రీకాల్ పిలుపు… జగన్ మూర్ఖత్వమే…

రీకాల్ పిలుపు… జగన్ మూర్ఖత్వమే…

గంజాయి స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం . . వారికి మాత్రం వైసీపీ అధినేత జగన్ పరామర్శలు . .. ఎక్కడికిపోతున్నాం . .. అంటూ సమాజం లో కొన్ని వర్గాలు ఆ పార్టీని , సదరు నేతను ఛీత్కరించుకుంటున్నా ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు .

వైఎస్ఆర్‌సీపీ “రీకాల్” కార్యక్రమం రాజకీయ దాడిగా కనిపిస్తున్నప్పటికీ, శాసనసభ బహిష్కరణ, చట్టవ్యతిరేక ఆరోపణలు, సమీక్షా రాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సరిదిద్దకపోతే, పార్టీ రాజకీయంగా మరింత బలహీనపడే అవకాశం ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ప్రకటించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో” కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు1 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్ఆర్‌సీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు వారాల పాటు ఇంటింటికీ వెళ్లి, క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతలకు ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తూ, ప్రజాతీర్పును అవమానిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం చవిచూసింది. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు సాధించి, రాష్ట్రంలోని 13 జిల్లాలకు 8 జిల్లాల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈ ఓటమి తర్వాత పార్టీలో సమగ్ర సమీక్ష జరగలేదు. ఓటమికి కారణాలను విశ్లేషించడం, లోపాలను సరిదిద్దుకోవడం జరగలేదు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మొక్కుబడి ప్రకటన కూడా చేయలేదు. బదులుగా, “రీకాల్” కార్యక్రమం పేరుతో ప్రతిపక్షంపై దాడిని ఉధృతం చేసింది. ఈ వైఖరి పార్టీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేని అసమర్థతను సూచిస్తుంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా, శాసనసభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారి బాధ్యత. అయితే, ఈ బాధ్యతను విస్మరించి, సభను బహిష్కరించడం ద్వారా ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. శాసనసభ బహిష్కరణ ద్వారా పార్టీ తన రాజకీయ అసమర్థతను బహిర్గతం చేసుకుంటోంది, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోంది.

గతంలో నిర్వహించిన “గడపగడపకూ” కార్యక్రమం ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, అది విఫలమైంది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిరస్కరించి, వైఎస్ఆర్‌సీపీని ఓడించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, “రీకాల్” కార్యక్రమంతో మళ్లీ ప్రతిపక్షంపై దూషణలకు దిగింది. ఈ వైఖరి వైఎస్ఆర్ సిపి వ్యూహాత్మక లోపాన్ని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని లోటును బయటపెడుతోంది.

వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలకు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటువంటి చర్యలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, శాసనసభ బహిష్కరణ ద్వారా వైఎస్ఆర్‌సీపీ ఈ బాధ్యతను విస్మరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో “రీకాల్” ప్రకటించడం పార్టీ నైతిక అర్హతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు పార్టీ వైఖరిపై బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో జగన్ నిర్ణయాలపై విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు నిశ్శబ్దం వహించడం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తుంది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్యకర్తలు జగన్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతివిశ్వాసం, పోల్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలు ఓటమికి కారణమని ఆరోపించారు. అయినప్పటికీ, ఈ అసంతృప్తిని పరిష్కరించే చర్యలు తీసుకోలేదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సవాలు చేయకపోతే, పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సర్వోన్నతం. ఓడిన పార్టీలు తమ లోపాలను సమీక్షించుకుని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలి. అయితే, వైఎస్ఆర్‌సీపీ ఈ మార్గాన్ని విస్మరించి, శాసనసభను బహిష్కరించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, “రీకాల్” ద్వారా ప్రతిపక్షంపై దూషణలకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. “గడపగడపకూ” కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో, “రీకాల్” కూడా విఫలమైతే, పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. ఈ వైఖరి పార్టీ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు .. అంటూ పలువురు జగన్ అంటే ఇష్టపడే వాళ్ళు సైతం సూచిస్తున్నారు . అయినా అతని వైఖరిలో మార్పు వస్తుందని భావించడం వీరి అమాయకత్వమే అవుతుంది .

