కోనసీమ టీడీపీ నేతలు అధిష్టానాన్ని ‘బ్లాక్ మెయిల్’ చేస్తున్నారా?

కోనసీమ టీడీపీ నేతలు అధిష్టానాన్ని ‘బ్లాక్ మెయిల్’ చేస్తున్నారా?

పి. గన్నవరంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి వెళ్లిన మూడు రోజులకే ఆ పార్టీలో ముసలం ఎందుకు పుట్టింది? నియోజకవర్గంలోని మూడు మండలాల టిడిపి అధ్యక్షులు మూకుమ్మడిగా ఎందుకు రాజీనామాలు చేశారు? నియోజకవర్గ టిడిపి ఇంచార్జి విషయంలో పార్టీ అధిష్టానం ఏదో నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయానికి వచ్చి ముగ్గురు మండల అధ్యక్షులు రాజీనామా చేసేలా చక్రం తిప్పిన నాయకులు ఎవరు?  ఆ నాయకులు అధిష్టానం నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారా? లేక అధిష్టానాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? పి. గన్నవరం నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై ‘Abhi News’ అందిస్తున్న ప్రత్యేక కథనం…

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకు నడిచిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అధిష్టానం ఆలోచనను ధిక్కరిస్తూ పి. గన్నవరం మండల టిడిపి అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, అంబాజీపేట మండల టిడిపి అధ్యక్షులు గుడాల ఫణి, అయినవిల్లి మండల టిడిపి అధ్యక్షులు శ్యాం సుందర్ రాజీనామా చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాలలోనే హాట్ టాపిక్ గా మారింది. పి. నియోజకవర్గ టిడిపి కో- కో ఆర్డినేటర్ మోకా ఆనందసాగర్ ను నియోజకవర్గ టిడిపి ఇంచార్జిగా నియమించాలని అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చిందని, దీనికి వ్యతిరేకంగా తాము రాజీనామా చేస్తున్నామని మండల టిడిపి అధ్యక్షులు చెబుతున్నారు. వాస్తవానికి అధిష్టానం ఈ నియోజకవర్గం ఇంచార్జి నియామకం విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోనూ లేదు.. ప్రకటించనూ లేదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో పర్యటించినపుడు పార్టీలో ఎస్సీ సామాజిక వర్గ ముఖ్య నేతగా వేదికపై ఆనంద్ సాగర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది నచ్చని అమలాపురం పార్లమెంట్ స్థాయి ప్రజా ప్రతినిధి ఈ మండల నేతలతో గ్రూపు రాజకీయాలకు తెర లేపినట్లు ప్రచారం జరుగుతోంది. 

      ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిపాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలికే విషయంలో పి. గన్నవరం నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు అనుచరులు పి. గన్నవరం నియోజకవర్గంతో సంబంధం లేకుండానే సీఎంకు స్వాగతం పలికే వారి జాబితాలో చేరిపోయారు. టిడిపి జోనల్ కోఆర్డినేటర్ సుజయ కృష్ణ రంగారావు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ లను తప్పుదారి పట్టించి పార్టీలో ఏ పదవి లేని వారు సైతం సీఎం హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుని హంగామా సృష్టించారు. ఇది పి. గన్నవరం నియోజకవర్గ ముఖ్య నేతలలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ టిడిపి పరిస్థితిపై సమీక్ష చేస్తున్న సమయంలో టిడిపి సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు డొక్కా నాథ్ బాబు సీఎం ఎదుటే తన అసంతృప్తి బయట పెట్టారు. నియోజకవర్గంకు సంబంధించి వాస్తవ నివేదికలు మీకు చేరడం లేదని నాథ్ బాబు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.

Cast Politics

          పి. గన్నవరం నియోజకవర్గం నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకులు ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ నుండి టిడిపి సీనియర్ నేత నామన రాంబాబు ఉమ్మడి తూర్పుగోదావరికి జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులుగా, రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ గా కూడా నామన రాంబాబు సేవలందించారు.  మరో ముఖ్య నేత డొక్కా నాథ్ బాబు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పని చేశారు. పి. గన్నవరం నియోజకవర్గంలో టిడిపి తరపున ఎవరికి పదవులు ఇవ్వాలి? ఎమ్మెల్యేగా ఎవరిని పోటీ చేయించాలి అనేది అధిష్టానంకు సూచించే స్థాయి ఈ ఇద్దరు నాయకులకు ఉండేది. ఇదంతా గతం. దశాబ్ద కాలంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతోంది. 2019లో ఓటమి తరువాత పి. గన్నవరం టిడిపికి ఇంచార్జినే నియమించలేదు అధిష్టానం. ఆ సమయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి, జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పి. గన్నవరం నియోజకవర్గం టిడిపిపై పెత్తనం చలాయించారు. ఆ తరువాత నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ గా నామన రాంబాబును, కో- కోఆర్డినేటర్లుగా మోకా ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణలను అధిష్టానం నియమించడంతో పి. గన్నవరం టిడిపి రాజకీయాలు కులాల వారీగా చీలిపోయాయి. 

