by Abhi Correspondent | Oct 3, 2025 | ఆరోగ్యం
వైద్య పరిశోధనల్లో స్పష్టమైన బెనిఫిట్స్ ఇవే . ..
రెగ్యులర్ గా వంటకాల్లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంలో వాపు, మంట లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, వికారాన్ని తగ్గించే శక్తి పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, అలర్జీ వంటి వాటిని అదుపులో ఉంచేందుకు అల్లం బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .
జీర్ణక్రియకు సహాయపడుతుంది : అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, జీర్ణాశయం నుంచి ఆహారం వేగంగా కదలడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అజీర్ణం , కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. అలాగే, గర్భధారణ సమయంలో వచ్చే ఉదయపు వికారం, ప్రయాణంలో వచ్చే మోషన్ సిక్‌నెస్, కీమోథెరపీ తర్వాత వచ్చే వికారాన్ని తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది .
ఇందులో జింజెరోల్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని, ఇవి బాడీ పెయిన్స్, వాపును తగ్గిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కారణంగా వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ అనారోగ్యాల లక్షణాలను తగ్గించడంలో, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైద్య శాస్త్రంలో అనేక బెనిఫిట్స్ కూడా అల్లం లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది .
by Abhi Correspondent | Sep 29, 2025 | ఆంధ్రప్రదేశ్
2058లో తలెత్తబోయే దుష్ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ తో స్టడీ
ఎన్జీటీ సూచనలతో అమరావతిలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం – వచ్చే నెల చివరికి నివేదిక సిద్ధం
” వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది . రాజధాని అమరావతిలో రానున్న దశాబ్దాలలో ఎదురు కాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి …. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచన మేరకు రాజధాని నగరానికి సంబంధించి వాతావరణ మార్పులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా సంభవించే దుష్ఫలితాలను నివారించేందుకు CRDA తయారు చేయిస్తోంది. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బహుళ జాతి సంస్థ అయిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంట్ ఇనీషియేటివ్స్- ఇక్లీ(ICLEI) ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధ్యయనం సాగుతోంది. అక్టోబరు చివరి నాటికి పూర్తి నివేదికను సమర్పించనుంది.
అమరావతి వాతావరణంపై విశ్లేషణ : రాజధాని అమరావతి నగరంలో వాతావరణంపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి గత వాతావరణ గణాంకాలను ఇక్లీ సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వాయు నాణ్యతపై ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా 0.22 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర పెరుగుదల కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రతి దశాబ్దానికి 0.32 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గణాంకాలు వివిరించారు . 2015 – 2024 కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా 4.5 మిల్లీమీటర్ల చొప్పున వార్షిక వర్షపాతం పెరుగుతోంది. పెరుగుదల ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో కనిపించింది. వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి. ప్రతి దశాబ్దానికి 2.6 రోజుల చొప్పున తరుగుదల నమోదైంది. కానీ వర్ష తీవ్రత మాత్రం పెరుగుతోంది.
2058 నాటికి వాతావరణ మార్పులు : రాజధానికి సంబంధించి నీటి సరఫరా, వృథా నీరు, వర్షపు నీరు, ఘన వ్యర్థాలు, రవాణా, విద్యుత్తు, భవనాలు, ఆరోగ్యం, హరితం, జీవవైవిధ్యం, గాలి నాణ్యత అంశాలపై ఇక్లీ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వనుంది. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతికి మొదటి దశలో 386 MLD నీరు, వైకుంఠపురం నుంచి రెండో దశలో 539 MLD చొప్పున 2058 నాటికి మొత్తం 925 MLD నీరు అవసరమవుతుందని అంచనా. 15 శాతం మేర నీటి నష్టాలు ఉంటాయని లెక్కగట్టారు.
2058 నాటికి వృథా నీరు 723 MLD వస్తుందని, ఈ నీటిని శుద్ధి చేసేందుకు 12 STPలు, 1 CETP నిర్మించాల్సి ఉంది. శుద్ధి చేసిన నీటిలో పచ్చదనం కోసం వినియోగించుకోవచ్చు. రాజధాని నగరంలో 2058 నాటికి రోజుకు 3,956 టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉంది. ఇందులో తడి చెత్త 2,028 టన్నులు కాగా, పొడి చెత్త 1,436 టన్నులు. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో విద్యుత్తు వినియోగం 220.5 మిలియన్ కిలోవాట్ అవర్. 2058 నాటికి డిమాండ్ 10,756 మిలియన్ కిలోవాట్ అవర్‌కు చేరుకోవచ్చని అధ్యయనంలో గుర్తించారు. సౌరవిద్యుత్తు డిమాండ్ 7,954 మిలయన్ కిలోవాట్ అవర్‌గా ఉంటుందని అంచనా.
