భారత్ దెబ్బ – పాకిస్తాన్ కే కాదు.. చైనా, అమెరికా ఉలికిపాటు

భారత్ దెబ్బ – పాకిస్తాన్ కే కాదు.. చైనా, అమెరికా ఉలికిపాటు

మేథావుల ముసుగేసుకున్న కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు గానీ...

కేవలం 24 నిమిషాలు.. పాకిస్తాన్ లో అన్ని ఉగ్రవాద తయారీ కేంద్రాలతోపాటు కీలక స్థావరాల ధ్వంసం. వందల ,వేల మంది మరణం. పైకి చెప్పుకోడానికి దాయాది దేశానికీ నోరు పెగలడం లేదు కానీ , . .పదిలక్షల కోట్ల విధ్వంసం…కోలుకోవడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.కీలకమైన తొమ్మిది ఎయిర్ బేస్ లు ధ్వ0సం. వాళ్ళ స్వీయ రక్షణ వ్యవస్థలు ధ్వంసం. ఆకాశ్, బ్రహ్మోస్ ల విలయ తాండవం వాళ్ళను సమర్థించే దేశాలకు సైతం వణుకు పుట్టించింది. పహల్గామ్ ఘటన తరవాత మోడీ ఎక్కడా నోరు మెదపకుండా మీటింగ్ లపై మీటింగ్ లు పెట్టడం చూసి చాలా మంది ఎన్నికల స్టంట్ అనుకున్నారు.

పాక్ లో కీలక స్థావరాలన్నింటినీ ధ్వ0సం చేయగలిగాం . దీనికి అమెరికన్ జిపియస్ కాకుండా మన సొంత శాటిలైట్స్ ద్వారా టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి…ఇస్రో ఉపగ్రహాలన్నింటినీ సరిహద్దుల వైపు ఫోకస్ పెట్టేదాకా వేచి చూసి…అన్నీ ఫర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టారు.(కార్గిల్ యుద్ధంలో పదాతి దళాలతో యుద్ధం చేయాల్సి రావడానికి కారణం అమెరికా వైమానిక దాడులకు జిపియస్ సహకారం నిరాకరించడమే) పాక్ లో ఆరాత్రి రెండు సార్లు ఎర్త్ కిక్ వచ్చిందన్నారు. అది ఎందుకో కొందరికే తెలుసు. పాక్ అణ్వాయుధ దేశం కావడానికి కారణమే చైనా…అమెరికా. వాళ్ళు ఆదేశంలో మొహరించి…దాచి పెట్టిన న్యూక్లియర్ వెపన్స్…పదార్థాలు గల కాంప్లెక్స్ లు…నేల మాళిగలకు మన బ్రహ్మోస్…ఆకాశ్ బొక్కలు పెట్టాయి. అది కాస్తా అక్కడ అణు ఇంధన లీకేజీకి కారణమయింది. అమెరికా, చైనా నిపుణులు కిరాణా హిల్స్ లో వాటిని డిఫ్యూజ్ చేసే పనిలోనే ఉన్నారు. దాంతో దాడులు నిలిపారు మనవాళ్ళు. ఎందుకంటే అణు లీకేజీ పెరిగితే లక్షల మంది పోతారు.ప్రపంచం ముంగిట మనం దోషులమవుతాం. గతంలోలా రోజుల తరబడి యుద్ధం చేయలేదన్న అసంతృప్తి నాబోటివాళ్ళకు కూడా వచ్చింది. కానీ మన సామర్థ్యం ప్రకారం మనోళ్ళు ఓ నాలుగైదు గంటలు చేస్తే చాలు…పాక్ దేశం ప్రపంచ పటంలో ఉండదు.

ఇప్పుడు ప్రపంచమే మన యుద్ధతంత్రానికి ఆశ్చర్య పడుతోంది. అమెరికా… చైనా ఇండియాను పాక్ ద్వారా దెబ్బతీయించి ఆనందపడదామనుకున్న ఆశలు నీరుగారిపోయి…వెంటనే చర్చలు కూడా జరుపుకున్నారు. పుతిన్ ని కూడా ప్రెజర్ చేయాలని చూస్తున్నారు. ఇకపై భారత్ మరింత అప్రమత్తతగా యుద్ధ సన్నాహాలు చేస్తుంది. లేజర్ ఆయుధాలతో స్టార్ వార్ కీ రఢీ అవుతుంది. ఇండియా గత పదేళ్ళుగా పాక్ ని కాకుండా చైనాను దృష్టిలో పెట్టుకునే యుద్ధ తంత్రం తయారు చేసుకుంటోంది. అది చైనాకూ తెలుసు. ఇక ట్రంప్ ప్రకటనలంటారా! తిరునాళ్ళలో రోడ్డుపై బూరలు , బుడగలు అమ్ముకునే వాడికీ వీడికీ తేడాలేదు. వాడి మాటలను వాళ్ళ దేశ జనమే నమ్మడం లేదు. పట్టూ పట్టూ వఛ్చినపుడు ఏమీ లేని స్థితిలోనే భారత్ అమెరికా మాట వినలేదు. మొన్న S400 రష్యా నుండి కొనొద్దనీ….ఆ డీల్ జరిపితే ఆంక్షలు విధిస్తామనీ…అమెరికా శతవిధాల ఆపడానికి ప్రయత్నించింది. అయినా కొనుక్కున్నాం. మన బ్రహ్మోస్…ఆకాశ్ లు పాక్ లో దీపావళి జరిపితే….వాళ్ళు పంపిన టర్కీ…చైనా పీసులను ఈ S400 తోపాటు…మన సొంత తయారీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సిస్టం కలిసి వచ్చిన వాటిని వచ్చినట్టే గాల్లోనే పేల్చి పడేశాయి.

పనిలో పని అమెరికా తయారీ f16 విమాలు రెండూ…చైనా విమానాలు కొన్నింటినీ ఖతం చేసారు మనోళ్ళు. చైనా…అమెరికా ఆయుధ వ్యాపారానికి మన 24 నిమషాల దాడి లక్షల కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. వాళ్ళ ఆయుధాలపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఇండియా ఆయుధ వ్యాపార మార్కెట్ పెరగనుంది. మన ఆయుధ కంపెనీల షేర్లు ఈ రెండు రోజుల్లోనే 15-20% పెరగడమే ఇందుకు తార్కాణం. మోడీ అమెరికా కు…ట్రంప్ కీ టైం చూసి వాత పెడతాడు. పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించబోతున్నాడు. చైనా వత్తిడిని తోసిరాజని మరీ వస్తున్నాడు. అక్కడ ఉక్రెయిన్ తౌ యుద్ధంలో ఆర్థిక ఇబ్బందులో రష్యా సతమతం అవుతోంది. అందుకే అనేక కీలక ఆయుధాలను ఇండియాకు అమ్మబోతున్నాడు. అందులో S500, కొన్ని అధునాతన యుద్ధ విమానాలు అందులో బాగమే.. ఇండియాతో ఏ వ్యవహారం అయినా ఏదేశానికైనా ఇంతకు ముందులా మాత్రం ఉండదు. రాఫెల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే…ఇటీవల జరిగిన మరిన్ని రాఫెల్స్ కొనుగోలుకు ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షిస్తారు. ఆపరేషన్ సింధూర్ ఏమీ ముగియలేదు. కాశ్మీర్ లోగానీ భారత్ లో గానీ చిన్న టపాసు పేలితే చాలు…ఇకపై దీపావళీ…ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటారు. జైహింద్….

ఏపీ మెట్రో . .. రయ్  రయ్

ఏపీ మెట్రో . .. రయ్ రయ్

తక్కువ వడ్డీపై అప్పు – ముందుకు వచ్చిన పలు సంస్థలు

విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్​ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విదేశీ బ్యాంకులు

ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి . ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా.. ఇప్పుడు వీటికి మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇవాళ ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.

విజ‌య‌వాడ‌లో ప్రతిపాదిత మెట్రో కారిడార్​ల‌ను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు ప‌రిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్​ల‌కు అయ్యే వ్యయంలో రూ.12,000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేసినట్లు తెలుస్తోంది.

విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజ‌య‌వాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు. త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్రదింపులు జ‌రుపుతున్నారు. త్వర‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చ‌ర్చలు జ‌ర‌ప‌నున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వేగంగా ముందుకు వెళ్తోంది.

విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్​కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్‌, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్‌, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్‌ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్‌ నిర్మించనున్నారు.

విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్​లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు .

మన  సామర్ధ్యానికి  మచ్చుతునక ‘బ్రహ్మోస్’

మన సామర్ధ్యానికి మచ్చుతునక ‘బ్రహ్మోస్’

భారత్ ను ప్రపంచంలో అగ్రగామి శక్తిగా చూపెట్టిన స్వదేశీ క్షిపణి

”దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, అందరికీ కడుపునిండా తిండి పెట్టడానికే తికానలేని దాయాది దేశం పాకిస్తాన్. మనపై అణుయుద్ధం చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతోంది. తీవ్రవాదులతో అరాచకాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి మనచేతిలో చావు దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించడంలేదు . .”

