by Rama Chandra P | Nov 7, 2025 | పరిశీలన
ప్రతిరోజూ కొత్తగా 2,650 కొత్త వాహనాలు రోడ్డు మీదకు పరుగులు… బెంగళూరులో మొత్తం వాహనాలు కోటి 20 లక్షలు
బెంగళూరు ట్రాఫిక్ తో ఆ నగర ప్రజలకు , రోజు వచ్చిపోయే జనానికి నరకం కనిపిస్తోంది. వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నా . . అందుకు తగ్గట్లు రోడ్లను విస్తరించలేరు కదా …
కర్ణాటక స్టేట్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మహా నగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిడి . శాఖ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో వాహన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌తో పోలిస్తే 46 శాతం మేర పెరిగాయి. సెప్టెంబర్‌లో 56,831 వాహనాలు నమోదుకాగా, అక్టోబర్‌లో అది 86,014కు ఎగబాకింది. అంటే రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు 1,894 నుండి 2,774కి పెరిగాయి – ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యధిక నెలవారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు.ఈ పెరుగుదలలో ప్రధాన పాత్ర ద్విచక్ర వాహనాలదేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ సుమారు 1,900 బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అదనంగా రోజుకి 514 కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో నమోదైన వాహనాల మొత్తం సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. ఇందులో 83.8 లక్షల ద్విచక్ర వాహనాలు, 24 లక్షల కార్లు ఉన్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే ఓ ఏడాది కాలంలోనే బెంగళూరు రోడ్లు వాహనాలతో కిక్కిరిసి . .. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడం ఖాయం . స్కూల్స్ , కాలేజీలు టైమింగ్స్ లో మార్పులు చేపట్టడం , సాఫ్ట్ వేర్ ఆఫీసులు సమయాలలో మార్పులు వంటివి చేపట్టడం ద్వారా కొంతవరకు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవచ్చు . దీనికంటే ముందు వాహనాలు సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది .
by Abhi Correspondent | Nov 1, 2025 | జనరల్, పరిశీలన
భారత్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ సర్కార్ ప్రచారం . . అమెరికన్ యువతను రెచ్చగొట్టే రీతిలో పబ్లిసిటీ . .
టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు దక్కుతాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం స్థానికతను తెరపైకి తేవడం ద్వారా అమెరికన్ల హృదయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవాలని వేస్తున్న ఎత్తులు అన్నీ , ఇన్నీ కావు .
ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ ఉద్యోగాల విధానంపై దృష్టి మరింత పెట్టింది. తాజాగా అమెరికా కార్మిక శాఖ (U.S. Department of Labor) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక కొత్త వీడియో ప్రకటన ఈ మార్పును బలంగా ప్రతిబింబిస్తోంది. American Dream Stolen అనే శీర్షికతో విడుదలైన ఈ ప్రచారం, కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చూపుతోంది . , తక్కువ వేతనాలపై విదేశీ కార్మికులను నియమించడం ద్వారా యువ అమెరికన్ల అవకాశాలను హరించాయని ఆరోపిస్తూ . .. ఇందులో ఉంది . ఇలాంటి వాటిని భారత్‌ను ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లబ్ధిదారుగా హైలైట్ చేస్తుండటం గమనార్హం . ప్రస్తుతం జారీ అయ్యే H-1B వీసాల్లో సుమారు 72 శాతం భారతీయ పౌరులకే వెళ్తున్నాయని, ఇది టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అత్యధికమని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రకటనలో స్పష్టంగా చెప్పకపోయినా, వీడియోలో చూపించిన గణాంకాలు, టెక్స్ట్‌లు భారతీయ ఐటీ నిపుణులను లక్ష్యంగా చేస్తున్నట్లు అర్ధం అవుతోంది .
1950ల కాలం నాటి అమెరికా దృశ్యాలను ఈ వీడియోలో చూపిస్తూ.. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న అమెరికన్లు, సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలు.. ”The American Dream was built on hard work and opportunity” అనే టాగ్ లైన్‌తో ప్రారంభమవుతుంది. కానీ తరువాతి సెకన్లలో ”That dream was stolen from young Americans” అనే పదాలతో అమెరికా యొక్క వీసా దుర్వినియోగం కారణంగా ఈ దేశంలో యువతకు అవకాశాలు కోల్పోయినట్లు.. వాటిని వేరేవాళ్లు ఎత్తుకుపోతున్నట్లు చూపిస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే.. అమెరికన్ కార్మికులను తక్కువ వేతనాలపై నియమించే విదేశీ వర్కర్లతో భర్తీ చేయకుండా కార్పొరేట్ కంపెనీలను అడ్డుకోవడం .. అని అక్కడివారు భావిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు . ”ఒక అమెరికన్ ఉద్యోగం ముందుగా ఒక అమెరికన్‌కే చెందాలి. మేము చట్టబద్ధమైన వలసలకు వ్యతిరేకం కాదు, దాని దోపిడీకి వ్యతిరేకం” అంటూ స్థానిక యువతలో చైతన్యం కలిగిస్తున్నామంటూ చెప్పుకుంటున్నారు .
by Abhi Correspondent | Oct 31, 2025 | పరిశీలన
వేగంగా బలపడి, అంత వేగంతో బలహీనపడిన ‘మొంథా’ వాతావరణ పెను మార్పులు
”మొంథా’, తుఫాను సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయి .. కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి . .” అంటూ వాతావరణ శాఖ అధికారులు సీరియస్ గా అప్రమత్తం చేశారు . కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది . అయితే తుపాను తన దిక్కును మార్చుకుంది . ఇలా ఎందుకు జరుగుతుంది . వాతావరణ అంచనాలకు తుపాను వంటి వైపరీత్యాలు అందకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయా ?
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.
by Srinivas Vedulla | Oct 8, 2025 | పరిశీలన, బిజినెస్
– మిడిల్ క్లాస్ కొనుగోళ్లు తగ్గుముఖం… దిగజారుతున్న ఆర్ధికం – 2027 లో రియల్ ఎస్టేట్ పతనం ?
- ఐటీ రంగం ఒడిదుడుకులే కాదు …. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలూ రియాలిటీకి దెబ్బే
”ఇరవై ఏళ్లపాటు అప్రతిహతంగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ శకం ముగియబోతోందా ? ఆ దూకుడుకు బ్రేక్ పడటమే కాదు . .. పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఐదారేళ్లుగా మందగమనం దేనికి సంకేతం ? ?? 2026, 2027 లలో రియల్ ఎస్టేట్ పతనం చూడబోతున్నామా ?
ఈ ప్రశ్నలకు ” ఔను … రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ పతనం చూడాల్సి వస్తుంది. ఇపుడు నుంచే జాగ్రత్తగా ఉండాలి . .. 2026లోనే రియల్ పతనం స్టార్ట్ అవుతుంది . అది 2027 నాటికి పీక్ కి వెళ్లబోతోంది . ..” అంటూ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి . అయితే కొన్ని సర్వే, ఏలాలసిస్ సంస్థలు మాత్రం ”2030 నాటికి ఇండియాలో రియల్ ఎస్టేట్ పతాక స్థాయికి వెళ్లబోతోంది . ..” అంటూ జీడీపీ పెరుగుదల , భారత్ లో జనాభా వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అంచనాలు వేస్తున్నాయి . అయితే ప్రస్తుత అస్తవ్యస్త విధానాలు , మెజార్టీ ప్రజల (70 శాతం ) కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు .
ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా . .. అవి ఇతర దేశాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి . రష్యా -ఉక్రెయిన్ యుద్ధం , ఇరాన్ – ఇరాక్ వార్ . .. అమెరికాలో ఆర్ధిక సంక్షోభ0, ట్రంప్ టారిఫ్ ల సంక్షోభం వంటివన్నీ మన సమాజంపై, మన ఆర్ధిక స్థితి – గతములపై కూడా అత్యంత ప్రభావం చూపుతున్నాయి .
ఐటీ భూమ్ సంక్షోభం వల్ల NRI ఇన్విస్ట్మెంట్స్ తగ్గుముఖం పట్టాయి . , ట్రాంప్ టారిఫ్ సంక్షోభం . .. వల్ల గోదావరి జిల్లాలలో ఆక్వా పరిశ్రమ బెంబేలెత్తిపోతోంది . ఈ ప్రభావం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తీవ్రంగా పడింది . ఇది కూడా రియల్ పై ఎఫెక్ట్ చూపుతోంది .
ఐటీ భూమ్ తగ్గడం : గ్లోబల్ వైజ్ ఐటీ రంగం ఒడిదుడుకుల ప్రభావం మన దేశ ‘రియల్ ఎస్టేట్ ‘ రంగంపై తీవ్రంగా పడుతోంది . ముక్యంగా దక్షిణాదిలో రియల్ భూమ్ ఎక్కువ . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అధికంగా ఉన్నారు . దేశీయంగాను , విదేశాలలోని సౌత్ ఇండియా వారు ఎక్కువగా ఐటీ, ఫార్మా రంగాల నుంచి ఆర్జిస్తున్నారు . వీరి ఆదాయంలో 50-60 శాతం రియల్ ఎస్టేట్ పైనే పెట్టేవారు . గడచినా ఐదారేళ్లుగా ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. 2024-2025 నుంచి ఈ మార్పు మరింత స్పష్టంగా ఉంటోంది .
ధరలు బాగా ఎక్కువ : హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ , విల్లాలు , ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ధరలు వాస్తవ పరిస్థితులకంటే చాలా ఎక్కువ. చదరపు గజం 6-8 వేలు ఉండాల్సిన చోట . .. రూ 12-15 వేల వరకు అమ్మేవారు . 2005 నుంచి 2015 వరకు చాలా చోట్ల బిల్డర్స్ కి ఇది నడిచింది . అప్పట్లో కనస్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంటర్ అయిన వారు భారీగా ఆరగించారు . పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన . … ఇతర రంగాలలో ఉన్నవారు , అంత ఆర్ధిక స్తోమతలేకపోయినా అప్పులు చేసి . .. నిర్మాణ రంగంలోకి వేలాదిగా వచ్చేసారు . జనం అవసరాల కంటే అదనంగా అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది . ఈ ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ పై పడింది . అలాగే వెంచర్లలో కూడా భారీ ధరలు పెట్టి . .. NRI లను ఆకర్షించి . .. అధిక ధరలకు అమ్ముకున్నారు . ఈ మార్కెట్ కూడా 2019 వరకు బాగానే సాగింది . కరోనా దెబ్బతో వెంచర్ల బిజినెస్ డీలాపడింది .
జీడీపీ పెరిగినా…. భారత్ జీడీపీ వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్న ప్రచారం జోరుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తోంది . అయితే ఇదే సమయంలో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గింది . జీడీపీ పెరిగినా ఆ ఫలితాలు సామాన్యులకు అందడంలేదు . . .. పారిశ్రేమికవేత్తలు , బడా బాబులకు చేరుతున్నాయని చెప్పాలి . 70 శాతం ఉన్న సామాన్య జనం కొనుగోలు శక్తి గణనీయంగా గట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . ఈ ప్రభావం తయారీ రంగంపై పడుతుంది . ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ ని వెనక్కిలాగుతుంది.
బ్యాంక్ లపై ఎఫెక్ట్ . .. రియల్ ఎస్టేట్ మందగమనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపునుండి . లోన్లు తీసుకున్న బిల్డర్స్ చాలామంది అపార్టుమెంట్లు అమ్ముడుపోక తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు . హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో వేలకోట్ల బాకీలు బ్యాంకులకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు . ఈ ప్రభావం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది .
వెంచర్ల పరిస్థితి అగమ్యగోచరం … పట్టణాలు , పల్లెలు అన్న తేడా లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి వేసిన వెంచర్లో అమ్ముడుపోక ఖాళీగా ఉంటున్నాయి . ఉదాహరణకు రాజమండ్రి సమీపంలో పాలచర్ల , వెలుగుబండ , దివాన్ చెరువు , రాజానగరం , రాజవోలు , తదితర ప్రాంతాలలో 20 ఏళ్ల క్రితం వేసిన వెంచర్లలో సైతం అమ్ముడుపోని సైట్లు అనేకం ఉన్నాయి . వెంచర్లు వేసిన రియాల్తార్లు లాంచింగ్ ఆఫర్స్ , అనో మరో స్కీం పేరుతొ చాలా వరకు అమ్ముకున్నారు . వారి నుంచి కొనుగోలు చేసిన వారే రెండో సారి అమ్మడానికి కష్టం అవుతోంది . కొనేందుకు ఎవరు ముందుకు రాక . .. పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోతుంది .
‘రియల్ శకం ముగిసినట్లేనా ? ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా >? అంటే మెజార్టీ నిపుణులు ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని ఘంటాపదంగా చెపుతున్నారు . ఎన్ని స్థలాలు కొంటారు . … >? ఎన్ని ఫ్లాట్స్ కొంటారు > కొనడానికి సరిపడా ఆదాయాలు వస్తున్నాయా > భూముల ధరలు అమాంతం పెరిగాయి . అవి కొని అపార్ట్మెంట్స్ నిర్మించే బిల్డర్స్ కి కూడా ఇది పెనుభారంగా మారింది . ఈ ప్రభావం కూడా హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం . రాజమండ్రి , కాకినాడ , తదితర నగరాలలో నిర్మాణ రంగంపై గణనీయంగా పడింది . “” ఐదారేళ్లలో రియల్ ఎస్టేట్ ఇలాగే ఉంటుంది . ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గుతాయి . అయినా బిజినెస్ పుంజుకునే పరిస్థితులు వచ్చేలా లేవు . భవిష్యత్తులో వ్యవసాయ భూముల ధరలు కాస్త పెరుగుతాయి . 2030 నాటికి వ్యవసాయ భూముల ధరలు 50-60 శాతం పెరిగే ఛాన్స్ ఉంది . ..” అని రాజమండ్రికి చెందిన ఎనలిస్ట్ జె . చౌదరయ్య ”అభిన్యూస్ ‘ తో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు . రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 2000 నుంచి 2020 మధ్య ఇరవై ఏళ్లలో 15,650 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి . ఇందులో వెంచర్లు వేసిన రియాల్తర్లు 70-80 శాతం అమ్మేసుకున్నారు . కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్ మాత్రం . .. 20 శాతం కూడా రీ సేల్ చేయలేకపోయారు . .. అని రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్టర్ ఒకరు చెప్పారు .
by Abhi Correspondent | Oct 4, 2025 | పరిశీలన
ప్లాస్టిక్ … విచ్చలవిడిగా వాడితే పర్యావరణం దెబ్బతుంటుంది . . ఇదే కదా మనమంతా అనుకునేది . ఇదొక్కటే కాదు . పర్యావరణం దెబ్బతినేకంటే ముందు మనం దెబ్బతింటాం . ప్లాస్టిక్ విరివిగా వాడేవాళ్లు ఆరోగ్యాలు పెనుప్రమాదంలో పడతాయి . ఇది గమనిస్తే పర్యావరణం మాట పక్కనపెడితే ముందు మానవ ఆరోగ్యాలు కదా . …
ఒకప్పుడు మనం స్నానం చేయడానికి వాడే బక్కెట్ లు ఇత్తడివి ఉండేవి, లేదా అల్యూమినియం బక్కెట్ ఉండేవి ,, అవన్నీ చాలా మంచిదే
చాలా హుందా తనమే,
ఒకసారి కొంటె కొన్ని సంవత్సరాలపాటు అలానే ఉంటాయి కొన్ని సార్లు వారు వాడి వారి పిల్లలాకు కూడా ఇచ్చేవారు మరి అలాంటివన్నీ కనుమరుగయ్యి వాటి స్థానం లో
ప్లాస్టిక్ అనే భూతం వచ్చేసింది
ప్లాస్టిక్ బక్కెట్ లో వేడి నీరు పోస్తే అది కచ్చితం గా నీటిలో కలుస్తుంది,,
ఆలోచించామా . … లేదే . .
చక్క పీటలు. లేవు
స్టూళ్లు లేవు,
ప్లాస్టిక్ స్టూల్ వచ్చేసాయి, వాటిమీద కూర్చుంటే వేడి జనరేట్ అవుతుంది సీట్ కింద 
వెదురు బద్దలతో అల్లిన చాటలు . .. మెంతులు పేపర్లు నానబెట్టి చిక్కగా అలికిన అందమైన చాటలు, అల్లిక బుట్టలు పోయి
ప్లాస్టిక్ చాటలు వచ్చాయి
వంట గదిలో,
పప్పుల డబ్బాలు, పోపుల డబ్బాలు ఇత్తడివి, అల్యూమినియం, స్టీల్ వి విలువైనవి ఆరోగ్యాకరమైనవ వాటిని తోసేసి హానికలిగించే ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి పెట్టేసాము
పచ్చళ్ళు, కారాలు సంవత్సరమ్ పాటు నిల్వ చేసుకునే పింగాని, జాడీలు, మట్టి కుండలు పోయి #ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసాయి
అసలు ఎందుకు ఇలా మారామో కాస్త ఆలోచించండి
ఒక్కసారి కొంటె రొండు తరాలు లేదా మూడు తరాలు వాడగలిగే విలువైన వాటిని వదిలేసి
ఎప్పుడు కొనాల్సి వస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతిసే విషాన్ని మనం ఎందుకు కొంటున్నామో ఆలోచించండి
ఇదంతా మనకు తెలియకుండా మన మెదళ్ళలో జోప్పించే మార్కెట్ మాయాజాలం. కూడా ఉంది
నీకు ఏది అవసరమో తెలియని ముర్కత్వంమూ ఉంది
ఒకే వస్తువును వాడటం నామోషీ., కొత్తదనం పేరుతో మారిపోతుండాలనే వెర్రితనం.
