భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్‌సీఓ (Shanghai Cooperation Organization) 25వ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. రష్యా, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్న ఈ వేదికపై, అదీ చైనా గడ్డపై మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య నెలకొన్న అపనమ్మకం, అమెరికా వాణిజ్య ఆంక్షలతో మారుతున్న ప్రపంచ సమీకరణాల నడుమ ఈ సదస్సు జరుగుతోంది. అందుకే, యావత్ ప్రపంచం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.
సదస్సు ప్రాధాన్యత, పూర్వాపరాలు
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదేళ్ల పాటు ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరగలేదు. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ (Brazil, Russia, India, China, South Africa)సదస్సులో మోదీ, జిన్‌పింగ్ సమావేశమవ్వడంతో ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపించాయి. ఈ క్రమంలోనే, ఆగస్టు 2025లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించారు. సరిహద్దు వివాద పరిష్కారానికి కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఈ సానుకూల వాతావరణానికి మరో ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ పరిణామం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ, ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ మొగ్గు చూపుతోంది. ఈ సదస్సు ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఒక పరీక్ష లాంటిది.
సదస్సులో భారత్ అజెండా: ఈ సమావేశంలో భారత్ రెండు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
ప్రాంతీయ భద్రత: సరిహద్దు తీవ్రవాదం భారత్‌కు ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను ఎస్‌సీఓ వేదికగా గట్టిగా ప్రస్తావించాలని మోదీ భావిస్తున్నారు. సంస్థ ఉగ్రవాద నిరోధక విభాగం RATS (Regional Anti-Terrorist Structure — ఇది ఎస్‌సీఓ యొక్క శాశ్వత అవయవం, సభ్య దేశాల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సమన్వయాన్ని నిర్వహిస్తుంది.) ద్వారా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని భారత్ డిమాండ్ చేయనుంది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా, వారి నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు సభ్య దేశాల మధ్య సమన్వయం పెరగాలని కోరనుంది.
వాణిజ్యం, అనుసంధానం: అమెరికా సుంకాల ప్రభావంతో ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు అత్యవసరం. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ INSTC – (International North-South Transport Corridor — భారత్, ఇరాన్, రష్యా మరియు యూరప్‌ను కలిపే బహుమాధ్య రవాణా మార్గాల సమూహం), చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భారత్ ప్రతిపాదించనుంది. ఇవి చైనా ఆధిపత్యంలోని వాణిజ్య మార్గాలకు ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు నేరుగా సంబంధాలు పెంచుతాయి.
భారత్ ముందున్న సవాళ్లు
ఎస్‌సీఓలో చైనా, రష్యా వంటి దేశాలతో భారత్ వేదిక పంచుకుంటున్నప్పటికీ, అదే సమయంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ కూటమిలోనూ క్రియాశీలకంగా ఉంది. క్వాడ్ (Quadrilateral Security Dialogue — భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా) కూటమి చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికే ఏర్పడిందన్నది బహిరంగ రహస్యం. ఈ సదస్సుకు ముందు మోదీ జపాన్‌లో పర్యటించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని నొక్కి చెప్పడం గమనార్హం. ఇలా భిన్న ప్రయోజనాలున్న కూటములతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం భారత విదేశాంగ విధానానికి ఒక కత్తి మీద సాము లాంటిది.
మొత్తం మీద, ఈ ఎస్‌సీఓ సదస్సు భారత్‌కు ఒక పెద్ద అవకాశం, అదే సమయంలో ఒక సవాలు. తీవ్రవాదం, సమాన వృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై తన గొంతు వినిపించి, ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ చూస్తోంది. టియాంజిన్ సదస్సు ఈ దిశగా భారత్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి కానుంది.
కుమ్మర్లకు ఉచితంగా పోర్టర్ వీల్ పంపిణీకి కూటమి సర్కార్ సన్నాహాలు — మట్టిపాత్రల ఆరోగ్యంపై ప్రచారం
స్టీల్ . , అల్యూమినియం … తప్పితే ప్లాస్టిక్ . .. ఇంటికి అవసరమయ్యే వస్తువులు , వంట సామగ్రి ఎక్కువగా వీటితోనే . వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . మట్టి పాత్రలలో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మేలని శతాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు . అయితే రెండు , మూడు దశాబ్దాలుగా వాటి వినియోగం గణనీయంగా తగ్గింది . ఇటీవల కాలంలో జనంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మట్టి పాత్రలు వినియోగం క్రమంగా పెరుగుతోంది . మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది .
వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడేలా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సన్నద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వృత్తి పనివారికి శిక్షణతోపాటు వ్యాపార అవకాశాలకు తోడ్పాటు అందించనున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని మట్టిపాత్రల తయారీకి సాంకేతికతను జోడించి విద్యుత్‌తో నడిచే చక్రాన్ని (పోర్టర్ వీల్) కుమ్మర్లకు ఉచితంగా ఇస్తారు. ఆకట్టుకునేలా వివిధ పాత్రల తయారీకి పది రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మార్కెటింగ్ మెళకువలు కూడా నేర్పుతారు .
ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
స్టీల్ అల్యూమినియం పాత్రల్లో ఆహార పదార్థాలు వండడం అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయ్ . ఇది కూడా మట్టి పాత్రలు తమ ఆహార పదార్థాలు వండుకునేందుకు దోహదం చేస్తుంది . అలాగే మనం తీసుకునే పోషకాహార పదార్థాలకు ఎలాంటి హాని జరగకుండా మట్టి పాత్రల్లో వండిన ఆహారపుర్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి పోషక విలువలు త్వరగా అంది జీర్ణ వ్యవస్థ,మిటబాలిజం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ప్లాస్టిక్,అల్యూమినియం వాడకం ఎక్కువైంది. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నాం. ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ తో పాటు ఇదీవర ఆర్గానిక్ ఫుడ్స్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
రాను రాను ఆహారపు అలవాట్లు మరాటమే కాదు.. ఆహారం తయారు చేసుకునే పాత్రలు కూడా మన ఆరోగ్యం పై అధికంగా ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో చాలావరకు మట్టి పాత్రలు ఉపయోగించి.. ఆ మట్టి పాత్రలోనే ఆహార పదార్థాలు తయారు చేసేవారు. ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ సెలవిస్తున్నారు .
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మట్టి పాత్రల తయారీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. నర్సీపట్నం మండలంలోని వేములపూడి ఖాదీ సొసైటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 120 మందిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
విక్రయాలకు సపోర్ట్ . .. : ఇప్పటివరకు కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికే ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికీ ఇవ్వాలని నిర్ణయించారు. మంజూరైన వాటిలో 80 కుమ్మర్లకు, 20 ఎస్సీలకు, 20 ఎస్టీలకు ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు తయారు చేసిన వస్తువులు కేవీఐసీ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో విక్రయించేలా అవకాశం కల్పిస్తారు. ..వీటోతోపాటు … వివిధ సంస్థల సహకారంతో కూడా అమ్మకలకు సపోర్ట్ ఇవ్వనున్నారు .
ఇండియా టుడే సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం – రేవంత్ కి ఏడోస్థానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా పటిమతో మరోమారు ప్రజామన్నన పొందారు. దేశంలోనే అగ్రగామి మీడియా ”ఇండియా టుడే ‘ పోల్ లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. గతంలో సీబీఎన్ ఈ రేసులో ఐదవ స్థానంలో ఉండేవారు .
యోగి నెంబర్ వన్ . ..
దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి (ఉత్తర ప్రదేశ్ ) ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్.. చాలా కాలంగా అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈయన ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా స్తానం దక్కించుకున్నారు . రెండో సారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆరు నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా టాప్ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆయన తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలను సేకరించి ప్రకటించారు . తెలుగు ప్రాంత ప్రజలు కాని వారు కూడా ఇందులో పాల్గొన్నారు . అయితే సాధారణంగా అందరికీ కాల్స్ వెళ్లినప్పుడు తెలుగు ఓటర్లు అభిప్రాయం చెబుతారు.
ఏపీలో కూటమికి 25 లోక్ సభ సీట్లు
తక్షణం ఎన్నికలు జరిగితే.. బీజేపీతో పాటు మిత్రపక్షాలు సీట్లను గణనీయంగా పెంచుకుంటాయని సర్వేలో వెల్లడి అయింది. టీడీపీ, జేడీయూ, శివసేన, వంటి పార్టీలు సీట్లను పెంచుకుంటాయి. అంటే.. ఆ పెరుగుదల కాస్త కాస్త ఎక్కువగానే ఉంది. 11 సీట్లను పెంచుకుంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలలో 2024 లో ఓడిపోయినా ఆ నాలుగు ఎంపీ సీట్లలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. అంటే ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు గెలుస్తారు .
లా అండ్ ఆర్డర్ప కడ్బందీగా…
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత . . చంద్రబాబు పాలంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ గణనీయంగా మెరుగుపడినట్లు సర్వేలో పాల్గొన్న మెజార్టీ జనం ఓటువేశారు . గత పాలనతో పోలిస్తే . … శాంతిభద్రతల విషయంలో ఎప్పటికీ చంద్రబాబు ఉండాలని పలువురు అభిలషించారు .
ఏపీలో గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలుగుతోంది. అభివృద్ధి పనులూ ఆగడం లేదు. దీంతో చంద్రబాబుపై ప్రజా విశ్వాసం పెరుగుతోంది. మరో వైపు వైసీపీ ప్రతిపక్ష. హోదా లేదని.. ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించకుండా రాక్షస మూకగా వ్యవహరించింది . దీంతో 2019-2024 మధ్య అరాచకాలతో ప్రజలను పీడించుకుతిన్నారు . దీంతో వైసీపీని సాగనంపాలని జనమ్ ఏకపక్ష0గా తీసుకున్న నిర్ణయంతో కూటమి అధికారంలోకి వచ్చింది .
ఇపుడిపుడే పెరుగుతున్న లావాదేవీలు – 2026 జనవరికి మరింత స్పీడ్
అమరావతి రెండవ విడత భూ సమీకరణ అంశంతో వెనుకంజ . .. లేకపోతె మరింత దూకుడు
ఐదారేళ్లుగా కుంటినడకన సాగిన రియల్ ఎస్టేట్ ఏపీలో కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే 2026 జనవరి – ఫిబ్రవరి నెలలనాటికి మరింత జోరందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అమరావతిలో రెండవ విడత ల్యాన్డ్ పూలింగ్ అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కి బ్రేక్ పడింది . ఇది ప్రభుత్వం చేసిన తెలివిమాలిన పనిగా రాజధాని ప్రాంత వాసులు చెపుతున్నారు . భూముల ధరలు పెరిగిన తర్వాత మరోవిడత భూ సమీకరణకు వెళ్లి ఉంటె ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేదని చెపుతున్నారు .
రియల్ ఎస్టేట్ మందగమనానికి ప్రధానంగా ధరలు పెరగడం ఒక కారణమ్ కాగా . … జనం దగ్గర డబ్బు కొరత ఏర్పడటం మరో కారణం . ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గత కొన్ని సంవత్సరాలు స్తబ్దతను వీడుతోంది . స్టాంపులు, అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగదాన్ని పరిశీలిస్తే . .. ఈ రంగం మళ్లీ రికవరీ మొదలు అవుతున్నట్టు కనిపిస్తోంది . రాజధాని అమరావతి, పరిసర ప్రాంతాలలో లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, ఇతర జిల్లాల్లో పెరుగుతున్న లావాదేవీలు అన్ని కలిపి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపిరి ఊపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు పెరిగి, కొంతకాలం ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుబడిదారుల్లో ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం ప్రారంభమైంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల నుండి వచ్చే ఆదాయం పెరగడం రియల్ ఎస్టేట్ రంగం తిరిగి లాభదాయక దిశలోకి వస్తున్నదని సూచిస్తోంది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2024కి పోలిస్తే 44% ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . అమరావతిలో రూ. 60,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ప్రారంభం కావడం .. పనులు వేగవంతంగా సాగడం వంటివి కూడా రియల్ భూమ్ పెరుగుదలకు కారణం .
ఇటీవల రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో నమోదయ్యాయి . వీటిలో ఎక్కువ ఆదాయం రికార్డ్ అయింది. అమరావతిలో భూస్థూల ధరలు పెరిగిన తర్వాత కూడా లావాదేవీలు పెరుగుతునే ఉన్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్ మురళి మాట్లాడుతూ . .. 2024 ఎన్నికల తర్వాత భూ స్థల ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని లావాదేవీలు నెమ్మదిగా జరిగాయి. ఇపుడిపుడే ఊపందుకుంటున్నాయి .
అమరావతి, చుట్టుపక్కల భూములు , సైట్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెవలపర్లు మరియు పెట్టుబడిదారులు భవిష్యత్తులో మంచి అవకాశాలున్న సరసమైన ధరల ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు . అమరావతి, గుంటూరు, ఒంగోలు , నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో భూమి మరియు భవనాల ధరలలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది . అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నా, గుంటూరు, రాజమండ్రి , నెల్లూరు, విశాఖ వంటి ప్రాంతాల్లో కొంచెం అందుబాటులో ధరలు ఉన్నాయి. దీని వల్ల కొత్త పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే దానిలో కాస్త ఆలోచనలో పడుతున్నారు .
నాలా రద్దుతో గ్రామాల్లో ‘రియల్ జోరు ‘ “” వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలంటే భూమార్పిడి జరగాలి . దీనికోసం స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రియల్టర్లను , పారిశ్రేమికవేత్తలను మామూళ్ల కోసం వేధించేవారు . దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి . ఇదే సమయంలో నాలా బదులు . .. స్థానిక సంస్థలకు కొంత ఫీజు చెల్లించడం వల్ల ఆ నిధులు స్థానికంగా ఖర్చుచేసుకునే సౌబల్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన కూడా సర్కార్ పరిగణలోకి తీసుకుంది . దీంతో నాలా రద్దు చేసారు . దీనివల్ల ముక్యంగా గ్రామీణ్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకోనున్నాయ్ .
అంతరిక్ష రంగంలో ప్రపంచం మనవైపు ఆసక్తిగా చూస్తోంది . దీనికి కారణం భారత్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిశ్చయించుకుంది. అందులో భాగంగా తాజాగా ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS)’ నమూనాను తాజాగా విడుదల చేసింది. దిల్లీలోని భారత మండపంలో శుక్రవారం నుంచి నేషనల్ స్పేస్ డే వేడుకలు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అవి :
ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్’ (ఐఎస్ఎస్)
చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్.
2035 సంవసరం నాటికి భారత్ కూడా సొంతంగా 5 మాడ్యుల్స్‌తో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ను నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది. 2028 నాటికి తొలి మాడ్యుల్‌ను నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.
10 టన్నుల బరువున్న మాడ్యూల్ బాస్-1 మాడ్యుల్ సుమారుగా 10 టన్నులు ఉండవచ్చని అంచనా. దీనిని భూమికి 450 కి.మీ ఎత్తులో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్విరాన్‌మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్(ఈసీఎల్‌ఎస్‌ఎస్), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజమ్, ఆటోమెటెడ్ హ్యాచ్ సిస్టమ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ బాస్-1 మాడ్యుల్ వేదిక కానుంది.
40 అంతస్తుల భవనమంత ఎత్తైన రాకెట్ నిర్మాణం “అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు అబ్బురపడేలా భారత్ అద్భుత ప్రగతి సాధించింది. ప్రస్తుతం 40 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే రాకెట్‌ను నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో నౌకాదళం కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించనున్నాం” అని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన 84వ స్నాతకోత్సవంలో, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ అందుకున్నారు.
ఈ సందర్భంగా వి . నారాయణన్ మాట్లాడారు . “రష్యా, అమెరికాలకు దీటుగా మనం ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాం. యూఎస్‌కు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. రానున్న 10 ఏళ్లలో భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. తొలిసారిగా శుక్రగ్రహంపై ప్రయోగాలు చేస్తున్నది మనమే. ఇస్రో పరిశోధనల లక్ష్యం- కర్షకులు, కార్మికులు సహా ప్రజలందరి దైనందిన జీవితాల్లో వెలుగు నింపడమే” అని అయన స్పష్టం చేసారు .