పాకిస్థాన్ భారత్ పై అణు ఆయుధాల ప్రయోగిస్తానని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ అణు నియంత్రణా కేంద్రం పక్కనే భారత్ సూపర్ సోనిక్ మిస్సైల్ “బ్రహ్మోస్” ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరిణామాన్ని పాకిస్థాన్ బ్లాక్ మెయిల్ కు భారత్ మౌన సమాధానంగానే దేశదేశాల దౌత్య వర్గాలు భావిస్తాయి. అణు ఆయుధాలు ఉన్న రెండు దేశాలు నేరుగా తలపడటం ప్రపంచంలో ఇదేమొదటి సారి.

భారత్ ఆయుధం “బ్రహ్మోస్” టార్గెట్ ప్రకారం పాక్ అణు నియంత్రణ కేంద్రం వరకూ వెళ్ళిన పరిమాణం పట్ల దేశదేశాల అధినేతలు నోరు మెదపకపోయినా మన సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్నారు.

భారత్ సాధనా సంపత్తిపై ప్రపంచం ఏమీ మాట్లాడకముందే అమెరికా ట్రంపు భారత్ అడగని “పెద్దన్న” బాధ్యతను నెత్తిన వేసుకుని “నా మాట విని యుద్దం ఆపేసిన భారత్ పాకిస్థాన్ లకు అభినందనలు” అని ట్విట్టర్ లో “అంతా నా వల్లే” అనే బిల్డప్ ఇచ్చారని అర్థమౌతుంది.

ఆపరేషన్ సిందూర్ లో కీలకమైన “బ్రహ్మోస్” ఆయుధం గురించి ఇక్కడ తెలుసుకుందాం!

బ్రహ్మోస్: భారత రక్షణ శక్తికి ప్రతీక

భారత్, రష్యా సంయుక్త సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఆధునిక యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుత విజయంగా నిలుస్తోంది. భారత డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రష్యా NPO మషినోస్ట్రోయెనియా సంస్థల సమన్వయంతో రూపొందిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే ఇపుడు వరల్డ్ వైడ్ మన రక్షణ సామర్ధాన్ని చాటి చెపుతోంది .

మాక్ 2.8 నుండి మాక్ 3 వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్, శత్రు రక్షణ వ్యవస్థలను అధిగమించగల సామర్థ్యంతో అసమానమైన శక్తిని ప్రదర్శిస్తుంది. 290 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల వరకు విస్తరించిన దాని పరిధి, భూమి, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుండి ప్రయోగించగల బహుముఖతతో, దీనిని యుద్ధ రంగంలో అప్రతిహత ఆయుధంగా నిలిపింది. అధునాతన గైడెన్స్ సిస్టమ్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ దీని స్టీల్త్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, అయితే “ఫైర్ అండ్ ఫర్గెట్” సూత్రం దాని ఖచ్చితత్వాన్ని 99.99% స్థాయికి పెంచుతుంది.

భారత్ రక్షణ సామర్ధ్యానికి ఆనవాలు

బ్రహ్మోస్ యొక్క వివిధ వెర్షన్‌లు—బ్రహ్మోస్-I, ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER), బ్రహ్మోస్-NG, హైపర్‌సోనిక్ బ్రహ్మోస్-II—భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా దాని సాంకేతిక పరిణామాన్ని సూచిస్తున్నాయి. మాక్ 8 వేగంతో 1,500 కిలోమీటర్ల పరిధిని లక్ష్యంగా చేసుకున్న బ్రహ్మోస్-II, హైపర్‌సోనిక్ యుగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపనుంది.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై వినియోగం బ్రహ్మోస్ యుద్ధ సామర్థ్యాన్ని స్పష్టం చేసింది. అంతేకాక, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల నుండి వస్తున్న ఆర్డర్లు, బ్రహ్మోస్ ప్రపంచ గుర్తింపును హైలైట్ చేస్తున్నాయి.

బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు—ఇది భారతదేశ రక్షణ సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణ, మరియు అంతర్జాతీయ సహకారం యొక్క సమ్మేళనం. దీని ఉనికి శత్రువులకు హెచ్చరికగా, మిత్రదేశాలకు భరోసాగా నిలుస్తోంది. బ్రహ్మోస్ ద్వారా, భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి గట్టిగా చెప్తోంది.

లక్ష్యాన్ని చూశారు…గురిచూసి కొట్టారు….శతృవు చేతులు ఎత్తేశాక… ఉగ్రవాదిని లేపెయ్యడమే…నువ్వు మా జాగా ఖాళీ చేసిపోవడమే… ఇక మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్…అని దిగ్బంధనం చేశారు. చుట్టూ బిగబట్టి శతృవుని కాళ్ళ బేరానికి రప్పించుకున్న చాణక్య నీతి చూపించారు. యుద్ధతంత్రంతో

భారత్ ను అజేయ శక్తిగా ప్రపంచం ముందు నిలబెట్టారు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయతకు జయహో జయహో జయహో. భారత్ మాతాకీ జై . ..

అమరావతి ‘చట్ట బద్ధత ‘  కోసం  ఏమి చేయబోతున్నారు ?

అమరావతి ‘చట్ట బద్ధత ‘ కోసం ఏమి చేయబోతున్నారు ?

సురక్షితమైన పరిపాలనా భవిష్యత్తు కోసం భవిష్యత్ లో ఆటంకాలు తలెత్తకుండా అమరావతి సేఫ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం


అమరావతికి చట్టపరమైన శాశ్వతత్వాన్ని పొందేందుకు వ్యూహాత్మక ప్రయత్నాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుంది, రాష్ట్ర స్వయంప్రతిపత్తి మరియు పరిపాలనా స్థిరత్వాన్ని సాధించడం మధ్య సున్నితమైన సమతుల్యతను ప్రతిబింబిస్తుంది .

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సుదీర్ఘ చర్చ కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంచడానికి ” ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014” ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చట్టం, 2014, సెక్షన్ 3లో వివరించిన విధంగా నోటిఫికేషన్ ద్వారా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడానికి రాష్ట్రానికి ఇప్పటికే అధికారం ఇస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్ట శాసన మద్దతు అవసరం లేకుండా రాష్ట్రాలు తమ రాజధానిని ఏర్పాటు చేసుకునే కార్యనిర్వాహక అధికారం ఉంది .

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజనను సులభతరం చేయడానికి రూపొందించబడిన పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రధానంగా ఆస్తి విభజన, బాధ్యతలు మరియు పరివర్తన ఏర్పాట్లను పరిష్కరించింది, వీటిలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తాత్కాలికంగా నియమించడం కూడా ఉంది.

మిగిలిన రాష్ట్ర రాజధానిని శాశ్వతంగా నిర్ణయించడానికి ఉద్దేశించబడలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సవరణ కోసం చేసిన అభ్యర్థన, ఇప్పటికే ఉన్న రాష్ట్ర యంత్రాంగాలు తగినంతగా ఉన్నప్పుడు కేంద్ర జోక్యాన్ని కోరడం వల్ల కేంద్రానికి కొత్త చిక్కులు వచ్చి పడతాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి .

జగన్ దెబ్బకు అమరావతి విలవిల

2015 లో విభాజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమర్ధించారు. 2019లో అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే జగన్ . .. మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు . దీంతో అమరావతిని పాతరేసినట్లయింది . ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది . పెట్టుబడిదారుల్లో , అమరావతి రైతులలో , జనంలోనూ జగన్ భయం వెంటాడుతూనే ఉంది. జగన్ మరోమారు అధికారంలోకి రాడన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలే అడుగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కూటమి నేతలకు జగన్ అధికారంలోకి రాడన్న భరోసా ఉన్నా జనాన్ని నమ్మించలేరనే విషయం గమనించాలి .


మూడు రాజధానుల నమూనా కోసం గత వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన – అమరావతిని శాసనసభ రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా మరియు కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదించారు . – విస్తృత నిరసనలు మరియు చట్టపరమైన సవాళ్లకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 తీర్పు అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ఘాటించింది, రాష్ట్రానికి దాని రాజధాని విధులను మూడుగా విభజించే శాసన సామర్థ్యం లేదని ప్రకటించింది. అయినా అప్పటి సీఎం జగన్ తన మొండి వైఖరితో మూడు రాజధానుల ముచ్చటను వదలకపోగా . . మరింత బలంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నించారు .

ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, అమరావతి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది, జూన్ 2024లో నాయుడు రాష్ట్రానికి రాజధానిగానే ఉంటుందని ప్రకటించారు. ఈ మార్పు ప్రజలు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఒక ఖచ్చితమైన అంశంగా సరిపోవడంలేదు . ఎందుకంటే దీనికి చట్టబద్దత లేదన్న డిబేట్ ఇంకా నడుస్తూనే ఉంది .

రెండవది, APCRDA చట్టం మరియు ఆర్టికల్ 162 కింద కార్యనిర్వాహక అధికారాలు అమరావతిని రాజధానిగా పేర్కొనడానికి చట్టపరమైన ఆధారాన్ని అందిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయాన్ని కేంద్ర చట్టంలో పొందుపరచడం భవిష్యత్తులో విధానపరమైన తిరోగమనాలకు వ్యతిరేకంగా బలమైన కవచాన్ని అందిస్తుంది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడానికి పార్లమెంటరీ ఆమోదం అవసరం, దీని వలన తదుపరి మార్పు రాజకీయంగా మరియు విధానపరంగా సంక్లిష్టమైన ప్రయత్నంగా మారుతుంది.


ఇది రాష్ట్ర స్థాయి రాజకీయాల అస్థిరత నుండి అమరావతిని రక్షించగలదు, ముఖ్యంగా రాజధాని కోసం విభిన్న దృక్పథాలతో ప్రభుత్వాలను మార్చిన రాష్ట్ర చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే. ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి $1.6 బిలియన్ల నిధులతో అమరావతి అభివృద్ధి యొక్క ఇటీవలి పునరుద్ధరణ, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించడానికి స్థిరమైన చట్రం యొక్క అవసరాన్ని మరింత నొక్కి చెబుతుంది.

మూడవదిగా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం చేసిన విజ్ఞప్తి, అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా చట్టబద్ధతను పెంచడానికి పార్లమెంటరీ చట్టం యొక్క అధికారాన్ని ఉపయోగించుకునే వ్యూహాత్మక ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. స్మార్ట్, స్థిరమైన పట్టణ కేంద్రంగా భావించబడిన ఈ నగరం, సింగపూర్ కన్సార్టియం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

అయితే, 2019 మరియు 2024 మధ్య ఈ ప్రాజెక్ట్ ఎదురుదెబ్బలను ఎదుర్కొంది, మూడు రాజధానుల ప్రతిపాదన రైతులకు యాన్యుటీ చెల్లింపులను నిలిపివేయడానికి, భూమిలేని కుటుంబాలకు పెన్షన్‌లను రద్దు చేయడానికి మరియు ప్రపంచ బ్యాంకు వంటి కీలక అంతర్జాతీయ భాగస్వాములను ఉపసంహరించుకోవడానికి దారితీసింది.

ప్రధాని మోదీ కూడా హామీ ఇవ్వలేదు . .

మే 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రారంభించారు . ఆ సందర్బంలో అమరావతికి చట్టబద్దత అంశంపై అయన ఎటువంటి హామీ ఇవ్వలేదు . ఈ ప్రభావం కూడా రాజధాని అమరావతి అభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తుందన్నది కాదనలేని అంశం . ఇప్పటికీ ఏపీ బీజేపీలో జగన్మోహన్ రెడ్డి అనుకూల నేతలు ఉన్నారు . వారి ద్వారా జగన్ అమరావతిని ఎంతోకొంత ఇబ్బంది పెట్టగలరని ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది జనం ఇప్పటికీ అనుమానంగానే ఉన్నారు.ఈ విషయంలో చంద్రభాబు నాయుడు మాటల ద్వారా ఇచ్చే భరోసాను ప్రజలు నమ్మలేరు . దీనిపై కూటమి సర్కార్ పూర్తిస్థాయిలో చట్టబద్దతపై కేంద్రం నుంచి పూర్తిస్థాయి భరోసా తీసుకోవాలి . లేకపోతే చంద్రబాబు ఎన్ని చెప్పినా అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న రీతిలోనే ఉంటుందని గుర్తించాలి

బిల్ గేట్స్ – 99 శాతం సంపద దానం చేస్తున్నారు

బిల్ గేట్స్ – 99 శాతం సంపద దానం చేస్తున్నారు

దీని వెలువ తొమ్మిది లక్షల కోట్ల పైమాటే . ..

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదంలో 99 శాతాన్ని పేదల కోసం వెచ్చించాలని నిర్ణయించారు . ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్‌కు (Gates Foundation) విరాళంగా ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్‌ను పూర్తిగా మూసెయ్యాలని నిర్ణయించుకున్నారు.గేట్స్ ఫౌండేషన్‌ను బిల్‌గేట్స్, మిలిందా 2000 సంవత్సరంలో స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్.

ప్రస్తుత లెక్కల ప్రకారం బిల్‌గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు. అలాగే దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి రాబోయే 20 ఏళ్లలో మరో 200 బిలియన్ డాలర్లు (రూ.16 లక్షల కోట్ల రూపాయలకు పైగా)ను కూడా ఖర్చుపెట్టబోతున్నారు. ఈ డబ్బును పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్‌కు ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ బఫెట్ కూడా భారీగా విరాళాలు అందజేస్తుంటారు.