లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

Srinivas Vedulla

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. మన రాష్ట్ర రాజకీయ భవితవ్యం కూడా NDA చేతిలోకి వెళ్ళబోతున్నాయ్.

”2029 లోనే కాదు . . 2034 లో మరో దఫా కూడా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు..” అంటూ జనసేన అధినేత , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తూ ఉంటారు . అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో 2027 లోనే నారా లోకేష్ కి పట్టం కట్టడానికి రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.

మోదీ ఆశీస్సులు: ఏపీ మంత్రి లోకేష్ కి ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల ప్రధాని నివాసంలో రెండు గంటలపాటు లోకేష్ కుటుంబంతో మోదీ ఉల్లాసంగా గడపడమే దీనికి సంకేతంగా భావించవచ్చు. లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలంటూ కొంత కాలం క్రితం టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో జనసేన కేడర్ భగ్గుమంది. ఉపముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండాలనేది టీడీపీ , జనసేన మధ్య ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం. అందులో భాగంగానే చంద్రబాబు సైతం లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడలేదు.

2029 లో పవన్ ని సీఎం చేయాలన్న డిమాండ్ జనసైనికుల నుంచి తీవ్రంగా ఉంది . అయితే పవన్ తన బలం , బలహీనతలు బాగా అంచనావేయగలిగిన నేతగా ఎదిగారు. పొత్తుతో ముందుకెళితేనే జనసేనకు కూడా భవిష్యత్ ఉంటుందని బలంగా నమ్మిన వ్యక్తి పవన్. 2019 దెబ్బ ఈ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే ఎన్నికలకు సైతం పొత్తుతోనే వెళ్లాలన్నది పవన్ యోచన.

పొత్తుతో ఉన్నపుడు అతిపెద్ద పార్టీ ఏదైతే ఆ పార్టీ నుంచే సీఎం వంటి కీలక పదవులు కేటాయింపు ఉంటుంది . ఇందులో భాగంగానే 2029 లో కూడా టీడీపీ కె ఈ ఛాన్స్ దక్కుతుంది . పవన్ కి కేడర్ నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్నా… అతను మాత్రం ఆచి – తూచి అడుగేస్తున్నారు . వచ్చే ఎన్నికలలో పవన్ ని దక్షిణాది మొత్తం తిప్పనున్నారు . సనాతన సారధిగా ఐడెంటిటీ పొందిన పవన్ ప్రాభవం . .. ఏపీ , తెలంగాణతోపాటు . .. కర్ణాటక , తమిళనాడులలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా . .. సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్ గా బీజేపీ ప్రమోట్ చేయనుంది .

2027 లో . .. అంటే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల ముందే లోకేష్ కి సీఎం పదవి పగ్గాలు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి . 2026 మహానాడులో లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

పవన్ కి కేంద్రమంత్రి పదవి . .. లోకేష్ సీఎం అయితే పవన్ ఉపముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు ? పవన్ కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు . ఈ మేరకు మోదీ టీమ్ ఒక అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది .

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా . .. చంద్రబాబు : లోకేష్ సీఎం పీఠం అధిరోహిస్తే . .. చంద్రబాబును ఉప రాష్ట్రపతిగా చేసే ప్రయత్నాలు NDA నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది .

2029 ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ . .. 2029 లో నాలుగోసారి గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపితే పోటీ మరింత గట్టిగ ఉంటుంది. ముక్యంగా బీజేపీ దక్షిణాదిపై ద్రుష్టి సారించింది . ఇందులో భాగంగా ఏపీ , తెలంగాణలు కూడా తమకు కీలకంగా బీజేపీ భావిస్తోంది.

2014-2019 మధ్య చంద్రబాబు , బీజేపీ తో పొత్తులో ఉన్నారు . 2019 ఎన్నికలలో మాత్రం NDA నుంచి బయటకు వచ్చి . .. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ దెబ్బ 2019 లో టీడీపీకి బొప్పి కట్టింది . దీంతో 2024 లో చేసిన తప్పును సరిదిద్దుకున్నారు . బీజేపీతో జతకట్టి అప్రతిహత విజయం సాధించారు . ఇదే సమయంలో కేంద్ర0లో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఏపీ నుంచి టీడీపీ మద్దతు మస్ట్. అంతేకాకుండా . .. చంద్రబాబును వదిలేస్తే లాభంలేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. గతంలో వాజపేయి ఉన్నపుడు బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. మళ్ళీ 2019 లో దూరమయింది . ఇలా ఒక్కోసారి . .. ఒక్కోరకంగా రాజకేయన్గా చంద్రబాబు మార్పులు ఉండటంతో బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉన్నారు . చంద్రబాబును ఇలా వదిలేస్తే లాభంలేదన్న భావనలో ఉన్న మోడీ , అమిత్ షా . .. సీబీఎన్ కి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెడితే బాగుంటుదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది .

You May Also Like…