దానివలన
ఆరోగ్య పరంగా. ఎంత నష్టాన్ని కలగచేస్తుందో ఆలోచించాలి
నీ నుండి పుట్టబోయే నెక్స్ట్ తరాన్ని నాశనం చేస్తుంది కదా
ఏది మనకు అవసరమో ఆలోచిస్తే
మన తరువాతీ తరాన్ని మనం కాపాడుకోగలుగుతాం . (ప్రక్రుతి వ్యవసాయ రైతు . .. విజయా … గారి వాల్ నుంచి )
by Rama Chandra P | Sep 24, 2025 | పరిశీలన
అమెరికా చదువులలో ఉన్న యువత ఆందోళన… ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో టెన్షన్
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలని కళలు కంటున్నా యువత కలలకు బ్రేక్ పడినట్లవుతోంది . టెక్ సంస్థలకు కూడా విదేశీ నిపుణులను అమెరికాలోని శాఖల్లో నియమించుకోవాలన్న కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టెక్‌సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. దీంతో ఇప్పడు అందరీ దృష్టి ఎల్-1, ఓ-1 పడింది. అసలు ఈ వీసాలు ఏంటి? వాటి ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి హెచ్-1బీ వీసా కీలకమార్గంగా ఉంది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును రూ.లక్ష డాలర్లకు ట్రంప్ సర్కార్ పెంచింది. దీంతో ఫీజు భారం ఎక్కువగా మారడంతో టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎల్-1, ఓ-1 వీసాలపై పడ్డాయి. పెరిగిన హెచ్-1బీ వీసా ఫీజుతో పోల్చుకుంటే వీటి ఫీజులు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. అటు దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కుడా హెచ్-1బీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నా వీటి ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. ఓ-1 వీసా కోసం 12 వేల డాలర్లు ఖర్చవుతుంది. వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసినవారిలో 93శాతం మందికి లభించింది. అదే హెచ్-1బీకి వచ్చిన దరఖాస్తుల్లో 73శాతం తిరస్కరణకు గురయ్యాయి.
ఎల్-1 వీసాలను బహుళజాతి సంస్థలు తమ విదేశీ శాఖల నుంచి అమెరికాలోని శాఖల్లో పనిచేయడానికి ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఎగ్జిక్యుటివ్స్, మేనేజర్లకు ఎల్-1ఏ, ఆ రంగంలో నిపుణులకు ఎల్-1బీ రకం వీసాలను జారీ చేస్తారు. అయితే ఎల్-1ఏ వీసా పొందే ఉద్యోగి సంస్థకు సంబంధించిన విదేశీ శాఖలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. అది కూడా ధరఖాస్తు చేసే నాటికి ముందు మూడేళ్లలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. కంపెనీ పేరంట్-సబ్సిడరీ బ్రాంచ్‌కి సంబంధం ఉండాలి. ఈ వీసా వస్తే భవిష్యత్తులో EB-1C గ్రీన్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆర్థికఏడాదిలో అమెరికా జారీ చేసిన ఎల్-1 వీసాల్లో 26శాతం భారతీయులకు దక్కాయి. ఓ-1 వీసాలు ఆర్ట్స్, సైన్స్, విద్యారంగం, వ్యాపారం, అథ్లెటిక్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే నాన్‌ఇమిగ్రెంట్ వీసా. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడ రంగంలోని వారికి ఓ-1ఏ వీసాలుజారీ చేస్తారు. కళలు, సినిమా, టెలివిజన్ రంగంలోని వారికి ఓ-1బీ జారీ చేస్తారు. దీనికి ఉన్న 8 ప్రమాణాల్లో కనీసం మూడింటినైనా అందుకోగలగాలి. ఈ వీసాను తొలుత మూడేళ్లకు జారీ చేసినా ఆ తర్వాత ఏడాది చొప్పున ఎంతకాలమైనా పొడిగిస్తారు. పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతేడాది 19,457 వీసాలను అమెరికా జారీ చేసింది. కాకపోతే హెచ్-1బీని భర్తీ చేసే స్థాయిలో ఇది ఉండదు. ఈ వీసా కోసం ఆయా రంగాల్లో అత్యంత నిష్ణాతుడిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.