గండికోటకు మహర్దశ 

గండికోటకు మహర్దశ 

300 అడుగత్తున నిటారుగా ఉండే ఇసుక రాతి కొండలు.. రెండు కొండల మధ్య పెన్నా నది సవ్వడులు.. , మరోవైపు ప్రాచీన చరితకు సాక్ష్యంగా నిలిచే వెయ్యేళ్ళ నాటి కోట.. పునాది లేకుండానే టన్నుల బరువుండే పెద్ద పెద్ద రాళ్లతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోట గోడ.. . ప్రకృతి ప్రేమికులకు నయనానందం కలిగించే అపురూప దృశ్యాలు. ఒక్కసారి అడుగుపెడితే.. ‘’గండికోట’’ అందాలను ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే.

ఎర్రమల కొండల మధ్య ఒంపులు తిరుగుతూ గలగల పారే పెన్నా నది అందాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయ్. నదికి ఇరువైపుల ఉన్న ఎత్తైన కొండలపై సూర్యకాంతి పడినపుడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అంతలోనే మబ్బులు కమ్మేస్తాయ్. ఈ వెలుగు-నీడల దోబూచులాట పర్యాటకులకు వీనుల విందు.

ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇంత అందంగా ఎవరు పేర్చారు? అనిపించేలా కొండలను ఆనుకుని ఉన్న బండరాళ్లు.. ఈ ప్రాంతానికి పర్యాటక వన్నె తీసుకువచ్చాయి.

‘గ్రాండ్ కాన్యన్’… అమెరికాలో అరిజోనా రాష్ట్రంలో Colorado river, దాని చుట్టూ ఎత్తైన ప్రదేశం… ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది.

‘గండికోట’లో ఎత్తైన కొండల మధ్య గలగలపారే పెన్నా అందాలు కూడా గ్రాండ్ కాన్యన్ ను పోలి ఉంటాయని అంటుంటారు. అందుకే ‘గండికోట’ను “గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా” గా అభివర్ణిస్తూ ఉంటారు. అమెరికాలో గ్రాండ్ కాన్యన్ లో మాదిరిగా సాహసక్రీడల ఏర్పాటుకు గండికోట ప్రాంతం ఎంతో అనువైనదిగా పర్యాటక శాఖ గుర్తించింది.

వేల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలి ఉన్న ‘గండికోట’ చారిత్రక వైభవాన్ని ఈ తరానికి అందించేందుకు పాలకులు సంకల్పంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పర్యాటక మంత్రిత్వ శాఖతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ‘’గండికోట’’కు నిధుల మంజూరుకు కీలకంగా వ్యవహరించారు. కేంద్రమంత్రిగా సొంత రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో పాటు… గండికోట ప్రాంతాన్ని ‘పెమ్మసాని’ వంశీయులు 400 ఏళ్లపాటు పాలించిన చారిత్రక నేపథ్యం ఉంది. తమ వంశీయుల చరిత్రను తర్వాత తరాల వారికి చూపించుకోవాలన్న ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు. ఇది పక్కనపెడితే రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడనుంది.

“గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం గండికోట. పెమ్మసాని పూర్వీకులు 300-400 సంవత్సరాలపాటు మిలటరీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పెమ్మసాని నాయకాస్ గండికోట పాలకులుగా కూడా దక్షిణ భారతదేశంలో పేరుగాంచారు.. ఇది పర్సనల్ గా కూడా నాకు ముఖ్యమే. గండికోట పర్యాటక అభివృద్ధితో రాయలసీమ ప్రాంతానికి పూర్వ వైభవం, ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు వస్తాయ్” అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

క్రీ.శ. 1123 లో కాకరాజు అనే సామంత రాజు గండికోటకు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయ్. కాకతీయ రాజుల సామంత రాజులు, విజయనగర సామ్రాజ్య సామంత రాజులు, కళ్యాణ చోళులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెపుతుంది. పెమ్మసాని నాయకాస్ (శ్రీకృష్ణదేవరాయల సైన్యాధికారులు) కూడా కొంతకాలం గండికోటకు రాజధానిగా చేసుకుని గుత్తి, అనంతపురం తదితర రాయలసీమ ప్రాంతాన్ని పాలించారు.

క్రీ.శ. 1323లో మహ్మదీయుల దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత గండికోట ప్రాంతం మహ్మదీయుల పాలన కిందకు వచ్చింది. ఆ సమయంలో గండికోటలో అనేక చారిత్రక కట్టడాలు కూల్చివేశారు.

క్రీ. శ . 1420-1448 మధ్య గండికోటకు పాలించిన తిమ్మనాయుడు ఈ కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. వీరతిమ్మనాయుడు, రామలింగనాయుడు తదితరుల ‘గండికోట’ పాలకులు రాయలసీమ ప్రాంతంలో కరవుకాటకాలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టేవారు. కరవు నుంచి రాజ్య ప్రజలను కాపాడేందుకు లోతైన, భారీ చెరువుల నిర్మాణం చేపట్టడంతోపాటు,, ఆహార ధాన్యాల నిల్వల కోసం భారీ ధాన్యాగారాలు నిర్మించారు.

1652 లో Mir Jumla అనే ముస్లింరాజు గండికోటపై దండయాత్ర చేయడానికి ప్రయత్నించాడు. అప్పటి పాలకుడైన చిన తిమ్మనాయుడు సాహసానికి తట్టుకోలేక వెనుతిరిగిన ముస్లిం రాజు, చిన తిమ్మనాయుడుని విష ప్రయోగంతో చంపినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చిన తిమ్మనాయుడు గండికోట చివరి రాజు.

గండికోట నిర్మించిన రాజులు ఎత్తైన కొండ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మూడు దుర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, జలపాతాలు ఈ గండికోట ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా అప్పట్లో ఉండేవి.

  1. జలదుర్గం: మూడు వైపుల నీటి ప్రవాహంతో కోతకు రక్షణ కల్పించే ఏర్పాట్లు
  2. వనదుర్గం: అడవులు ఎక్కువగా పెంచారు. శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అటవీ ప్రాంతంలో కందకాలు ఏర్పాటు చేసేవారు
  3. పర్వతదుర్గం: ఎత్తైన కొండపైన కోట ఉండటం వల్ల శత్రు సైన్యం చేరడం కష్టమవుతుందని ఈ ప్లాన్ తో నిర్మించారు. కింద నుంచి శత్రు సైన్యం కొండపైన కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసే సమయంలో కోట లోపల నుంచి ‘గండికోట’ సైనికులు శత్రు సైన్యంపై ప్రతిదాడి చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్మణం చేపట్టారు.

వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు 12 కిలోమీటర్ల దూరంలో ‘గండికోట’ ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు గండికోట అందుబాటు దూరంలో ఉంటుంది.

  • బెంగుళూరు నుంచి గండికోటకు 290 కిలోమీటర్లు
  • చెన్నై నుంచి గండికోటకు 364 కిలో మీటర్లు
  • హైదరాబాద్ నుంచి గండికోటకు 386 కిలో మీటర్లు.
  • తిరుపతి నుంచి గండికోటకు.. 227 కిలో మీటర్ల దూరం ఉంది.
  • కడప ఎయిర్ పోర్ట్ నుంచి గండికోటకు 75 కిలో మీటర్ల దూరం.

గండికోట పేరు వినగానే.. ఏభై, అరవై ఏళ్ల పైబడిన వయస్సు వారికి సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘’గండికోట రహస్యం’’ సినిమా తళుక్కున గుర్తు రావడం సహజం.

ఓ ప్రకటన… జంక్ ఫుడ్ తినేలా చేస్తూంది

ఓ ప్రకటన… జంక్ ఫుడ్ తినేలా చేస్తూంది

స్కూల్ పిల్లల్లో ‘చక్కర’ స్నాక్స్ ప్రమాదంపై CBSC సూచనలు 

పిల్లలలో పెరుగుతున్న చక్కెర వినియోగాన్ని అరికట్టే ప్రయత్నంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అన్ని అనుబంధ పాఠశాలలను ‘షుగర్ బోర్డులు’ ఏర్పాటు చేయాలని ఆదేశించింది – ఇది అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు తెలియజేయడానికి రూపొందించబడిన అద్భుతమైన అవగాహన కార్యక్రమం.

2024 యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీలో జరిగిన ఒక కొత్త ట్రయల్, కేవలం ఐదు నిమిషాల జంక్ ఫుడ్ ప్రకటనలు పిల్లలు రోజుకు 130 అదనపు కిలో కేలరీలు తినేలా చేస్తాయని వెల్లడించింది – దాదాపు రెండు బ్రెడ్ ముక్కలు అన్నమాట…

స్కూల్స్ పరిసరాలలో చక్కెర స హిత తినుబండారాలు లేకుండా చేయాలంటే ఇపుడున్న ప్రభుత్వాలకు సాధ్యం అయ్యేలా కనిపించడంలేదు. సంక్షోభాన్ని ఎదుర్కోవాలని కోరబడుతున్నప్పటికీ, కొత్త అంతర్జాతీయ పరిశోధన మరింత విస్తృతమైన శత్రువును వెల్లడిస్తుంది – దూకుడు జంక్ ఫుడ్ ప్రకటనలు, ఇది బహిర్గతం అయిన కొద్ది నిమిషాల్లోనే పిల్లల కేలరీల తీసుకోవడం పెంచుతుంది.

పిల్లలలో టైప్ 2 డయాబెటిస్‌లో ఆందోళనకరమైన పెరుగుదల – ఒకప్పుడు పెద్దలకు మాత్రమే ప్రత్యేకమైన పరిస్థితి – ఈ చొరవ వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఒకటిగా CBSE తన సూచనలో స్పష్టంగా పేర్కొంది.

“ఈ బోర్డులు సిఫార్సు చేయబడిన రోజువారీ చక్కెర తీసుకోవడం, సాధారణంగా తీసుకునే ఆహారాలలో చక్కెర కంటెంట్ (జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన అనారోగ్యకరమైన భోజనం), అధిక చక్కెర వినియోగంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందించాలి. ఇది విద్యార్థులకు సమాచారంతో కూడిన ఆహార ఎంపికల గురించి అవగాహన కల్పిస్తుంది మరియు విద్యార్థులలో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది” అని అది పేర్కొంది.

టైప్ 2 డయాబెటిస్
గత దశాబ్దంలో పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ గణనీయంగా పెరిగిందని, ఒకప్పుడు పెద్దవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించేదని CBSE తెలిపింది. ఈ ఆందోళనకరమైన ధోరణికి కారణం అధిక చక్కెర తీసుకోవడం, తరచుగా పాఠశాల పరిసరాలలో చక్కెర స్నాక్స్, పానీయాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు సులభంగా లభించడం. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరగడమే కాకుండా ఊబకాయం, దంత సమస్యలు మరియు ఇతర జీవక్రియ రుగ్మతలు కూడా సంభవిస్తాయి, చివరికి పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు విద్యా పనితీరును ప్రభావితం చేస్తాయి.

“4 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోజువారీ కేలరీల తీసుకోవడంలో చక్కెర 13 శాతం, మరియు 11 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి 15 శాతం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఇది సిఫార్సు చేయబడిన 5 శాతం పరిమితిని గణనీయంగా మించిపోయింది. పాఠశాల పరిసరాలలో తరచుగా అందుబాటులో ఉండే చక్కెర స్నాక్స్, పానీయాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాల తీసుకోవడంలో గణనీయంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది… అని CBSE కీలక అధికారి ఒకరు తెలిపారు.

ప్రచార మాధ్యమాలలో స్క్రీన్‌ల నుండి అతిపెద్ద ప్రకటనలు వచ్చినప్పుడు లంచ్‌బాక్స్‌లలో చక్కెరను పరిష్కరించడం సరిపోకపోవచ్చు. మలగాలో జరిగిన 2024 యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీలో సమర్పించబడిన కొత్త యాదృచ్ఛిక క్రాస్ఓవర్ ట్రయల్, జంక్ ఫుడ్ ప్రకటనలకు ఐదు నిమిషాలు బహిర్గతం కావడం వల్ల పిల్లలు రోజుకు అదనంగా 130 కిలో కేలరీలు తినవచ్చు – ఇది రెండు బ్రెడ్ ముక్కలకు సమానం… అని సూచించడాన్ని కూడా అదునుగా తీసుకుంటున్నారు.

బహుళ కారకాల స్థితి అయిన ఊబకాయం, వివిధ రకాల పర్యావరణ, ప్రవర్తనా మరియు సామాజిక ఆర్థిక కారకాలచే ప్రభావితమవుతుంది. మునుపటి పరిశోధన ఆడియోవిజువల్ మీడియాలో ఉత్పత్తి ఆధారిత ప్రకటనలను పిల్లలలో పెరిగిన తక్షణ మరియు ఆలస్యమైన ఆహార వినియోగానికి అనుసంధానించినప్పటికీ, ఇతర రకాల మీడియా ప్రభావాల గురించి తక్కువగా తెలుసు.

వీటిలో బ్రాండ్-మాత్రమే ప్రకటనలు (వాస్తవ ఆహారం లేదా పానీయాలను చూపించకుండా లోగోలు వంటి బ్రాండింగ్ అంశాలను కలిగి ఉంటాయి) మరియు ఆడియో-మాత్రమే ప్రకటనలు (పాడ్‌కాస్ట్‌లు లేదా రేడియోలో విన్నవి వంటివి) ఉన్నాయి.

చిన్నారులలో తక్షణ మరియు ఆలస్యమైన కేలరీల తీసుకోవడం రెండింటిపై HFSS ఆహార ప్రకటనల ప్రభావాన్ని (ఆహారేతర ప్రకటనలతో పోలిస్తే) కొలవడానికి పరిశోధకులు యాదృచ్ఛిక క్రాస్ఓవర్ ట్రయల్ నిర్వహించారు. కంటెంట్ ఆధారంగా ప్రభావాలు మారుతున్నాయా అని కూడా వారు పరిశీలించారు ప్రకటన (బ్రాండ్-మాత్రమే vs. ఉత్పత్తి-ఆధారిత), మీడియా రకం (ఆడియో-విజువల్, విజువల్, ఆడియో లేదా స్టాటిక్), మరియు పిల్లల సామాజిక ఆర్థిక నేపథ్యం.

ఈ సమగ్ర విధానం సమస్య యొక్క క్రమబద్ధమైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది మరియు అనారోగ్యకరమైన ఆహార మార్కెటింగ్ యొక్క విస్తృత ప్రభావాల నుండి పిల్లలను పూర్తిగా రక్షించడంలో CBSE ఇటీవల ఆదేశించిన ‘షుగర్ బోర్డులు’ వంటి అవగాహన కార్యక్రమాల ప్రభావం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది.

ఈ అధ్యయనంలో UKలోని మెర్సీసైడ్‌లోని పాఠశాలల నుండి 240 మంది పాల్గొన్నారు. రెండు వేర్వేరు సందర్భాలలో, పిల్లలు ఐదు నిమిషాల HFSS ఆహార ప్రకటనలకు మరియు ప్రత్యేక సెషన్‌లో, ఆహారేతర ప్రకటనలకు గురయ్యారు. ఈ ప్రకటనలు బ్రాండ్-మాత్రమే లేదా ఉత్పత్తి-ఆధారితమైనవి మరియు నాలుగు మీడియా ఫార్మాట్‌లలో ఒకదాని ద్వారా పంపిణీ చేయబడ్డాయి

లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. మన రాష్ట్ర రాజకీయ భవితవ్యం కూడా NDA చేతిలోకి వెళ్ళబోతున్నాయ్.

”2029 లోనే కాదు . . 2034 లో మరో దఫా కూడా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు..” అంటూ జనసేన అధినేత , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తూ ఉంటారు . అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో 2027 లోనే నారా లోకేష్ కి పట్టం కట్టడానికి రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.

మోదీ ఆశీస్సులు: ఏపీ మంత్రి లోకేష్ కి ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల ప్రధాని నివాసంలో రెండు గంటలపాటు లోకేష్ కుటుంబంతో మోదీ ఉల్లాసంగా గడపడమే దీనికి సంకేతంగా భావించవచ్చు. లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలంటూ కొంత కాలం క్రితం టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో జనసేన కేడర్ భగ్గుమంది. ఉపముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండాలనేది టీడీపీ , జనసేన మధ్య ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం. అందులో భాగంగానే చంద్రబాబు సైతం లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడలేదు.

2029 లో పవన్ ని సీఎం చేయాలన్న డిమాండ్ జనసైనికుల నుంచి తీవ్రంగా ఉంది . అయితే పవన్ తన బలం , బలహీనతలు బాగా అంచనావేయగలిగిన నేతగా ఎదిగారు. పొత్తుతో ముందుకెళితేనే జనసేనకు కూడా భవిష్యత్ ఉంటుందని బలంగా నమ్మిన వ్యక్తి పవన్. 2019 దెబ్బ ఈ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే ఎన్నికలకు సైతం పొత్తుతోనే వెళ్లాలన్నది పవన్ యోచన.

పొత్తుతో ఉన్నపుడు అతిపెద్ద పార్టీ ఏదైతే ఆ పార్టీ నుంచే సీఎం వంటి కీలక పదవులు కేటాయింపు ఉంటుంది . ఇందులో భాగంగానే 2029 లో కూడా టీడీపీ కె ఈ ఛాన్స్ దక్కుతుంది . పవన్ కి కేడర్ నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్నా… అతను మాత్రం ఆచి – తూచి అడుగేస్తున్నారు . వచ్చే ఎన్నికలలో పవన్ ని దక్షిణాది మొత్తం తిప్పనున్నారు . సనాతన సారధిగా ఐడెంటిటీ పొందిన పవన్ ప్రాభవం . .. ఏపీ , తెలంగాణతోపాటు . .. కర్ణాటక , తమిళనాడులలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా . .. సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్ గా బీజేపీ ప్రమోట్ చేయనుంది .

2027 లో . .. అంటే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల ముందే లోకేష్ కి సీఎం పదవి పగ్గాలు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి . 2026 మహానాడులో లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

పవన్ కి కేంద్రమంత్రి పదవి . .. లోకేష్ సీఎం అయితే పవన్ ఉపముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు ? పవన్ కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు . ఈ మేరకు మోదీ టీమ్ ఒక అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది .

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా . .. చంద్రబాబు : లోకేష్ సీఎం పీఠం అధిరోహిస్తే . .. చంద్రబాబును ఉప రాష్ట్రపతిగా చేసే ప్రయత్నాలు NDA నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది .

2029 ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ . .. 2029 లో నాలుగోసారి గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపితే పోటీ మరింత గట్టిగ ఉంటుంది. ముక్యంగా బీజేపీ దక్షిణాదిపై ద్రుష్టి సారించింది . ఇందులో భాగంగా ఏపీ , తెలంగాణలు కూడా తమకు కీలకంగా బీజేపీ భావిస్తోంది.

2014-2019 మధ్య చంద్రబాబు , బీజేపీ తో పొత్తులో ఉన్నారు . 2019 ఎన్నికలలో మాత్రం NDA నుంచి బయటకు వచ్చి . .. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ దెబ్బ 2019 లో టీడీపీకి బొప్పి కట్టింది . దీంతో 2024 లో చేసిన తప్పును సరిదిద్దుకున్నారు . బీజేపీతో జతకట్టి అప్రతిహత విజయం సాధించారు . ఇదే సమయంలో కేంద్ర0లో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఏపీ నుంచి టీడీపీ మద్దతు మస్ట్. అంతేకాకుండా . .. చంద్రబాబును వదిలేస్తే లాభంలేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. గతంలో వాజపేయి ఉన్నపుడు బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. మళ్ళీ 2019 లో దూరమయింది . ఇలా ఒక్కోసారి . .. ఒక్కోరకంగా రాజకేయన్గా చంద్రబాబు మార్పులు ఉండటంతో బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉన్నారు . చంద్రబాబును ఇలా వదిలేస్తే లాభంలేదన్న భావనలో ఉన్న మోడీ , అమిత్ షా . .. సీబీఎన్ కి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెడితే బాగుంటుదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది .

ఖజానా కొల్లగొట్టిన వైఎస్సార్సీపీ నేతలు-లిక్కర్ స్కాం

ఖజానా కొల్లగొట్టిన వైఎస్సార్సీపీ నేతలు-లిక్కర్ స్కాం

ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్స్ లోకి వెళుతుంటే . .. జగన్ హయాంలో వైసీపీ సర్కార్ మద్యం అమ్మకాలను నగదు రూపంలోకి తీసుకువచ్చినపుడే జనంలో లిక్కర్ స్కాం పై అనుమానాలు రేకెత్తాయి . …

వైఎస్సార్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు మద్యం మాఫియా సాగించిన అరాచకాలు, అకృత్యాలు తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు . నియంతృత్వ ప్రభుత్వాలు, అప్పటి రాజులు కూడా దిగదుడుపే. తమ మాట వినకపోతే మార్కెట్లో ఎంతో పేరున్న మద్యం బ్రాండ్లకూ ఆర్డర్లు లేకుండా చేశారు. సామ దాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఐదేళ్లపాటు అందిన మేర కొల్లగొట్టారు. కమీషన్ల వసూలులో రాజ్‌ కెసిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించినట్లు తేలింది.

ఫ్యాక్షనిజ0తో బెదిరింపులు : మద్యం కుంభకోణంలో సిట్ అధికారులకు సైతం విస్తుగొలిపే అరాచకాలు బయటకొస్తున్నాయి. ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం నడిపించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంత రెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మాఫియా మొత్తాన్ని రాజ్‌ కెసిరెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కలిసి నడిపించారనేందుకు ఇదీ ఒక నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.

నంద్యాలలో ఉన్న ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్‌ ఛాంబర్స్‌ లిమిటెడ్, శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ద్వారా పెట్టుబడుల రూపంలో సొమ్ములు మళ్లించారు. ఇలా 30 కోట్లను శిష్ట్‌లా శ్రీనివాస్‌కు చెందిన శాన్‌హోక్‌ ల్యాబ్స్‌కు బదిలీ చేసారు . దీన్ని డికార్ట్‌ లాజిస్టిక్స్‌లోకి పంపారు. అనంతరం ఈ సొమ్మును ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీకి డికార్ట్‌ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్‌ బ్రాండ్‌ మద్యం ఉత్పత్తి చేయించింది. నిధుల లావాదేవీల వివరాలను విచారణ బృందాలు సేకరించాయి. ఎస్‌పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అనంతరం వీటిని డికార్ట్‌ లాజిస్టిక్స్‌లోకి మళ్లించారు.

పొరుగు రాష్ట్రాల కంపెనీలకు బెదిరింపులు

తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్‌జే షుగర్స్, ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు చెందిన జయ మురుగున్, మాతప్పన్‌ను వాట్సప్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకాశ్, రాజశేఖర్‌రెడ్డి సంప్రదించారు. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డికి దగ్గరి వాళ్లమని పరిచయం చేసుకుంటూ, మద్యం అమ్మకాలకు సంబంధించి లంచాలు చెల్లించాలని లేదంటే పరిశ్రమను సబ్‌లీజ్‌కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో 2019 సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన 16 కోట్ల చెల్లింపులను ఆపేశారు. కమీషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్‌ డిస్టిలరీ, బీవీఎస్‌ డిస్టిలరీ, ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వాటికి ఆర్డర్లు తగ్గించారు. అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మార్కెట్‌ నుంచి తొలగించారు. లిక్కర్ వ్యవహారంలో తమ ఆదేశాలు కాదని వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు . దీంతో కంపెనీల యజ్నమ్యాలు సైతం భయకంపితులై వీరి చెప్పుచేతల్లోకి వచ్చారు .

బర్లీ పొగాకు రైతు అతలాకుతలం-సర్కార్ ఆదుకుంటుందా?

బర్లీ పొగాకు రైతు అతలాకుతలం-సర్కార్ ఆదుకుంటుందా?

ఆంధ్రప్రదేశ్‌లో బర్లీ పొగాకు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు . అధిక సరఫరా సమస్యను పరిష్కరించడానికి, అధిక HD బర్లీ సాగును నిరుత్సాహపరిచేందుకు మరియు ఇతర వాణిజ్య పంటలకు మారడాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జూన్ 2025 నుండి అవగాహన కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సాగుచేసే బర్లీ పొగాకు అమెరికా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది . మనదేశంలో ఐటీసీ వంటి కంపెనీలు సిగరెట్ల తయారీకి వినియోగిస్తాయి .

ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు సరఫరాలో మిగులు కారణంగా ధర పతనం కారణంగా అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు.

2024-25 సీజన్‌లో, రికార్డు స్థాయిలో 190,456 హెక్టార్లలో పొగాకు పంటను సాగు చేయడం వల్ల పొగాకు సరఫరా అధికంగా ఉంది. దీని వల్ల 450 మిలియన్ కిలోల ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (FCV), వైట్ బర్లీ మరియు HD బర్లీ రకాల పొగాకులో ఈ ఏడాది అధిక దిగుబడి వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికం .

ప్రత్యామ్నాయ పంటగా . .. మిరప మరియు పత్తి వంటి సాధారణ వాణిజ్య పంటలను ప్రభావితం చేసే తెగుళ్లను నిర్వహించడం వారికి కష్టంగా మారుతున్నందున చాలా మంది రైతులు పొగాకు సాగు వైపు మొగ్గు చూపారు .

మానవ వనరుల మంత్రి ఎన్. లోకేష్ మే 15న ప్రకాశం జిల్లాలోని అమ్మన్‌బ్రోలును సందర్శించినప్పుడు, రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చూసుకోవాలని ఆయనను అభ్యర్థించారు. అందించే ధర చాలా తక్కువగా ఉన్నందున నిల్వలు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని లోకేష్ దృష్టికి తెచ్చారు .


ధరలు పతనమవుతున్నాయి
ప్రపంచ వ్యాప్తంగా పొగాకు డిమాండ్ బలహీనంగా ఉందని పేర్కొంటూ వ్యాపారులు స్టాక్‌లను కొనుగోలు చేయడానికి నిరాకరించడం, నాణ్యత తక్కువగా ఉందని పేర్కొంటూ వేలంలో ఉత్పత్తులను తిరస్కరించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్ వ్యవసాయ మంత్రి కె. అచ్చన్ నాయుడుతో మాట్లాడి, అవసరమైతే పొగాకు బోర్డు మరియు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతును రైతులకు హామీ ఇచ్చారు మరియు మార్కెట్‌ను స్థిరీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మే 16న ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, రైతుల ప్రయోజనాలను కాపాడేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

క్వి0టా రూ 20 వేల నుంచి రు. 4 వేలకు . ..

గతేడాది వంద కిలోల బర్లీ పొగాకు 20 వేల వరకు ధర పలికింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పలువురు రైతులు… మరింత ఉత్సాహంతో సాగు పెంచారు . అయితే కౌలు , పెట్టుబడి గణనీయంగా పెరిగింది . గత ఏడాది ఎకరం కౌలు 15 వేలు కాగా , ఈ సీజన్ లో 20-25 వేలకు పెరిగింది. ఎకరం కౌలు , పెట్టుబడి . .. 60 వేల వరకు అవుతుంది. పొగాకు విరిచి ఆరబెట్టడానికి మరో 30-40 వేల.. అంటే ఎకరాకు లక్ష అవుతుంది . పది కింటాలు దిగుబడి వస్తే . … 4 వేల చొప్పున … 40 వెలవరకు మాత్రమే వస్తుంది . అంటే ఎకరా సాగుచేసిన రైతుకు 60 వేళా వరకు నష్టం వస్తుంది .

రైతులు నష్టపోకుండా చూసుకునేందుకు, వ్యాపారులు హెచ్‌డి బర్లీ కోసం క్వింటాల్‌కు కనీసం ₹12,500 (కిలోకు ₹125) చొప్పున పొగాకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ (జిపిఐ) మరియు ఐటిసి వంటి కంపెనీలు 20 మిలియన్ కిలోలను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.

రైతుల వద్ద ఉన్న అన్ని పొగాకు నిల్వలను ఆలస్యం చేయకుండా సేకరించాలని ముఖ్యమంత్రి అన్నారు. “రైతుల వద్ద, వారి ఇళ్లలో లేదా పొలంలో ఎటువంటి నిల్వలు కొనుగోలు చేయకుండా ఉండకూడదు” అని ఆయన అన్నారు.

న ష్టాలను తగ్గించే ప్రయత్నాలు
రోజువారీ కొనుగోళ్లను పర్యవేక్షించడానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మరియు వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించాలని నాయుడు ఆదేశించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి నివేదికలను సమర్పించాలని వ్యవసాయ శాఖను కోరారు. వ్యాపారులు సోమవారం, మే 19 నాటికి కొనుగోళ్లు మరియు ధరలపై వివరణాత్మక నివేదికను అందించాలి.

భవిష్యత్తులో సంక్షోభాలను నివారించడానికి, రైతులు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుతూ నాయుడు బైబ్యాక్ విధానాన్ని ప్రతిపాదించారు. ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా న్యాయమైన ధరను నిర్ధారించడానికి పొగాకు బోర్డు అమలును పర్యవేక్షిస్తుంది.

అధిక సరఫరా సమస్యను పరిష్కరించడానికి, అధిక HD బర్లీ సాగును నిరుత్సాహపరిచేందుకు మరియు ఇతర వాణిజ్య పంటలకు మారడాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జూన్ 2025 నుండి అవగాహన కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. మార్కెట్ అస్థిరత నుండి రైతులను రక్షించడానికి పంట వైవిధ్యీకరణ కీలకమని నాయుడు నొక్కిచెప్పారు.

సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు కూడా ఆయన హెచ్చరిక చేశారు. రైతులకు అన్యాయం జరిగినా తాను సహించనని ఆయన అన్నారు. నిరంతర దోపిడీ రైతులను పొగాకు సాగు నుండి దూరం చేయగలదని, పరిశ్రమ పతనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

”గతేడాది 5 ఎకరాలు బర్లీ పొగాకు సాగుచేస్తే . .. 4 లక్షల వరకు లాభం వచ్చింది . ఈ ఏడాది 20 ఎకరాల వరకు వ్యవసాయం చేశాను . 20 లక్షల పెట్టుబడి అయితే . .. ఇపుడున్న ధర ప్రకారం . .. 6-8 లక్షలు కూడా రాదన్న ఆందోనళనలో ఉన్నాము.. ప్రభుత్వం ఆదుకోవాలి . ..” అని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చంద్రేడు గ్రామానికి చెందిన యువరైతు ‘బొడ్డు శ్రీహరి’ అభిన్యూస్ తో మాట్లాడుతూ బాధను వ్యక్తం చేసారు .