అమరావతిలో సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీలు : అమరావతిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీల సెంటిగ్రేడ్. రాజధానిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేయాలన్నది బృహత్ ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి పచ్చదనం పెంచితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర తగ్గే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. పచ్చదనం తక్కువగా ఉన్న అనంతవరం, లింగాయపాలెం, నేలపాడు, వెంకటపాలెం, నవులూరులో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తేలింది.
by Abhi Correspondent | Sep 16, 2025 | పరిశీలన
”మన దేశంలో ఏసీల వినియోగం ఏటేటా గణనీయంగా పెరుగుతోంది . ఇదే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి . .. ” అని ఒక ప్రముఖ సంస్థ సర్వ్ వెల్లడించింది .
2030 నాటికి భారతదేశంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేసే గృహోపకరణాలుగా ఏసీలు ప్రధమ స్థానంలో ఉంటాయని . .. ఓ సర్వే తెలిపింది. అంతేకాకుకండా 2035 నాటికి మొత్తం ఉద్గారులు రెండింతలు పెరిగి 329 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానంగా చేరుతాయని దిల్లీ కేంద్రంగా ఉన్న థింక్ ట్యాంక్ iFOREST తాజా సర్వేలో వెల్లడించింది.
‘2024లో మాత్రమే ఏసీల వల్ల 156.9 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దేశంలోని అన్ని ప్రయాణీకుల కార్ల ఉద్గారాలకు సమానం. ఇందులో 52 మిలియన్ టన్నులు రిఫ్రిజిరేటర్ల లీకేజీల వల్ల వచ్చాయి. జాతీయ రిఫ్రిజరెంట్ డేటాబేస్ ఏర్పాటు చేసి, ఉద్గారాలను తగ్గించడానికి కఠినంగా అమలు చేయాలి. ఈ చర్యల ద్వారా రానున్న దశాబ్దంలో 500 నుంచి 640 మిలియన్ టన్నుల కార్బన ఉద్గారాలను నివారించవచ్చు. ఇవి 25-32 బిలియన్ డాలర్లు ఉంటాయి. కార్బన్ క్రెడిట్ల విలువత పాటు వినియోగదారులకు 10 బిలియన్ డాలర్ల రీఫిల్లింగ్ ఖర్చులను ఆదా చేస్తాయి’ అని నివేదిక తెలిపింది.
భారత్‌లో ఒక ఏసీని రెండు సంవత్సరాలకోసారి రీఫిల్ చేస్తే, అది ఒక కారు విడుదల చేసే ఉద్గారాలంత నష్టం చేస్తుందని ఢిల్లీలోని ప్రముఖ ఎన్అజీవి నిర్వాహకుడు సిద్దర్ సూకీ తెలిపారు. ‘వాతావరణ మార్పులకు ఏసీ కూడా కారు మాదిరిగానే హానికరం. ప్రజలు ఎనర్జీ ఎఫిషెన్సీ పట్ల జాగ్రత్తగా ఉన్నారు కానీ రిఫ్రిజిరేటర్ల విషయంలో అవగాహన తక్కువ. ప్లాస్టిక్‌లకు ఉన్నట్లే రిఫ్రిజిరేటర్ల లైఫ్‌సైకిల్‌పై కూడా సమగ్ర నియంత్రణ అవసరం’ అని అయన అన్నారు.
AC వినియోగం స్పీడ్ గా పెరుగుతోంది’
సర్వే ప్రకారం, భారత్‌లో ఏసీల సంఖ్య 2024లో 62 మిలియన్ ఉన్నాయి. 2035 నాటికి 245 మిలియన్‌కు పెరుగనుంది. వార్షిక విక్రయాలు 14 మిలియన్ నుంచి 40 మిలియన్‌కు పెరుగుతాయి. 2020 నుంచి ఏసీ అమ్మకాలు సంవత్సరానికి 15-20శాతం వృద్ధి సాధిస్తున్నాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 3,100 కుటుంబాల సర్వే ప్రకారం,80శాతం ఏసీలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగివి ఉన్నాయి. 87శాతం కుటుంబాలు ఒక్క ఏసీ కలిగి ఉంటే, 13శాతం కుటుంబాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. చెన్నై, జయపుర్, కోల్‌కతా, పుణెలో బహుళ ఏసీ వినియోగం ఎక్కువగా ఉంది.
డేంజర్ . .. డేంజర్ . .. HFC-32 దేశంలో విస్తృతంగా వాడుతున్న రిఫ్రిజిరేటర్. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 675 రెట్లు అధిక వేడి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.లీకేజీ కారణంగా ఉద్గారాలు 2024లో 52 మిలియన్ టన్నులు కాగా, 2035 నాటికి 84 మిలియన్ టన్నులు పెరుగుతాయని అంచనా. సగటున కుటుంబాలు రోజుకు 4 గంటలు ఏసీలు వాడుతున్నారు.
