“అల్లం” రెగ్యులర్ గా తింటే ఏమవుతుంది?

Abhi Correspondent

October 3, 2025

వైద్య పరిశోధనల్లో స్పష్టమైన బెనిఫిట్స్ ఇవే . ..

రెగ్యులర్ గా వంటకాల్లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంలో వాపు, మంట లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు, వికారాన్ని తగ్గించే శక్తి పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, అలర్జీ వంటి వాటిని అదుపులో ఉంచేందుకు అల్లం బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .

జీర్ణక్రియకు సహాయపడుతుంది : అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, జీర్ణాశయం నుంచి ఆహారం వేగంగా కదలడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అజీర్ణం , కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. అలాగే, గర్భధారణ సమయంలో వచ్చే ఉదయపు వికారం, ప్రయాణంలో వచ్చే మోషన్ సిక్‌నెస్, కీమోథెరపీ తర్వాత వచ్చే వికారాన్ని తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది .

ఇందులో జింజెరోల్‌ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని, ఇవి బాడీ పెయిన్స్, వాపును తగ్గిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కారణంగా వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ అనారోగ్యాల లక్షణాలను తగ్గించడంలో, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్​లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైద్య శాస్త్రంలో అనేక బెనిఫిట్స్ కూడా అల్లం లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది .

You May Also Like…