమురు ట్యాంక్‌కు ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే కెపాసిటీ ఉంది.

ఇరాన్‌ ప్రతిదాడి ఎలా?
హర్మూజ్ మీదుగా ఇతర దేశాల ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. కానీ ఖర్గ్ ద్వీపం నుంచి చమురు సప్లైలను ఇరాన్ ఇంకా కొనసాగిస్తోందని తెలుస్తోంది. తాజాగా TankerTrackers.com చేసిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం, మార్చి 11న (బుధవారం) ఖర్గ్ ద్వీపంలో అనేక పెద్ద ముడి చమురు ట్యాంకర్లు లోడ్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి బుధవారం వరకు ఇరాన్ రోజుకు సగటున 1.1 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఖర్గ్‌పై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఖర్గ్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ ఘాటుగా బదులిచ్చే ఛాన్స్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే  లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి వ్యవస్థ ప్రమాదకరంగా మారింది . సదరు నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం ప్రకటించిన కొన్ని రోజులకే ఇరాన్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. భారీ భూగర్భ బంకర్ల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంచర్లనే లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అత్యంత పకడ్బందీగా నిర్మించుకున్న క్షిపణి నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? టెహ్రాన్ వ్యూహం ఎందుకు విఫలమైంది? 

తాజాగా ఇరాన్‌లోని డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంచర్లు బయటకు రాగానే వాటిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అమెరికా భారీ బాంబర్ల దాడులతో ఇరాన్ ఆయుధాలు కొన్ని చోట్ల భూగర్భంలోనే చిక్కుకుపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దక్షిణ నగరమైన షిరాజ్ సమీపంలోని స్థావరాలతో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్, కెర్మాన్‌షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్లు ఇటీవల తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడికి గురైన స్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నప్పటికీ, వాటి పైభాగంలో ఉన్న భవనాలు, ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా వాటిని సులభంగా గుర్తించి దాడులు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇరాన్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. లాంచర్లను బయటకు తీసుకురాకుండా నేరుగా భూగర్భ బంకర్ల నుంచే క్షిపణులను ప్రయోగించేందుకు కొన్ని స్థావరాల వద్ద ఇరాన్ సైన్యం భూగర్భ గోతులను నిర్మించింది. దక్షిణ ఇరాన్‌లోని ఖోర్ముజ్ పట్టణం సమీపంలో ఉన్న ఒక స్థావరంలో ఇటువంటి సామర్థ్యాలున్న తొమ్మిది భూగర్భ గోతులు ఉన్నట్లు అమెరికా సైనిక మాజీ నిపుణుడు కాలిన్ డేవిడ్ వెల్లడించారు. ఇవి పర్షియన్ గల్ఫ్ వైపు చూసేలా పర్వతాల వాలులో తవ్విన లోతైన గుంతలు. పదే పదే ఈ గోతులను వినియోగించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల భూగర్భ ప్రయోగ కేంద్రాల ఆలోచనను ఇరాన్ దాదాపుగా విరమించుకుందని వాషింగ్టన్‌కు చెందిన సీఎన్ఏ కార్పొరేషన్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్​ను తక్కువ అంచనా వేయడంలేదా ?
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి రక్షించుకునేందుకు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ అప్రమత్తమైంది. కొన్ని క్షిపణులను, లాంచర్లను బంకర్ల నుంచి బయటకు తరలించి ఉండవచ్చని, తద్వారా వాటిని చెదరగొట్టి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు ఉన్న భారీ భూగర్భ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసే బంకర్-బస్టింగ్ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే, లాంచర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్షిపణులను అడ్డుకునే ఎయిర్-డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్ల నిల్వలు అయిపోకముందే, టెహ్రాన్ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది.

తాజా దాడుల ప్రభావంతో ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గుముఖం పట్టాయని ఇజ్రాయెల్, అమెరికా అధికారులు ధ్రువీకరిస్తున్నారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలను ఆదా చేసుకుంటున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ క్షిపణి నిల్వలపై భిన్నమైన అంచనాలున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 2,500 క్షిపణులు ఉండొచ్చని ఇజ్రాయెల్ అంచనా వేయగా, సుమారు 6,000 వరకు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అంచనావేస్తున్నారు .

