‘మొంథా’ ఎఫెక్ట్ – 107 రైళ్లు రద్దు – హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసిన రైల్వే
తుఫాను మంథా: ఆంధ్రప్రదేశ్‌లో రైలు, విమాన మరియు బస్సు సర్వీసులు ప్రభావితమయ్యాయి తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.
మొంథా తుపాను ముంచుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
తుఫాను మంథా దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు తీర రైల్వే అక్టోబర్ 28, మంగళవారం భద్రతా కారణాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి విశాఖపట్నం వరకు మరియు దాని గుండా వెళ్ళే అనేక రైలు సర్వీసులను రద్దు చేశాయి,
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయబడిన లేదా తిరిగి షెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాలను విడుదల చేసింది. తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న తుఫాను మంథా త్వరలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది, మంగళవారం రాత్రి నాటికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
రియల్ టైమ్ వాయిస్ అలర్ట్‌లు అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మోంతా తుఫాను హెచ్చరికల కోసం రియల్ టైమ్ వాయిస్ అలర్ట్‌లను తీరప్రాంత జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాలకు ప్రయోగాత్మకంగా అందజేస్తున్నట్లు తెలిపింది.
“విద్యుత్తు అంతరాయం సమయంలో కూడా, 360° హార్న్ స్పీకర్ సిస్టమ్ ఒక కిలోమీటరు వ్యాసార్థంలో స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాలకు విస్తరించనుంది” అని APSDMA తెలిపింది.
తూర్పు తీర రైల్వే రైలు యొక్క స్వల్పకాలిక ముగింపు/ స్వల్పకాలిక ప్రారంభాన్ని ప్రకటించింది.
అక్టోబర్ 27న హౌరా నుండి బయలుదేరిన రైలు నంబర్ 18005 హౌరా-జగ్దల్‌పూర్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ రాయగడ వద్ద స్వల్పకాలిక ముగింపును పొందుతుంది మరియు అక్టోబర్ 29న రాయగడ నుండి హౌరాకు 18006గా తిరిగి వస్తుంది. అందువల్ల, అక్టోబర్ 29న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు. రైలు నంబర్ 18448 హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28న జగదల్‌పూర్‌కు బదులుగా రాయగడ నుండి భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
రైలు నంబర్ 18108 ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28న జగదల్‌పూర్‌కు బదులుగా రాయగడ నుండి రూర్కెలాకు ప్రారంభమవుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన స్థితిని తనిఖీ చేయాలని ఆదేశించింది.
“ప్రస్తుత తుఫాను పరిస్థితులు మరియు #విజయవాడ, #విశాఖపట్నం మరియు #రాజమండ్రి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా, ఈ నగరాలకు మరియు వాటి నుండి విమాన కార్యకలాపాలు ప్రభావితమవుతాయి” అని X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
“విమానాశ్రయానికి వెళ్లే ముందు అన్ని వినియోగదారులు https://t.co/4fxgr5orzK వద్ద వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. జలదిగ్బంధనం మరియు ట్రాఫిక్ రద్దీని అంచనా వేస్తున్నందున, దయచేసి అదనపు ప్రయాణ సమయంతో మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. మీ భద్రత మరియు సౌకర్యం మా ప్రధాన ప్రాధాన్యత, దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి” అని అది జోడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన బస్సు సర్వీసులు మాత్రమే నడపాలని APSRTC మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు .
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ మరియు కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని IMD గుర్తించింది. ఇంతలో, రాబోయే తుఫాను దృష్ట్యా పొరుగున ఉన్న ఒడిశా కూడా హై అలర్ట్‌లో ఉంది.
సోషల్ మీడియా పుకార్లపై అధికారుల అలెర్ట్ . .. హుద్ . .హుద్ సమయంలో తీసిన వీడియోలను యు ట్యూబ్ లో పెడుతూ . .. కాకినాడలో అల్లకల్లోలం నెలకొందంటు కొందరు చేస్తున్న ప్రచారంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని పోలీసు అధికారులు వెల్లడించడంతో తప్పుడు ప్రచారాలకు కాస్త బ్రేక్ పడింది .
ఈదురుగాలులకు పలుచోట్ల కూలుతున్న చెట్లు
ఈదురుగాలులకు ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలుచోట్ల కూలుతున్న చెట్లు
కాకినాడ కలెక్టరేట్, సురేష్‌నగర్, బాలాజీ చెరువు వద్ద కూలిన చెట్లు
కాకినాడ సురేష్‌నగర్‌లో విరిగిపడిన రెండు విద్యుత్ స్తంభాలు
తుని పార్కు సెంటర్, రౌతులపూడి మం. ఎ.మల్లవరంలో కూలిన చెట్లు
కోనసీమ: అల్లవరం మం. బోడసకుర్రులో రోడ్డుపై కూలిన భారీ చెట్టు
క్రేన్లతో చెట్లు తొలగించి రాకపోకలు పునరుద్ధరిస్తున్న పోలీసులు
నారా లోకేష్ కి ప్రధాని మోదీ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం >???
నారా లోకేష్ . ఏపీ ఐటీ , విద్యాశాఖ మంత్రి. ఒక రాష్ట్ర మంత్రికి సాక్షాత్తు దేశ ప్రధాని , అందునా వరల్డ్ పాపులర్ లీడర్ మోడీ . .. ప్రత్యకంగా చూపుతున్న అభిమానం వెనుక ఏదైనా వ్యూహం ఉందా ?
నారా లోకేష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం, ఆత్మీయతల వెనుక కారణం ఏమై ఉండొచ్చు . దీని వెనుక విస్తృతమైన వ్యూహం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ఏ మేరకు వాస్తవికతకు తగ్గారగా ఉంది . . మిత్రపక్షాల్లో తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించడం ద్వారా కూటమిని బలోపేతం చేసుకోవడం దీని లక్ష్యం. ఈ నమూనాకు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ ఒక ఉదాహరణ. ఆయన మోదీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు. ప్రధాని పాదాలకు నమస్కరించారు. బదులుగా మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఫలితంగా చిరాగ్‌కు కీలకమైన కేంద్ర మంత్రి పదవి లభించింది. ఆయన పార్టీకి 5 ఎంపీలు ఉన్నారు.
మరోవైపు రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించారు. దీంతో జయంత్ ఎన్డీఏకు మద్దతు పలికారు. ఆయన పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇది రాజకీయ వారసత్వాలను గౌరవిస్తూ, వారిని కలుపుకుపోయే ఎత్తుగడ.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కును అందుకోలేకపోయింది. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పలేదు. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ కూటమిలో రెండో అతిపెద్ద పక్షంగా అవతరించింది. ఈ పరిణామం వల్ల చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో (మరోసారి) కింగ్‌మేకర్ అయ్యారు. ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీడీపీతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం బీజేపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ భవిష్యత్ నాయకుడైన లోకేష్‌కు మోదీ అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు.
లోకేష్ తన రాజకీయ బ్రాండ్‌ను సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణపై నిర్మించుకున్నారు. విశాఖపట్నంలో ₹1500 కోట్లతో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల కోసం లండన్, సింగపూర్ వంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించారు. ఆయన అభివృద్ధి మంత్రం, మోదీ ‘వికసిత భారత్’ ఆశయానికి దగ్గరగా ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను “డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్” అని లోకేష్ అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను బహిరంగంగా ప్రశంసించారు. ఈ విధేయత, విధాన సారూప్యత మోదీకి నచ్చింది. అందుకే కర్నూలు సభలో లోకేష్ దూరంగా నిలబడితే, “ఇక్కడికి రా” అని ఆత్మీయంగా పిలిచారు. ఈ బహిరంగ ఆమోదం లోకేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలున్న టీడీపీ అత్యంత కీలకం. అందుకే లోకేష్‌కు ప్రాధాన్యం ఎక్కువ. చిరాగ్ బంధం వ్యక్తిగత విధేయతపై ఆధారపడితే, లోకేష్‌తో బంధం విధానాల ఏకీభావనపై కూడా నిలిచింది.లోకేష్‌ను ప్రశంసించడం ద్వారా, అభివృద్ధి రాజకీయాలు చేసే వారసులకు తన మద్దతు ఉంటుందని మోదీ ఇతర ప్రాంతీయ పార్టీలకు సందేశం పంపుతున్నారు. ఇది సంకీర్ణ రాజకీయాల కొత్త నమూనా. వ్యక్తిగత ఆభిమానం వెనుక పక్కా రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
మోదీ-లోకేష్ బంధం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలున్నాయి. ఇది ఒక సహజీవన సంబంధం. ప్రభుత్వ స్థిరత్వం కోసం మోదీకి లోకేష్ అవసరం. జాతీయ స్థాయిలో గుర్తింపు, కేంద్రం మద్దతు కోసం లోకేష్‌కు మోదీ ఆశీస్సులు అవసరం. లోకేష్ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చనే సంకేతాలను ప్రధాని పరోక్షంగా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పుత్రోత్సాహానికి మించిన విజయం ఏ తండ్రకీ వుండదు. మోదీ అపురూపమైన ఈ మానవ సంబందపు ఆనందాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారు, మోడీ చేస్తున్న ఈ లాజిక్కు గురించి ఎవరు ఏమి చర్చుకున్నా … దేశరాజకీయ పరిస్తుతులలో పెను మార్పునకు కారణం అవుతుందా > అనేదానిపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి .
ఆంధ్రజ్యోతి ‘కొత్తపలుకు ‘ లో ఆర్కే రాసిన కధనం వాస్తవాలను ప్రతిబింబిస్తుంది . .
వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి . .. అభివృద్ధిలోనూ తనదైన బాణీని వదలడంలేదు . అంతర్జాతీయ ప్రతిష్టాత్మక టెక్ సంస్థ గూగుల్ . .. అమెరికా తర్వాత అంతటి స్థాయి సెంటర్ ని భారత్ లో . .. అందునా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే . .. అభినందించాల్సిన ప్రతిపక్ష నేత కుళ్ళుకోవడం ఆంధ్రప్రజల దురదృష్టం అనే చెప్పాలి .
ఆంధ్రజ్యోతి ‘ఆదివారం ‘ కొత్తపలుకు యధావిధిగా ఇక్కడ ఇస్తున్నాం.
మారీచ కుట్రలు
విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ద్వారా ఏఐ హబ్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుసకొడుతున్న…
విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సంస్థ ద్వారా ఏఐ హబ్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుసకొడుతున్న వేళ ఆ దేశానికి చెందిన గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక మైలురాయి. భారీ పెట్టుబడి సాధించినందుకు ‘ఆహా’ అని మురిసిపోవాలి. అయితే పునాదులు కూడా దాటని వైద్య కళాశాలల నిర్మాణాలను చూసి ‘ఆహా’ అని ఆశ్చర్యపోవాలని చెప్పుకొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అండ్ కో మాత్రం విషం కక్కడం మొదలుపెట్టారు. గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఏడుపులు లంకించుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పర్యటనలకు వెళ్లినప్పుడు పచ్చని చెట్లను నరికేసినా పర్యావరణం గురించి ఒక్క నోరు కూడా పెగల్లేదు. ఇంతటితో ఆగకుండా ప్రతిపాదిత డేటా సెంటర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. డేటా సెంటర్ అంటే సాదా సీదా గోడౌన్ లాంటిది అని, కంప్యూటర్లను లోపల పెట్టి బయటి నుంచి తాళాలు వేస్తారని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ అండ్ కోలో ఇంత మనోవికారం ఎందుకు ఏర్పడిందో అంతుపట్టదు. రాష్ర్టాభివృద్ధిని కాంక్షించే వారే అయితే తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబును మించి పెట్టుబడులు సాధిస్తామని చెప్పుకోవాలి. అలా కాకుండా పొరుగు రాష్ర్టాలకు ఈర్ష్యగా మారిన ఈ ఒప్పందంపై విషం చిమ్మడం ఏమిటి? దీన్నిబట్టి వారి మెదళ్లు ఎంత విషతుల్యం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ సంస్థ డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికాలోనూ భారత్‌లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ర్టీట్ జర్నల్ ఈ నెల 11న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్‌రెడ్డికి ఇలాంటి పెద్ద విషయాలు తెలియకపోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మద్దతుదారుల్లో అంతో ఇంతో చదువుకున్న వాళ్లు ఉన్నారు. వారికి కూడా తెలియకపోతే ఎలా? రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే చంద్రబాబుకు గానీ, ఐటీ మంత్రి లోకేశ్‌కు గానీ వ్యక్తిగతంగా లాభం ఏమీ ఉండదు. పెట్టుబడుల ఫలితాలను ప్రజలు అనుభవిస్తారు. హైదరాబాద్ మహానగరమే ఇందుకు నిదర్శనం. ఆహా అని మెచ్చుకోవాల్సిన సందర్భాలలో కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
గూగుల్‌తో ఒప్పందానికి సంబంధించిన వార్తను జగన్ మీడియా అస్సలు పట్టించుకోలేదు. అంటే సదరు రోత మీడియాకు రాష్ట్ర ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు.. జగన్‌రెడ్డి ప్రయోజనాల కోసమే ఆ మీడియా పనిచేస్తోందన్న మాట! ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏఐ హబ్ గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. అల్ప బుద్ధులు ఉన్న వారికి ఇది అర్థం కాదు. చేపలు, రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకొన్న వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. చేపలు, రొయ్యలను తాజాగా కొని తెచ్చుకొని తినవచ్చునని పులివెందుల ప్రజలు ఊహించారా? అని సెలవిచ్చిన జగన్‌రెడ్డి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము! ప్రభుత్వం సరఫరా చేసే విషతుల్యమైన మద్యం తాగుతూ చేపలూ రొయ్యలూ వండుకొని నంజుకుతింటూ కునారిల్లుతూ ఉండాలన్నది జగన్ అండ్ కో కోరిక. థింక్ బిగ్.. డ్రీమ్ బిగ్ అని దివంగత అబ్దుల్ కలాం చెప్పేవారు. జగన్ అండ్ కో నుంచి అంత ఆశించలేము. వినూత్న ఆవిష్కరణలు, భారీ పెట్టుబడుల గురించి ఆలోచించకపోయినా ఫర్వాలేదు– రాష్ర్టాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలపై మారీచ, సుబాహుల వలె నిప్పులు పోయడం ఏమిటి? సంక్షేమం పేరిట ప్రభుత్వం విసిరే మెతుకులు తింటూ జనం ఎదుగూ బొదుగూ లేని జీవితం గడపాలన్నదే జగన్ అండ్ కో అభిలాష. అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగానే అడుగులు వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి మొదలైంది. గూగుల్ నిర్ణయం తర్వాత మరెందరో ఏపీకి రావొచ్చు. ఇదే ఒరవడి కొనసాగితే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరుగుతుంది. అదే జరిగితే తమకు రాజకీయంగా నష్టమని భావిస్తున్న జగన్ అండ్ కో కుత్సితపు ఆలోచనలకు తెర తీశారు. కుట్రల అమలు మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండకుండా చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వమేవాహం అంటే త్వమేవాహం అనుకొనేలా కాకుండా జగన్‌రెడ్డికి భిన్నంగా చంద్రబాబు పనిచేయడం ఏమిటి? ఆయన ప్రయత్నాలు ఫలించడం ఏమిటి? కేంద్రం నుంచి సహకారం అందడం ఏమిటి? అని రగిలిపోతున్నారు.
ఆ చావులు మరిచారా?
‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టుగా అధికారంలో ఉన్నంత కాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోళ్లలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యాపారం జరుగుతోందని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి కల్తీ మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటాయి. కల్తీ సారా, కల్తీ మద్యం తాగి మన తెలుగునాటే కాదు, ఇతర రాష్ర్టాలలోనూ ఎంతో మంది మరణించిన సంఘటనలను చూశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, రాష్ట్రం విడిపోయాక గానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క జగన్మోహన్‌రెడ్డి మినహా మరే ముఖ్యమంత్రి కూడా మద్యం ద్వారా సొమ్ములు దండుకొనే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా మద్యం ద్వారా వెనుకేసుకోవాలని భావించలేదు. కాసులకు కక్కుర్తిపడి విషతుల్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘనత మాత్రం జగన్‌రెడ్డికే దక్కుతుంది. ఇప్పుడు కల్తీ మద్యం గురించి గగ్గోలు పెడుతున్న జగన్ అండ్ కో పాలనలో కల్తీ మద్యం సరఫరా కాలేదా? అంటే జంగారెడ్డిగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఆ మద్యం తాగి పలువురు మరణించిన విషయం అప్పుడే మరచిపోతే ఎలా? గతంలో ఏమి జరిగినా చర్యలు ఉండేవి కావు. ఇప్పుడు ములకలచెరువులో ఈ వ్యవహారం బయటకు రాగానే బాధ్యులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారుచేశానని ప్రధాన నిందితుడు జనార్దనరావు చెప్పారు. ఇందులో నిజానిజాలు త్వరలోనే బయటికొస్తాయి. పాపం పండే ప్రమాదం ఉందని తెలియడంతో జగన్‌రెడ్డి రోత మీడియా యథావిధిగా అభూత కల్పనలతో కథనాలను వండి వారుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రయత్నిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై మాజీ మంత్రి పేర్ని నాని విషం కక్కుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు జుగుప్స కలిగిస్తున్నాయని ఆయన నోరు పారేసుకున్నారు. నిజానికి ఒకప్పుడు సౌమ్యుడిగా పేరున్న నాని వైసీపీలో చేరిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు ఆయన ప్రవర్తన సంస్కారవంతంగా ఉండేది. జగన్‌రెడ్డితో చేతులు కలిపిన తర్వాత ఆయన ప్రవర్తన మారింది. మంచివాడు అనిపించుకున్న పేర్ని నాని వంటి వారు కూడా వివేకం మరచి విజ్ఞత లేకుండా మాట్లాడటం చూస్తుంటే వారు ఏదైనా వైరస్ బారినపడ్డారా అన్న అనుమానం కలుగుతుంది. లేని పక్షంలో మంచివాళ్లు కూడా జగన్ పక్షం చేరగానే హద్దూ అదుపూ లేకుండా ఎలా వ్యవహరించగలరు? కల్తీ మద్యం తయారీ అనేది అసాధారణ సంఘటన ఏమీ కాదు. అయితే జగన్ అండ్ కో దీనికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే, కారణం లేకపోలేదు. మద్యం ద్వారా నేను ఒక్కడినే సొమ్ములు వెనుకేసుకోలేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికే ఈ తాపత్రయం. అదే సమయంలో మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కూడా వారి లక్ష్యం కావచ్చు. జగన్‌రెడ్డి ఒక పార్టీకి అధిపతి కనుక ఇలాంటి ట్రిక్కులు చేయడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. చంద్రబాబుపై రాజకీయంగా బురద చల్లడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, రాష్ట్రంపై కూడా విషం చిమ్మాలనుకోవడం ఏమిటి? అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఈ క్రమంలో జగన్ అండ్ కో గత కొంత కాలంగా చేస్తున్న ప్రచారం, అమలు చేస్తున్న కుట్రలను పరిశీలిస్తే వారికి ఇలాంటి విషపూరిత ఆలోచనలు ఎలా వస్తాయో అని ఆశ్చర్యం వేస్తుంది.
కులాల కుంపట్లలో చలి కాచుకుంటూ..
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేయడం కూడా వారి హక్కు. అంతేగానీ జరగనిది జరిగినట్టుగా, ఏమీలేని చోట విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేయడం, కులాల కుంపట్లు రగిలించడం ఏమిటి? దారి తప్పిన రాష్ర్టాన్ని గాడిలో పెట్టాలంటే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్లు అధికారంలో ఉండాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం–జనసేన మధ్య విభేదాలు రాకపోతాయా? చంద్రబాబు–పవన్ కల్యాణ్ కొట్టుకొని విడిపోకపోతారా? అని జగన్ అండ్ కో ఇప్పటి వరకూ ఆశగా చూశారు. తాజాగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం– జనసేన మధ్య తగవులు పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్‌రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనమే పాటిస్తున్నారు. జనసైనికులకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలని సూచిస్తున్నారు. అయితే అవతల ఉన్నది జగన్ అండ్ కో! హుందాతనంతో కూడిన రాజకీయాలను ఆ గుంపు నుంచి ఆశించలేము. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వైషమ్యాల వల్ల ఒకరి హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. హత్య చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకేముందీ.. వైసీపీకి చెందిన రాబందులు వాలిపోయాయి.
కమ్మ–కాపు అంశాన్ని తెర మీదకు తెచ్చి వైషమ్యాల సృష్టికి చేయని ప్రయత్నం లేదు. నిజానికి హతుడు–హంతకుడు కొంత కాలం క్రితం వరకు సన్నిహితంగానే ఉండేవారు. కారణాలు ఏమైనా వారి మధ్య వైరం ఏర్పడింది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మదంతో విచక్షణ మరచి కారుతో తొక్కించి చంపాడు. జరిగినది హత్య అని తెలియగానే పోలీసులు ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడి తండ్రిని కూడా హత్యా నేరం కింద అరెస్టు చేశారు. ఇక్కడ కులాల గొడవ తలెత్తకూడదు. అయితే అలా వదిలేస్తే వారు జగన్ అండ్ కో ఎందుకవుతారు? వైసీపీకి మద్దతుగా ఉంటున్న కాపు సామాజికవర్గానికి చెందిన కొద్ది మంది అక్కడ వాలిపోయారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వీడియోలు వదిలారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వీరంగం వేస్తున్నారు. అధికారంలో ఉన్నది కమ్మ సామాజిక వర్గమని, అందుకే కాపులకు రక్షణ లేకుండా పోయిందని, సొంత సామాజిక వర్గాన్ని రక్షించుకోవడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విఫలమయ్యారని, కమ్మ వాళ్ల చేతిలో కాపులు మరోసారి మోసపోయారంటూ కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ముస్లిం మహిళకు వంగవీటి శిరీష అనే పేరు తగిలించి పోస్టులు పెట్టించారు. చౌదరి గారు ఆశపడితే నాయుడు తన భార్యను పంపకపోతే పరిణామం ఇలాగే ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలతో సదరు ఫేక్ ఐడీ ద్వారా పోస్టులను సోషల్ మీడియాలో తిప్పారు. రాజకీయాల్లో ఇంత నీచత్వం ఏమిటి? ఫేక్ ఐడీలతో ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నాలు చేయడాన్ని మించిన దురాగతం ఉంటుందా?
కూటమిలో చిచ్చు కోసం తహతహ!
ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు మరెక్కడైనా వ్యక్తుల మధ్య వివాదాలు ఏర్పడటం, ఘర్షణలు జరిగి హత్యలకు దారితీయడం కొత్త కాదు. అన్నదమ్ములే కొట్టుకు చస్తున్నారు. ఏ సంఘటనలోనైనా ఒకరు బాధితుడైతే మరొకరు నేరస్తుడవుతారు. కందుకూరులో కూడా ఇదే జరిగింది. అతడు కాపు.. చంపిన వ్యక్తి కమ్మ కావడం యాదృచ్ఛికం. ఈ దురాగతానికి పాల్పడిన వాడిని కాపాడటానికి ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ప్రయత్నించలేదు కదా? హంతకుడు జైల్లోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్‌ను అనేక విధాలుగా అవమానించడమే కాకుండా ఆయన నటించిన సినిమాలు కూడా నడవకుండా అడ్డుపడిన జగన్ అండ్ కో, ఇప్పుడు కాపులను రెచ్చగొట్టడం చూస్తే వారి ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలి. చంద్రబాబు–పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు సృష్టించాలి. ఇందుకోసం గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి ఐక్యంగా ఉంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న తమ కోరిక కలగానే మిగిలిపోతుందన్నది వారి బాధ. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు కమ్మ–కాపులు సఖ్యంగానే ఉండేవారు. వంగవీటి రంగా హత్యానంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి రంగప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే. ఇందులో ఆ రెండు కులాలకు చెందిన ఇతరుల ప్రమేయం ఏముంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులే కాదు కమ్మ వారు కూడా హత్యలకు గురయ్యారు. ఈ హత్యలకు స్థానిక పరిస్థితులే కారణం కానీ కులాలు కావు కదా? మెదళ్ల నిండా విషం నింపుకొని రాజకీయం చేయాలనుకుంటున్న జగన్ అండ్ కోను అర్థం చేసుకోవడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ రాజకీయాలకు మాత్రమే అలవాటుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి కూడా జగన్‌ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.
విచిత్రమేమింటే, జగన్‌రెడ్డి విషపూరిత ఆలోచనలు, కుట్రలను అమలుచేయడానికి ఆయనకు మనుషుల కొరత లేదు. అదేమిటో గానీ, జగన్‌ను సమర్థించేవారు గానీ, కుట్రల అమలులో పాలుపంచుకొంటున్న వారు గానీ విచక్షణ కోల్పోతున్నారు. అంతుపట్టని ఉన్మాదం వారిని ఆవహిస్తోంది. లేనిపక్షంలో జగన్ కోసం అడ్డమైన పనులూ చేసి ఇబ్బందులపాలవడానికి ఎందుకు సిద్ధపడతారు? చేసిన పాపాలకు జైలుకు వెళ్లి వచ్చిన వారిలో కూడా పశ్చాత్తాపం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం వారిలో కనిపించడం లేదు. దొరికిపోయినా ఫర్వాలేదు జగన్‌రెడ్డి కోసం జైలుకు వెళ్లడానికి, చివరకు చనిపోవడానికి కూడా సిద్ధపడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగోలా జగన్ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని కేక్‌లా కోసుకు తినవచ్చునన్న ఆశల్లో విహరిస్తున్నారు. కందుకూరు సంఘటనపై ఫేక్ ఐడీతో పోస్టులు పెట్టిన మహిళ కేవలం డబ్బుల కోసమే ఆ పని చేశారని భావించలేము. ఆమెను అంతకు మించిన ఉన్మాదం ఏదో ఆవహించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఈ బెడద పోవాలంటే పులివెందులను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి దానికి జగన్‌రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోతుందేమో! లేని పక్షంలో జగన్‌రెడ్డి వ్యాపింపజేస్తున్న వైరస్ ఇతర జిల్లాల ప్రజలకు సోకి మొత్తం రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్‌లో ఉంటూ జగన్‌కు మద్దతు పలికే వారికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పురోగమించడం నచ్చడం లేదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వచ్చినా, అభివృద్ధి జరిగినా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నవారు ఎవరూ విమర్శించలేదు. జగన్‌రెడ్డికి జలుబు చేస్తే తెలంగాణలో ఆయన మద్దతుదారులు ముక్కు చీదుకుంటూ ఉపశమనం కలిగించాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు. వాళ్లంతా జగన్‌రెడ్డి హయాంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినప్పుడు కళ్లు మూసుకొని ఆనందించారు.
ఇవాళ తన దాకా వచ్చేసరికి జగన్‌రెడ్డికి కూడా పత్రికా స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం ‘ఏబీఎన్’తో పాటు ‘టీవీ 5’ ప్రసారాలను నిలిపివేయించలేదా? శాసనసభ కార్యక్రమాలను కూడా కవర్ చేయకుండా ‘ఏబీఎన్’ను నిర్బంధించలేదా? సీఐడీ పోలీసులతో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక పైనా, సిబ్బందిపైనా కేసులు పెట్టించారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ కోర్టులకు హాజరవుతున్నాం కదా? అధికారం కోల్పోయిన తర్వాత కూడా మా సంస్థలను దూరం పెట్టడం నిజం కాదా? జగన్ కార్యక్రమాలు, వైసీపీ నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’లపై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా? చివరకు నాపై కూడా దేశ ద్రోహం సెక్షన్ల కింద కేసులు పెట్టారు కదా? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటున్న వాళ్లు అప్పుడు నోరు కట్టేసుకోవడానికి కారణం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అప్పుడు గుర్తుకురాలేదా? నీవు నేర్పిన విద్యనే నీరజాక్షా.. అన్నట్టుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని తప్పు పట్టే నైతిక హక్కు జగన్ అండ్ కోకు ఉందా? నాటి బాధితుల ఆక్రందనలు మీకు శ్రవణానందకరంగా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మీ ఆక్రందనలు కూడా ఇతరులకు అదే విధంగా శ్రవణానందకరంగా ఉంటాయని సరిపెట్టుకోండి. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అని అంటారు. నాడు అధికార మదంతో విర్రవీగినందుకు ఇప్పుడు ఫలితం అనుభవించాలి కదా? ఇప్పుడు అద్దెకు తెచ్చుకున్న గొంతులు మీకు అనుకూలంగా మాట్లాడవచ్చు.
మీకు మద్దతుగా మాట్లాడవచ్చు. అయితే అలాంటి గొంతులకు విలువ ఉండదు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పే ముందే ఆలోచించుకోవాలి. రేపు మనకూ అదే గతి పడుతుందని తెలుసుకోవాలి కదా? అప్పట్లో ‘ఏబీఎన్’ ప్రసారాల నిలిపివేతపై న్యాయస్థానాలు ప్రశ్నించగా, మాకేమి సంబంధం అని బుకాయించారు. అప్పుడు మీరు ఏర్పాటు చేసిన దారిలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న వారు నడిస్తే ఎలా తప్పు పట్టగలరు? సాటి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నది ఎవరు? ఇప్పుడు మీ మీడియాను కూడా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థిగానే భావించడంలో తప్పేముంది? అధికారం శాశ్వతం అని విర్రవీగిన వారికి ప్రకృతి గుణపాఠం నేర్పుతుంది. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దారుణం అని ఇప్పుడు ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే అవుతుంది. ఇప్పటికైనా జగన్‌రెడ్డి అండ్ కో బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. అలా కాకుండా తాము కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని నిత్యం గగ్గోలు పెట్టినా నిజం ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు. అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియాను అణచివేయడానికి ఎంత ప్రయత్నించినా మీ ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిజంగా తప్పు చేస్తే దాన్ని శిక్షించే విషయం ప్రజలే చూసుకుంటారు. అయితే ముందుగా మీ విశ్వసనీయత ఏపాటిదో తెలుసుకుంటే మంచిది. రాష్ర్టానికి మంచి జరిగినప్పుడు కూడా హర్షించలేని మనస్తత్వం ఉన్నవాళ్లను ఆ దేవుడే కాపాడాలి!
ఆంధ్రప్రదేశ్ సాంకేతికతను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే మార్గం
”హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు సమయంలో… ఇదెందుకు వేస్ట్ . .. అంటూ చంద్రబాబుపై కామెంట్స్ చేశారు . ఇపుడు తెలంగాణను ఆర్ధికంగా నిలబెట్టడంలో అది ఎంత ఉపయోగపడిందో మనందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది . .
రానున్న రోజులలో విశాఖలో గూగుల్ వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ కి జరిగే బహుళ ప్రయోజనాలను ఇప్పట్లో అంచనావేయడం కష్టమే . కానీ ప్రస్తుత సాంకేతిక విప్లవంలో గూగుల్ ఆంధ్రప్రదేశ్ యువతను ప్రపంచంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గం సుగమనం చేస్తుందనడంలో సందేహంలేదు .
భారతదేశ సాంకేతిక ప్రస్థానంలో ఒక సువర్ణాధ్యాయం గూగుల్ ఏర్పాటుతో ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, ఆంధ్రప్రదేశ్‌లోని సుందర నగరం విశాఖపట్నంలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటన, కేవలం ఒక పెట్టుబడిగా కాకుండా, దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక వ్యూహాత్మక ముందడుగుగా చెప్పవచ్చు . రాబోయే ఐదేళ్ల కాలంలో (2026-2030) సుమారు $15 బిలియన్ల (భారత కరెన్సీలో సుమారు ₹1.25 లక్షల కోట్లు) అంచనా పెట్టుబడితో రూపుదిద్దుకోనుండి .
అమెరికా అవతల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఏఐ హబ్ కావడం దీని ప్రాముఖ్యతను తెలియాచేస్తుంది .. ఈ బృహత్ ప్రణాళికలో దేశంలోని రెండు పారిశ్రామిక దిగ్గజాలు, అదానీ గ్రూప్ మరియు భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు కీలక భాగస్వాములుగా చేరడం, ఈ ప్రాజెక్ట్ యొక్క పరిధిని మరియు ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తూ, దీనిని కేవలం ఒక వాణిజ్య ఒప్పందంగా కాకుండా, భారతదేశం కోసం, భారతదేశంలో నిర్మిస్తున్న ఒక “చరిత్రాత్మక అభివృద్ధి”గా అభివర్ణించారు. ఈ మాటలు ఈ ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక దార్శనికతకు నిలువుటద్దాల నిలుస్తుంది .
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక డేటా సెంటర్ నిర్మాణం కాదు; ఇది ఒక సంపూర్ణ, స్వయం సమృద్ధ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ (Ecosystem). ఇందులో మూడు ప్రధాన, పరస్పర ఆధారిత విభాగాలు ఉన్నాయి. అవి:
అత్యాధునిక గిగావాట్-స్థాయి ఏఐ డేటా సెంటర్ క్యాంపస్: డీప్ లెర్నింగ్, ఏఐ మోడల్ శిక్షణకు అవసరమైన అపారమైన కంప్యూటింగ్ శక్తిని అందించే ఒక డిజిటల్ బిగ్ మెమరీ . ..
. అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే: భారతదేశాన్ని ప్రపంచ డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఒక నూతన, వ్యూహాత్మక ద్వారం.
హరిత ఇంధన మౌలిక సదుపాయాలు: ప్రాజెక్ట్‌కు అవసరమైన శక్తిని పూర్తిగా పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి చేసే ఒక పర్యావరణ హితమైన వ్యవస్థ.
అత్యాధునిక డేటా సెంటర్: భారతదేశపు డిజిటల్ మహా మెదడు. ఈ ప్రాజెక్టుకు గుండెకాయ వంటిది ఈ అత్యాధునిక డేటా సెంటర్. దీనిని మనం ఒక భారీ డిజిటల్ గ్రంథాలయం లేదా ఒక శక్తివంతమైన కృత్రిమ మెదడుగా ఊహించుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి అసంఖ్యాక సేవలకు సంబంధించిన అపారమైన సమాచారం (డేటా) ఎక్కడో ఒకచోట భద్రపరచబడాలి మరియు వేగంగా ప్రాసెస్ చేయబడాలి. ఆ క్లిష్టమైన పనిని నిర్వర్తించే అత్యంత సురక్షితమైన ప్రదేశమే ఈ డేటా సెంటర్.
ప్రాసెసింగ్ శక్తి: ఈ డేటా సెంటర్ కేవలం సమాచారాన్ని నిల్వ చేయడమే కాదు, దానిని అత్యంత వేగంగా, సమర్థవంతంగా విశ్లేషించి, కావలసిన ఫలితాలను అందిస్తుంది. ఉదాహరణకు, మీరు గూగుల్‌లో ఒక పదం టైప్ చేసిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది వెబ్ పేజీల నుండి మీకు అత్యంత సంబంధిత సమాచారాన్ని సెకనులో పదో వంతు కన్నా తక్కువ సమయంలో మీ ముందు ఉంచడం వెనుక ఈ డేటా సెంటర్లలోని లక్షలాది సర్వర్ల అపారమైన ప్రాసెసింగ్ శక్తి ఉంది.
TPU మరియు GPUల ప్రాముఖ్యత: ఈ డేటా సెంటర్‌ను సాధారణ డేటా సెంటర్ల నుండి వేరు చేసే ముఖ్యమైన అంశం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) పనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు (TPU), గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU) భారీ స్థాయిలో మోహరించడం. సాధారణ కంప్యూటర్లలో ఉండే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) అనేక రకాల పనులను చేయగలదు, కానీ ఏఐకి సంబంధించిన సంక్లిష్ట గణిత గణనలను (Complex Mathematical Computations) చేయడంలో నెమ్మదిగా ఉంటుంది.
దీనికి భిన్నంగా, TPUలు మరియు GPUలు ఏకకాలంలో వేలాది గణనలను సమాంతరంగా (Parallel Processing) చేయగలవు. మనుషుల మెదడులా ఆలోచించడం, నేర్చుకోవడం, చిత్రాలను గుర్తించడం, భాషలను అనువదించడం, భవిష్యత్తును అంచనా వేయడం వంటి క్లిష్టమైన పనులను ఇవి అత్యంత వేగంగా చేస్తాయి. ఈ శక్తితోనే నేటి చాట్‌జీపీటీ వంటి అధునాతన ఏఐ నమూనాలను అభివృద్ధి చేస్తారు. విశాఖలో ఈ స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల, భారతదేశంలోనే ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధన మరియు అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
సరళంగా చెప్పాలంటే: విశాఖపట్నంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లతో ఒక “డిజిటల్ బ్రెయిన్” రూపుదిద్దుకుంటోంది. ఇది భారతదేశ డిజిటల్ అవసరాలను తీర్చడమే కాకుండా, దేశీయంగా కొత్త ఏఐ ఆవిష్కరణలకు ఊపిరి పోస్తుంది. వైద్యం, వ్యవసాయం, విద్య, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఏఐ అప్లికేషన్లకు ఇది పునాదిగా నిలుస్తుంది.
అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే: ప్రపంచానికి నూతన డిజిటల్ ద్వారం
ఇంటర్నెట్‌ను ప్రపంచ దేశాలను కలిపే ఒక అదృశ్య మహా రహదారుల నెట్‌వర్క్‌గా భావిస్తే, ఈ రహదారులలో అత్యంత కీలకమైనవి సముద్ర గర్భంలో వేయబడిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ప్రపంచంలోని 99% పైగా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ఈ సబ్‌మరైన్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది.
గేట్‌వే యొక్క ప్రాముఖ్యత: ఈ సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ రహదారులు, భూమి మీదకు వచ్చి ఆ దేశంలోని టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యే ప్రదేశాన్నే “కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)” లేదా “గేట్‌వే” అంటారు. ఇవి ఒక దేశానికి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశ ద్వారాలు. వీటి ద్వారానే అంతర్జాతీయ డేటా దేశంలోకి ప్రవేశిస్తుంది మరియు దేశం నుండి బయటకు వెళుతుంది.
విశాఖలో ఎందుకు?: ఇప్పటివరకు భారతదేశంలో ఇంటర్నెట్ ట్రాఫిక్ అధిక భాగం పశ్చిమ తీరంలోని ముంబై, తూర్పు తీరంలోని చెన్నైలలో ఉన్న గేట్‌వేలపైనే ఆధారపడి ఉంది. దీనివల్ల దేశ డిజిటల్ వ్యవస్థకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు నగరాల్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యం (తుఫాను, భూకంపం వంటివి) లేదా సాంకేతిక సమస్య తలెత్తితే, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. విశాఖపట్నంలో ఈ మూడవ అంతర్జాతీయ గేట్‌వే ఏర్పాటు చేయడం ద్వారా, మన డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఒక కీలకమైన ప్రత్యామ్నాయ మార్గం (Redundancy) ఏర్పడుతుంది. ఇది దేశ డిజిటల్ భద్రతను, સ્થિરత్వాన్ని (Resilience) గణనీయంగా పెంచుతుంది. తూర్పు భారతదేశం మరియు పొరుగు దేశాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ వేగం మెరుగుపడుతుంది.
సరళంగా చెప్పాలంటే: విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ ఇంటర్నెట్ పటంలో ఒక కొత్త, వ్యూహాత్మక అంతర్జాతీయ జంక్షన్‌గా అవతరించబోతోంది. ఇది కేవలం ఇంటర్నెట్ వేగాన్ని పెంచడమే కాదు, దేశ డిజిటల్ భద్రతకు ఒక కవచంగా నిలుస్తుంది మరియు భారతదేశాన్ని ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఒక కీలకమైన డేటా ట్రాఫిక్ హబ్‌గా మారుస్తుంది.
హరిత ఇంధన వసతులు: పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రగతి ఇంత భారీ డేటా సెంటర్ సంబంధిత వ్యవస్థలు నిరంతరాయంగా 24/7 పనిచేయాలంటే, ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అవసరం. ఈ అపారమైన విద్యుత్ అవసరాలను శిలాజ ఇంధనాల (బొగ్గు వంటివి) ద్వారా తీర్చితే, అది పర్యావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, గూగుల్ ఈ ప్రాజెక్ట్‌ను 100% పునరుత్పాదక ఇంధన వనరులతో నడపాలని ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది.
ఉత్పత్తి విధానం: ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన విద్యుత్‌ను పూర్తిగా పర్యావరణ హితమైన మార్గాలలో, అంటే సూర్యరశ్మి నుండి (సోలార్ ప్యానెళ్లు) మరియు గాలి నుండి (పవన విద్యుత్ యంత్రాలు) ఉత్పత్తి చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా కొత్త సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు మరియు వాటిని గ్రిడ్‌కు అనుసంధానించడానికి కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మిస్తారు.
నిల్వ వ్యవస్థలు: సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడు లేనప్పుడు లేదా గాలి వీచనప్పుడు కూడా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను నిల్వ చేయడానికి భారీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేస్తారు.
ప్రయోజనం: ఈ విధానం వల్ల ఈ ప్రాజెక్ట్ కార్బన్ రహితంగా (Carbon-Neutral) పనిచేస్తుంది. ఇది అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఒక చక్కటి సమతుల్యతను సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది.
సరళంగా చెప్పాలంటే: ఈ టెక్నాలజీ హబ్ తన కార్యకలాపాల కోసం ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా, సూర్యుడు మరియు గాలి వంటి సహజ వనరుల నుండి స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని, నిల్వ చేసుకుంటుంది. ఇది ‘గ్రీన్ టెక్నాలజీ’కి ఒక ఉజ్వల ఉదాహరణ.
భాగస్వాముల పాత్ర: త్రిశక్తి సంగమం
ఈ మహాయజ్ఞం విజయవంతం కావడానికి గూగుల్, అదానీ గ్రూప్, మరియు భారతీ ఎయిర్‌టెల్ మధ్య ఒక స్పష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది.
అదానీ గ్రూప్ (అదానీకనెక్స్): ఈ ప్రాజెక్ట్ యొక్క భౌతిక నిర్మాణ బాధ్యతలను అదానీ గ్రూప్ మరియు దాని జాయింట్ వెంచర్ సంస్థ అయిన అదానీకనెక్స్ తీసుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ డేటా సెంటర్ల భవనాలను నిర్మించడం, వాటికి అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మౌలిక సదుపాయాలను సమకూర్చడం వీరి బాధ్యత. అంతేకాకుండా, ప్రాజెక్ట్‌కు అవసరమైన హరిత ఇంధన వ్యవస్థలను (సోలార్, విండ్ ప్లాంట్లు) కూడా అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తుంది.
భారతీ ఎయిర్‌టెల్: దేశంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్, ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన డిజిటల్ అనుసంధానాన్ని (Digital Connectivity) నిర్మిస్తుంది. గూగుల్ యొక్క అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్స్ విశాఖ తీరానికి చేరినప్పుడు, వాటిని భూమిపై ఉన్న నెట్‌వర్క్‌కు అనుసంధానించే అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)ను ఎయిర్‌టెల్ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఈ డేటా సెంటర్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో మరియు ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్‌లతో కలపడానికి హై-స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తుంది.
గూగుల్: ఈ భాగస్వామ్యంలో గూగుల్ తన ప్రధాన సాంకేతికత, మేధో సంపత్తి, మరియు ఏఐ నైపుణ్యంపై దృష్టి పెడుతుంది. డేటా సెంటర్ల లోపల సర్వర్లను, నెట్‌వర్కింగ్ పరికరాలను, మరియు ప్రత్యేకమైన TPU/GPU క్లస్టర్లను డిజైన్ చేసి, నిర్వహించడం గూగుల్ బాధ్యత.
ఈ త్రైపాక్షిక భాగస్వామ్యం వల్ల ప్రతి సంస్థ తమ తమ రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి, ప్రాజెక్ట్‌ను వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది.
ప్రభుత్వాల పాత్ర: ప్రగతికి చోదక శక్తి
ఇంత భారీ పెట్టుబడి భారతదేశానికి రావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీలక మద్దతు మరియు విధానపరమైన సంస్కరణలు కీలక పాత్ర పోషించాయి. జాతీయ దార్శనికతతో అనుసంధానం: ఈ ప్రాజెక్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత అయిన ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి మరియు ‘అందరికీ ఏఐ’ (AI for All) నినాదానికి సంపూర్ణంగా అనుగుణంగా ఉందని ప్రభుత్వం ప్రశంసించింది. ఇది భారతదేశాన్ని ఒక గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చే ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
విధానపరమైన సంస్కరణలు: ఈ స్థాయి పెట్టుబడిని ఆకర్షించడానికి, గూగుల్ వంటి సంస్థలు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలను ఆశిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ కోరిన ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలను మరియు ఇతర సదుపాయాలను కల్పించడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో, కేంద్ర ప్రభుత్వం జాతీయ డేటా సెంటర్ పాలసీ-2020లో అవసరమైన మార్పులు చేసింది. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని, వేగాన్ని మరియు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం: ఒక నూతన శకానికి నాంది
ఈ గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించగల శక్తిని కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మక “ఏఐ సిటీ వైజాగ్” కార్యక్రమానికి ఒక బలమైన పునాదిగా భావిస్తోంది.
ఉద్యోగ సృష్టి: ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో ప్రత్యక్షంగా (డేటా సెంటర్ ఆపరేటర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు) మరియు పరోక్షంగా (నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, భద్రత) సుమారు 1.8 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఇది రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి, అధిక వేతనం గల ఉద్యోగ అవకాశాలను కల్పించి, ‘బ్రెయిన్ డ్రెయిన్’ (ప్రతిభావంతులు ఇతర రాష్ట్రాలకు లేదా దేశాలకు వలస వెళ్లడం) సమస్యను గణనీయంగా నివారిస్తుంది.
ఆర్థిక అభివృద్ధి: ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి (GSDP) ఏటా సుమారు ₹10,518 కోట్లు అదనంగా చేకూరుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్నుల రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది.
టెక్నాలజీ ఎకోసిస్టమ్: ఈ గూగుల్ హబ్ చుట్టూ ఒక శక్తివంతమైన టెక్నాలజీ క్లస్టర్ ఏర్పడుతుంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాలలో పనిచేసే అనేక స్టార్టప్‌లు, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. ఇది ఆంధ్రా యూనివర్సిటీ వంటి స్థానిక విద్యాసంస్థలను పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా ప్రోత్సహిస్తుంది.
విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు – ఏఐ సిటీగా అవతరించనున్న వైజాగ్
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం మరోమారు అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోనుంది . విశాఖ మకుటంలో మరో కలికితురాయి చేరనుంది. రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఈ సంస్థ విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ఏర్పాటుపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది .
టీసీఎస్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించారు . రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలో పెట్టనుండటం గమనార్హం. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏఐ సిటీగా విశాఖ: డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నగరంగా రూపుదిద్దుకోనుంది. డేటా సెంటర్‌లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్‌లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీహెచ్‌ఎఫ్‌ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అమెరికా బయట రూ.56,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్‌ను (1,000 మెగావాట్లు) ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి నవంబరులో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా రూ.87,520 కోట్ల పెట్టుబడులతో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ సంస్థ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఐటీ భవిష్యత్తుకి భరోసా : సిఫీ టెక్నాలజీస్ రూ.16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. మెటా సంస్థ సముద్రగర్భంలో సబ్‌మెరైన్ కేబుళ్ల ద్వారా విశాఖలోనూ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హైస్పీడ్ డేటా సెంటర్లతో ఏఐ, క్వాంటమ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్తు కేంద్రంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన ఉపాధి అవకాశాలు: టీసీఎస్ విశాఖలో ఏర్పాటు చేసే డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా సుమారు 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థ సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 22 ఎకరాలను కేటాయించింది. ఇదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. సత్వా, ఏఎంఎన్‌ఎస్ ద్వారా మరో 15,000 మందికి ఉపాధి లభించ నుంది .
ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రజల్ని నమ్మించడానికి “ఏ ఒక్కరినీ వొదిలేది లేదు” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పదే పదే చేసే చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూనే వున్నాయి. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తగ్గలేదన్న నివేదికలను ఈ వైఫల్యాలు దృవపరస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ “కామినేని శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ – చిరంజీవి” వివాదం.
ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఒక రాజకీయ వ్యూహం బెడిసికొట్టి, దాన్ని ప్రారంభించిన వారికే ఇబ్బందికరంగా మారిన ఉదంతం ఇది.
2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి శాసనసభను వేదికగా చేసుకుంది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించడానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని గుర్తుచేశారు.
చంద్రబాబుకి, చిరంజీవికి ఎన్ టి ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కామినేని ఉభయకుశలోపరి అన్నట్టుగా
చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్‌ను అహంకారిగా చిత్రీకరిస్తూ, అదే సమయంలో కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని హీరోగా ప్రశంసించడం ఆయన ఉద్దేశం.
కామినేని మాటలు ముగియకముందే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. జగన్‌ను ఎవరూ నిలదీయలేదని కామినేని వాదనను ఖండించారు. అంతటితో ఆగకుండా, జగన్‌ను “సైకోగాడు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. ఇది మిత్రపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. జగన్‌కు ప్రధాన విమర్శకుడిగా తనకున్న ఇమేజ్‌కు, కామినేని వ్యాఖ్య భంగం కలిగిస్తుందని బాలకృష్ణ భావించి ఉండవచ్చు. ఏమైనా ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు, కూటమిలోని సమన్వయ లోపాన్ని బయటపెట్టాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లౌక్యంగా ముగింపు పలికారు. ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఏమాత్రం అవమానించలేదని, సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జగన్ – చిరంజీవి దంపతులను భోజనానికి ఆహ్వానించి సాదరంగా గౌరవించారు. తరువాత సినిమా రంగం ప్రతినిధులతో కలిసి చిరంజీవి వెళ్ళినపుడు జగన్ వీరిని పట్టించుకోనట్టు వ్యవహరించి తన ఆధిక్యత చూపించారు. ఇందులో చిరంజీవి పాక్షిక వాస్తవాన్ని మాత్రమే అశ్వద్ధామ హత: కుంజర అన్నట్టు ప్రస్తావించి అంతేకాకుండా, తన చొరవ వల్లే సినిమా టికెట్ ధరలు పెరిగాయని, అది బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” చిత్రానికి కూడా మేలు చేసిందని సున్నితంగా గుర్తుచేశారు. ప్రత్యక్ష దాడికి దిగకుండా, వాస్తవాలతోనే ఆయన బాలకృష్ణకు సమాధానమిచ్చారు. తనను ఒక రాజకీయ పావుగా వాడుకోవడాన్ని నిరాకరిస్తూ, తన గౌరవాన్ని, స్వతంత్రతను చాటుకున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదం కూటమి ఐక్యతకు నష్టం చేస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ద్వారా వివాదాన్ని తుంచేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరిస్తూ, రికార్డుల నుంచి తొలగించాలని పెద్దరికంతో హుందాగా స్పీకర్‌ను కోరారు. స్పీకర్, కామినేని, బాలకృష్ణ ఇద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
ఈ వివాదాన్ని వైఎస్ఆర్సిపి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయని, వారు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తమ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఈ వ్యూహం పూర్తిగా విఫలమైంది. చిరంజీవి ప్రకటనతో, ఈ కథనంలో “బాధితుడు” లేకుండా పోయారు. కూటమి నాయకత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో, వైఎస్ఆర్సిపి ప్రచారానికి ఆయుష్షు లేకుండా పోయింది.
ఈ సంఘటన వైఎస్ఆర్సిపికి రాజకీయంగా నష్టాన్నే మిగిల్చింది. ఎలాగంటే ఈ వివాదం కూటమిలోని బలహీనతను కాకుండా, సంక్షోభాన్ని పరిష్కరించగల వారి నాయకత్వ బలాన్ని ప్రదర్శించింది. చిన్న సమస్యపై అతిగా దృష్టి పెట్టడం ద్వారా, వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని ప్రజలకు మరోసారి బోధపడింది. ఈ వివాదం, సినీ పరిశ్రమతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణాత్మక గతాన్ని ప్రజలకు తిరిగి గుర్తు చేసింది. ఇది వారికి “బూమరాంగ్” అయింది.