ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ వెనుకంజ.. కారణం ?

ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ వెనుకంజ.. కారణం ?

గణనీయంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం .. సర్వే నెంబర్లు , వెబ్ ల్యా0డ్ తప్పుల సవరణపై యంత్రాంగం నిర్లక్ష్యం

కూటమి అధికారంలోకి వస్తే ‘రియల్ ఎస్టేట్ ‘ దూసుకుపోతుంది… అంటూ వేసుకున్న అంచనాలు ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ అవుతున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ గద్దెనెక్కి పదినెలలవుతున్నా రాష్ట్రంలో మాత్రం ‘రియల్ ఎస్టేట్ ‘ రంగం గాడినపడలేదు. అమరావతి , కృష్ణా , గుంటూరు జిల్లాలలో మాత్రం ఓ మోస్తరుగా భూములు క్రయవిక్రయాలలో కదలిక కనిపిస్తున్నా , , మిగిలిన ప్రాంతాలలో మాత్రం గతేడాదితో పోల్చినా వెనుకబాటు కనిపిస్తోంది.

గత ఏడాది . (2023-2024).. 22 లక్షల 25 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి . 9,600 కోట్ల ఆదాయం వచ్చింది .

గడిచిన ఏడాది 2024-2025 ఆర్ధిక సంవత్సరం 20 లక్షల 20 వేలు మాత్రమే అయ్యాయి . 8,800 కోట్లు మాత్రమే వచ్చింది .

800 కోట్ల ఆదాయం తగ్గింది.

అయితే కూటమి నేతలు మాత్రం.. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం . . అంటూ ఆర్బాటంగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. అభివృద్ధికి కొలమానంగా చెప్పుకునే రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇంత వెనుకబాటు ఉంటే మిగిలిన రంగాల పరిస్థితి కూడా పరిశీలించుకుని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.

రియాల్టీ పతనానికి కారణం ?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలయింది . ఇక్కడి పెట్టుబడిదారులు చాలామంది హైదరాబాద్ వెళ్లి అక్కడ భూములు , భవనాలు కొనుగోలు చేశారు. 2022-2023 నాటికి హైదరాబాద్ లో భూముల ధరలు కృత్రిమంగా పెంచేశారు. ఇంకా పెరిగిపోతాయన్న భ్రమల్లో ఉన్న ఆంధ్రులు ఎగబడి … ఆంధ్రాలో ఉన్న సొమ్ములు తీసుకువెళ్లి తెలంగాణాలో పెట్టుబడులు పెట్టారు .

  • తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనమైంది . అక్కడి పెట్టుబడులు లాక్ అయ్యాయి .
  • జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘జగనన్న సమగ్ర భూ సర్వే ‘ పేరుతొ జరిగిన అక్రమాలు , తప్పులు లక్షలలో చేరిపోయాయి . వాటిని సరిదిద్దే యంత్రాంగం ఏపీలో లేదు . కూటమి సర్కార్ సైతం అప్పటి తప్పులను సరిదిద్దే ప్రయత్నం సంపూర్నంగ చేయడంలేదు .
  • ఈ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో భూముల లావాదేవీలు పెరగడంలేదు . ఏపీలో రియల్ పతనానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పవచ్చు .
  • ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి0దో లేదో తెలియదు .