తుపాను నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష – రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అంచనాలు
విపత్కర పరిస్థితులలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు అందెవేసిన చేయి . ప్రకృతి వైపరీత్యాలను ఆపేసి టెక్నాలజీ లేకపోయినా . .. పక్కా ప్రణాళిక , నిరంతర మానిటరింగ్ , టెక్నాలజీ ఉపయోగించుకుని సాధ్యమైనంత నష్టం తగ్గించడం , , చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో . ..
..29 ఏళ్ళ వ్యవధిలో విరుచుకు పడిన మూడు పెను తుపానుల మధ్య అతిపెద్ద సాంకేతిక విప్లవం వుంది. ఈ మూడు పెద్ద తుపాను సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండటం యాదృచ్చికమే . .
. 1996 కొనసీమ తుపాను (నవంబర్ 6, 1996) నాటికి కమ్యూనికేషన్లు, టెక్నాలజీ అంతగా లేవు. పెను తుపాను దెబ్బకి అపుడు 1000 మందికి పైగా చనిపోయారు. 2014 లో హుదూద్ తుపాను నాటికి కమ్యూనికేషన్లు బాగా పెరిగాయి. అపుడు 64 మంది చనిపోయారు. ఇపుడు మొంథా తుపాను నాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా వ్యాపించింది. ఈ తుపానులో మరణాలు రెండుకి పరిమితం కావడం కాస్త బెటర్ . .
రాష్ట్రంలో తుపాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్అండ్బీ రహదారుల వల్ల ఆర్అండ్బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వచ్చిందనిని అధికారులు సీఎంకి వివరించారు.
18 లక్షల మందిపై తుపాను ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలను అపేసే టెక్నాలజీలు లేవు. ముందు జాగ్రత్తల వల్ల ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించ వచ్చు. టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంతటి సాంకేతికత లేనపుడే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు కి మించిన నాయకుడు లేడన్న పేరు తెచ్చుకున్నారు. అన్ని వనరులను సమీకృతం చేసి పనిచేసే ప్రళాళికలే ఆయన విజయ రహస్యం.
1996 నవంబర్ 6 నాటి కోనసీమ తుపానులో 200 కిలోమీటర్ల గాలివేగానికి పబ్లిక్ ప్రయివేట్ ఆస్ధులు అపారంగా ధ్వంసమయ్యాయి. వెయ్యిమంది చనిపోయారు. కోనసీమ తుపాను నష్టాలకు ప్రధాన కారణం ఉప్పెన/ నీరు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే ఏర్పడిన ఈ విపత్తులో సహాయక చర్యలకోసం ఆయన రాజమండ్రిలో మకాం వేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసే సెక్రటేరియట్ / సిఎం పేషీగా మారిపోయింది. ప్రిస్సిపల్ సెక్రటరీ రమాకాంత రెడ్డి ప్రధాన అధికారిగా, ఆర్ డి ఒ శ్రీధర్ ఆయన ప్రధాన సహాయకుడిగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో “తుపాను సహాయక ప్రభుత్వమే” నడిచింది. కకా వికలమైం కోనసీమ కోలుకోడానికి ఆ తర్వాత ఐదారేళ్ళు పట్టింది.
అప్పటికి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రెండే కంప్యూటర్లు వున్నాయి. ప్లాస్టిక్ కవర్ తో ముసుగు వేసి వుండేవి. ఎందుకంటే అప్పటికి ఏడాది క్రితమే వచ్చిన “విండోస్ 95” కి ప్రయివేటు రంగం అలవాటు పడుతున్నంతగా ప్రభుత్వ రంగం అలవాటు పడలేదు. నల్లటి స్క్రీన్ మీద తెల్లటి text కనబడే Dos ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 95 గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) తో ప్రామాణికమైన, వినియోగం పెరుగుతున్న ఇంటర్‌ఫేస్‌గా మారింది. దీనిపై చంద్రబాబుకి లోతైన అవగాహన వుంది. ఆయన సూచన మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్యూటర్లను అప్ డేట్ చేయించారు. కానీ దానిని వినియోగించే వారు అక్కడ లేకపోవడంతో వేరే చోట నుంచి తీసుకువచ్చారు .
18 ఏళ్ళు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ సాధనాలైన కాల్ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీటిని నిర్వహించడానికి నిర్దిష్టమైన బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ, వాటి విజయాన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ (KPIs) ద్వారా లెక్కగట్టడం మొదలైంది. ఈ సాంకేతికతలు ఫోర్త్ ఐటి రివల్యూషన్ కు ఊతమిచ్చాయి.
2014 అక్టోబర్ 12 న హుదూద్ తుపాను వచ్చింది. 210 కిలోమీటర్ల గాలివేగానికి విశాఖపట్నం ఏరియాలో 64 మంది చనిపోయారు. విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడం వల్ల 21 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . హుదూద్ నష్టాలకు ప్రధాన కారణం భారీ గాలి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో మకాం వేశారు. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సహాయ చర్యలు అమలు చేయించారు. విశాఖ ప్రాంతం ఏడాదిలో కోలుకోవడంలో చంద్రబాబు తనవంతు పాత్ర నిర్వహించారు .
ప్లానింగ్ + టెక్నాలజీ = క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు సూత్రం ఇదే . ..
కూలిపోయిన చెట్లను కూలీలతో ముక్కలు చేయించి రోడ్లను క్లియర్ చేయడం ఇందుకు వారాలు వారాలే పట్టడం 1996 నాటి పరిస్ధితి. అడ్డదిడ్డంగా పడిపోయిన స్ధంభాలు చెట్లను ఎత్తి పక్కన పెట్టడానికి క్రెయిన్లు అందుబాటులోకి రావడం 2014 నాటి పరిస్ధితి. ఈ పద్దెనిమేళ్ళలోనూ టెక్నాలజీ అనూహ్యంగా పెరిగింది .
11 ఏళ్ళు గడచిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) అనూహ్యంగా వికసించింది. టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ను సాధ్యం చేస్తుంది. దీనికి ఫైబర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. లార్జర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తరిస్తోంది.
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వారి వారి డాష్ బోర్డుల మీద మొంథా తుపాన్ ని గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్త ప్రభుత్వ యంత్రాంగమూ ఇదే పనిలో వుంది. ఇందువల్ల ప్రాణ నష్టాన్ని జీరో శాతానికి తెచ్చే అవకాశం వుంది.
టెక్నాలజీ నివినియోగించుకోవడంతో పాటు సమస్యని గుర్తించడం (Identification) పరిష్కారానికి వనరుల్ని సమీకృతం చేయడం(Integration) అన్ని శక్తుల్ని భాగస్వామ్యం చేయడం(Involvement) చిత్తశుద్ధితో పని చేయడం (Integrity) – ఈ “I 4” సూత్రాన్ని పాటించడం వల్లే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు నాయుడికి మించిన రాజకీయ నాయకుడు లేరన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతుల్ని అయన గడించుకున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా మెదడు అయితే, కనెక్టివిటీ గుండె. విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ రావడమంటే
అది భారత్ కు మాత్రమే కాక కనీసం 12 దేశాల కనెక్టివిటీకి పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పడం అతిశయోక్తికాదు .



