దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

ఒక్కో వ్యక్తి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు

‘బంగారు నగరం’గా దుబాయ్ కి పేరు . పేరుకు తగ్గట్టే ఆ ‘గోల్డ్ సిటీ’లో రోజూ జోరుగా పసిడి షాపింగ్ జరుగుతుంటుంది. ప్రజలు దేశవిదేశాల నుంచి వచ్చి మరీ పెద్దఎత్తున స్వర్ణాన్ని కొనేస్తుంటారు. ఈ క్రేజ్ వల్లే గోల్డ్ సిటీగా దుబాయ్ విశ్వ ఖ్యాతిని గడించింది. ఇంతకీ దుబాయ్‌లో బంగారాన్ని కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారు? అంటే, అక్కడ పసిడి రేట్లు తక్కువ. భారత్ కంటే దుబాయ్‌లో తక్కువ రేటుకే స్వర్ణం లభిస్తుంది. అక్కడ పసిడి ధర ఎందుకు తక్కువగా ఉంది? పన్నులేం విధించరా? అక్కడి బంగారం స్వచ్ఛత విషయంలో ఫర్వాలేదా ? లేక క్వాలిటీ తేడా ఉంటుందా ? ??

దుబాయ్‌ నుంచి భారత్‌, చైనాలకూ గోల్డ్
దుబాయ్‌లో బంగారం రేటు తక్కువగా ఉండటంపై పలువురిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ బంగారు గనులు ఉండబట్టే, తక్కువ రేటుకు గోల్డ్‌ను అమ్ముతున్నారని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. దుబాయ్‌లో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు. అక్కడ విక్రయిస్తున్న బంగారమంతా ఆఫ్రికా దేశాలు, తుర్కియే (టర్కీ), స్విట్జర్లాండ్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్‌, చైనా. ఈ రెండు దేశాలకు చెందిన బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏటా వందల టన్నుల బంగారాన్ని దుబాయ్‌లోని హోల్‌సేల్ గోల్డ్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇందుకోసం ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారత, చైనాల పౌరులు కూడా దుబాయ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు, బంగారాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.

ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? పన్నులు ఎంత ?

  • మన దేశంలో మనం ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. భారతీయులు దుబాయ్‌లో ఎంత బంగారాన్ని కొని తెచ్చుకోవచ్చు? అనే దానిపై నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. అంతకుమించిన మోతాదులో బంగారాన్ని దుబాయ్‌ నుంచి మనదేశానికి తీసుకురావడానికి వీల్లేదు.
  • లగేజీలో గరిష్ఠంగా ఒక కేజీ దాకా బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు తెచ్చుకోవచ్చు. అయితే విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు గడిపి, భారత్‌కు తిరిగొస్తున్న వారికే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల సుంకాలను చెల్లించాలి. కొనుగోలుకు సంబంధించిన పత్రాలన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాలి.
  • పురుషులు 50 నుంచి 100 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 100 నుంచి 200 గ్రాముల బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • పురుషులు 100 గ్రాములకుపైగా బంగారం, మహిళలు/బాలల 200 గ్రాములకుపైగా బంగారంపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • వాణిజ్య అవసరాల కోసం బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై జీఎస్‌టీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల వికాస సెస్ (ఏఐడీసీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ విధిస్తారు.
  • భారతీయ మహిళలు, 15 ఏళ్లలోపు బాలలు గరిష్ఠంగా 40 గ్రాములు లేదా రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. భారతీయ పురుషులు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50వేలు విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో భారతీయ మహిళలు, పురుషులు, బాలలు ఎలాంటి సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే బంగారం బరువు ఒక కేజీకి మించకూడదు. కొనుగోలుకు సంబంధించిన రశీదులన్నీ విమానాశ్రయంలోని అధికార వర్గాలకు చూపించాలి.
  • వ్యక్తిగతంగా దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై, దాని మోతాదు ఆధారంగా 3 శాతం, 6 శాతం, 10 శాతం మేర భారత్‌లో కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు.
  • పురుషులు 20 నుంచి 50 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 40 నుంచి 100 గ్రాముల బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.

దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎందుకు తక్కువ?
భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ. దీనికి ప్రధాన కారణం అక్కడి పన్నుల వ్యవస్థే. దుబాయ్‌లో బంగారం విక్రయాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను విధించరు. అయితే ప్రతీ విక్రయంపై 5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను విధిస్తారు. వ్యాట్‌పై మనకు ఫుల్ రీఫండ్ లభిస్తుంది. అయితే దీన్ని పొందేందుకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండానే దుబాయ్‌లో బంగారాన్ని కొనేయొచ్చన్న మాట. ఈ ప్రత్యేకత వల్లే బంగారు నగరంగా దుబాయ్ అవతరించింది.

దుబాయ్‌లో బంగారం క్వాలిటీ ???
దుబాయ్‌లో విభిన్న రకాల స్వచ్ఛతలతో కూడిన బంగారం లభిస్తుంది. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అంటే ఈ బంగారంలోని 1000 భాగాల్లో 1000 కూడా స్వచ్ఛంగా ఉంటాయన్న మాట. 22 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 916.66 భాగాలు స్వచ్ఛమైనవి. ఇందులో 22 క్యారట్ల బంగారం, 2 భాగాల్లో జింక్, కాపర్, నికెల్, ఐరన్, కాడ్మియం, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం, పలాడియంల మిశ్రమం ఉంటుంది. వీటిని ‘అలాయ్డ్ మెటల్స్’ అంటారు. ఇవన్నీ ఉండటం వల్ల 22 క్యారట్ల బంగారం ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 21 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 875 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 875 అని కూడా పిలుస్తారు. ఇందులో 21 క్యారట్ల బంగారం, 3 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 750 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 750 అని అంటారు. ఇందులో 18 క్యారట్ల బంగారం, 6 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి.

ఉపరాష్ట్రపతి రాజీనామా – రాజ్యాంగ విలువలపై కొత్త చర్చ

ఉపరాష్ట్రపతి రాజీనామా – రాజ్యాంగ విలువలపై కొత్త చర్చ

మేధావుల చర్చలలో జాతీయ స్థాయి డిబేట్ … సరికొత్త సూచనలు . .

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో ఒక చర్చను మొదలుపెట్టింది. “ఆరోగ్య కారణాలు” అని రాజీనామా పేర్కొన్నప్పటికీ, దీని వెనుక బీజేపీ అధిష్టానం వైఖరితో విభేదాలు, రాజ్యాంగ పదవికి జరిగిన అవమానమే అసలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ అనూహ్య పరిణామం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పెద్ద అంతర్గత తిరుగుబాటుకు సంకేతమంటూ, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో భాగంగా, ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్‌ఖడ్, ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించారు. ముఖ్యంగా, జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ప్రతిపాదనలో సాంకేతిక లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ తీర్మానాలను సభలో లిస్ట్ చేయాలని పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. చైర్మన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ధన్‌ఖడ్ వైఖరికి ప్రతిగా, బీజేపీ తన అసంతృప్తిని పరోక్షంగా కానీ బలంగా కానీ తెలియజేసింది. పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ గైర్హాజరయ్యారు. చైర్మన్‌కు కనీస ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ చర్యను ధన్‌ఖడ్ తీవ్ర అవమానంగా, తన ఆత్మగౌరవానికి భంగంగా భావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధులకు అడ్డుకట్ట వేయడాన్ని సహించలేక, మౌనంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.

ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్నప్పటికీ, ఆయన చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, జైపూర్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారని, కాబట్టి “ఆరోగ్య కారణం” అనేది గౌరవంగా తప్పుకోవడానికి చూపిన ఒక సాకు మాత్రమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పదేళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీ లేకుండా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ధన్‌ఖడ్ రాజీనామా ఒక గట్టి హెచ్చరిక లాంటిది. మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ పదవులను, వాటి నిబంధనలను తేలికగా తీసుకోకూడదని, సంకీర్ణ ధర్మాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని ఈ సంఘటన ఒక బలమైన సందేశం పంపింది.

బీజేపీ నియమించిన వ్యక్తే, ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ పదవిని త్యజించడం, ఒకరకంగా ఇది తీవ్రమైన అంతర్గత తిరుగుబాటుగానే పరిగణించాలి.

