ఉప్పాడ తీర0 రక్షణ చర్యలు – రూ.323 కోట్ల

ఉప్పాడ తీర0 రక్షణ చర్యలు – రూ.323 కోట్ల

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సముద్రకోటతో దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ తీరప్రాంతానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తాను…అని ఇచ్చిన హామీ పవన్ రెండేళ్లలోనే అమలులోకి తీసుకువచ్చారు.

సముద్ర కోతతో every Year దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పడింది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం నాడు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం, సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ చేయనుంది. రూ.323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉప్పాడ తీర ప్రాంత వాసుల సమస్యలను పట్టించుకోలేదు. ఎన్నికల ముందు హడావిడిగా సర్వేలు చేయించి మిన్నకుంది. ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ తీర ప్రాంతాన్ని పరిశీలించి, తాము అధికారంలోకి వస్తే రక్షణ గోడ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొలువు తీరాక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో సర్వే చేయించారు. వాకలపూడి-యు.కొత్తపల్లి మండలం అమినాబాద్‌ చేపలరేవు వరకు 14.5 కిలోమీటర్ల మేర రూ.323 కోట్ల అంచనాతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధుల మంజూరుకు హామీ పొందారు. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాస్‌తో బుధవారం నాడు ఒప్పందం జరిగింది.

తీరనున్న తీరప్రాంత వాసుల కల:

  • ఇప్పటికే సుబ్బంపేట సమీపంలో తీరం వెంబడి రహదారి కోతకు గురికాకుండా రూ.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత ఐదేళ్లలో ఉప్పాడ తీరంలో సముద్ర కోత కారణంగా సుమారు 400కు పైగా ఇళ్లు, 8 ఆలయాలు నేలమట్టమవగా, దాదాపు 14 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది.
  • గత 25 ఏళ్లుగా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు రాకాసి అలల ప్రభావానికి గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములూ కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో కలిపి 1360.75 ఎకరాల మేర కోతకు గురైంది. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డు నిరంతరం కోతకు గురయ్యేది. మరమ్మతులకు ఏటా రూ.కోట్లలో ఖర్చు అయ్యేది.
  • 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రూ.12 కోట్ల వ్యయంతో జియోట్యూబ్‌ నిర్మించారు. నాలుగేళ్ల వరకు గ్రామాలకు రక్షణ కల్పించింది. అనంతరం జియోట్యూబ్‌ మరమ్మతులకు గురవడంతో కాలం గడిచేకొద్దీ కనుమరుగైంది. దీంతో పదేళ్లుగా మళ్లీ కోత సమస్య తీవ్రమైంది. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ చొరవతో సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
మైనింగ్ పై కేంద్రం పెత్తనమే ఎక్కువ…

మైనింగ్ పై కేంద్రం పెత్తనమే ఎక్కువ…


పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రాల అధికారాలకు కత్తెర

ఖనిజాలపై పన్నులు విధించే మరియు గత బకాయిలను వసూలు చేసే రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.

ఖనిజ హక్కులు మరియు ఖనిజ నిక్షేపాలు కలిగిన భూములపై ​​పన్నులు, సెస్ మరియు ఇతర రుసుములను విధించే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను గణనీయంగా పరిమితం చేసే ‘గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, 2026’ను భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ ఆగస్టు 12న మరియు రాజ్యసభ ఆగస్టు 13, 2026న ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది.

ఈ సవరణ బిల్లు, కేంద్రం అనుమతి లేకుండా ఖనిజ హక్కులు మరియు ఖనిజ నిక్షేపాలు కలిగిన భూములపై ​​పన్నులు, సెస్ లేదా ఇతర రుసుములను విధించే రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నియంత్రిస్తుంది. అలాగే, రాష్ట్రాలు గతంలో పెండింగ్‌లో ఉన్న ఖనిజ పన్ను బకాయిలను వసూలు చేయడాన్ని ఈ చట్టం చెల్లనిదిగా చేస్తుంది; అదే సమయంలో, ఇప్పటికే వసూలు చేసిన పన్నులు మరియు రుసుములను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఏకరీతి మరియు స్థిరమైన పన్ను విధానాన్ని అమలు చేయడం, మైనింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు ఖనిజ ఉత్పత్తిని పెంచడం ఈ చర్య యొక్క లక్ష్యమని కేంద్రం పేర్కొంది.

షరతులను అంగీకరిస్తేనే హర్మూజ్​ ఓపెన్ : అమెరికాకు ఇరాన్ మెలిక

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న హర్మూజ్ వ్యవహారం సంక్లిష్టంగా మారింది. అమెరికా తమ షరతులను పూర్తిగా అంగీకరించిన తర్వాతే హర్మూజ్​ను తిరిగి తెరుస్తామని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్​జీసీ) స్పష్టం చేసింది. అలాగే హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు హర్మూజ్​లో అబుదాబికి చెందిన అడ్నాక్​ నౌకపై క్షిపణి దాడి జరిగింది.

హర్మూజ్‌ జలసంధి తెరవడం అనేది నిర్దిష్ట విధానాలు, షరతులకు లోబడి ఉంటుందని ఐఆర్​జీసీ ప్రతినిధి సర్దార్​ మొహెబీ తెలిపారు. ప్రాంతీయ చర్చల్లో అమెరికా జోక్యాన్ని నిలిపివేయాలని చేశారు. హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభానికి సంబంధించి తమ డిమాండ్లను అమెరికా అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మహమ్మద్‌ బాగెర్‌ కూడా పలు షరతులను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా బెదిరింపులను నిలిపివేయడం, సైనిక చర్యలను ఆపడం, గల్ఫ్‌ ప్రాంతం నుంచి ఆపరేషన్లలో పాల్గొంటున్న నౌకా, వైమానిక బలగాలను వెనక్కి తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఘర్షణల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని కూడా టెహ్రాన్ కోరుతోంది.

ఒమన్‌తో ఒప్పందానికి చేరువలో
ఇక హర్మూజ్​లో వాణిజ్య నౌకల రాకపోకలకు సంబంధించి ఒమన్​తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. కొత్త నౌకాయాన విధానంపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యనించారు. అయితే శాంతి కోసం చర్చలు జరిపినా, ఇరాన్ ప్రజల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దేశీయ సామర్థ్యాలు, ప్రజలపైనే తమ ప్రభుత్వం ప్రధానంగా ఆధారపడుతుందని పేర్కొన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పెజెష్కియాన్‌ ఆరోపించారు.