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు – ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం – పెంటగాన్ హెచ్చరిక

ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసాయ ? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఔవుననే చెపుతున్నాయి . ఇరాన్‌పై దాడులు ఇదేరీతిలో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొనడం గమనార్హం .

ఏ నిల్వలు తగ్గిపోతాయి ?
సీఎన్ఎస్, ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా, అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా కీలక ఆయుధ నిల్వలన్నీ తగ్గిపోయే ముప్పు ఉంటుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌‌ను హెచ్చరించామని పెంటగాన్ అధికార వర్గాలు, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డ్యాన్ కైనీ చెప్పారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. 2025 జూన్‌లో ఇరాన్ – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసిందని పేర్కొన్నాయి. ఆ టైంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

ఖరీదైన యుద్ధం . ..
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం ఖర్చు తడిపిమోపెడు అవుతోంది . అత్యు0త భారీగా ఉందని . . అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి 24 గంటల్లోగా అమెరికాకు దాదాపు రూ.7186 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది . గల్ఫ్ సముద్ర జలాల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక విమాన వాహక యుద్ధ నౌకను, అందులోని సైనికులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఒకరోజుకు రూ.59 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి ఇరాన్‌పై దాడులు చేయడానికి, దాదాపు నెల రోజుల ముందు నుంచే గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల మోహరింపును అమెరికా మొదలుపెట్టింది.

యుద్ధం 4 వారాలు ఉంటే.. లక్షల కోట్ల ఖర్చు . ..

ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా . .

ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు : ట్రంప్
‘‘అమెరికా ఆయుధ సప్లైలు బలమైన స్థితిలో ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి. అన్ లిమిటెడ్‌గా ఆయుధాలను సప్లై చేసే సత్తా అమెరికాకు ఉంది. ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు’’ అని పేర్కొంటూ ఇటీవలే ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇలాంటి పోస్టులు చేయడం ట్రంప్ కి ముందు నుంచీ అలవాటే . . అని ప్రముఖులు చెపుతున్నారు .

దావోస్.. ఒప్పందాలు అమలైతే.. ఎంత బాగుంటుందో..

దావోస్.. ఒప్పందాలు అమలైతే.. ఎంత బాగుంటుందో..

దావోస్ దౌత్యం: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు, లోకేష్
డబ్ల్యూఈఎఫ్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ పాల్గొనడం వల్ల ఇప్పటికే సుమారు ₹2.5 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించాయని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు . నిజంగా ఇవన్నీ కాకపోయినా , , కొన్నయినా అమలులోకి రావాలని కోరుకుందాం . ..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు , విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, గ్రీన్ ఎనర్జీ, అధునాతన సాంకేతికతలు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు . .

మీడియాతో మాట్లాడుతూ, వేగంగా మారుతున్న ప్రపంచ పారిశ్రామిక ధోరణులు మరియు పెట్టుబడిదారుల మనోభావాలను అర్థం చేసుకోవడానికి దావోస్ వేదిక అమూల్యమైనదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు . WEF సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఇప్పటికే దాదాపు ₹2.5 లక్షల కోట్ల పెట్టుబడి నిబద్ధతలుగా మారిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .

“యువశక్తి, నిర్ణయాత్మక నాయకత్వం మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల కారణంగా ప్రపంచ పరిశ్రమ నాయకులు భారతదేశం వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బలాలను సమర్థవంతంగా ప్రదర్శించడానికి దావోస్ మాకు సహాయపడింది” అని ఆయన అన్నారు.రాష్ట్ర ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ మరియు జాతీయ పారిశ్రామిక కారిడార్‌లతో దాని ఏకీకరణను హైలైట్ చేస్తూ, ముఖ్యమంత్రి డిపి వరల్డ్, ఎడి పోర్ట్స్, షరాఫ్ గ్రూప్ మరియు ఎడిఎన్‌ఓసి వంటి యుఎఇ కంపెనీలను పారిశ్రామిక పార్కులు మరియు లాజిస్టిక్స్ పెట్టుబడులను అన్వేషించడానికి ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ 160 GW సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకున్న పునరుత్పాదక ఇంధన రంగంలో, అలాగే అంతరిక్ష మరియు డ్రోన్ నగరాల్లో భాగస్వామ్యాలను కూడా ఆయన ప్రతిపాదించారు
నాలుగు రోజుల పర్యటనలో, ముఖ్యమంత్రి 36 సమావేశాలకు హాజరయ్యారు, వాటిలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మరియు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ వంటి 16 మంది ప్రపంచ వ్యాపార ప్రముఖులతో సంభాషణలు జరిగాయి .

గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ, వ్యవసాయం మరియు పర్యాటక రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని ఈ నిశ్చితార్థాలలో పదునైన దృష్టికి తీసుకువచ్చినట్లు నాయుడు చెప్పారు. ఇజ్రాయెల్, యుఏఈ మరియు స్విట్జర్లాండ్ ప్రతినిధులతో సమావేశాలలో కూడా ఆయన పాల్గొన్నారు మరియు బహుళ WEF సెషన్‌లకు హాజరయ్యారు.

వైజాగ్ TCS అభివృద్ధి కేంద్రం, అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ మరియు కర్నూలులో సౌర విద్యుత్ ప్రాజెక్టులపై నాయుడు చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపారు. పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మరియు రాష్ట్రంలోని మూడు ప్రతిపాదిత క్రీడా నగరాల్లో పెట్టుబడులను అన్వేషించాలని ఆయన టాటా గ్రూప్‌ను కోరారు.

చంద్రశేఖరన్ సహకారానికి హామీ ఇచ్చారు మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద చొరవలపై టాటా ట్రస్ట్ అధికారులు వివరణాత్మక చర్చలు నిర్వహిస్తారని చెప్పారు.

వ్యవసాయం మరియు ఎగుమతుల విషయంలో, నాయుడు యుఎఇ విదేశీ వాణిజ్య సహాయ మంత్రి థాని బిన్ అహ్మద్ అల్ జెయుదీని కలిసి, ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యానవనాలు, ఆక్వా మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు దుబాయ్‌తో అనుసంధానించబడిన ఆహార క్లస్టర్‌కు కేంద్రంగా ప్రతిపాదించారు.

.సహజ వ్యవసాయం మరియు ప్రత్యామ్నాయ పంటలు
సహజ వ్యవసాయం మరియు ప్రత్యామ్నాయ పంటలపై WEF నిర్వహించిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమవుతోందని, ఇప్పటికే రెండు మిలియన్ ఎకరాల్లో 1.8 మిలియన్ల మంది రైతులు రసాయన రహిత పద్ధతులను అనుసరిస్తున్నారని నాయుడు అన్నారు.

తక్కువ ఇన్‌పుట్ ఖర్చులు, మొదటి సంవత్సరం నుండి అధిక నికర ఆదాయాలు, మెరుగైన నేల కార్బన్ నిల్వ, నీటి సామర్థ్యం మరియు జీవవైవిధ్యం వంటి ప్రయోజనాలను ఆయన నొక్కిచెప్పారు, అదే సమయంలో ప్రపంచ మార్కెట్లు, ధృవీకరణ వ్యవస్థలు మరియు సహజ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ప్రైవేట్ రంగ మద్దతు అవసరాన్ని నొక్కి చెప్పారు.

ముఖ్యమంత్రి చేరువకు సాంకేతికత మరియు పాలనపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి చేరువయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించే ఆస్ట్రేలియా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, మైనర్ల మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు మరియు అలాంటి విధానాన్ని అవలంబిస్తే బలమైన చట్టపరమైన చట్రం అవసరమని ఆయన వెల్లడించారు.

ప్రపంచ సాంకేతికత మరియు సంస్థాగత నాయకులతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహించారు. విశాఖపట్నంలో AI, క్లౌడ్ మరియు డిజిటల్ సేవలపై దృష్టి సారించిన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మరియు అమరావతి క్వాంటం వ్యాలీ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్యం, క్వాంటం కంప్యూటింగ్ మరియు స్టార్టప్ ఇన్నోవేషన్‌లో భాగస్వామి కావాలని ఆయన యాక్సెంచర్‌ను ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఉమ్మడి పరిశోధన, పాఠ్యాంశాల అభివృద్ధి, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజీలు మరియు వాతావరణ మార్పు మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులపై సహకారం కోరుతూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబోరా ప్రెంటిస్‌ను కూడా ఆయన కలిశారు.

దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్‌ను నిర్వహించడానికి
WEF క్వాంటం కంప్యూటింగ్ సెషన్‌లో, ఆంధ్రప్రదేశ్ జూలై 2026 నాటికి అమరావతిలో IBM మరియు TCS భాగస్వామ్యంతో దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ – 133-క్విట్ ప్రాసెసర్‌తో IBM క్వాంటం సిస్టమ్ టూను నిర్వహిస్తుందని లోకేష్ ప్రకటించారు.

భారతదేశం యొక్క జాతీయ క్వాంటం మిషన్‌తో అనుసంధానించబడిన నైపుణ్యాలు మరియు పరిశోధన నుండి హార్డ్‌వేర్ తయారీ మరియు ఎగుమతుల వరకు పూర్తి క్వాంటం విలువ గొలుసును నిర్మించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

ఇంధన పరివర్తన, సైబర్ భద్రత మరియు సరిహద్దు సాంకేతిక పాలనపై దృష్టి సారించి, ఒక సంవత్సరంలోపు నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం WEF–AP కేంద్రాన్ని ప్రారంభించేందుకు లోకేష్ WEF ప్రభుత్వ వ్యవహారాల అధిపతి మారౌన్ ఖైరోజ్‌ను కలిశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రౌండ్‌టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రం ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’ నుండి ‘వ్యాపారం చేయడంలో వేగం’ వైపు మారుతోందని, గత 18 నెలల్లో 50కి పైగా నియంత్రణల సరళీకరణ సంస్కరణలను చేపట్టి, 2035 నాటికి ‘డే-జీరో రెడీ స్టేట్’గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

విదేశీ పెట్టుబడులు 100 శాతం . . భీమా సమస్యలకు  ఎఫెక్ట్ ..>

విదేశీ పెట్టుబడులు 100 శాతం . . భీమా సమస్యలకు ఎఫెక్ట్ ..>

100 శాతం విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భీమా రంగానికి ఎంత మేర మేలు చేకూరుస్తుంది . భారత పార్లమెంటు ‘సబ్కా బీమా సబ్కీ రక్షా (ఇన్సూరెన్స్ చట్టాల సవరణ) బిల్లు-2025’ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 74 శాతం నుండి ఏకంగా 100 శాతానికి పెంచారు. బీమా చట్టం-1938, ఎల్‌ఐసీ చట్టం-1956, ఐఆర్‌డీఏ చట్టం-1999లను సవరిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశంలో మందకొడిగా ఉన్న బీమా విస్తరణను వేగవంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, కేవలం పెట్టుబడుల పరిమితి పెంచినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తీరుతాయా అన్న అంశంపై చర్చ నడుస్తోంది .

పెట్టుబడుల వేగం తగ్గింది . .

కొన్నేళ్లుగా భారత్‌లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 43.9 బిలియన్ డాలర్లుగా ఉన్న నికర ఎఫ్‌డిఐ, 2025 నాటికి 959 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు దేశంలో బీమా తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. జీడీపీలో బీమా ప్రీమియం వాటా 3.7 శాతంగానే మాత్రమే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ అంతరాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ద్వారాలు తెరవడం పెద్ద చర్చ .

