కోహ్లీ వల్ల కూడా కాలేదు, పటీదార్‌‌ సాధించాడు!

కోహ్లీ వల్ల కూడా కాలేదు, పటీదార్‌‌ సాధించాడు!

IPL హిస్టరీలో తొలి కెప్టెన్‌గా రికార్డు! – RAJAT PATIDAR 2025 IPL
 ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ఆర్సీబీ 2025 ఐపీఎల్‌ సీజన్‌ని అద్భుతంగా స్టార్ట్‌ చేసింది. ఆరు పాయింట్లతో టేబుల్‌లో మూడో ప్లేస్‌లో ఉంది. అనేక సంవత్సరాలుగా కొంతమంది స్టార్‌ ప్లేయర్‌లపైనే అతిగా ఆధారపడిన ఆర్​సీబీ ఇప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. బలమైన జట్టును నిర్మించి, టీమ్‌ని అద్భుతంగా నడిపిస్తున్న కెప్టెన్ రజత్ పటీదార్‌‌కే ఈ క్రెడిట్ దక్కుతుందని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్​సీబీ ప్రస్తుత సీజన్‌ ప్రారంభంలో గ్రాండ్‌ విక్టరీలు అందుకుంది. టాప్‌ టీమ్‌లు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ని హోమ్‌ గ్రౌండ్‌లో ఓడించింది. వరుసగా ఈడెన్ గార్డెన్స్, చెపాక్ వాంఖడేలో అద్భుత విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్ కూడా ఒకే సీజన్‌లో ఇలా చేయలేక పోయాడు. అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా పటీదార్‌ నిలిచాడు.అలానే ఓ అరుదైన రికార్డును పటీదార్‌ సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో రెండు జట్లు మాత్రమే తమ సొంత స్టేడియంలలో KKR, CSK, MIలను ఓడించాయి. మొదట పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్ ) 2012లో ఈ ఘనత అందుకుంది. అయితే ఆ జట్టు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ హస్సీ నేతృత్వంలో ఓడించింది. తాజాగా ముంబయిపై ఆర్​సీబీ వాంఖడేలో గెలవడంతో అరుదైన రికార్డు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా పటీదార్‌ నిలిచాడు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్లు హ్యాపీగా చెపుతున్నారు.