అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

Abhi Correspondent

August 7, 2025

అమెరికా టారిఫ్​లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా? టారిఫ్​లు ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయా? తదితర విషయాల గురించి ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఏ అంచనా వేస్తున్నారు . అయన విశ్లేషణ ఏమిటి ??

‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’
అలాగే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలపైనా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చని వివరించారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది” అని సంజయ్ ప్రకటించారు.

ఆర్​బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. తక్కువ వృద్ధి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. “ప్రపంచ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ అనిశ్చితులు కొంత వరకు తగ్గాయి. ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు తక్కువ వృద్ధిని, ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంలో పెరుగుదలను కూడా చూస్తున్నాయి” అని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

కీలక విషయాలపై వివరణ
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి సంజయ్ వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రపంచ వాణిజ్య వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల వల్ల అది ఎలా ప్రభావితమవుతుంది? అనే విషయాలను వెల్లడించారు.

“రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర కీలక రేట్లు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 4, 5,6 తేదీలలో ఎంపీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పాలసీ రెపో రేటును 5.5శాతం వద్ద స్థిరంగా ఉంచడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. కొత్త డేటా, మారుతున్న దేశీయ, ప్రపంచ పరిస్థితులపై కమిటీ నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. తగిన ద్రవ్య విధాన విధానాన్ని రూపొందించడానికి ఇన్​కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై నిశితంగా నిఘా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది. దీని ప్రకారం, సభ్యులందరూ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు” అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.

You May Also Like…