విదేశీ కంపెనీల ముందున్న సవాళ్లు 100 శాతం పెట్టుబడికి అవకాశం ఇచ్చినప్పటికీ, విదేశీ సంస్థలు భారత్‌లో అడుగుపెట్టడానికి ఒక ప్రధాన అడ్డంకి ఉంది. అదే ‘ఏజెంట్ వ్యవస్థ’. మన దేశంలో బీమా వ్యాపారం పూర్తిగా ఏజెంట్ల నెట్‌వర్క్ మీద ఆధారపడి నడుస్తుంది. దాదాపు 50 శాతం వ్యాపారం ఏజెంట్ల ద్వారానే జరుగుతోంది. విదేశీ సంస్థలు సాధారణంగా సాంకేతికతను నమ్ముకుంటాయి. కానీ భారతీయ వినియోగదారులు ‘మనిషి భరోసా’ (human interface) కోరుకుంటారు. ఏజెంట్ వచ్చి మాట్లాడితే తప్ప పాలసీ కొనని పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంత పెద్ద ఏజెంట్ వ్యవస్థను నిర్వహించడం విదేశీ కంపెనీలకు కత్తి మీద సాము వంటిదే. అందుకే చాలా కంపెనీలు జాయింట్ వెంచర్లకే మొగ్గు చూపుతున్నాయి.

కఠిన నిబంధనలు – ఐఆర్‌డీఏఐ పవర్స్ కొత్త చట్టం బీమా నియంత్రణ సంస్థ (IRDAI)కు అపరిమిత అధికారాలు కల్పించింది. తప్పుడు మార్గంలో సంపాదించిన లాభాలను జప్తు చేయడం, సోదాలు నిర్వహించడం వంటి అధికారాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకులు, ఇతర మధ్యవర్తులపైనా ఈ చర్యలు తీసుకునే వీలుంది. ఇది పరిశ్రమ వర్గాల్లో గుబులు రేపుతోంది. దీనికి తోడు, కంపెనీలో మెజారిటీ వాటా విదేశీయులదే అయినా… ఛైర్మన్, సీఈఓ లేదా ఎండీ వంటి కీలక పదవుల్లో కచ్చితంగా భారతీయులే ఉండాలన్న నిబంధన ఉంది. ఇది పెట్టుబడిదారులను వెనకడుగు వేయించే అంశం.

జేబులో డబ్బుంటేనే బీమా అసలు సమస్య వేరే ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆదాయం పెరగకపోవడమే బీమా రంగం డీలా పడటానికి అసలు కారణం. దేశంలో నాణ్యమైన ఉద్యోగాలు తగ్గుతున్నాయి. జీతాలు పెరగడం లేదు. సుమారు 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ ఉచిత రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ కంపెనీలు ఎంత పెట్టుబడి తెచ్చినా, సామాన్యుడి జేబులో డబ్బు లేకపోతే బీమా పాలసీలు ఎవరు కొంటారు? ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే తప్ప బీమా విస్తరణ సాధ్యం కాదని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

ఈనాడు.. ఎందుకు ఇలా చేస్తోంది . …

ఈనాడు.. ఎందుకు ఇలా చేస్తోంది . …

కంటెంట్ కాపీ.. ఇది పెద్ద విషయం ఏమీ కాదు . .. కానీ ఎందుకు అంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ?

సోషల్ మీడియా వేగంగా పరిగెడుతున్న కాలం ఇది. ఒకరి కంటెంట్ మరొకరు కాపీ కొట్టడం , మార్పులు చేసి వాడుకోవడం . . సహజాతి సహజంగా సాగిపోతున్న రోజులు . దీనిని పెద్దగా పట్టించుకునేవారు కూడా లేరనే చెప్పాలి .

ఈనాడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లను ఉపయోగించుకుని వాటిని షేర్ చేస్తుంటే ఆ క్రెడిట్ ఈనాడు వాళ్ళకే వెళుతుంది కదా . .. అలాంటిది ఎందుకు వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఈనాడు పత్రికలో సెల్ఫ్ యాడ్ ఇచ్చారో జర్నలిస్ట్ వర్గాలలో చర్చ నడుస్తోంది .

