by Rama Chandra P | Jul 16, 2025 | పరిశీలన, బిజినెస్
ఏపీకి రాజధానిలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ – క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ”క్వాంటమ్ వ్యాలీ”లోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకు రాగా తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా పరిశోధన కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి ..పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్దిరోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్‌ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ”క్వాంటమ్ వ్యాలీ” ఇండియాలోనే మొదటిది .
మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే భవనాన్ని నిర్మిస్టార్ . దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా? ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా? అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది.
శామ్‌సంగ్, యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీల్లో ఏది గ్లోబల్ మార్కెట్లను ఆకర్షిస్తుందో నని మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .
అమరావతి ”క్వాంటమ్ వ్యాలీ”లోకి మైక్రోసాఫ్ట్ అడుగిడితే గ్లోబల్ గా పేరున్న మరిన్ని సంస్థలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్ రప్పించి హైటెక్ సిటీలో వారి సంస్థ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవ ఆంధ్రప్రదేశ్ ని సాఫ్ట్ వేర్ వరల్డ్ లో దూసుకుపోయేలా చేసింది .
by Abhi Correspondent | Jul 15, 2025 | బిజినెస్
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్ సక్సెస్ స్టోరీ .. మహిళలకు మాత్రమే కాదు.. అందరికీ స్ఫూర్తి . .
చిరు ఉద్యోగం నుంచి అదే కంపెనీలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం వెనుక కఠోర శ్రమ , పట్టుదలతో ఆమె ఈ తరం వారికి ఆదర్శవంతంగా నిలుస్తోంది.
వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో వేలమంది ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. కొన్నివేల మంది చేస్తున్నారు. అయితే ఒకామె ఈ కంపెనీలోని కెరీర్ ప్రారంభించి . .. ఇదే కంపీనీ సిఈవో స్థాయికి ఎదిగారు . ఆ కంపెనీలో 30 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె.. ఎన్నో ఆటుపోట్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు..
ప్రియా నాయర్. చిన్న ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి ఎదిగిన ప్రియా నాయర్ సక్సెస్ నేటి తరానికి ఎంతో ఆదర్శవంతం. అనుచరణీయం . ..
ఆమె ప్రతీ అడుగులో అంకితభావం, ఎదురైన ప్రతీ సవాలును స్ఫూర్తిగా మలుచుకున్న ధైర్యం, ఆమె హృదయంలోని అచంచలమైన సంకల్పం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆమె విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు.. అకుంఠిత దీక్షతో శ్రమించే వారికి మార్గదర్శనం . ..
కంపెనీ వస్తువులను.. సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. ప్రియా నాయర్ మెదడులో వచ్చిన ఆలోచన ఆమెను సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా నిలిపింది. 2014లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. పైగా కోతలు ఎక్కువ. ఇక ఇంటర్నెట్ అంటే చాలా మందికి పరిచయమే లేదు. టీవీలు ఉన్నా.. చాలా గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. 1933లో ప్రారంభించిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అయితే అప్పటికే దేశంలోనే మంచి పేరున్న ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థగా కొనసాగుతోంది. ఇక ఈ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు కొనేవారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారే . దీంతో సంస్థ తీసుకువచ్చిన కొత్త ఉత్పత్తులను వారికి పరిచయం చేయడం ఎలా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కొత్త సీఈఓ అండ్ ఎండీగా నియమితులైన ప్రియా నాయర్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ సంస్థ 92 సంవత్సరాల చరిత్రలో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ ప్రియా నాయర్ కావడం విశేషం. 1995లో హెచ్‌యూఎల్‌లో చేరిన ప్రియా నాయర్.. ఇప్పుడు సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సంస్థలోని హోమ్ కేర్, బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్, పర్సనల్ కేర్ డిపార్ట్‌మెంట్‌లలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అనేక కీలక పాత్రలు పోషించారు. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. ఆ సంస్థకు చెందిన బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సీఎంఓగా ఆమె గ్లోబల్ బ్రాండ్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. హెచ్‌యూఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె లండన్‌లో నివసించేవారు. వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించడం, నీటిని తక్కువగా ఉపయోగించుకోవడం సహా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేందుకు అనుగుణంగా తమ కంపెనీ ఉత్పత్తులను ప్రియా తీసుకొచ్చారు.
”ప్రియా నాయర్ మనసుతో ఆలోచిస్తారు . ఎందుకంటే ఆమె ప్రచారం చేసిన బ్రాండ్‌లు అన్నీ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించేలా చూడటం ఆమె అలవాటు . …” అని సంస్థలో ఆమె గురించి బాగా తెలిసిన ఉన్నతోద్యోగులు చెపుతూ ఉంటారు . కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఈ మాటను అంగీకరిస్తారు .
by Rama Chandra P | Jul 9, 2025 | పరిశీలన, బిజినెస్
ఫార్మా ఉత్పత్తులపై 200శాతం,రాగిపై 50, సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్
భారత్‌పై భారీ ప్రభావం పడుతుందంటున్న నిపుణులు
తన పిచ్చి చేష్టలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారిఫ్‌లను విధించిన ట్రంప్, తాజాగా రాగిపై కూడా 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించేదిలేదని ట్రాంప్ క్లారిటీ ఇచ్చారు .
భారత్‌పై ప్రభావం ఏ మేరకు . ..
విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్‌కు ఎక్కువగా రాగి, ఔషదాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25లో ప్రపంచదేశాలకు 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి, దాని అనుబంధ ఉత్పత్తులను సరఫరా చేసింది భారత్. ఇందులో అమెరికా మార్కెట్లకు 360 మిలియన్ డాలర్లు లేదా 17 శాతంగా రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియా (26 శాతం), చైనా (18 శాతం) తర్వాత అమెరికాకు ఎక్కువ రాగి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశంగా మన దేశం మూడవ స్థానంలో ఉంది .
ఫార్మాకు గట్టి దెబ్బె . .. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీయనున్నాయి. రాగి ఉత్పత్తులతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం ఫార్మా రంగంపైనే ఎక్కువ పడనుంది. ప్రపంచ దేశాల్లో అమెరికాకే భారత్ ఎక్కువ ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేసింది. ఇది మునుపటి ఏడాది ఎగుమతులు 8.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతంగా ఉంది. ఫార్మా రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్‌ను కుదుర్చుకునే పనిలో భారత్ ఉంది. సుంకాల అమలు గడువు ఆగస్టు 1లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొత్త టారిఫ్ ల ప్రభావం భారత మార్కెట్లపై పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
by Abhi Correspondent | May 28, 2025 | తెలంగాణ, బిజినెస్
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా 200, 300 శాతం ధరలు కృత్తిమంగా పెంచేసి హైప్ చేసిన మార్కెట్లు ఎప్పటికైనా కిందకు దిగి వాస్తవ ధరలకు రావలిసి0దే కదా . …
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే గత పాలకులు కేసీఆర్, కెటిఆర్ వంటి వారి స్వార్ధ్య ప్రయోజనాల కోసం ఉన్న ధరలకు హెచ్చు చూపించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెడకు ఉరితాడు పడినట్లయింది .
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నాలుగైదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఇటీవల వరకు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాస్తవ ధరలతో పోలిస్తే మార్కెట్ ధర చాలా ఎక్కువ . . ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ – రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్‌లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక తెలిపింది . ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు మొదలయ్యాయి . అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారేళ్ళ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .
by Rama Chandra P | May 23, 2025 | బిజినెస్
చిన్న ఆశ్రమం పెట్టుకుని యోగా నేర్పించడం ప్రారంభించిన బాబా రాందేవ్ ఈ స్థాయికి చేరడానికి . ,?
స్వామి రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో పతంజలి సంస్థ సామాజిక వ్యాపారానికి కొత్త దిక్సూచి అనడంలో సందేహంలేదు . యోగ, ఆయుర్వేదం, స్వదేశీ ఉత్పత్తులతో స్వయం ఉపాధికి మార్గం చూపిస్తూ, లక్షల మందికి జీవనోపాధి కల్పి0చడమే రాందేవ్ మొదటి విజయంగా చెప్పవచ్చు . రైతుల నుంచి చిన్న పరిశ్రమల వరకు సమగ్ర అభివృద్ధికి ఈ మోడల్ మార్గదర్శకంగా మారింది.
యోగా గురువు బాబా రామ్‌దేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఇటీవల 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఆశాజనకమైన ఫలితాలను నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25 మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.358.53 కోట్ల నికర లాభాన్ని, 74 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.206.31 కోట్లు. మార్చి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,744.73 కోట్లుగా ఉండగా, 2023-24 ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,348.02 కోట్లుగా ఉంది.
బాబా రామ్‌దేవ్ యోగా, ఆయుర్వేదం , స్వదేశీ ఉత్పత్తుల ప్రజాదరణను ఉపయోగించి తన కంపెనీని రూ. 10,000 కోట్లకు పైగా విలువైనదిగా చేశారు. దీని వెనుక అనేక వినూత్న ఆలోచనలతోపాటు . … దేశభక్తి , అంకితభావం అసలైన కారణాలుగా చెప్పవచ్చు .
బ్రాండింగ్,మార్కెటింగ్: బాబా రామ్‌దేవ్ స్వయంగా పతంజలిని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రోత్సహించారు. వారు ఉత్పత్తులను ప్రచారం చేయడానికి టీవీ, సోషల్ మీడియా , వారి యోగా ప్రచారాన్ని ఉపయోగించారు.పతంజలి ఆయుర్వేద ఔషధాలను దాటి FMCG, కాస్టిక్ సోడా, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, విద్య , ఆరోగ్య సంరక్షణకు విస్తరించింది. ఆ విధంగా, బాబా రామ్‌దేవ్ తన పతంజలి కంపెనీని ప్రతిచోటా విస్తరించాడు. దీని వలన పతంజలి బాగా ప్రాచుర్యం పొందింది.
ఆయిల్ పామ్ పరిశ్రమ . .. కాకినాడ సమీపంలో 3 పామాయిల్ ఫ్యాక్టరీస్ ను పతంజలి ఆరేళ్ళ క్రితమే కొనుగోలు చేసింది . రుచి సొయా నుంచి రూ 1600 కోట్లకు ఈ డీల్ జరిగింది . ఇపుడు 25 వేల ఎకరల పామాయిల్ సాగు రైతులతో పతంజలి ఒప్పందం చేసుకుంది .
పతంజలి “ఫార్మ్ టు ఫార్మసీ” మోడల్ ద్వారా రైతుల నుంచి నేరుగా ఔషధ మొక్కలు కొంటోంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభిస్తోంది. చాలా మంది రైతులు రసాయనాలను వదిలేసి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లారు. ఇది వారి ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచింది.
పతంజలి చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)ను తోడ్పాటు ఇస్తూ స్థానిక తయారీదారులకు టెక్నాలజీ, బ్రాండింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ లభించేలా చేసింది. దాంతో వారు మార్కెట్‌లో పోటీ ఇవ్వగలుగుతున్నారు. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా పతంజలి నేరుగా ఉద్యోగాలను కల్పించగా, 10 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభం పొందుతున్నారు.
by Srinivas Vedulla | Apr 7, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్‌తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, టైటాన్, టీసీఎస్.
-
- కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి