by Rama Chandra P | Oct 29, 2025 | బిజినెస్
”2025 టాటా సియెర్రా” లాంఛ్ డేట్ ఫిక్స్- వివరాలు ఇవిగో !
సరికొత్త వాహనాలపై మోజు ఉండే వాహన ప్రియులకు అదిరే అప్డేట్ ఇది .. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త SUV “టాటా సియెర్రా”ను త్వరలో విడుదల చేయబోతోంది. నవంబర్ 25న భారతదేశంలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కారు కాన్సెప్ట్ మోడల్‌ను మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు దీనిని విడుదల చేసేందుకు రెడీ అయింది.
టాటా “సియెర్రా” నేమ్‌ప్లేట్ పాత, ప్రతిష్టాత్మకమైనది. 2020 ఆటో ఎక్స్‌పో తర్వాత 2023లో అప్డేటెడ్ “సియెర్రా EV” కాన్సెప్ట్ వెల్లడైంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దాదాపు పూర్తిగా నిర్మించిన అంతర్గత SUV ఉత్పత్తిని ఆవిష్కరించారు.
దీని ఫైనల్ ప్రొడక్షన్-స్పెక్ మోడల్ గతంలో ప్రదర్శించిన చివరి నియర్-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌కు దగ్గరగా పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ICE, EVల మధ్య కొన్ని స్టైలింగ్ తేడాలు కనిపించవచ్చు, వాటిలో గ్రిల్‌లో మార్పులు కూడా ఉన్నాయి. ICE మోడల్ బ్లాక్ గ్రిల్‌ను కలిగి ఉంది .
టాటా సియెర్రా ఇంటీరియర్: టాటా సియెర్రా ఇంటీరియర్ విషయానికి వస్తే డాష్‌బోర్డ్‌లో 3 డిస్‌ప్లేలతో పాటు అనేక సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఎంపిక చేసిన వేరియంట్‌లలో డెడికేటెడ్ కో-డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది లెవల్ 2 ADAS ఫంక్షన్‌లు, 360-డిగ్రీ కెమెరాలతో పాటు అనేక ఫీచర్లు ఇందులో స్పెషల్ .
టాటా సియెర్రా ఇంజిన్: పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, ఇది టాటా కొత్త హైపెరియన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. అదనంగా ఈ SUV డీజిల్ ఇంజిన్ ఎంపికనూ అందించవచ్చు. ఇది టాటా హారియర్‌లో కనిపించే సుపరిచితమైన 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్. “టాటా సియెర్రా EV” పవర్‌ట్రెయిన్‌కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రివీల్ కాలేదు. అయినప్పటికీ ఇది “టాటా కర్వ్ EV”, “టాటా హారియర్ EV” వంటి కార్లతో పవర్‌ట్రెయిన్ భాగాలు ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి .
by Srinivas Vedulla | Oct 8, 2025 | పరిశీలన, బిజినెస్
– మిడిల్ క్లాస్ కొనుగోళ్లు తగ్గుముఖం… దిగజారుతున్న ఆర్ధికం – 2027 లో రియల్ ఎస్టేట్ పతనం ?
- ఐటీ రంగం ఒడిదుడుకులే కాదు …. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలూ రియాలిటీకి దెబ్బే
”ఇరవై ఏళ్లపాటు అప్రతిహతంగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ శకం ముగియబోతోందా ? ఆ దూకుడుకు బ్రేక్ పడటమే కాదు . .. పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఐదారేళ్లుగా మందగమనం దేనికి సంకేతం ? ?? 2026, 2027 లలో రియల్ ఎస్టేట్ పతనం చూడబోతున్నామా ?
ఈ ప్రశ్నలకు ” ఔను … రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ పతనం చూడాల్సి వస్తుంది. ఇపుడు నుంచే జాగ్రత్తగా ఉండాలి . .. 2026లోనే రియల్ పతనం స్టార్ట్ అవుతుంది . అది 2027 నాటికి పీక్ కి వెళ్లబోతోంది . ..” అంటూ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి . అయితే కొన్ని సర్వే, ఏలాలసిస్ సంస్థలు మాత్రం ”2030 నాటికి ఇండియాలో రియల్ ఎస్టేట్ పతాక స్థాయికి వెళ్లబోతోంది . ..” అంటూ జీడీపీ పెరుగుదల , భారత్ లో జనాభా వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అంచనాలు వేస్తున్నాయి . అయితే ప్రస్తుత అస్తవ్యస్త విధానాలు , మెజార్టీ ప్రజల (70 శాతం ) కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు .
ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా . .. అవి ఇతర దేశాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి . రష్యా -ఉక్రెయిన్ యుద్ధం , ఇరాన్ – ఇరాక్ వార్ . .. అమెరికాలో ఆర్ధిక సంక్షోభ0, ట్రంప్ టారిఫ్ ల సంక్షోభం వంటివన్నీ మన సమాజంపై, మన ఆర్ధిక స్థితి – గతములపై కూడా అత్యంత ప్రభావం చూపుతున్నాయి .
ఐటీ భూమ్ సంక్షోభం వల్ల NRI ఇన్విస్ట్మెంట్స్ తగ్గుముఖం పట్టాయి . , ట్రాంప్ టారిఫ్ సంక్షోభం . .. వల్ల గోదావరి జిల్లాలలో ఆక్వా పరిశ్రమ బెంబేలెత్తిపోతోంది . ఈ ప్రభావం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తీవ్రంగా పడింది . ఇది కూడా రియల్ పై ఎఫెక్ట్ చూపుతోంది .
ఐటీ భూమ్ తగ్గడం : గ్లోబల్ వైజ్ ఐటీ రంగం ఒడిదుడుకుల ప్రభావం మన దేశ ‘రియల్ ఎస్టేట్ ‘ రంగంపై తీవ్రంగా పడుతోంది . ముక్యంగా దక్షిణాదిలో రియల్ భూమ్ ఎక్కువ . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అధికంగా ఉన్నారు . దేశీయంగాను , విదేశాలలోని సౌత్ ఇండియా వారు ఎక్కువగా ఐటీ, ఫార్మా రంగాల నుంచి ఆర్జిస్తున్నారు . వీరి ఆదాయంలో 50-60 శాతం రియల్ ఎస్టేట్ పైనే పెట్టేవారు . గడచినా ఐదారేళ్లుగా ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. 2024-2025 నుంచి ఈ మార్పు మరింత స్పష్టంగా ఉంటోంది .
ధరలు బాగా ఎక్కువ : హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ , విల్లాలు , ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ధరలు వాస్తవ పరిస్థితులకంటే చాలా ఎక్కువ. చదరపు గజం 6-8 వేలు ఉండాల్సిన చోట . .. రూ 12-15 వేల వరకు అమ్మేవారు . 2005 నుంచి 2015 వరకు చాలా చోట్ల బిల్డర్స్ కి ఇది నడిచింది . అప్పట్లో కనస్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంటర్ అయిన వారు భారీగా ఆరగించారు . పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన . … ఇతర రంగాలలో ఉన్నవారు , అంత ఆర్ధిక స్తోమతలేకపోయినా అప్పులు చేసి . .. నిర్మాణ రంగంలోకి వేలాదిగా వచ్చేసారు . జనం అవసరాల కంటే అదనంగా అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది . ఈ ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ పై పడింది . అలాగే వెంచర్లలో కూడా భారీ ధరలు పెట్టి . .. NRI లను ఆకర్షించి . .. అధిక ధరలకు అమ్ముకున్నారు . ఈ మార్కెట్ కూడా 2019 వరకు బాగానే సాగింది . కరోనా దెబ్బతో వెంచర్ల బిజినెస్ డీలాపడింది .
జీడీపీ పెరిగినా…. భారత్ జీడీపీ వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్న ప్రచారం జోరుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తోంది . అయితే ఇదే సమయంలో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గింది . జీడీపీ పెరిగినా ఆ ఫలితాలు సామాన్యులకు అందడంలేదు . . .. పారిశ్రేమికవేత్తలు , బడా బాబులకు చేరుతున్నాయని చెప్పాలి . 70 శాతం ఉన్న సామాన్య జనం కొనుగోలు శక్తి గణనీయంగా గట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . ఈ ప్రభావం తయారీ రంగంపై పడుతుంది . ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ ని వెనక్కిలాగుతుంది.
బ్యాంక్ లపై ఎఫెక్ట్ . .. రియల్ ఎస్టేట్ మందగమనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపునుండి . లోన్లు తీసుకున్న బిల్డర్స్ చాలామంది అపార్టుమెంట్లు అమ్ముడుపోక తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు . హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో వేలకోట్ల బాకీలు బ్యాంకులకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు . ఈ ప్రభావం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది .
వెంచర్ల పరిస్థితి అగమ్యగోచరం … పట్టణాలు , పల్లెలు అన్న తేడా లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి వేసిన వెంచర్లో అమ్ముడుపోక ఖాళీగా ఉంటున్నాయి . ఉదాహరణకు రాజమండ్రి సమీపంలో పాలచర్ల , వెలుగుబండ , దివాన్ చెరువు , రాజానగరం , రాజవోలు , తదితర ప్రాంతాలలో 20 ఏళ్ల క్రితం వేసిన వెంచర్లలో సైతం అమ్ముడుపోని సైట్లు అనేకం ఉన్నాయి . వెంచర్లు వేసిన రియాల్తార్లు లాంచింగ్ ఆఫర్స్ , అనో మరో స్కీం పేరుతొ చాలా వరకు అమ్ముకున్నారు . వారి నుంచి కొనుగోలు చేసిన వారే రెండో సారి అమ్మడానికి కష్టం అవుతోంది . కొనేందుకు ఎవరు ముందుకు రాక . .. పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోతుంది .
‘రియల్ శకం ముగిసినట్లేనా ? ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా >? అంటే మెజార్టీ నిపుణులు ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని ఘంటాపదంగా చెపుతున్నారు . ఎన్ని స్థలాలు కొంటారు . … >? ఎన్ని ఫ్లాట్స్ కొంటారు > కొనడానికి సరిపడా ఆదాయాలు వస్తున్నాయా > భూముల ధరలు అమాంతం పెరిగాయి . అవి కొని అపార్ట్మెంట్స్ నిర్మించే బిల్డర్స్ కి కూడా ఇది పెనుభారంగా మారింది . ఈ ప్రభావం కూడా హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం . రాజమండ్రి , కాకినాడ , తదితర నగరాలలో నిర్మాణ రంగంపై గణనీయంగా పడింది . “” ఐదారేళ్లలో రియల్ ఎస్టేట్ ఇలాగే ఉంటుంది . ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గుతాయి . అయినా బిజినెస్ పుంజుకునే పరిస్థితులు వచ్చేలా లేవు . భవిష్యత్తులో వ్యవసాయ భూముల ధరలు కాస్త పెరుగుతాయి . 2030 నాటికి వ్యవసాయ భూముల ధరలు 50-60 శాతం పెరిగే ఛాన్స్ ఉంది . ..” అని రాజమండ్రికి చెందిన ఎనలిస్ట్ జె . చౌదరయ్య ”అభిన్యూస్ ‘ తో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు . రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 2000 నుంచి 2020 మధ్య ఇరవై ఏళ్లలో 15,650 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి . ఇందులో వెంచర్లు వేసిన రియాల్తర్లు 70-80 శాతం అమ్మేసుకున్నారు . కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్ మాత్రం . .. 20 శాతం కూడా రీ సేల్ చేయలేకపోయారు . .. అని రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్టర్ ఒకరు చెప్పారు .
by Rama Chandra P | Sep 11, 2025 | బిజినెస్
కౌటిల్యుడిని ఫాలో అయితే విజయమే… బిజినెస్ లో దూసుకుపోవడమే . ..
ఎవరైనా కాస్త తెలివిగా ఉంటే ”చాణుక్యుడు ‘ ‘ అనడం పరిపాటి. అంటే చాణుక్యుడు అంటే తెలివితేటలకు. వ్యూహాలకు పెట్టింది పేరు . అలాంటి చాణుక్యుడి సూత్రాలు పాటిస్తే బిజినెస్ లో కూడా దూసుకుపోవడమే . .. కౌటిల్యుడు . .. అదేనండీ చాణుక్యుడు మరో పేరు . .. అయన చెప్పిన వ్యాపార సూత్రాలు తెలుసుకుందామా . ….
మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన గురువుగా చాణక్యుడికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆర్థికవేత్తగా, రాజకీయ వ్యూహకర్తగా ఆయనకు ఆయనే సాటి. ఇంతటి ఘనత కలిగిన చాణక్యుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో అర్థశాస్త్రాన్ని రచించారు. ఈ పురాతన గ్రంథాన్ని 15 పుస్తకాలుగా విభజించారు. ఈ అర్థశాస్త్రంలో స్టేట్‌క్రాఫ్ట్, గవర్నెన్స్, ఎకనామిక్స్, డిప్లొమసీకి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.
క్రీస్తు పూర్వం చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం వ్యూహాత్మక జ్ఞానానికి శాశ్వతమైన గని వంటిది . ఆధునిక వ్యాపారపు సంక్లిష్ట, పోటీతత్వ వాతావరణానికి దోహదపడే ఎన్నో టిప్స్ అర్థశాస్త్రంలో ఉన్నాయి. మన దేశంలోని ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలు కూడా అర్థశాస్త్ర సూత్రాలను ఫాలో అవుతుంటారు. వాటిని తమ కంపెనీ రూల్స్‌లో అమలు చేస్తుంటారు. మన దేశ సైన్యంలోని ఉన్నతాధికారులకు చాణక్యుడు చెప్పిన వ్యూహ రచనా నైపుణ్యాలను చెపుతూ ఉంటారు .
దూరదృష్టి :వ్యాపార రంగంలో ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలంటే క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని అర్థశాస్త్రం చెబుతోంది. వ్యాపారంలో ఉండే రిస్క్‌ను ముందస్తుగా మదింపు చేసుకోవడం, దానికి అనుగుణంగా చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని చాణక్యుడు సూత్రీకరించారు . చాణక్యుడి అర్థశాస్త్రం నుంచి వ్యూహాత్మక ఆలోచనా విధానం, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు క్లారిటీగా నేర్చుకోవచ్చు. నేటి అధునాతన బిజినెస్‌లకు కూడా ఈ టిప్స్ పనికొస్తాయి. కౌటిల్యుని ప్రకారం, వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసే సామర్థ్యం తప్పకుండా వ్యాపారికి ఉండాలి. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ముందుగానే వ్యూహరచన చేసుకోవాలి.
నైతికత :వ్యాపార వ్యవహారాలలో నైతికతకు ప్రధమంగా చోటు ఉండాలని చాణక్యుడు అంటారు. వ్యాపార లావాదేవీలు, వ్యాపార నిర్వహణలో చిత్తశుద్ధి, నిజాయితీ, న్యాయబద్ధత ఉండాలని ఆయన బోధించారు. ఇవి అన్ని కాలాలకూ వర్తించే రూల్స్. కార్పొరేట్ నైతికతల గురించి నేటి కాలంలోనూ ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ సూత్రాలు స్థిరమైన, ప్రసిద్ధ వ్యాపారాలకు పునాదిగా నిలుస్తాయి
నాయకత్వం :వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగాలంటే సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. తన సంస్థలో మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు వ్యాపారి ప్రయత్నించాలి. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించాలి. వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తన ఉద్యోగులు, వాటాదారుల సంక్షేమానికి తగిన ప్రణాళికను అమలు చేయాలి. అంతేకాదు వ్యాపారం చేసేవారికి కచ్చితంగా నైతికత ఉండాలని కౌటిల్యుడు స్పష్టం చేశారు. నేటి వ్యాపారులు కూడా వీటిని అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఆర్థిక నిర్వహణ :వ్యాపారం విజయవంతంగా నిర్వహించాలంటే . .. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. వనరుల కేటాయింపు, ఉత్పత్తి లక్ష్యం, రాబడి విశ్లేషణ, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక విధానాల రూపకల్పనపై వ్యాపారికి అవగాహన ఉండాలి. వివేకంతో వ్యవహరిస్తూ, సమర్థవంతమైన వనరుల నిర్వహణ చేపడితే వ్యాపారికి లాభాలు తథ్యమని చాణక్యుడు క్లారిటీ ఇస్తారు . ఈ ఆర్ధిక నిర్వహణ మేరకే ఏ వ్యాపారమైనా ముందుకు సాగుతుంది .
దౌత్యం :దౌత్యానికి, చర్చలకు మధ్య భేదం ఉంటుంది. ఇవి రెండూ ఒకటేనని మనం భావించకూడదు. దౌత్యం, చర్చల మధ్యనున్న సూక్ష్మభేదాలను చాణక్యుడు అర్థశాస్త్రంలో నిశితంగా వివరించాడు. పొత్తులు పెట్టుకోవడానికి, విభేదాలను పరిష్కరించుకోవడానికి సంబంధించిన సూత్రాలను కూడా అర్ధశాస్త్రంలో ఆయన ప్రస్తావించారు. ఆనాడు చాణక్యుడు వివరించిన చర్చల వ్యూహాలు, సూత్రాలు నేటి వ్యాపారాలకు కూడా వర్తిస్తాయి. వీటిని వినియోగిస్తే కంపెనీల చర్చలు, వ్యాపార విలీనాలు, భాగస్వామ్యాలను సులువుగా చేసుకోవచ్చు. మానవ మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా, తప్పకుండా చాణక్యుడి బోధనలను చదవాల్సిందే.
వ్యూహాల్లో మార్పు :నేటి ప్రపంచం వేగంగా మారుతోంది. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో బోధించారు. దీని వల్ల మార్కెట్‌పై పట్టును కొనసాగించవచ్చని తెలిపారు. నేటి వ్యాపార సిద్ధాంతాలు కూడా ఇదే విధమైన భావనతో ముందుకు సాగుతున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ నియమాలనే అనుసరిస్తుంటాయి. వీటిని పాటిస్తే ఎవరైనా బిజినెస్ లో రాణించవచు . సాటి వ్యాపారుకంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు .
by Abhi Correspondent | Aug 7, 2025 | బిజినెస్
భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం – ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఏమంటున్నారు?
అమెరికా టారిఫ్‌లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా? టారిఫ్‌లు ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయా? తదితర విషయాల గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఏ అంచనా వేస్తున్నారు . అయన విశ్లేషణ ఏమిటి ??
‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’
అలాగే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలపైనా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చని వివరించారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది” అని సంజయ్ ప్రకటించారు.
ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. తక్కువ వృద్ధి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. “ప్రపంచ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ అనిశ్చితులు కొంత వరకు తగ్గాయి. ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు తక్కువ వృద్ధిని, ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంలో పెరుగుదలను కూడా చూస్తున్నాయి” అని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
కీలక విషయాలపై వివరణ
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి సంజయ్ వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రపంచ వాణిజ్య వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల వల్ల అది ఎలా ప్రభావితమవుతుంది? అనే విషయాలను వెల్లడించారు.
“రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర కీలక రేట్లు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 4, 5,6 తేదీలలో ఎంపీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పాలసీ రెపో రేటును 5.5శాతం వద్ద స్థిరంగా ఉంచడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. కొత్త డేటా, మారుతున్న దేశీయ, ప్రపంచ పరిస్థితులపై కమిటీ నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. తగిన ద్రవ్య విధాన విధానాన్ని రూపొందించడానికి ఇన్కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై నిశితంగా నిఘా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది. దీని ప్రకారం, సభ్యులందరూ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు” అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.
by Abhi Correspondent | Jul 28, 2025 | బిజినెస్
ఒక్కో వ్యక్తి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు
‘బంగారు నగరం’గా దుబాయ్ కి పేరు . పేరుకు తగ్గట్టే ఆ ‘గోల్డ్ సిటీ’లో రోజూ జోరుగా పసిడి షాపింగ్ జరుగుతుంటుంది. ప్రజలు దేశవిదేశాల నుంచి వచ్చి మరీ పెద్దఎత్తున స్వర్ణాన్ని కొనేస్తుంటారు. ఈ క్రేజ్ వల్లే గోల్డ్ సిటీగా దుబాయ్ విశ్వ ఖ్యాతిని గడించింది. ఇంతకీ దుబాయ్‌లో బంగారాన్ని కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారు? అంటే, అక్కడ పసిడి రేట్లు తక్కువ. భారత్ కంటే దుబాయ్‌లో తక్కువ రేటుకే స్వర్ణం లభిస్తుంది. అక్కడ పసిడి ధర ఎందుకు తక్కువగా ఉంది? పన్నులేం విధించరా? అక్కడి బంగారం స్వచ్ఛత విషయంలో ఫర్వాలేదా ? లేక క్వాలిటీ తేడా ఉంటుందా ? ??
దుబాయ్ నుంచి భారత్, చైనాలకూ గోల్డ్
దుబాయ్‌లో బంగారం రేటు తక్కువగా ఉండటంపై పలువురిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ బంగారు గనులు ఉండబట్టే, తక్కువ రేటుకు గోల్డ్‌ను అమ్ముతున్నారని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. దుబాయ్‌లో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు. అక్కడ విక్రయిస్తున్న బంగారమంతా ఆఫ్రికా దేశాలు, తుర్కియే (టర్కీ), స్విట్జర్లాండ్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్, చైనా. ఈ రెండు దేశాలకు చెందిన బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏటా వందల టన్నుల బంగారాన్ని దుబాయ్‌లోని హోల్‌సేల్ గోల్డ్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇందుకోసం ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారత, చైనాల పౌరులు కూడా దుబాయ్ టూర్‌కు వెళ్లినప్పుడు, బంగారాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? పన్నులు ఎంత ?
- మన దేశంలో మనం ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. భారతీయులు దుబాయ్‌లో ఎంత బంగారాన్ని కొని తెచ్చుకోవచ్చు? అనే దానిపై నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. అంతకుమించిన మోతాదులో బంగారాన్ని దుబాయ్ నుంచి మనదేశానికి తీసుకురావడానికి వీల్లేదు.
- లగేజీలో గరిష్ఠంగా ఒక కేజీ దాకా బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు తెచ్చుకోవచ్చు. అయితే విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు గడిపి, భారత్‌కు తిరిగొస్తున్న వారికే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల సుంకాలను చెల్లించాలి. కొనుగోలుకు సంబంధించిన పత్రాలన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాలి.
- పురుషులు 50 నుంచి 100 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 100 నుంచి 200 గ్రాముల బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
- పురుషులు 100 గ్రాములకుపైగా బంగారం, మహిళలు/బాలల 200 గ్రాములకుపైగా బంగారంపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
- వాణిజ్య అవసరాల కోసం బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై జీఎస్‌టీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల వికాస సెస్ (ఏఐడీసీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ విధిస్తారు.
- భారతీయ మహిళలు, 15 ఏళ్లలోపు బాలలు గరిష్ఠంగా 40 గ్రాములు లేదా రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. భారతీయ పురుషులు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50వేలు విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో భారతీయ మహిళలు, పురుషులు, బాలలు ఎలాంటి సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే బంగారం బరువు ఒక కేజీకి మించకూడదు. కొనుగోలుకు సంబంధించిన రశీదులన్నీ విమానాశ్రయంలోని అధికార వర్గాలకు చూపించాలి.
- వ్యక్తిగతంగా దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై, దాని మోతాదు ఆధారంగా 3 శాతం, 6 శాతం, 10 శాతం మేర భారత్‌లో కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు.
- పురుషులు 20 నుంచి 50 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 40 నుంచి 100 గ్రాముల బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎందుకు తక్కువ?
భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ. దీనికి ప్రధాన కారణం అక్కడి పన్నుల వ్యవస్థే. దుబాయ్‌లో బంగారం విక్రయాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను విధించరు. అయితే ప్రతీ విక్రయంపై 5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను విధిస్తారు. వ్యాట్‌పై మనకు ఫుల్ రీఫండ్ లభిస్తుంది. అయితే దీన్ని పొందేందుకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండానే దుబాయ్‌లో బంగారాన్ని కొనేయొచ్చన్న మాట. ఈ ప్రత్యేకత వల్లే బంగారు నగరంగా దుబాయ్ అవతరించింది.
దుబాయ్‌లో బంగారం క్వాలిటీ ???
దుబాయ్‌లో విభిన్న రకాల స్వచ్ఛతలతో కూడిన బంగారం లభిస్తుంది. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అంటే ఈ బంగారంలోని 1000 భాగాల్లో 1000 కూడా స్వచ్ఛంగా ఉంటాయన్న మాట. 22 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 916.66 భాగాలు స్వచ్ఛమైనవి. ఇందులో 22 క్యారట్ల బంగారం, 2 భాగాల్లో జింక్, కాపర్, నికెల్, ఐరన్, కాడ్మియం, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం, పలాడియంల మిశ్రమం ఉంటుంది. వీటిని ‘అలాయ్డ్ మెటల్స్’ అంటారు. ఇవన్నీ ఉండటం వల్ల 22 క్యారట్ల బంగారం ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 21 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 875 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 875 అని కూడా పిలుస్తారు. ఇందులో 21 క్యారట్ల బంగారం, 3 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 750 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 750 అని అంటారు. ఇందులో 18 క్యారట్ల బంగారం, 6 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి.
by Rama Chandra P | Jul 16, 2025 | పరిశీలన, బిజినెస్
ఏపీకి రాజధానిలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ – క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ”క్వాంటమ్ వ్యాలీ”లోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకు రాగా తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా పరిశోధన కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి ..పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్దిరోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్‌ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ”క్వాంటమ్ వ్యాలీ” ఇండియాలోనే మొదటిది .
మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే భవనాన్ని నిర్మిస్టార్ . దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా? ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా? అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది.
శామ్‌సంగ్, యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీల్లో ఏది గ్లోబల్ మార్కెట్లను ఆకర్షిస్తుందో నని మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .
అమరావతి ”క్వాంటమ్ వ్యాలీ”లోకి మైక్రోసాఫ్ట్ అడుగిడితే గ్లోబల్ గా పేరున్న మరిన్ని సంస్థలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్ రప్పించి హైటెక్ సిటీలో వారి సంస్థ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవ ఆంధ్రప్రదేశ్ ని సాఫ్ట్ వేర్ వరల్డ్ లో దూసుకుపోయేలా చేసింది .