అమెరికా వైద్య చరిత్రలో ముక్కామల శ్రీనివాస్ రికార్డ్

అమెరికా వైద్య చరిత్రలో ముక్కామల శ్రీనివాస్ రికార్డ్

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి ముక్కామల శ్రీనివాస్

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్‌( భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కమల శ్రీనివాస్(బాబీ) ఎన్నికయ్యారు. 178 సంవత్సరాల AMA చరిత్రలో ఈ సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా శ్రీనివాస్ రికార్డ్ క్రియేట్ చేశారు . ఇటీవ చికాగోలో జరిగిన ఏఎంఏ వార్షిక సమావేశంలో కుటుంబ సభ్యులు, సహచరులు, మాజీ నాయకుల సమక్షంలో ముక్కామల శ్రీనివాస్ ఈ బాధ్యతలు చేపట్టారు

ముక్కామలకు 8 సెం.మీ. మెదడు కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగిన కొన్ని నెలల తర్వాత ఆయన నియామకం జరిగింది. “నేను మాయో క్లినిక్‌లో మెదడు శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు, ట్యూబ్‌లు మరియు వైర్లు నా ప్రతి కదలికను పర్యవేక్షిస్తుండగా, ఈ రాత్రి – ఈ గౌరవం – ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఈ అవకాశం చాలా సుదూర కలగా అనిపించింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

“మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మన శ్రద్ధ అవసరమయ్యే అపారమైన అంతరాలు ఉన్నాయి” అని పేర్కొంటూ, అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్కరణల అవసరాన్ని ముక్కామలకు నొక్కి చెప్పారు. “అందుకే మన రోగులకు తగినంత ఆరోగ్య కవరేజ్ కోసం పోరాటం కొనసాగించడం చాలా ముఖ్యం… మరియు స్థిరమైన, సమానమైన ఆరోగ్య సంరక్షణ నమూనా కోసం పోరాటం ఎందుకు చాలా ముఖ్యం” అని ఆయన జోడించారు.

అమెరికా ఆరోగ్య వ్యవస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించడంపై తాను దృష్టి సారిస్తానని డాక్టర్ ముక్కామల స్పష్టం చేశారు. వైద్యులపై పనిభారం, సిబ్బంది కొరత, వైద్య సేవలు అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో ముక్కామల నాయకత్వం ఏఎంఎఏ ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, వైద్యుల సంక్షేమంపై దృష్టి సారించనుంది. అంతేకాకండా వైద్యులు, రోగుల కోసం సంస్థ తన వాణిని బలంగా వినిపిస్తుందని ఆశిస్తున్నారు.

డాక్టర్ ముక్కామల వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక పెను సవాలు కూడా ఉంది. గ‌తేడాది నవంబర్​లో ఆయన మెదడులో 8 సెంటీమీటర్ల కణితి (ట్యూమర్) ఉన్నట్లు తెలిసింది. మూడు వారాల తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పడు దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారు శ్రీనివాస్. తన వైద్య బృందం నైపుణ్యం, కుటుంబ సభ్యుల మద్దతు, వైద్య విజ్ఞాన శాస్త్రంలో పురోగతి వల్లే ఇప్పుడు తాను బతికి ఉన్నాని ఆయన తెలిపారు. వైద్యుడి నుంచి రోగిగా మారిన తన అనుభవం ఆరోగ్య సంరక్షణపై తన దృక్పథాన్ని మరింత మార్చిందని పేర్కొన్నారు. .

ముక్కామల శ్రీనివాస్ ఒక ప్రముఖ రేడియాలజిస్ట్, మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భారతదేశంలో జన్మించిన ఆయన అమెరికాలో వైద్య విద్యను అభ్యసించారు. గతంలోనూ ఏఎంఏలో వివిధ కీలక పదవుల బాధ్యతలు చేపట్టారు.

గోదావరి కుర్రాడు ,,కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్​

గోదావరి కుర్రాడు ,,కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్​

యూకేలోని రాయల్‌ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన ఆర్యన్ ఉదయ్

భీమవరం రురల్ తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వీరాస్వామి, గొబ్బెళ్లమ్మ మనవడు ఆర్యన్ ఉదయ్‌. ఇతని తండ్రి వెంకటసత్యనారాయణ భీమవరంలో హెడ్మాస్టర్ గా పని చేశారు. ఉదయ్‌ సెయింట్‌మెరీ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. టెన్నిస్‌పై ఆసక్తితో హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారు. ఆ తరువాత భీమవరంలో డిగ్రీ, నరసాపురంలో ఎంబీఏ విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం లండన్‌లో ఎంఎస్‌ పూర్తి చేసి, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు సంఘం కార్యదర్శిగానూ ఆర్యన్ ఉదయ్ పని చేశారు.

రాయల్‌ బరో కెన్సింగ్టన్, చెల్సియా కౌన్సిలర్‌గా పదవి నిర్వహిస్తూనే డిప్యూటీ మేయర్‌గానూ ఎన్నికై య్యారు . ప్రస్తుతం బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా, యూరోప్‌ ఇండియా సెంటర్‌ ఫర్‌ బిజినెస్‌ అండ్‌ ఇండస్ట్రీకి ఉపాధ్యక్షుడిగానూ ఉదయ్ పని చేస్తున్నారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌కు నమ్మకస్థుడిగా ఉదయ్ ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుని లండన్‌లో కలిశారు. హైదరాబాద్‌లో ఏర్పడిన టెన్నిస్‌ పరిచయాలే తనను లండన్‌ దిశగా నడిపించాయని ఉదయ్‌ అంటున్నారు.

పట్టుదలతో , ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మన గోల్స్ సాధించడం ఎంతో సులభం అంటారు భీమవరానికి చెందిన ఆర్యన్ ఉదయ్ని. యూకేలోని రాయల్‌ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన తెలుగు వ్యక్తిగా నిలిచారు. గోదావరి జిల్లాల ప్రాంతానికి చెందిన యువకుడు బ్రిటన్​లో ఉన్నత పదవి చేపట్టడంపై ఈ ప్రాంతవాసులు , ఉదయ్ స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.