by Abhi Correspondent | Sep 15, 2025 | జనరల్
ఇంజనీరింగ్ నైపుణ్యంలోనే కాదు . . నైతిక విలువల్లోనూ ఆణిముత్యం విశ్వేశ్వరరావు
2017 ఆగష్టులో జూబ్లీ హిల్ల్స్ పబ్లిక్ స్కూలు విద్యార్థులను ఉద్దేశించి పూజ్య గురువులు చేసిన ప్రసంగములో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ ని గురించిన విశేషములు, శ్రీ విశ్వేశ్వరయ్య గారి జన్మదినము సందర్భముగా…
…ఆ రోజులలో ప్రభుత్వ ఇంజినీర్లు ఎన్నో గ్రామాలలో తిరిగి, వారి నివేదికలు చేతితో వ్రాసి, తయారు చేసి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన పరిస్థితి. ఒకానొక సమయములో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామములో ఒక నివేదిక తయారు చేయటము కొరకు ఆ గ్రామములోని ఒక పెద్ద మనిషి ఇంటిలో బస చేసారు. పగలంతా తిరిగి, అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనము చేసి, రాత్రికి నివేదిక తయారు చెయ్యటానికి ఉద్యుక్తులయ్యారు విశ్వేశ్వరయ్య గారు. ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్తు లేదు. కానీ ఆ నివేదిక వ్రాయటము వాయిదా వేస్తే తాను ఎమైనా మరచిపోతానేమోనని తన సంచీలోనుంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుగులో తన నివేదిక పూర్తి చేసారు వారు.
సహజముగానే పుస్తక పఠనాసక్తులయిన విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పి మరొక కొవ్వొత్తిని వెలిగించి, దాని వెలుగులో తన పుస్తక పఠన చేయసాగారు. ఇది చూచిన ఆ ఇంటి పెద్దాయన విశ్వేశ్వరయ్య గారి వద్దకు వెళ్ళి – “అయ్యా…ఈ రెండు కొవ్వొత్తులు ఏమిటి? ఒక కొవ్వొత్తి ఆర్పి, రెండవ కొవ్వొత్తి కాంతి లో ఎందుకు చదువుతున్నారు?” అని కుతూహలముగా అడిగారు. “నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వము వారు విద్యుత్తు లేనప్పుడు నా ఉద్యోగ ధర్మములో ఉపయోగపడుతుందని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది నా ఉద్యోగము కాదుగా…నాకు ఆసక్తయిన పుస్తక పఠనము. దీనికి వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వ వనరులు దుర్వినియోగ పరచటమవుతుంది కదా…బాధ్యతగల పౌరులుగా మనము అది చేయకూడదు. అందుకే, నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుతా…” అని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు. విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ పెద్దాయన అబ్బురపడ్డారు…
విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ…కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కూడా తరచూ మోక్షగుండం విశ్వేశ్వరరావు గురించి , అయన నైతికత గురించి చెపుతూ ఉంటారు .
by Abhi Correspondent | Sep 15, 2025 | ఆంధ్రప్రదేశ్
షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్ పిటిషన్ – రాజకీయ మైలేజీకి జగన్ కుటుంబ వివాదాన్ని వాడుకోవడం బాధాకరం – చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన వైఎస్ విజయమ్మ
” వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి . . షర్మిలతో ఉన్న దీర్ఘకాల వైరుధ్యాలు, రాజకీయ కలహాల కారణంగానే జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్-NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ;; అని అతని తల్లి , వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అన్నాచెల్లెలి వివాదాల్లో తాను ఇరుక్కుపోయానని ఈ మేరకు చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్(NCLAT)కి నివేదించారు. రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని వాపోయారు.
ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్‌ను జగన్ ఆశ్రయించడానికి కారణం చెల్లి షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలోని ఎన్‌సీఎల్‌ఏటీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్‌లో వాటాల బదలాయింపు, రిజిస్టర్‌లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్‌లో జగన్ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వెలిబుచ్చారు.
జగన్ రాజకీయ ప్రాపకం కోసమే : కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మేలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్‌డీడ్‌లు కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ కార్పొరేట్ వివాదానికి సంబంధించినది కాదని అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుద్ధ్యాల ఫలితమేనని విజయమ్మ తేల్చిచెప్పారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనన్నారు.
అది చట్టవిరుద్ధం : విజయమ్మ, జనార్దన్‌రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్‌లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ(NCLAT)లో విజయమ్మ అప్పీల్ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్ ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది.
అప్పుడే రాజీనామా : సరస్వతి పవర్‌లో తాను ప్రధాన వాటాదారునేనని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన అప్పీలులో విజయమ్మ స్పష్టం చేశారు. వాటాల బదలాయింపునకు ముందు తనకు 48.99 శాతం వాటాలున్నట్లు పేర్కొన్నారు. 2021 జులై 26న జగన్ 74 లక్షల 26 వేలు, భారతీరెడ్డి 40 లక్షల 50 వేల వాటాలను ప్రేమతో తన పేరిట గిఫ్ట్‌డీడ్‌లు ఇచ్చారని వివరించారు. 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పదవికి జగన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. గిఫ్ట్ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్ కోర్టులోనూ జగన్ సవాల్ చేయలేదని విజయమ్మ పేర్కొన్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్‌లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్ పెండింగులో ఉండగా ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే సెటిల్ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. సభ్యుల రిజిస్టర్‌పై యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని విజయమ్మ తెలిపారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులతో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే తనకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుందని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీకి విజయమ్మ నివేదించారు.