తెలుగు వార్తాపత్రికలలో అత్యంత ఆదరణ ఉన్న పత్రిక ఈనాడు . విస్తృతంగా ప్రసారం అయ్యే ఈనాడు, పాఠకులను మరియు సోషల్ మీడియా వినియోగదారులను ఇలా హెచ్చరించడంలో ఉద్దేశ్యం అర్ధం కావడంలేదు .

ఈనాడు యాజమాన్యంలోని రామోజీ గ్రూప్ కంపెనీ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ నోటీసు, అనుమతి లేకుండా వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన వార్తా కథనాలు లేదా ఇ-పేపర్ కంటెంట్‌ను షేర్ చేస్తే కాపీరైట్ చట్టం కింద చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది.

సంక్షిప్తంగా, ఫార్వార్డింగ్, స్క్రీన్‌షాట్‌లు లేదా “ఈనాడు హెడ్‌లైన్‌లతో శుభోదయం” సందేశాలు ఉండకూడదు.

ఈ వైఖరి చాలా ఇతర ప్రచురణలు చేసే దానికి ఎంత విరుద్ధంగా ఉందో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆచరణాత్మకంగా నేడు ప్రతి డిజిటల్ వార్తా సంస్థ కథనాల పైభాగంలో లేదా దిగువన సులభమైన షేర్ బటన్‌లను అందిస్తుంది, పాఠకులను ఈ పదాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. అయితే, ఈనాడు ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈదుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ హెచ్చరిక ఈనాడు దాని కంటెంట్ ఆన్‌లైన్‌లో ఎలా ప్రసారం చేయబడుతుందో లేదా అర్థం చేసుకోబడుతుందో దానిపై గట్టి నియంత్రణను ఉంచడానికి మార్గం కావచ్చు, ముఖ్యంగా రాజకీయ చర్చలు తరచుగా కథనాలను ఆకారంలో లేని సమయంలో.

అయితే, ఒక కథనం ప్రచురించబడిన తర్వాత, అది సహజంగానే ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తుందని విమర్శకులు ఎత్తి చూపారు, అక్కడ పాఠకులు మరియు వ్యాఖ్యాతలు చర్చించడానికి, విశ్లేషించడానికి మరియు విభేదించడానికి కూడా స్వేచ్ఛగా ఉంటారు.

సోషల్ మీడియా ఈ చర్యపై తనదైన శైలిని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పవనాలు మారుతున్నాయని ఈనాడు పెరుగుతున్న భయాన్ని ఈ హెచ్చరిక ప్రతిబింబిస్తుందని చాలా మంది వినియోగదారులు చమత్కరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ఆ బృందం కఠినమైన రోజులు ఎదురుచూస్తుందని సూచిస్తూ, పత్రిక ఆందోళనను ఇది వెల్లడిస్తుందని కొందరు పేర్కొన్నారు.

టీడీపీ , కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చినా . .. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన , అరాచకాలకు పురిగొల్పింది ఆ పార్టీ కీలక నేతలపై చర్యలు తీసుకోకపోవడం ఈనాడుకు కోపం తెప్పిస్తోంది . పైగా జగన్ సీఎంగా ఉన్నపుడు హవా కొనసాగించిన అధికారులలో ఇంకా కొందరు కూటమి పాలనలో సైతం కీ రోల్ పోషిస్తున్నారు . దీనిపై కూడా ఈనాడు అక్కసు వెళ్లగక్కుతోంది .

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, అసంతృప్తి పూర్తిగా తొలగిపోయినట్లు కనిపించడం లేదు. జగన్ ఆన్‌లైన్ సైన్యం – వెక్కిరించడానికి మరియు మీమ్‌లకు – పెరగడం ఈనాడును అంచున ఉంచిందని, డిజిటల్ రంగంలో దాని ప్రభావం జారిపోతుందనే ఆందోళనతో ఉందని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు .