ఎన్ఆర్ఐ లు అమరావతి వైపు చూడటంలేదు.. ఎందుకు?

Abhi Correspondent

అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని కూటమి అదేపనిగా చెపుతున్నా … ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐ లు సైతం అమరావతిలో భూములు , స్థలాలు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

వీడని జగన్ భయాలు: 175 అసెంబ్లీయే సీట్లకుగాను . . 164 చోట్ల కూటమి గెలుపొంది… జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినా ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంకా స్తబ్దన్గానే ఎందుకు ఉంది? కూటమి పాలనపై పెట్టుబడిదారులతో ఇంకా విశ్వాసం పెరగలేదా ? ”జగన్ అండ్ కో ఘోరంగా ఓటమిపాలైనా. రాష్ట్రంలో ఎక్కడ ఏ అరాచకాలకు పాల్పడతారోనన్న ఆందోళన ఇంకా కొన్ని వర్గాలలో ఉంది. దీనికి చంద్రబాబు జనంలో బలమైన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అమరావతిలో భూములు కొనుగోలు చేద్దామంటే . .. మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. కూటమి నేతలు మాటవరసకు భరోసా ఇస్తున్నా . .. జగన్ భయాలు మాత్రం మాలో ఇంకా పోవడంలేదు . ...” అని అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక NRI ‘అభిన్యూస్ ‘ ప్రతినిధితో తన అభిప్రాయం వెలిబుచ్చారు.

అమరావతిపై బాబు ఆటలు: 2014-2019 మధ్య అమరావతిని హంగులతో చూపించారు. కొంతవరకు పనులు చేసినా , ,, భారీ ప్రచారం దెబ్బకొట్టింది. చేసింది పావలా అయితే . ..రూపాయిన్నర పబ్లిసిటీ చేయడం అమరావతిపై నమ్మకంలేకుండా చేసింది. ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. అయితే ఇందులో అభివృద్ధి పనులు కనీసం 10-15 శాతం కూడా కాకుండానే . .. రెండో విడత విస్తరణ పేరుతో మరో 40 వేల ఎకరాల భూ సమీకరణకు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు , అమ్మకాలు లావాదేవీలలో స్తబ్దత ఏర్పడింది. కూటమి గెలుపుతో ఒక్కసారిగా జోరందుకున్న అమరావతి భూముల ధరలకు రెండోవిడత భూ సమీకరణ బ్రేక్ వేసింది.

పనులు అంతంతమాత్రం.. పబ్లిసిటీ మాత్రం.. చంద్రబాబుకు చేసిన దానికంటే ఎక్కువ చెప్పడం ముందు నుంచీ అలవాటు. ఇది కాస్త దెబ్బతీస్తుది.” కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది . . ఇంతవరకు గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్స్ అప్పగించలేదు. ఏడాది కాలం సరిపోలేదా ? ఇంత జాప్యం చేస్తుంటే జనంలో నమ్మకం ఎలా కలుగుతుంది.. ఈ ధోరణి మార్చుకోవాలి . …లేకపోతె అమరావతి వైపు పెట్టుబడులు వచ్చే పరిస్థితులు ఉండవు . ..” అని తుళ్లూరు ప్రాంతానికి చెందిన మురళి అనే యువకుడు అభిప్రాయపడ్డారు.

NRI ల పెట్టుబడులు హైదరాబాద్ లోనే . .. అమెరికా , బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా , కువైట్ , అబుదాబి , మస్కట్ , జర్మనీ , వంటి దేశాల్లో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)కు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఇది కూడా అమరావతిలో పెట్టుబడులు రాకపోవడానికి ఒక ప్రధాన కారనంగా చెప్పవచ్చు . కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ పెట్టుబుడులు పెట్టేందుకు హైదరాబాద్ నే మొదట ఎంపికగా ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. అయితే హైదరాబాద్ లో ఏడాదిన్నరగా రియల్ కుదేలైన కారణంగా అక్కడ కూడా పెట్టుబడులు ఆగాయి. కొంతమంది వారు పనిచేస్తున్న దేశాలలోనే ఇళ్ళు , భూములపై పెట్టుబడులు పెట్టడం ఇటీవల ఎక్కువయింది.

ఎన్ఆర్ఐ ల అనుమానాలను కూటమి సర్కార్ నివృత్తి చేయాలి. జగన్ వస్తే . . జగన్ వస్తే . … అనే స్లోగన్ కు మెజార్టీ ఎన్ ఆర్ ఐ లు భయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు , పవన్ వంటి నేతలు ఎన్ని చెప్పినా వాళ్లలో భరోసా కల్పించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారని ఒక సర్వేలో తేలింది. జగన్ పర్యటనల సందర్బంగా చేస్తున్న అరాచకాలకు కూడా జనంలోనూ , విదేశాలలో ఉండే మనవాళ్లలోనూ అనుమానాలు బలపడుతున్నాయి . దీనిపై పూర్తిగా కూటమి సర్కార్ వైఫల్యం అనే చెప్పలేం . .. జగన్ ధోరణిలో మార్పు రానంతవరకు . ..ఈ అనుమానాలు ఇలాగే కొనసాగుతాయి. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయ్ . దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .

You May Also Like…