కూటమి హామీలపై వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయాలని జగన్ ఆదేశం. స్థానికంగా వైసీపీ చోటా నేతలు ఈ పనిని చేయ్యపట్టాల్సి ఉంటుంది . అయితే ఇప్పటికే జనంలో స్థానిక వైసీపీ వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం గురించి తెలిసిందే. ఈ ప్రభావంతో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అభాసుపాలవుతుందని మెజార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

విభజన తర్వాత చ‌ట్ట స‌భ‌ల్లో ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ– భ‌విష్య‌త్తుపైనే నాయ‌కుల ఆశ‌లు

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ద‌శాబ్దాల‌పాటు శాసించిన ఘ‌న‌ చ‌రిత్ర‌ కాంగ్రెస్ పార్టీది. అయితే కేంద్రంలో తాను అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర‌ విభజన చేసిన‌ త‌ర్వాత ఆ పార్టీ ఆశించిన రాజ‌కీయ ప్రయోజ‌నాలు తెలంగాణ‌లో సైతం ద‌క్కించుకోలేక‌పోయింద‌న్న‌ది నిజం. ప‌దేళ్ల త‌ర్వాత రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆయ‌న పోరాటంతోపాటు ప‌లు అంశాలు క‌లిసివ‌చ్చి అధికారం ద‌క్కించుకోవ‌డం వేరే సంగ‌తి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజకీయ పటంలో ఆ పార్టీ దాదాపు క‌నుమ‌రుగైన‌ స్థాయికి క్షీణించిందని చెప్పాలి. 2004, 2009 ఎన్నిక‌ల్లో వరుసగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి స్వ‌యంకృత‌మే. గ‌తంలో దేశ‌మంతా కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన స‌మ‌యంలోనూ ఆ పార్టీకి అండ‌గా నిలిచింది తెలుగు ప్ర‌జ‌లే. తిరిగి ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర ఉమ్మ‌డి ఏపీది. అయితే ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ప్రాతినిధ్యంలో కూడా ఏపీలో ఆ పార్టీ నామ‌మాత్రంగా మిగిలింది.

విభజన గాయ‌మా.. ప్ర‌త్య‌ర్థుల వ్యూహ‌మా..?

2014లో తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం తీవ్రం కావ‌డం, ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే అంశంగా మార‌డంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని నాటి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర విభ‌జ‌న‌కు పూనుకుంది. అయితే సీమాంధ్ర ప్ర‌జ‌ల అభ్యంత‌రాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోపాటు పార్ల‌మెంటులో విభ‌జ‌న బిల్లు ఆమోదించిన తీరు ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విధంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు శిక్షించారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ద‌శాబ్ద‌కాలం గ‌డ‌చినా ఆ పార్టీ ఇక్క‌డ ఒక మోస్త‌రు స్థాయిలోనైనా కోలుకోలేక‌పోవ‌డానికి కార‌ణం మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం నిర్ల‌క్ష్యమేన‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా తెలంగాణ‌లో నాటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌రిష్ట ప్ర‌యోజ‌నం ద‌క్కించుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అనుస‌రించిన‌ త‌ప్పుడు వ్యూహాలే కార‌ణం. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే కాంగ్రెస్‌కి ఘోర పరాభవాన్ని తేటతెల్లం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ త‌ప్పిదాలే వైసీపీ పునాదులు

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు తాను ఏంచేసినా చెల్లుతుంద‌ని, భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప‌రిణామాలు తాను ఆశించిన‌ట్టే ఉంటాయ‌ని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మ‌రోప‌క్క బీజేపీ నుంచి దేశ‌వ్యాప్తంగా ఎదుర‌య్యే ముప్పును కూడా చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేసింది. తెలంగాణ ఇచ్చింది తానే కాబ‌ట్టి అక్క‌డి ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని భావించింది. కేసీఆర్ త‌న‌ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌న్నా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు విని చేతులారా వ‌దుల‌కుంది. ఇక ఏపీలో తాత్కాలికంగా న‌ష్ట‌పోయినా సంప్ర‌దాయ ఓటు బ్యాంకు భ‌విష్య‌త్తులో తిరిగి త‌న నీడ‌కే చేరుతుంద‌ని భావించింది. వైఎస్సార్ త‌న‌యుడైన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీ ఈ ప‌రిణామం ద్వారా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి తెలుసు. తాను అమ‌లు చేసే వ్యూహం ప్రకారం జ‌గ‌న్ తిరిగి త‌న‌గూటికే చేర‌క త‌ప్ప‌ద‌ని అనుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యాల‌న్నీ ఘోర త‌ప్పిదాలుగా మారి పార్టీ దుస్థితికి కార‌ణ‌మ‌య్యాయి.

కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓటుబ్యాంకే వైసీపీకి పునాది

వైసీపీ పేరుతో సొంత కుంప‌టి పెట్టుకున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ ప‌రిణామాల‌ను, అవ‌కాశాన్ని తెలివిగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడ‌ర్‌ను గంప‌గుత్త‌గా సొంతం చేసుకుని ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ‌నేత‌గా ఆవిర్భ‌వించారు.2014 అసెంబ్లీ ఎన్నికలు: 175 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు షేర్ 2% కంటే తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికలు: ఓటింగ్‌లో పార్టీ ఉనికే కన్పించలేదు – రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ 1% లోపే. 2024 ఎన్నికలు: కాంగ్రెస్ పోటీ చేసినా, ఫలితాలు నామమాత్రమే. టీవీ చర్చల్లోనైనా పేరు వినిపించనంత స్థాయిలో వెనుకబడిపోయింది.

నాయకత్వ లోపం – నిస్సత్తువగా పునర్నిర్మాణం

విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు మిగల్లేదు. పార్టీ క్యాడ‌ర్ నిస్తేజంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన లోటును పార్టీ ఇప్ప‌టికీ పూడ్చుకోలేక‌పోయింది. అంతేకాదు.. వైఎస్సార్ హ‌యాంలో ఆయ‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇత‌ర నాయ‌కుల‌ను ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డం తాలూకు దుష్ప‌రిణామాల‌ను ఇప్పుడు అనుభ‌విస్తోంది. ఆయన వారసుడైన జగన్‌ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా నియ‌మించినా పార్టీ కోలుకుంటున్న సూచ‌న‌లు ఏమాత్రం కాన‌రావ‌డం లేదు.

భవిష్యత్ లో పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలేవీ..?

కేంద్రంలో వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోలేక‌పోవ‌డం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెనుశాపంగా మారింది. గ‌తంలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించిన స‌మ‌యంలోనూ ఏపీకి ఏమంత ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంలోని ఆంత‌ర్యం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీల్లో ఒక‌రైనా కొన్నిరోజుల‌పాటు ఏపీలో ప‌ర్య‌టించి గ‌తంలో పార్టీ త‌ర‌పున రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం స‌రిదిద్దుకునే అవకాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను కోర‌క‌పోవ‌డం వారి రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌గానే భావించాలి. ఏదేమైనా గ‌తంలో బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను క‌లిగిఉన్నరాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించే విధానాలు, స్థానిక నేతల ప్రోత్సాహం, ఓర్పుతో కేడర్ మళ్లీ తయారు చేయడం.. విభజనపై బాధ్యతను అంగీకరించి, ప్రజల్లో విశ్వాసం కలిగించగల సామర్థ్యం ఉన్న ఓ మానవీయమైన నాయకత్వం..ఇవన్నీ కలిస్తేనే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగలదు. కానీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ దిశ‌గా తొలి అడుగులు వేసే ప్ర‌య‌త్నం కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం వ‌హించిన పీసీసీ కార్యాలయాల్లో చురుకైన కార్యకలాపాలు లేవు. జిల్లాల్లో పాత నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.

ముగింపు మాట

ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రాజకీయ విశ్లేషకులు హాస్పాస్ప‌దంగా స్పందించే ప‌రిస్థితి ఉంది. అయితే, రాజకీయాల్లో శాశ్వతంగా ఇదే ముఖ‌చిత్రం ఉంటుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు క‌మ్యూనిస్టు పార్టీల‌ను క‌లుపుకుని ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మార‌గ‌లిగే గొప్ప అవ‌కాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయం మార్చుకుంటే పార్టీల త‌ల‌రాతలు తిరిగి రాయ‌గ‌ల‌రు. ఆ దిశ‌గా పార్టీ చేసే కృషి మాత్ర‌మే ప్ర‌జాద‌ర‌ణ‌కు ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌దు అందుకు త‌గిన సంస్కరణలు, కొత్త దారులు అవసరం. లేకపోతే “ఒకప్పుడు ఏపీని పాలించిన అభ‌య‌ హస్తచిహ్నం… ఇప్పుడు జాడలు మిగలని జ్ఞాపకమే..”! అన్న‌ట్టుగా చరిత్రలో మిగిలిపోతుంది.

ఎన్ఆర్ఐ లు అమరావతి వైపు చూడటంలేదు.. ఎందుకు?

ఎన్ఆర్ఐ లు అమరావతి వైపు చూడటంలేదు.. ఎందుకు?

అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని కూటమి అదేపనిగా చెపుతున్నా … ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐ లు సైతం అమరావతిలో భూములు , స్థలాలు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

వీడని జగన్ భయాలు: 175 అసెంబ్లీయే సీట్లకుగాను . . 164 చోట్ల కూటమి గెలుపొంది… జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినా ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంకా స్తబ్దన్గానే ఎందుకు ఉంది? కూటమి పాలనపై పెట్టుబడిదారులతో ఇంకా విశ్వాసం పెరగలేదా ? ”జగన్ అండ్ కో ఘోరంగా ఓటమిపాలైనా. రాష్ట్రంలో ఎక్కడ ఏ అరాచకాలకు పాల్పడతారోనన్న ఆందోళన ఇంకా కొన్ని వర్గాలలో ఉంది. దీనికి చంద్రబాబు జనంలో బలమైన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అమరావతిలో భూములు కొనుగోలు చేద్దామంటే . .. మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. కూటమి నేతలు మాటవరసకు భరోసా ఇస్తున్నా . .. జగన్ భయాలు మాత్రం మాలో ఇంకా పోవడంలేదు . ...” అని అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక NRI ‘అభిన్యూస్ ‘ ప్రతినిధితో తన అభిప్రాయం వెలిబుచ్చారు.

అమరావతిపై బాబు ఆటలు: 2014-2019 మధ్య అమరావతిని హంగులతో చూపించారు. కొంతవరకు పనులు చేసినా , ,, భారీ ప్రచారం దెబ్బకొట్టింది. చేసింది పావలా అయితే . ..రూపాయిన్నర పబ్లిసిటీ చేయడం అమరావతిపై నమ్మకంలేకుండా చేసింది. ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. అయితే ఇందులో అభివృద్ధి పనులు కనీసం 10-15 శాతం కూడా కాకుండానే . .. రెండో విడత విస్తరణ పేరుతో మరో 40 వేల ఎకరాల భూ సమీకరణకు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు , అమ్మకాలు లావాదేవీలలో స్తబ్దత ఏర్పడింది. కూటమి గెలుపుతో ఒక్కసారిగా జోరందుకున్న అమరావతి భూముల ధరలకు రెండోవిడత భూ సమీకరణ బ్రేక్ వేసింది.

పనులు అంతంతమాత్రం.. పబ్లిసిటీ మాత్రం.. చంద్రబాబుకు చేసిన దానికంటే ఎక్కువ చెప్పడం ముందు నుంచీ అలవాటు. ఇది కాస్త దెబ్బతీస్తుది.” కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది . . ఇంతవరకు గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్స్ అప్పగించలేదు. ఏడాది కాలం సరిపోలేదా ? ఇంత జాప్యం చేస్తుంటే జనంలో నమ్మకం ఎలా కలుగుతుంది.. ఈ ధోరణి మార్చుకోవాలి . …లేకపోతె అమరావతి వైపు పెట్టుబడులు వచ్చే పరిస్థితులు ఉండవు . ..” అని తుళ్లూరు ప్రాంతానికి చెందిన మురళి అనే యువకుడు అభిప్రాయపడ్డారు.

NRI ల పెట్టుబడులు హైదరాబాద్ లోనే . .. అమెరికా , బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా , కువైట్ , అబుదాబి , మస్కట్ , జర్మనీ , వంటి దేశాల్లో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)కు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఇది కూడా అమరావతిలో పెట్టుబడులు రాకపోవడానికి ఒక ప్రధాన కారనంగా చెప్పవచ్చు . కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ పెట్టుబుడులు పెట్టేందుకు హైదరాబాద్ నే మొదట ఎంపికగా ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. అయితే హైదరాబాద్ లో ఏడాదిన్నరగా రియల్ కుదేలైన కారణంగా అక్కడ కూడా పెట్టుబడులు ఆగాయి. కొంతమంది వారు పనిచేస్తున్న దేశాలలోనే ఇళ్ళు , భూములపై పెట్టుబడులు పెట్టడం ఇటీవల ఎక్కువయింది.

ఎన్ఆర్ఐ ల అనుమానాలను కూటమి సర్కార్ నివృత్తి చేయాలి. జగన్ వస్తే . . జగన్ వస్తే . … అనే స్లోగన్ కు మెజార్టీ ఎన్ ఆర్ ఐ లు భయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు , పవన్ వంటి నేతలు ఎన్ని చెప్పినా వాళ్లలో భరోసా కల్పించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారని ఒక సర్వేలో తేలింది. జగన్ పర్యటనల సందర్బంగా చేస్తున్న అరాచకాలకు కూడా జనంలోనూ , విదేశాలలో ఉండే మనవాళ్లలోనూ అనుమానాలు బలపడుతున్నాయి . దీనిపై పూర్తిగా కూటమి సర్కార్ వైఫల్యం అనే చెప్పలేం . .. జగన్ ధోరణిలో మార్పు రానంతవరకు . ..ఈ అనుమానాలు ఇలాగే కొనసాగుతాయి. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయ్ . దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ  సహకారం

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ సహకారం

జగన్ మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

తెలంగాణలో కవిత , ఢిల్లీలో సీఎం , డిప్ట్యూటీ సీఎంల అరెస్ట్ . .. జగన్ ని వదిలేసినట్లు ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం లో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఫోకస్ పెరిగింది. కూటమి సర్కార్ ఇప్పటికే మద్యం కుంభకోణంపై పలువురు కీలక నేతలపై కేసులు పెట్టడం , కొందరి అరెస్ట్ జరిగాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నేతలు , అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ పై కూడా మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . అయితే కేంద్రం పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో జగన్ వరకు వచ్చి . .. ఈ కేసు ఆగింది.

మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం – జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ పోస్ట్

జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాకూర్ ఆరోపించారు . వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణంపై మాణికం ఠాగూర్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, కుట్ర కోణాలు అంటూ పలు ఆరోపణలు చేశారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను జగన్‌ క్యాష్‌ క్యారియర్లుగా వాడుకున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో దాచారని మద్యం డబ్బుతో విదేశాల్లో లిక్కర్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పారని అన్నారు. ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు దుబాయ్, టాంజానియా, దక్షిణాఫ్రికాలో భేటీ అయ్యేవారని తెలిపారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉండి ఈ మద్యం కుంభకోణానికి సహకరించిందని మాణికం ఠాకూర్ విమర్శించారు . కేంద్ర బీజేపీ పెద్దల సహకారం లేకపోతె జగన్ ఎప్పుడో అరెస్టయ్యేవారని పేర్కొన్నారు .

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .

ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అడ‌వుల్లో భ‌ద్ర‌తా ద‌ళాల గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఒక మ‌హిళ స‌హా ముగ్గురు మావోయిస్టు కీల‌క నేత‌లు మ‌ర‌ణించారు. రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి ప్రాంతాల స‌మీపంలోని కొండ‌మొద‌లు, కొయ్య‌ల‌గూడెం, చింత‌కూరు వ‌ద్ద ఇరువ‌ర్గాల‌కు భీక‌ర కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన వారిని మావోయిస్టు అగ్ర‌నేత చ‌ల‌ప‌తిరావు భార్య అరుణ‌, గాజ‌ర్ల ర‌వి అలియాస్ ఉద‌య్‌, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చ‌ల‌ప‌తిరావు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా రాష్ట్రాల స‌రిహ‌ద్దులో జ‌రిగిన భ‌ద్ర‌తాద‌ళాల కూంబింగ్‌లో జ‌రిగిన కాల్పుల్లో మ‌ర‌ణించాడు.

కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో మూడు ఏకే 47 రైఫిల్స్ స‌హా భారీగా ఆయుధాల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. హ‌తుల్లో అరుణ మావోయిస్టు స్పెష‌ల్ జోన్ క‌మిటీ స‌భ్యురాలు కాగా గాజ‌ర్ల ర‌వి కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డ‌ర్ స్పెష‌ల్ జోన్ క‌మిటీ ఏసీఎంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జ‌రిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హ‌త్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. చ‌నిపోయిన‌వారి మృత‌దేహాల‌ను రంప‌చోడ‌వ‌రం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటీవ‌లికాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతమంతా ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు తాజా ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఒక‌ప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ‌, తూర్పుగోదావ‌రిజిల్లాల్లోని దండ‌కార‌ణ్య ప్రాంతం మావోయిస్టుల‌కు పెట్ట‌నికోట‌గా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌నుంచి ప‌లువురు యువ‌కులు ఈ ఉద్య‌మం ప‌ట్ల ఆకర్షితులై చేర‌డంతోపాటు, గ్రామాల్లో ప‌లువురు సానుభూతిప‌రులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్య‌మం బ‌లంగా విస్తరించింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు.. మావోయిస్టుల‌కు త‌ర‌చుగా కాల్పులు జ‌రుగుతూ ఇరువైపులా ప్రాణ‌న‌ష్టం జ‌రిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జ‌రుగుతున్న స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా తీవ్ర‌వాదులు స‌రిహ‌ద్దుల్లోని చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా ప్రాంతాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో త‌ర‌లిపోయి షెల్ట‌ర్ తీసుకునేవారు. త‌మ‌కు అనువైన స‌మ‌యంలో ఒక్క‌సారిగా విరుచుకుప‌డి ఎదురుదాడి చేసేవారు. ఈ కార‌ణంగానే వారిని ఎదుర్కోవ‌డం పోలీసుల‌కు పెనుస‌వాల్‌గా ఉండేది.

కొన్నేళ్ల క్రితం తీవ్ర‌వాద ఉద్య‌మం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో ఏవోబీలోను, బ‌స్త‌ర్ అడ‌వుల్లోనూ కూంబింగ్‌కు వెళ్లిన భ‌ద్ర‌తాద‌ళాల‌పై ఊహించ‌నివిధంగా చుట్టుముట్టి మావోలు భీక‌ర‌మైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బ‌లిమెల జ‌లాశ‌యంలో గ్రేహౌండ్స్ ద‌ళాలు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ‌పై మావోయిస్టులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు స‌హా మొత్తం 38 మంది మ‌ర‌ణించారు. 2010 ఏప్రిల్‌లో చ‌త్తీస్‌గడ్ రాష్ట్రంలోని చింత‌ల్నార్ వ‌ద్ద కూంబింగ్‌కు వెళ్లిన 200 మంది భ‌ద్ర‌తాద‌ళాల‌ను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చ‌క్ర‌వ్యూహంలో బంధించి జ‌రిపిన మార‌ణ‌హోమంలో 76మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జ‌రిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెల‌లో మ‌ళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వ‌స్తున్న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మందుపాత‌ర‌తో పేల్చి 10మందిని బ‌లిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్ర‌మే.

మావోయిస్టుల స‌మ‌స్యను బీజేపీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర హోం శాఖ‌.. మావోయిస్టు ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా ద‌ళాలు మావోల ప్రాబ‌ల్య‌మున్న రాష్ట్రాల పోలీసుల స‌హ‌కారం స‌మ‌న్వ‌యంతో వారున్న అట‌వీ ప్రాంతాల‌ను కొన్ని నెల‌లుగా ప్ర‌ణాళిక ప్రకారం జ‌ల్లెడ ప‌డుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని స్థాయిలో మావోల‌తో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గ‌త రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్ర‌నాయ‌క‌త్వంతో స‌హా రెండువంద‌ల‌మందికి పైగా భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్ట‌ర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వ‌చ్చిన‌ట్టు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆయుధాలు చేత‌బ‌ట్టి హింసావాదంతో వ్య‌వ‌స్థ‌ల‌ను మార్చవ‌చ్చ‌ని న‌మ్మే కాలం చెల్లిన ఆలోచ‌నావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాల‌ను గుర్తించ‌లేని పిడివాదం.. సామాన్య ప్ర‌జ‌ల్లో ఉద్య‌మంపై ఒక‌నాటి సానుభూతి క్ర‌మేణా క‌రిగిపోవ‌డం మావోయిస్టు ఉద్య‌మం బ‌ల‌హీన‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక‌ ప‌రిస్థితుల కార‌ణంగా యువ‌త‌కు అభివృద్ధి ఫ‌లాలు అంద‌డంతో కొత్త‌గా ఉద్య‌మం వైపు ఆక‌ర్షిత‌మ‌య్యేవారు క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మావోయిస్టు పార్టీ నేత‌లు తెలంగాణ‌లోనూ ఇటు ఏపీ, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి ఉద్య‌మాన్ని త‌మ స్వార్థం కోసం వాడుకున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఒక‌ర‌కంగా వారి వెన్నుపోటు పార్టీని త‌ప్పుడు మార్గం ప‌ట్టించింది. మావోయిస్టుల‌ను త‌మ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మ‌కంగా వాడుకున్న ఆ నేత‌లు తమ‌కు అధికారం ద‌క్కాక ఉద్య‌మాన్ని అంతం చేసేందుకు త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. ఉద్య‌మం బ‌ల‌హీనం కావ‌డం మొద‌లైంది ఆ కాలంలోనే. ప్ర‌జాస్వామ్య‌ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై పోరాడాల్సింది పోయి వ్య‌వ‌స్థ‌పైనే పోరాటం సాగిస్తామ‌న‌డం అర్థ‌ర‌హితం అవివేకం. మావోయిస్టు ఉద్య‌మం ఉత్ధాన ప‌త‌నాలు చెప్పే పాఠ‌మ‌దే. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించే ధైర్య‌మున్న అతికొద్దిమంది యువ‌త ప్ర‌జాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు న‌డిపించే నాయ‌కులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు ప‌ట్టి అడ‌విపాలై త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగిల్చారు.

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్‌. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో మొద‌లై ఆ త‌ర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచ‌కం విస్త‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద‌ర్యాప్తులో వెలుగుచూసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తోపాటు ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌ను కూడా నివ్వెర‌ప‌రచేవే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తోపాటు ప‌లువురుపారిశ్రామికవేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘ‌ట‌న‌లో బాధితులేన‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌ల కార‌ణంగా విలువ‌లు ఎంత‌గా దిగ‌జారిపోయాయో స్పష్టం అవుతోంది .

గ‌తంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో నాడు టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్‌రెడ్డిపై జ‌రిగిన స్టింగ్ ఆప‌రేష‌న్ ఓటుకు నోటు కేసు. రాజ‌కీయంగా అప్ప‌ట్లో అదో సంచ‌ల‌నం. తెలంగాణలో త‌మ పార్టీని శాశ్వ‌తంగా అంతం చేయాల‌ని జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌గా టీడీపీ ఆ ఘ‌ట‌న‌ను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మ‌చ్చ‌గా మిగిలింద‌నే చెప్పాలి. ఈ కేసు కార‌ణంగానే గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగ‌తి తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిక‌గా మ‌ర‌చిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్ర‌బాబునాయుడు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా హైదరాబాద్ ను వ‌దిలి ఏపీ నుంచే పాల‌న సాగించేందుకు సిద్ధ‌ప‌డ్డారన్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ స‌హాయంతో చేసిన కుట్ర‌గా భావించిన రేవంత్‌రెడ్డి ఆ త‌ర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయ‌న సీఎం అయిన నాటినుంచి గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గ‌ట్టిగా దృష్టి సారించారు. నాటి ప్ర‌భుత్వంలో దీనికి సంబంధించి ప‌నిచేసిన కీల‌క అధికారుల విచార‌ణ‌లో విస్తుగొలిపే అంశాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .