ఏపీకి రాజధానిలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ – క్వాంటమ్ వ్యాలీలో పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ”క్వాంటమ్ వ్యాలీ”లోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకు రాగా తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా పరిశోధన కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి ..పరిశోధన కేంద్రం ఏర్పాటుపై కొద్దిరోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్‌ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ”క్వాంటమ్ వ్యాలీ” ఇండియాలోనే మొదటిది .
మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే భవనాన్ని నిర్మిస్టార్ . దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా? ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా? అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది.
శామ్‌సంగ్, యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీల్లో ఏది గ్లోబల్ మార్కెట్లను ఆకర్షిస్తుందో నని మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .
అమరావతి ”క్వాంటమ్ వ్యాలీ”లోకి మైక్రోసాఫ్ట్ అడుగిడితే గ్లోబల్ గా పేరున్న మరిన్ని సంస్థలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని హైదరాబాద్ రప్పించి హైటెక్ సిటీలో వారి సంస్థ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవ ఆంధ్రప్రదేశ్ ని సాఫ్ట్ వేర్ వరల్డ్ లో దూసుకుపోయేలా చేసింది .