ఒకప్పుడు ధన్‌ఖడ్ పక్షపాత వైఖరితో ఉన్నారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయనను “విలువలకు కట్టుబడిన వ్యక్తి” అని ప్రశంసించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

ధన్ ఖడ్ రాజీనామా ఉపసంహరింపచేసే బాధ్యత ప్రధానమంత్రిదే అని కాంగ్రెస్ ఓపెన్ గా చేసిన విన్నపంలో “మీరు నియమించిన వ్యక్తినే మీరు ఒప్పించలేకపోతున్నారు” అనే దెప్పిపోటు కూడా వుంది.

ప్రస్తుతం, ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన తక్షణ సవాలు నిలిచింది. “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” వంటి కీలక బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలంటే, సభను సమర్థవంతంగా నడిపించే చైర్మన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఎంపిక కోసం మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలతో విస్తృత సంప్రదింపులు జరపడం బీజేపీకి తప్పనిసరి.

జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగియదని, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం రైతుల ప్రతినిధిగా ఆయన ఒక కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది, రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

జె మోడల్ లిక్కర్ స్కామ్…ఇలా చేసేశారు

జె మోడల్ లిక్కర్ స్కామ్…ఇలా చేసేశారు

ఆధారాలు లభ్యమైనా.. ‘సిట్ ‘ నత్తనడకన వెళుతుందెందుకు ?

” అధికారంలోకి వచ్చాకా .. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం ‘ ‘ అని ‘2019 ఎన్నికలకు ముందు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన ముఖ్యమైన వాగ్దానం . అయితే, ఐదేళ్ల పాలన ముగిసేసరికి, ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరాల ప్రకారం, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిన, సుమారు ₹3,200 కోట్ల ఆర్గనైజ్డ్ దోపిడీ. దర్యాప్తు పూర్తయ్యే సరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం వుంది. నిషేధం అనే సామాజిక లక్ష్యం, ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఈ స్కామ్ మూడు మూడు ప్రధాన దశల్లో జరిగింది.

1. ప్రభుత్వ గుత్తాధిపత్యం: అధికారంలోకి రాగానే, ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి, మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కిందకు తెచ్చారు. అమ్మకాలను నియంత్రించి, అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా, అసలు ఉద్దేశ్యం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే!

2. “జె-బ్రాండ్” వ్యూహం: ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక, దశాబ్దాలుగా మార్కెట్‌లో ఉన్న ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు. వాటి స్థానంలో, ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అధికార పార్టీ నేతలతో సంబంధం వున్న వారి డిస్టిలరీల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో (“జె-బ్రాండ్లు”) మార్కెట్‌ను ముంచెత్తాయి. ఫలితంగా, ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా 53% నుంచి 5.3%కి పడిపోయింది. వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయాలు లేక, “జె-బ్రాండ్ల” నే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు.

3. పారదర్శకతకు పాతర: స్కామ్ కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు. గతంలో ఉన్న పారదర్శకమైన, ఆటోమేటెడ్ ఆన్‌లైన్ స్టాక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ “సి-టెల్”ను రద్దు చేశారు. దాని స్థానంలో, అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ “ఆఫర్ ఫర్ సేల్” (OFS) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా, తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ, ఇతరులను పక్కనపెట్టారు. ఇదే కిక్‌బ్యాక్‌ల పథకానికి పునాది వేసింది.

ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి, దానిని చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు.

* కిక్‌బ్యాక్‌లు: తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు, దాని రకాన్ని బట్టి ₹150 నుంచి ₹600 వరకు లంచం/కిక్‌బ్యాక్‌గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది. ఈ లెక్కన, ఐదేళ్లలో సుమారు ₹3,200 కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు. లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు.

* నగదు లావాదేవీలు: ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, డిజిటల్ చెల్లింపులను నిషేధించి, కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు. ఐదేళ్లలో జరిగిన ₹99,413 కోట్ల అమ్మకాల్లో 99.38% నగదు రూపంలోనే జరిగాయి. ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది.

* మనీ లాండరింగ్: ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్‌కు తరలించడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, “ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్” అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లధనంగా మార్చారని సిట్ కనిపెట్టింది.

* లిక్కర్ బాండ్లు: వీటన్నిటికీ మించి, భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, APSBCL ద్వారా అధిక వడ్డీకి (9.62% వరకు) వేల కోట్ల రూపాయల రుణాలు (బాండ్లు) సేకరించారు. ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది.

ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం “జె-బ్రాండ్ల”లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి అనేక మరణాలు, అనారోగ్యాలు ఉదాహరణలుగా వున్నాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం, 2019-24 మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ, మూత్రపిండాల వ్యాధుల కేసులు 100% పెరిగాయి.

ప్రస్తుతం ఈ కేసుపై సిట్ దర్యాప్తు చేస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డిని “ప్రధాన సూత్రధారి”గా పేర్కొంటూ, మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్టు చేసింది. అయితే, ఇది రాజకీయ కక్ష సాధింపేనని, తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని వైఎస్సార్సీపీ వాదిస్తోంది.

మొత్తం మీద, మద్యపాన నిషేధం అనే ప్రజా సంక్షేమ హామీ, ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారితీసిందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ప్రభుత్వ గుత్తాధిపత్యం, అపారదర్శక విధానాలు, రాజకీయ-అధికార-కార్పొరేట్ కూటమి కలిసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడి, వేలమంది మద్యం అలవాటున్న వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం . . వందలమంది చనిపోవడం జరిగాయి . వారి కుటుంబాలకు నష్టం చేసారు . ఈ కుంభకోణంలో దోచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.

అమరావతికి మైక్రోసాఫ్ట్,, పరిశోధన కేంద్రం

అమరావతికి మైక్రోసాఫ్ట్,, పరిశోధన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ”క్వాంటమ్‌ వ్యాలీ”లోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటుకు ముందుకు రాగా తాజాగా మైక్రోసాఫ్ట్‌ కూడా పరిశోధన కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి ..పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్దిరోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్‌ల సామర్థ్యంతో క్వాంటమ్‌ కంప్యూటర్​ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ”క్వాంటమ్‌ వ్యాలీ” ఇండియాలోనే మొదటిది .

మైక్రోసాఫ్ట్‌ కోసం క్వాంటమ్‌ వ్యాలీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే భవనాన్ని నిర్మిస్టార్ . దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా? ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా? అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్‌ సామర్థ్యంతో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది.

శామ్‌సంగ్‌, యాపిల్‌ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్‌ టెక్నాలజీల్లో ఏది గ్లోబల్ మార్కెట్లను ఆకర్షిస్తుందో నని మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

అమరావతి ”క్వాంటమ్‌ వ్యాలీ”లోకి మైక్రోసాఫ్ట్ అడుగిడితే గ్లోబల్ గా పేరున్న మరిన్ని సంస్థలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్ రప్పించి హైటెక్ సిటీలో వారి సంస్థ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవ ఆంధ్రప్రదేశ్ ని సాఫ్ట్ వేర్ వరల్డ్ లో దూసుకుపోయేలా చేసింది .

అలసిపోతున్నారా? ఎందుకంటే…

అలసిపోతున్నారా? ఎందుకంటే…

విద్యార్థుల నుండి వివిధ రంగాల నిపుణుల వరకు – ప్రజలు శారీరక అలసట లేదా బర్నౌట్‌తో సంబంధం లేని నిరంతర, పరిసర అలసటకు మూల కారణాలు అన్వేషించేందుకు నిపుణుల బృందం శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు . ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కుమార్ అటువంటి సందర్భాలలో పెరుగుదలను ధృవీకరిస్తూ, ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. “ఎయిర్‌ప్లేన్ మోడ్”లో ఉండటంతో పోల్చబడిన ఈ మానసిక అలసట నిశ్శబ్దంగా, విస్తృత పోరాటంగా మారుతోంది

స్పష్టమైన కారణం లేనప్పుడు కూడా, వయస్సు సమూహాలు మరియు వృత్తులలో పెరుగుతున్న సంఖ్యలో ప్రజలు కదలని అలసటను నివేదిస్తున్నారు. “ఇది శారీరక అలసట కాదు” అని ప్రముఖ డిజైన్ కన్సల్టెంట్ అయిన శిల్పా రామ్ చెపుతున్నారు .

కొత్తగా అలసిపోయినవారు
హైదరాబాద్‌ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ . .. ఈ ఫిర్యాదులతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని అంగీకరిస్తున్నారు. “అవును, స్పష్టమైన కారణం లేకుండా అధికంగా మరియు నిరంతరం అలసిపోయినట్లు అనిపించడం సర్వసాధారణం. చాలా మంది వ్యక్తులు నిర్దిష్ట కారణాన్ని గుర్తించలేనప్పుడు కూడా ఈ అనుభూతులను అనుభవిస్తున్నట్లు నివేదిస్తున్నారు. ఈ ధోరణి ఇటీవలి సంవత్సరాలలో మరింత గుర్తించదగినదిగా మారింది, ఇది వయస్సు మరియు నేపథ్యాలలో ప్రజలను ప్రభావితం చేస్తుంది.”

మానసిక ఆరోగ్య నిపుణులు దీనిని “యాంబియంట్ ఓవర్‌వర్” అని పిలుస్తున్నారు – ఈ పదం ట్రామా సైకాలజీ నుండి తీసుకోబడింది కానీ ఇప్పుడు రోజువారీ జీవితంలో ప్రతిధ్వనిని కనుగొంటోంది.

“ఇది సాంప్రదాయ బర్నౌట్ కాదు, ఇక్కడ కారణ-ప్రభావ గొలుసు ఉంటుంది. ఇది మరింత కృత్రిమమైనది,” అని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. “ప్రజలు పనిచేస్తున్నారు, కానీ వారు సజీవంగా ఉన్నట్లు భావించడం లేదు,” అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వందన అంటున్నారు
ఆర్థిక అభద్రత మరియు పెరుగుతున్న జీవన వ్యయాల నుండి స్థిరమైన సోషల్ మీడియా పోలికల వరకు, నేడు ప్రజలు దానిని గ్రహించకుండానే ఒత్తిడిని గ్రహిస్తున్నారు.

ఈ పెరుగుతున్న భావోద్వేగ మరియు మానసిక అలసట కార్పొరేట్ కార్మికులకే పరిమితం కాదు. కళాశాల విద్యార్థులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు – అందరూ తక్కువ బ్యాటరీతో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మరియు దీర్ఘకాలిక ఒత్తిడి తర్వాత వచ్చే బర్నౌట్ మాదిరిగా కాకుండా, ఈ రకమైన అలసట పరిసరంగా అనిపిస్తుంది – ఎల్లప్పుడూ నేపథ్య శబ్దం లాగా ఉంటుంది.

విశ్రాంతి అనేది ఉత్పాదకత లేనిదిగా భావించే లూప్‌లో ప్రజలు చిక్కుకుపోయారని ఆయన వివరించారు. “నిరంతర డిజిటల్ శబ్దం – సోషల్ మీడియా, నోటిఫికేషన్, వార్తల చక్రాల నుండి సమాచార ఓవర్‌లోడ్ మెదడును నింపుతుంది, ఒత్తిడిని పెంచుతుంది మరియు దృష్టిని విచ్ఛిన్నం చేస్తుంది.

అధ్యయనాలు అధిక స్క్రీన్ సమయం (చాలా మందికి రోజుకు సగటున 7-10 గంటలు) డోపమైన్ నియంత్రణకు అంతరాయం కలిగిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి .

ఈ పెరుగుతున్న భావోద్వేగ మరియు మానసిక అలసట కార్పొరేట్ కార్మికులకే పరిమితం కాదు. కళాశాల విద్యార్థులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు – అందరూ తక్కువ బ్యాటరీతో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మరియు దీర్ఘకాలిక ఒత్తిడి తర్వాత వచ్చే బర్నౌట్ మాదిరిగా కాకుండా, ఈ రకమైన అలసట పరిసరంగా అనిపిస్తుంది – ఎల్లప్పుడూ నేపథ్య శబ్దం లాగా ఉంటుంది.

. “నా జీవితంలో ఎటువంటి సంక్షోభం లేదు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నాను . కానీ నేను ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం ప్రయత్నిస్తున్నట్లుగానే నాకు అనిపిస్తుంది. నేను ధ్యానం చేస్తాను, చికిత్సకు వెళ్తాను, కానీ నిస్తేజమైన అలసట మాత్రం తగ్గడంలేదు . ..” అని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు అభిప్రాయపడ్డారు .

భారతదేశంలోని అర్బన్ మెంటల్ హెల్త్ సెంటర్ 2024లో నిర్వహించిన సర్వేలో, ఐదు ప్రధాన మహానగరాలలో 67 శాతం మంది ప్రతివాదులు రాత్రికి సగటున 7 గంటలు నిద్రపోయినప్పటికీ, తాము ‘ఎక్కువ సమయం’ అలసిపోయినట్లు చెప్పారని కనుగొన్నారు.

ఈ నిరంతర అలసట భావన, ఆధునిక జీవితంలో భావోద్వేగ విచ్ఛిన్నత వల్ల మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇమెయిల్‌లు, వార్తల నవీకరణలు, కుటుంబ సందేశాలు, ఇన్‌స్టాగ్రామ్ మధ్య స్థిరమైన సందర్భ మార్పిడి – మెదడును హైపర్‌విజిలెంట్ స్థితికి నెట్టివేస్తుంది.

డిజిటల్ మితిమీరిన వినియోగం పని-జీవిత సరిహద్దులను అస్పష్టం చేయడం మరియు సమాచార ఓవర్‌లోడ్‌ను సృష్టించడం ద్వారా ఒత్తిడిని పెంచుతుందని డాక్టర్ అశ్విని వాదిస్తున్నారు. “ఇది ఒత్తిడి-ప్రతిస్పందన వ్యవస్థను క్రమబద్ధీకరించగలదు, భావోద్వేగ అలసటకు ఆజ్యం పోస్తుంది.”

ఒంటరితనం డేంజర్
గుంపులో కూడా, చాలామంది ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. మరియు మనోరోగ వైద్యుల ప్రకారం, అది అత్యంత భారం కావచ్చు. COVID మహమ్మారి రోజుల నుండి ప్రారంభమైన రిమోట్‌గా పనిచేసే సంస్కృతి కూడా సహాయపడటం లేదని డాక్టర్ కులకర్ణి చెప్పుకొచ్చారు . “ప్రజలు ఎల్లప్పుడూ 24/7 వారి స్క్రీన్‌లలో తమ ఇన్‌బాక్స్‌లను తనిఖీ చేస్తూ ఉంటారు. ఇటువంటి సామాజిక డిస్‌కనెక్షన్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది ” అని ఆయన అన్నారు. ఒంటరితనం మరియు బలహీనమైన సమాజ సంబంధాల పర్యవసానంగా ఒంటరితనం పెరుగుతోంది.

“భారతదేశంలో, మేము సమాజ-ఆధారిత సంస్కృతుల నుండి వచ్చాము” అని మనోరోగ వైద్యుడు డాక్టర్ అశ్విని అన్నారు. “కానీ పట్టణ జీవితం ఆ మద్దతు వ్యవస్థను క్షీణింపజేసింది. ప్రజలకు 500 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కానీ అవి విచ్ఛిన్నమైనప్పుడు కాల్ చేయడానికి ఎవరూ లేరు.”

పరిస్కారం . ..?
ఈ రకమైన అలసట కేవలం సెలవులు లేదా ఎక్కువసేపు నిద్రపోవడం ద్వారా పరిష్కరించబడదు. నిపుణులు చిన్న, స్థిరమైన పద్ధతులను సూచిస్తున్నారు:

  • నెమ్మదిగా శ్వాసలు తీసుకోవాలి .
  • విరామం ఇచ్చి శ్వాస తీసుకోండి: నెమ్మదిగా, లోతైన శ్వాస నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది మరియు తక్షణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

సరిహద్దులను నిర్ణయించండి: నో చెప్పడం నేర్చుకోండి మరియు మీ భారాన్ని తగ్గించడానికి వీలైనప్పుడల్లా పనులను అప్పగించండి.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి: క్రమం తప్పకుండా నిద్ర షెడ్యూల్‌ను నిర్వహించండి మరియు విశ్రాంతి వాతావరణాన్ని సృష్టించండి.

అభిరుచిని విచ్ఛిన్నం చేయండి: పెద్ద పనులను చిన్న, నిర్వహించదగిన దశలుగా విభజించండి, తద్వారా మీరు మునిగిపోయినట్లు అనిపించదు.

వార్తలు మరియు డూమ్ స్క్రోలింగ్‌ను పరిమితం చేయండి.

మీ రోజులో “ఉత్పాదకత లేదు” అనే జోన్‌ను నిర్మించుకోండి.

వివరణలు అవసరం లేని వ్యక్తులతో సమయం గడపండి.

“మీరు ఈ రోజు ఏమి చేసారు?” స్థానంలో “మీరు నిజంగా ఎలా భావిస్తున్నారు?” అనే దానితో భర్తీ చేయండి. మెడిటేషన్ అలవాటు చేసుకుంటే 42 రోజులలో మీ సమస్య చాలా వరకు పరిస్కారం అవుతుంది .