   2024లో పొత్తులో భాగంగా పి. గన్నవరం జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే అయ్యారు. కూటమి పరంగా అంతా బాగానే ఉన్నా టిడిపిలో మాత్రం గ్రూప్ తగాదాలు పెరిగి పోయాయి. అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పి. గన్నవరం టిడిపిపై ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ గ్రూపులు పెరగడానికి కారణం అని టిడిపి క్యాడర్ బాహాటంగానే చెబుతోంది.

టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ కు పి. గన్నవరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి పదవి ఇప్పించి ఈ నియోజకవర్గంను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఎంపీ హరీష్ గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో మోకా ఆనంద్ సాగర్ కి లభించిన ప్రాధాన్యతతో అతనికి ఇంచార్జి పదవి ఇస్తే తన పెత్తనానికి ఇక్కడ చెక్ పడుతుందనే భావనతో హరీష్ ఇక్కడ మండల టిడిపి అధ్యక్షుల రాజీనామాకు తెర లేపారని ప్రచారం జరుగుతోంది. మండల టిడిపి అధ్యక్షుల రాజీనామాపై పార్టీ అధిష్టానం ఆరా తీసినపుడు సైతం హరీష్ పాత్ర ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

బొత్స మేనల్లుడు…చిన్న శ్రీను.. టీడీపీ డీల్ ఏమిటి?

బొత్స మేనల్లుడు…చిన్న శ్రీను.. టీడీపీ డీల్ ఏమిటి?

చిన్న శ్రీను జంప్ వెనుక ఉన్న పెద్ద ‘సీన్’ కథ ఏమిటి?

* ఆర్ధిక నేరాల ఉచ్చు బిగుస్తుందన్న భయంతోనే…

* ఎంక్వయిరీ జరగబోతుందని గ్రహించి.. కూటమి నేతలతో డీల్…

*ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్

*టీడీపీ నాయకులు, శ్రేణుల్లోనూ ఆగ్రహావేశాలు

వైసీపీ అధికారంలో ఉన్నపుడు… అంతకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మేనమామ బొత్స సత్యనారాయణను అడ్డంపెట్టుకుని భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు… అలియాస్ చిన్న శ్రీను…
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నపుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని బొత్స కుటుంబం సాగించిన దోపిడీపై ఉత్తరాంధ్రలో కధలు కధలుగా చెప్పుకుంటారు. భూ ఆక్రమణలు, మైనింగ్ దోపిడీ, సెటిల్మెంట్స్,,, ఒకటేమిటి… భారీ ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున అభియోగాలు వచ్చాయి.
వీటిపై కూటమి సర్కార్ మజ్జి శ్రీనివాసరావుపై విచారణకు సన్నాహాలు చేస్తోందన్న సమాచారం ముందుగానే లీక్ అయింది. అలెర్ట్ అయిన శ్రీను… కూటమి నేతలతో… ప్రముఖంగా టీడీపీ పెద్దలతో లాబీయింగ్ చేసుకుని… వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని… ఆర్ధిక నేరాల నుంచి రక్షణ పొందినట్లు… విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను హఠాత్తుగా వైసీపీ గుడ్ బై చెప్పి tdp lo చేరడంపై స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

విజయనగరం Politics ki అయువుపట్టుగా వస్తున్న జిల్లా పరిషత్ పీఠంపై కుమార్తె సిరి సహస్రను కూర్చోబెట్టేందుకే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా, ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విజయనగరం జిల్లా అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరినట్టు  చిన్నశ్రీను చెప్పుకొస్తున్నా, ….తెరవెనుక కారణాలు మాత్రం వేరే ఉంటాయనేది ఇక్కడ చర్చ.

