క్వాంటం వ్యాలీ… కథ తెలుసుకుందాం…

Rama Chandra P

ఏమిటి? ఈ క్వాంటం వ్యాలీ హడావుడి. చంద్రబాబు నాయుడు తరచూ చెపుతున్న దీని గురించి చాలామందికి తెలియదు . గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటుంటే కూడా చంద్రబాబు విజన్ ను అర్ధం చేసుకోకుండా కువిమర్శలు చేసిన వారి నోళ్లు మూయించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ హబ్ . క్వాంటం టెక్నాలజీలో పరిశోధన, ఇన్నొవేషన్ & స్కిల్స్ డెవలప్‌మెంట్‌కు ప్రపంచస్థాయి సెంటర్!

వీటి గురించి తెలుసుకుంటే … ఎవరైనా అడిగితె చెప్పడానికి ఉంటుంది . …

ఎందుకు?

– ఫ్యూచర్-రెడీ: క్వాంటం కంప్యూటర్లు వైద్యం, సెక్యూరిటీ, AIలో విప్లవం తెస్తాయి!

– ఆర్థిక పురోగతి: హై-టెక్ ఉద్యోగాలు, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షిస్తుంది.

– స్థానిక ప్రయోజనాలు:

🚜 వ్యవసాయం: నీటి/భూమి ఉపయోగ ఆప్టిమైజేషన్.

⚓ పోర్ట్‌లు (విశాఖ, కృష్ణపట్నం): కార్గో లాజిస్టిక్స్ స్మార్ట్‌గా నిర్వహణ.

🏥 ఆరోగ్యం: వైరస్‌లకు మందులు వేగంగా కనుగొనడం.

🔹 AP ప్రత్యేకత

– IIIT శ్రీ సిటీ, IIT తిరుపతితో కలిసి పని.

– తెలుగు యువతకు క్వాంటం స్కిల్స్ శిక్షణ. ఇవన్నీ సవ్యంగా జరిగితే రానున్న ఐదారేళ్లలో . …

 క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ గురించి . .. సామన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే. 90వ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే కూడా మెజార్టీ జనానికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్న వారే. ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది.

అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీని డీప్‌టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. క్వాంటం కంప్యూటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ ఏఐ సెమీకండక్టర్స్‌, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ దీని అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఐటీ సాఫ్ట్‌వేర్‌ సేవలకు భిన్నంగా కటింగ్‌-ఎడ్జ్‌ పరిశోధన, హార్డ్‌వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు గాను అమరావతిలో ఈ కేంద్రం కానుందని సర్కార్ చెబుతోంది.

అమరావతిలో 50 ఎకరాలను ప్రభుత్వం క్వాంటా0 వ్యాలీ కోసం కేటాయించింది. 2026 జనవరి 1 వ తేదీన వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నెల 30న క్వాంటం మిషన్‌ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్‌షాప్‌ను సర్కార్ నిర్వహిస్తోంది. రూ.4000ల కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది.

డీప్‌టెడ్‌ వ్యాలీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 1.5 మిలియన్‌ ఉన్నతస్థాయి ఉద్యోగాలు భవిష్యత్​లో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఆంచనా వేస్తోంది. క్వాంటం సైంటిస్టులు, రీసెర్చర్లు, క్వాంటం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, క్వాంటం హార్డ్‌వేర్‌ ఇంజినీర్లు, క్వాంటం-అవేర్‌ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, డొమైన్‌ నిపుణులు, సిస్టమ్‌ ఇంజినీర్లు, కమర్షియలైజేషన్‌ ప్రొఫెషనల్స్‌ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అమెరికా యూనివర్సిటీలో . ..

అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్‌లో భాగం కానుంది. 2023-2024 నుంచి 2030-2031 మధ్య 8 ఏళ్లలో రూ.6300 కోట్లకు పైగా జాతీయ క్వాంటం మిషన్‌ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డీప్‌టెక్‌ రీసెర్చ్‌ పార్క్‌కు సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమరావతి స్మార్ట్‌ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది.

క్వాంటం కంప్యూటింగ్‌ మార్కెట్‌ 2024లో 71.4 మిలియన్‌ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్‌ డాలర్లకు చేరే ఛాన్స్ ఉంది . ఈ అవకాశాన్ని అందింపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్‌ క్వాంటం లీడర్‌గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్‌ మార్కెట్‌లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌లో ఐబీఎం, టీసీఎస్​, ఎల్‌ అండ్‌ టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తోంది.

దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్‌ 156-క్యూబిట్‌ క్వాంటం సిస్టమ్‌-2ను ఐబీఎం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎల్ అండ్‌ టీ సంస్థ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు, హైబ్రిడ్‌ కంప్యూటింగ్‌ సొల్యూషన్‌లను టీసీఎస్​ అందించనుంది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, తయారీ రంగాల్లో క్వాంటం సామర్థ్యాలను టీసీఎస్ అనుసంధానిస్తుంది.

You May Also Like…