మేథావుల ముసుగేసుకున్న కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు గానీ...
కేవలం 24 నిమిషాలు.. పాకిస్తాన్ లో అన్ని ఉగ్రవాద తయారీ కేంద్రాలతోపాటు కీలక స్థావరాల ధ్వంసం. వందల ,వేల మంది మరణం. పైకి చెప్పుకోడానికి దాయాది దేశానికీ నోరు పెగలడం లేదు కానీ , . .పదిలక్షల కోట్ల విధ్వంసం…కోలుకోవడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.కీలకమైన తొమ్మిది ఎయిర్ బేస్ లు ధ్వ0సం. వాళ్ళ స్వీయ రక్షణ వ్యవస్థలు ధ్వంసం. ఆకాశ్, బ్రహ్మోస్ ల విలయ తాండవం వాళ్ళను సమర్థించే దేశాలకు సైతం వణుకు పుట్టించింది. పహల్గామ్ ఘటన తరవాత మోడీ ఎక్కడా నోరు మెదపకుండా మీటింగ్ లపై మీటింగ్ లు పెట్టడం చూసి చాలా మంది ఎన్నికల స్టంట్ అనుకున్నారు.
కానీ మనల్ని పాక్ పై దాడులు చేయొద్దని…రెండు దేశాల మధ్యా అణు యుద్ధం జరుగుతుందనీ…పాక్ అన్నింటికీ తెగించి ఉందనీ….మీ అభివృద్ధి ఆగిపోతుందనీ…చైనా తన క్షిపణులు కొన్ని పాక్ లో మొహరించి తమ జిపియస్ ద్వారా ఇండియా లో కీలక స్థావరాలు పేల్చేయబోతోందనీ….అనేక వత్తిడులు. మొన్నటి పహల్గాం ఘటనకు కూడా ఉగ్రవాదులు చైనా జీపియస్ ని…చైనా శాటిలైట్ ఫోన్లే వాడారంటూ బెదిరింపులు. ఆఖరుకు పుతిన్ కూడా ఇప్పుడు యుద్ధం వద్దు. పాక్ కి పోయేదేం లేదు…ఇండియాకు చాలా నష్టం జరుగుతుందంటూ హితోక్తులు. ఈ నేపధ్యంలో అన్నీ అంచనా వేసుకుని...దేశ ప్రజల ఎమోషన్స్ ని పరిగణనలోకి తీసుకుంటూ….జస్ట్ టెస్ట్ మోనియల్ తరహా దాడి చేసారు. కరాచీ ఫోర్ట్ కొన్నేళ్ళపాటు పనికిరాకుండా పేల్చారు.
పాక్ కీలక స్థావరాలన్నీ మటాష్
పాక్ లో కీలక స్థావరాలన్నింటినీ ధ్వ0సం చేయగలిగాం . దీనికి అమెరికన్ జిపియస్ కాకుండా మన సొంత శాటిలైట్స్ ద్వారా టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి…ఇస్రో ఉపగ్రహాలన్నింటినీ సరిహద్దుల వైపు ఫోకస్ పెట్టేదాకా వేచి చూసి…అన్నీ ఫర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టారు.(కార్గిల్ యుద్ధంలో పదాతి దళాలతో యుద్ధం చేయాల్సి రావడానికి కారణం అమెరికా వైమానిక దాడులకు జిపియస్ సహకారం నిరాకరించడమే) పాక్ లో ఆరాత్రి రెండు సార్లు ఎర్త్ కిక్ వచ్చిందన్నారు. అది ఎందుకో కొందరికే తెలుసు. పాక్ అణ్వాయుధ దేశం కావడానికి కారణమే చైనా…అమెరికా. వాళ్ళు ఆదేశంలో మొహరించి…దాచి పెట్టిన న్యూక్లియర్ వెపన్స్…పదార్థాలు గల కాంప్లెక్స్ లు…నేల మాళిగలకు మన బ్రహ్మోస్…ఆకాశ్ బొక్కలు పెట్టాయి. అది కాస్తా అక్కడ అణు ఇంధన లీకేజీకి కారణమయింది. అమెరికా, చైనా నిపుణులు కిరాణా హిల్స్ లో వాటిని డిఫ్యూజ్ చేసే పనిలోనే ఉన్నారు. దాంతో దాడులు నిలిపారు మనవాళ్ళు. ఎందుకంటే అణు లీకేజీ పెరిగితే లక్షల మంది పోతారు.ప్రపంచం ముంగిట మనం దోషులమవుతాం. గతంలోలా రోజుల తరబడి యుద్ధం చేయలేదన్న అసంతృప్తి నాబోటివాళ్ళకు కూడా వచ్చింది. కానీ మన సామర్థ్యం ప్రకారం మనోళ్ళు ఓ నాలుగైదు గంటలు చేస్తే చాలు…పాక్ దేశం ప్రపంచ పటంలో ఉండదు.
ప్రపంచ దేశాల ఆశ్చర్యం
ఇప్పుడు ప్రపంచమే మన యుద్ధతంత్రానికి ఆశ్చర్య పడుతోంది. అమెరికా… చైనా ఇండియాను పాక్ ద్వారా దెబ్బతీయించి ఆనందపడదామనుకున్న ఆశలు నీరుగారిపోయి…వెంటనే చర్చలు కూడా జరుపుకున్నారు. పుతిన్ ని కూడా ప్రెజర్ చేయాలని చూస్తున్నారు. ఇకపై భారత్ మరింత అప్రమత్తతగా యుద్ధ సన్నాహాలు చేస్తుంది. లేజర్ ఆయుధాలతో స్టార్ వార్ కీ రఢీ అవుతుంది. ఇండియా గత పదేళ్ళుగా పాక్ ని కాకుండా చైనాను దృష్టిలో పెట్టుకునే యుద్ధ తంత్రం తయారు చేసుకుంటోంది. అది చైనాకూ తెలుసు. ఇక ట్రంప్ ప్రకటనలంటారా! తిరునాళ్ళలో రోడ్డుపై బూరలు , బుడగలు అమ్ముకునే వాడికీ వీడికీ తేడాలేదు. వాడి మాటలను వాళ్ళ దేశ జనమే నమ్మడం లేదు. పట్టూ పట్టూ వఛ్చినపుడు ఏమీ లేని స్థితిలోనే భారత్ అమెరికా మాట వినలేదు. మొన్న S400 రష్యా నుండి కొనొద్దనీ….ఆ డీల్ జరిపితే ఆంక్షలు విధిస్తామనీ…అమెరికా శతవిధాల ఆపడానికి ప్రయత్నించింది. అయినా కొనుక్కున్నాం. మన బ్రహ్మోస్…ఆకాశ్ లు పాక్ లో దీపావళి జరిపితే….వాళ్ళు పంపిన టర్కీ…చైనా పీసులను ఈ S400 తోపాటు…మన సొంత తయారీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సిస్టం కలిసి వచ్చిన వాటిని వచ్చినట్టే గాల్లోనే పేల్చి పడేశాయి.
మేడిన్ అమెరికా, చైనా విమానాలూ ఖతం
పనిలో పని అమెరికా తయారీ f16 విమాలు రెండూ…చైనా విమానాలు కొన్నింటినీ ఖతం చేసారు మనోళ్ళు. చైనా…అమెరికా ఆయుధ వ్యాపారానికి మన 24 నిమషాల దాడి లక్షల కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. వాళ్ళ ఆయుధాలపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఇండియా ఆయుధ వ్యాపార మార్కెట్ పెరగనుంది. మన ఆయుధ కంపెనీల షేర్లు ఈ రెండు రోజుల్లోనే 15-20% పెరగడమే ఇందుకు తార్కాణం. మోడీ అమెరికా కు…ట్రంప్ కీ టైం చూసి వాత పెడతాడు. పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించబోతున్నాడు. చైనా వత్తిడిని తోసిరాజని మరీ వస్తున్నాడు. అక్కడ ఉక్రెయిన్ తౌ యుద్ధంలో ఆర్థిక ఇబ్బందులో రష్యా సతమతం అవుతోంది. అందుకే అనేక కీలక ఆయుధాలను ఇండియాకు అమ్మబోతున్నాడు. అందులో S500, కొన్ని అధునాతన యుద్ధ విమానాలు అందులో బాగమే.. ఇండియాతో ఏ వ్యవహారం అయినా ఏదేశానికైనా ఇంతకు ముందులా మాత్రం ఉండదు. రాఫెల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే…ఇటీవల జరిగిన మరిన్ని రాఫెల్స్ కొనుగోలుకు ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షిస్తారు. ఆపరేషన్ సింధూర్ ఏమీ ముగియలేదు. కాశ్మీర్ లోగానీ భారత్ లో గానీ చిన్న టపాసు పేలితే చాలు…ఇకపై దీపావళీ…ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటారు. జైహింద్….