ఉత్తరాంధ్ర  వైసీపీలో బొత్స సత్యనారాయణ తర్వాత అంతటి Status ఉన్న నాయకుడిగా చిన్న శ్రీను పార్టీలో గుర్తింపు పొందారు.

మేనమామ బొత్స సత్యనారాయణ మంత్రిగా పదవిలో ఉన్న సమయంలో చిన్న శ్రీను… అనేక భూ ఆక్రమణలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ గా నిధుల దుర్వినియోగపైనా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపై స్థానిక టీడీపీ, జనసేన నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. వీటిపై కూటమి సర్కార్ దర్యాప్తునకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అలెర్ట్ అయిన చిన్న శ్రీను పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.అయితే విజయనగరం టీడీపీ నేతలు పలువురు చిన్న శ్రీనును టీడీపీలో చేర్చుకునేందుకు అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు దీనిపై అభ్యన్తరాలు వ్యక్తం చేస్తూ పలు విజ్ఞప్తులు కూడా పంపారు. అయినా… వారందరి మనోభావాలను పక్కనపెట్టి… టీడీపీలో చేర్చుకున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద డీల్ జరిగినట్లు ఉత్తరాంద్ర టీడీపీ, జనసేన సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీనిపై టీడీపీ అధిష్టానం ఏమి సమాధానం చెపుతుందో వేచి చూడాలి. The End.

ఉప్పాడ తీర0 రక్షణ చర్యలు – రూ.323 కోట్ల

ఉప్పాడ తీర0 రక్షణ చర్యలు – రూ.323 కోట్ల

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సముద్రకోటతో దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ తీరప్రాంతానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తాను…అని ఇచ్చిన హామీ పవన్ రెండేళ్లలోనే అమలులోకి తీసుకువచ్చారు.

సముద్ర కోతతో every Year దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పడింది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం నాడు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం, సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ చేయనుంది. రూ.323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉప్పాడ తీర ప్రాంత వాసుల సమస్యలను పట్టించుకోలేదు. ఎన్నికల ముందు హడావిడిగా సర్వేలు చేయించి మిన్నకుంది. ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ తీర ప్రాంతాన్ని పరిశీలించి, తాము అధికారంలోకి వస్తే రక్షణ గోడ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొలువు తీరాక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో సర్వే చేయించారు. వాకలపూడి-యు.కొత్తపల్లి మండలం అమినాబాద్‌ చేపలరేవు వరకు 14.5 కిలోమీటర్ల మేర రూ.323 కోట్ల అంచనాతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధుల మంజూరుకు హామీ పొందారు. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాస్‌తో బుధవారం నాడు ఒప్పందం జరిగింది.

తీరనున్న తీరప్రాంత వాసుల కల:

  • ఇప్పటికే సుబ్బంపేట సమీపంలో తీరం వెంబడి రహదారి కోతకు గురికాకుండా రూ.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత ఐదేళ్లలో ఉప్పాడ తీరంలో సముద్ర కోత కారణంగా సుమారు 400కు పైగా ఇళ్లు, 8 ఆలయాలు నేలమట్టమవగా, దాదాపు 14 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది.
  • గత 25 ఏళ్లుగా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు రాకాసి అలల ప్రభావానికి గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములూ కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో కలిపి 1360.75 ఎకరాల మేర కోతకు గురైంది. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డు నిరంతరం కోతకు గురయ్యేది. మరమ్మతులకు ఏటా రూ.కోట్లలో ఖర్చు అయ్యేది.
  • 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రూ.12 కోట్ల వ్యయంతో జియోట్యూబ్‌ నిర్మించారు. నాలుగేళ్ల వరకు గ్రామాలకు రక్షణ కల్పించింది. అనంతరం జియోట్యూబ్‌ మరమ్మతులకు గురవడంతో కాలం గడిచేకొద్దీ కనుమరుగైంది. దీంతో పదేళ్లుగా మళ్లీ కోత సమస్య తీవ్రమైంది. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ చొరవతో సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

” ”అమరావతిని డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.. భవిష్యత్తులో మరిన్ని తీసుకువస్తాం..” అని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

సీఆర్‌డీఏ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో వేగంగా బ్యాంక్‌స్ట్రీట్ నిర్మాణ పనులు అవుతున్నాయని తెలిపారు.

దేవిన సిస్టర్స్ కి ఉగాది పురష్కారం . . సీఎం చేతులమీదుగా . .

దేవిన సిస్టర్స్ కి ఉగాది పురష్కారం . . సీఎం చేతులమీదుగా . .

సైకత శిల్ప కళద్వారా జనంలో అవగాహన కల్పిస్తున్నందుకు దక్కిన ఛాన్స్ . .

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత , దేవిన ధన్యత సోదరీమణులు . వీరు పదేళ్లుగా సైకత శిల్ప కళ ద్వారా జనంలో అవగాహనా తీసుకువస్తున్నారు . వ్యవసాయ సంక్షోభం , ఆడపిల్లల పట్ల వివక్షత , వంటి సామాజిక వివక్షతలపై అవగాహన కల్పిస్తున్న వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది . ఈ అమ్మాయిల తండ్రి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పి . ఆర్టిస్ట్ . జాతీయ , అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో శ్రీనివాస్ పాల్తొన్నారు .

ఉగాది సందర్బంగా గురువారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా సోహిత , ధన్యత ఉగాది పురస్కారాలు అందుకున్నారు .

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

క్వాంటమ్ హబ్ . . అమరావతి ఎక్కడికో . ..

/. భారత్ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మరో మలుపు తిప్పబోయే చారిత్రక ఘట్టానికి అమరావతి వేదిక అయింది . సాంకేతిక సునామీ..

ప్రపంచం మారుతోంది.. మనమూ మారాలి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఇప్పుడు కేవలం ఒక టెక్నాలజీ కాదు, అదొక మహా విప్లవం. డార్విన్ సిద్ధాంతంలాగే, కాలంతో పాటు అప్‌డేట్ అవ్వకపోతే టెక్ ప్రపంచంలో కనుమరుగవ్వడం ఖాయం.

ముంచుకొస్తున్న మార్పు – మనమెక్కడ ఉన్నాం?

అమెరికా స్టాక్ మార్కెట్‌లో టెక్ షేర్లు కుప్పకూలుతున్నాయి. Anthropic వంటి ఏఐ టూల్స్ నెలల పనిని గంటల్లోనే పూర్తి చేస్తున్నాయి. నిన్నటి దాకా ఉన్న ‘మ్యాన్-అవర్స్’ బిజినెస్ మోడల్ కనుమరుగవుతోంది. కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు.. బిజినెస్ లాజిక్ మరియు డొమైన్ నాలెడ్జ్ ఉంటేనే భవిష్యత్తు!

⚡ అమరావతి.. ఇక దక్షిణాసియా ‘క్వాంటం వ్యాలీ’!

ఈ సాంకేతిక సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది:

🔹 క్వాంటం హబ్: అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, రాయపూడిలో 50 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్.

🔹 పెట్టుబడులు: ₹9,000 కోట్ల పెట్టుబడులు.. రాష్ట్ర GSDP లో 3-5% వృద్ధి లక్ష్యం.

🔹 అత్యంత శక్తివంతమైన కంప్యూటర్: దక్షిణాసియాలోనే అతిపెద్ద 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతికి రాబోతోంది. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS) వంటి దిగ్గజాలు ఇందులో భాగస్వాములు.

🔹 గ్లోబల్ లీడర్: బోస్టన్, సింగపూర్ సరసన ఇప్పుడు మన అమరావతి నిలవబోతోంది!

🎓 విద్యార్థుల కోసం సువర్ణావకాశం:

డిగ్రీలు మాత్రమే సరిపోవు.. నైపుణ్యం ముఖ్యం! ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 50,000 మందికి క్వాంటం శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

✅ దశ 1: 4 వారాల కోర్సు (ఫీజు కేవలం ₹500/- మాత్రమే).

✅ దశ 2: ప్రతిభ కనబరిచిన 3,000 మందికి ఉచిత అడ్వాన్స్‌డ్ శిక్షణ.

✅ దశ 3: టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ సౌకర్యం.

ఇకపై ఇంజనీరింగ్ అంటే పాత సిలబస్ కాదు.. ఏఐ ఇంజనీర్లుగా, డేటా ఆర్కిటెక్టులుగా ఎదగాల్సిన సమయం.

యువతకు పిలుపు: సర్టిఫికెట్ల వెనక కాదు.. నాలెడ్జ్ వెనక పరిగెత్తండి. ఆంధ్రప్రదేశ్ క్వాంటం విప్లవంలో భాగస్వాములు అవ్వడానికి తెలుగు యువత సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమయింది .