వచ్చే పదేళ్లలో వ్యవసాయ0…

వచ్చే పదేళ్లలో వ్యవసాయ0…

వచ్చే పదేళ్లలో వ్యవసాయ భూమి ఉన్నవాళ్లు ప్రశాంతంగా బతకగలరు*.

*టెక్నాలజీ చాలా పెరుగుతుంది*.

*మనకు ఊళ్ళో భూమి ఉంటే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు పండించుకొని ఆహార భద్రత పొందవచ్చు*.

*ఇప్పుడు సిటీలో సంపాదించే ప్రతి రూపాయి ఖర్చు చేస్తే… ఇంకొన్నాళ్ళకి ఇదే ఉద్యోగం, సంపాదన ఉండవచ్చు… లేకపోవచ్చు*.

*వీలైనంత పొదుపు చేసి…ఎంత మారుమూల పల్లెలో ఐనా సరే నీటి వసతి చూసుకుని కొంత భూమిని కొనే ప్రయత్నాలు చేయండి*.

*అది ఎంత తక్కువ రేటుకు వస్తుంది… అభివృద్ధి కి ఎంత దూరంలో ఉంది అనేది పట్టించుకోకండి*.

*జీవితాంతం ఇదే సిటీ, ఇదే ఖర్చు లు… రిటైర్మెంట్ తర్వాత కూడా భరించాలి అంటే ఎంతో కష్టమో ఊహించండి*.

*మీరు ఆరోగ్యంగా ఉంటే ఎంత పల్లెల్లో ఉన్నా ఏమీ కాదు. చాలా మంది హాస్పిటల్స్ కోసం సిటీలో ఉంటున్నారు. మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి*.

*హెల్దీ గా ఉంటే ఎక్కడైనా హ్యాపీగా బతకవచ్చు*.

*మెట్రో సిటీస్ లో కోట్లు పెట్టి డబుల్, త్రిబుల్ బెడ్రూం లు కొనే బదులు… చిన్న పల్లెలో లక్షల్లో మంచి ఇల్లు కట్టుకోవడమే మంచిది*.

*లాంగ్ రన్ లో చాలా పనికి వస్తుంది*.

*యంత్రాలతో ఐనా సరే, వ్యవసాయం చేయించగలిగేవారికి మళ్ళీ భవిష్యత్ వస్తుంది*.

*బిర్యానీ లు, హోటల్ ఫుడ్, ఆల్కహాల్, పబ్లు, క్లబ్బులు*, *ట్రాఫిక్ జాం లు, పొల్యూషన్*,

*ఫాల్స్ ప్రెస్టేజ్ లు ఇవే లైఫ్* *అనుకునే వారికి ఈ పోస్ట్ అనవసరం*.

— నున్నా నవీన్ చౌదరి

ఆక్వా సాగు.. నిబంధనలు

ఆక్వా సాగు.. నిబంధనలు

తీర ప్రాంతంలో ఆక్వా సాగు.. నిబంధనలు తప్పనిసరి!

కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టం (CAA Act, 2005 – సవరణ 2023) ప్రకారం తీర ప్రాంతాల్లో ఆక్వాకల్చర్‌కు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

📍 హై టైడ్ లైన్ (HTL) నుంచి 2 కి.మీ పరిధిలో ఉన్న కోస్టల్ ఆక్వాకల్చర్ ప్రాంతాల్లో సంబంధిత నిబంధనల ప్రకారం CAA నమోదు తప్పనిసరి.

🚫 వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఆక్వా చెరువులుగా మార్చకూడదు.

🌱 మడ అడవులు (Mangroves) ధ్వంసం చేయకూడదు.

🌊 పర్యావరణపరంగా సున్నితమైన తీర ప్రాంతాలను రక్షించాలి.

చట్టబద్ధమైన ఆక్వా సాగు.. ఆరోగ్యకరమైన తీర ప్రాంతం.. సుస్థిరమైన భవిష్యత్తు.

💙 మన తీరాన్ని కాపాడుకుందాం.. బాధ్యతాయుతమైన ఆక్వా సాగును ప్రోత్సహిద్దాం.