వందేళ్ళ ఆర్ ఎస్ ఎస్ – భారత రాజకీయాల్లో ఒక ట్రాన్స్ ఫర్మేషన్

వందేళ్ళ ఆర్ ఎస్ ఎస్ – భారత రాజకీయాల్లో ఒక ట్రాన్స్ ఫర్మేషన్

భారత్ రాజకీయాలలో RSS పాత్ర అత్యంత కీలకం. ప్రయోగాత్మకం. అంతకుమించి పెనుమార్పునకు కారణమ్ . రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) శతాబ్ది ఉత్సవాలు భారత సామాజిక-రాజకీయ రంగంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కు సంకేతం. ఒకప్పటి వివాదాస్పద సంస్థ ఇప్పుడు దేశ పాలక వ్యవస్థలో గట్టిగా స్థిరపడుతోంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఇది హిందుత్వ ఆధారిత స్వచ్ఛంద సంస్థ. 1925లో విజయదశమి రోజున మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దీనిని స్థాపించారు. హిందూ క్రమశిక్షణ, ఏకీకరణ పెంపొందించడం, హిందూ రాష్ట్ర స్థాపన దీని ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిపై హెడ్గేవార్ విభేదించారు. ముస్లింల ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఆయన విముఖత చూపారు.

ఈ శతాబ్ది ఉత్సవాల వేదిక నాగ్‌పూర్. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.ఆర్ ఎస్ ఎస్ స్థాపన కేంద్రం నాగ్‌పూరే. ఈ శతాబ్ది వేడుకలు మహాత్మా గాంధీ జయంతి, డా. బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధంలోకి మారిన రోజు (ధమ్మచక్ర ప్రవర్తన దినం) తో ఏకకాలంలో రావడం గమనార్హం.

గాంధేయవాదం, అంబేద్కర్ వాదం, హిందుత్వ… ఈ మూడు ఆలోచనా స్రవంతులు దేశ రాజకీయ వ్యక్తిత్వాన్ని రూపొందించాయి. నాగ్‌పూర్ ఈ మూడు వారసత్వాలకు కేంద్రంగా నిలిచింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంసేవక్. ఆయన ఢిల్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శతాబ్ది ప్రయాణాన్ని ఆయన త్యాగం, నిస్వార్థ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణకు ఉదాహరణగా అభివర్ణించారు. ఆర్ ఎస్ ఎస్ శాఖలు ‘యజ్ఞ వేదీస్’ వంటివని కొనియాడారు.

సంఘ్ శతాబ్దికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంప్, ₹100 నాణెం విడుదల చేసింది. నాణెంపై ‘భారత్ మాత’ చిత్రం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కరెన్సీపై భారత్ మాత చిత్రం ఇదే మొదటిది.

ఆర్ ఎస్ ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. విద్య, సామాజిక సేవ, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత వంటి అన్ని రంగాల్లో దాని అనుబంధ సంస్థలు విస్తరించాయి. పాలక పార్టీ బీజేపీ, అతిపెద్ద కార్మిక సంఘం బిఎంఎస్ , అతిపెద్ద విద్యార్థి సంస్థ ఎబివిపి, విద్యా భారతి పాఠశాల వ్యవస్థ సంఫ్‌ పరివార్‌లో భాగమే. ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం భారతదేశాన్ని కేవలం సమృద్ధ దేశంగానే కాకుండా, ‘నైతిక, సాంస్కృతిక విశ్వగురువుగా’ మార్చడం. దీనికి ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతమే పునాది.

అయితే, ఈ వేడుకలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ గౌరవం రాజ్యాంగాన్ని అవమానించడమే అని కాంగ్రెస్, సీపీఎం ఖండించాయి. ఆర్ ఎస్ ఎస్ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండి, బ్రిటిష్ వారికి సహకరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత సర్దార్ పటేల్ సంస్థను నిషేధించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

అంటరానితనంపై పోరాటం చేస్తున్నామని సంఘ్ వాదిస్తున్నా , ఇది అగ్రకులాల ఆధిపత్యంలో ఉందనే విమర్శ ఉంది. చరిత్రను వక్రీకరించి పాఠ్యాంశాలను ‘కాషాయీకరణ’కు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

ఈ శతాబ్ది మైలురాయి సంఘ్ సైద్ధాంతిక, సంస్థాగత విజయాన్ని స్థిరీకరించింది. భవిష్యత్తులో దేశ జాతీయ కథనంపై దాని పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది.

టీసీఎస్ డేటా సెంటర్ – లక్ష కోట్ల పెట్టుబడి

టీసీఎస్ డేటా సెంటర్ – లక్ష కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం మరోమారు అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోనుంది . విశాఖ మకుటంలో మరో కలికితురాయి చేరనుంది. రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఈ సంస్థ విశాఖలో టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్‌ ఏర్పాటుపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది .

టీసీఎస్‌ సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ సీఎం చంద్రబాబును కలిసి డేటా సెంటర్‌ ప్రతిపాదనపై చర్చించారు . రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలో పెట్టనుండటం గమనార్హం. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏఐ సిటీగా విశాఖ: డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) నగరంగా రూపుదిద్దుకోనుంది. డేటా సెంటర్‌లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్‌లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హైస్పీడ్‌ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీహెచ్‌ఎఫ్‌ఎక్స్, ఏఐ క్లౌడ్‌ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అమెరికా బయట రూ.56,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్‌ను (1,000 మెగావాట్లు) ఏర్పాటు చేసేందుకు గూగుల్‌ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి నవంబరులో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా రూ.87,520 కోట్ల పెట్టుబడులతో 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ సంస్థ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

మెరుగైన ఉపాధి అవకాశాలు: టీసీఎస్‌ విశాఖలో ఏర్పాటు చేసే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా సుమారు 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థ సొంత క్యాంపస్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం 22 ఎకరాలను కేటాయించింది. ఇదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. సత్వా, ఏఎంఎన్‌ఎస్‌ ద్వారా మరో 15,000 మందికి ఉపాధి లభించ నుంది .

రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా? Is the real estate era over?

రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా? Is the real estate era over?

ఈ ప్రశ్నలకు ” ఔను … రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ పతనం చూడాల్సి వస్తుంది. ఇపుడు నుంచే జాగ్రత్తగా ఉండాలి . .. 2026లోనే రియల్ పతనం స్టార్ట్ అవుతుంది . అది 2027 నాటికి పీక్ కి వెళ్లబోతోంది . ..” అంటూ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి . అయితే కొన్ని సర్వే, ఏలాలసిస్ సంస్థలు మాత్రం ”2030 నాటికి ఇండియాలో రియల్ ఎస్టేట్ పతాక స్థాయికి వెళ్లబోతోంది . ..” అంటూ జీడీపీ పెరుగుదల , భారత్ లో జనాభా వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అంచనాలు వేస్తున్నాయి . అయితే ప్రస్తుత అస్తవ్యస్త విధానాలు , మెజార్టీ ప్రజల (70 శాతం ) కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు .

ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా . .. అవి ఇతర దేశాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి . రష్యా -ఉక్రెయిన్ యుద్ధం , ఇరాన్ – ఇరాక్ వార్ . .. అమెరికాలో ఆర్ధిక సంక్షోభ0, ట్రంప్ టారిఫ్ ల సంక్షోభం వంటివన్నీ మన సమాజంపై, మన ఆర్ధిక స్థితి – గతములపై కూడా అత్యంత ప్రభావం చూపుతున్నాయి .

ఐటీ భూమ్ సంక్షోభం వల్ల NRI ఇన్విస్ట్మెంట్స్ తగ్గుముఖం పట్టాయి . , ట్రాంప్ టారిఫ్ సంక్షోభం . .. వల్ల గోదావరి జిల్లాలలో ఆక్వా పరిశ్రమ బెంబేలెత్తిపోతోంది . ఈ ప్రభావం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తీవ్రంగా పడింది . ఇది కూడా రియల్ పై ఎఫెక్ట్ చూపుతోంది .

ఐటీ భూమ్ తగ్గడం : గ్లోబల్ వైజ్ ఐటీ రంగం ఒడిదుడుకుల ప్రభావం మన దేశ ‘రియల్ ఎస్టేట్ ‘ రంగంపై తీవ్రంగా పడుతోంది . ముక్యంగా దక్షిణాదిలో రియల్ భూమ్ ఎక్కువ . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అధికంగా ఉన్నారు . దేశీయంగాను , విదేశాలలోని సౌత్ ఇండియా వారు ఎక్కువగా ఐటీ, ఫార్మా రంగాల నుంచి ఆర్జిస్తున్నారు . వీరి ఆదాయంలో 50-60 శాతం రియల్ ఎస్టేట్ పైనే పెట్టేవారు . గడచినా ఐదారేళ్లుగా ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. 2024-2025 నుంచి ఈ మార్పు మరింత స్పష్టంగా ఉంటోంది .

ధరలు బాగా ఎక్కువ : హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ , విల్లాలు , ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ధరలు వాస్తవ పరిస్థితులకంటే చాలా ఎక్కువ. చదరపు గజం 6-8 వేలు ఉండాల్సిన చోట . .. రూ 12-15 వేల వరకు అమ్మేవారు . 2005 నుంచి 2015 వరకు చాలా చోట్ల బిల్డర్స్ కి ఇది నడిచింది . అప్పట్లో కనస్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంటర్ అయిన వారు భారీగా ఆరగించారు . పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన . … ఇతర రంగాలలో ఉన్నవారు , అంత ఆర్ధిక స్తోమతలేకపోయినా అప్పులు చేసి . .. నిర్మాణ రంగంలోకి వేలాదిగా వచ్చేసారు . జనం అవసరాల కంటే అదనంగా అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది . ఈ ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ పై పడింది . అలాగే వెంచర్లలో కూడా భారీ ధరలు పెట్టి . .. NRI లను ఆకర్షించి . .. అధిక ధరలకు అమ్ముకున్నారు . ఈ మార్కెట్ కూడా 2019 వరకు బాగానే సాగింది . కరోనా దెబ్బతో వెంచర్ల బిజినెస్ డీలాపడింది .

జీడీపీ పెరిగినా…. భారత్ జీడీపీ వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్న ప్రచారం జోరుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తోంది . అయితే ఇదే సమయంలో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గింది . జీడీపీ పెరిగినా ఆ ఫలితాలు సామాన్యులకు అందడంలేదు . . .. పారిశ్రేమికవేత్తలు , బడా బాబులకు చేరుతున్నాయని చెప్పాలి . 70 శాతం ఉన్న సామాన్య జనం కొనుగోలు శక్తి గణనీయంగా గట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . ఈ ప్రభావం తయారీ రంగంపై పడుతుంది . ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ ని వెనక్కిలాగుతుంది.

బ్యాంక్ లపై ఎఫెక్ట్ . .. రియల్ ఎస్టేట్ మందగమనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపునుండి . లోన్లు తీసుకున్న బిల్డర్స్ చాలామంది అపార్టుమెంట్లు అమ్ముడుపోక తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు . హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో వేలకోట్ల బాకీలు బ్యాంకులకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు . ఈ ప్రభావం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది .

వెంచర్ల పరిస్థితి అగమ్యగోచరం … పట్టణాలు , పల్లెలు అన్న తేడా లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి వేసిన వెంచర్లో అమ్ముడుపోక ఖాళీగా ఉంటున్నాయి . ఉదాహరణకు రాజమండ్రి సమీపంలో పాలచర్ల , వెలుగుబండ , దివాన్ చెరువు , రాజానగరం , రాజవోలు , తదితర ప్రాంతాలలో 20 ఏళ్ల క్రితం వేసిన వెంచర్లలో సైతం అమ్ముడుపోని సైట్లు అనేకం ఉన్నాయి . వెంచర్లు వేసిన రియాల్తార్లు లాంచింగ్ ఆఫర్స్ , అనో మరో స్కీం పేరుతొ చాలా వరకు అమ్ముకున్నారు . వారి నుంచి కొనుగోలు చేసిన వారే రెండో సారి అమ్మడానికి కష్టం అవుతోంది . కొనేందుకు ఎవరు ముందుకు రాక . .. పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోతుంది .

‘రియల్ శకం ముగిసినట్లేనా ? ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా >? అంటే మెజార్టీ నిపుణులు ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని ఘంటాపదంగా చెపుతున్నారు . ఎన్ని స్థలాలు కొంటారు . … >? ఎన్ని ఫ్లాట్స్ కొంటారు > కొనడానికి సరిపడా ఆదాయాలు వస్తున్నాయా > భూముల ధరలు అమాంతం పెరిగాయి . అవి కొని అపార్ట్మెంట్స్ నిర్మించే బిల్డర్స్ కి కూడా ఇది పెనుభారంగా మారింది . ఈ ప్రభావం కూడా హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం . రాజమండ్రి , కాకినాడ , తదితర నగరాలలో నిర్మాణ రంగంపై గణనీయంగా పడింది . “” ఐదారేళ్లలో రియల్ ఎస్టేట్ ఇలాగే ఉంటుంది . ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గుతాయి . అయినా బిజినెస్ పుంజుకునే పరిస్థితులు వచ్చేలా లేవు . భవిష్యత్తులో వ్యవసాయ భూముల ధరలు కాస్త పెరుగుతాయి . 2030 నాటికి వ్యవసాయ భూముల ధరలు 50-60 శాతం పెరిగే ఛాన్స్ ఉంది . ..” అని రాజమండ్రికి చెందిన ఎనలిస్ట్ జె . చౌదరయ్య ”అభిన్యూస్ ‘ తో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు . రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 2000 నుంచి 2020 మధ్య ఇరవై ఏళ్లలో 15,650 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి . ఇందులో వెంచర్లు వేసిన రియాల్తర్లు 70-80 శాతం అమ్మేసుకున్నారు . కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్ మాత్రం . .. 20 శాతం కూడా రీ సేల్ చేయలేకపోయారు . .. అని రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్టర్ ఒకరు చెప్పారు .

ప్లాస్టిక్ భూతం… ఆలోచిద్దాం ఒక్క నిమిషం

ప్లాస్టిక్ భూతం… ఆలోచిద్దాం ఒక్క నిమిషం

ప్లాస్టిక్ … విచ్చలవిడిగా వాడితే పర్యావరణం దెబ్బతుంటుంది . . ఇదే కదా మనమంతా అనుకునేది . ఇదొక్కటే కాదు . పర్యావరణం దెబ్బతినేకంటే ముందు మనం దెబ్బతింటాం . ప్లాస్టిక్ విరివిగా వాడేవాళ్లు ఆరోగ్యాలు పెనుప్రమాదంలో పడతాయి . ఇది గమనిస్తే పర్యావరణం మాట పక్కనపెడితే ముందు మానవ ఆరోగ్యాలు కదా . …

ఒకప్పుడు మనం స్నానం చేయడానికి వాడే బక్కెట్ లు ఇత్తడివి ఉండేవి, లేదా అల్యూమినియం బక్కెట్ ఉండేవి ,, అవన్నీ చాలా మంచిదే

చాలా హుందా తనమే,

ఒకసారి కొంటె కొన్ని సంవత్సరాలపాటు అలానే ఉంటాయి కొన్ని సార్లు వారు వాడి వారి పిల్లలాకు కూడా ఇచ్చేవారు మరి అలాంటివన్నీ కనుమరుగయ్యి వాటి స్థానం లో

ప్లాస్టిక్ అనే భూతం వచ్చేసింది

ప్లాస్టిక్ బక్కెట్ లో వేడి నీరు పోస్తే అది కచ్చితం గా నీటిలో కలుస్తుంది,,

ఆలోచించామా . … లేదే . .

చక్క పీటలు. లేవు

స్టూళ్లు లేవు,

ప్లాస్టిక్ స్టూల్ వచ్చేసాయి, వాటిమీద కూర్చుంటే వేడి జనరేట్ అవుతుంది సీట్ కింద 🥰

వెదురు బద్దలతో అల్లిన చాటలు . .. మెంతులు పేపర్లు నానబెట్టి చిక్కగా అలికిన అందమైన చాటలు, అల్లిక బుట్టలు పోయి

ప్లాస్టిక్ చాటలు వచ్చాయి

వంట గదిలో,

పప్పుల డబ్బాలు, పోపుల డబ్బాలు ఇత్తడివి, అల్యూమినియం, స్టీల్ వి విలువైనవి ఆరోగ్యాకరమైనవ వాటిని తోసేసి హానికలిగించే ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి పెట్టేసాము

పచ్చళ్ళు, కారాలు సంవత్సరమ్ పాటు నిల్వ చేసుకునే పింగాని, జాడీలు, మట్టి కుండలు పోయి #ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసాయి

అసలు ఎందుకు ఇలా మారామో కాస్త ఆలోచించండి

ఒక్కసారి కొంటె రొండు తరాలు లేదా మూడు తరాలు వాడగలిగే విలువైన వాటిని వదిలేసి

ఎప్పుడు కొనాల్సి వస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతిసే విషాన్ని మనం ఎందుకు కొంటున్నామో ఆలోచించండి

ఇదంతా మనకు తెలియకుండా మన మెదళ్ళలో జోప్పించే మార్కెట్ మాయాజాలం. కూడా ఉంది

నీకు ఏది అవసరమో తెలియని ముర్కత్వంమూ ఉంది

ఒకే వస్తువును వాడటం నామోషీ., కొత్తదనం పేరుతో మారిపోతుండాలనే వెర్రితనం.

దానివలన

ఆరోగ్య పరంగా. ఎంత నష్టాన్ని కలగచేస్తుందో ఆలోచించాలి

నీ నుండి పుట్టబోయే నెక్స్ట్ తరాన్ని నాశనం చేస్తుంది కదా

ఏది మనకు అవసరమో ఆలోచిస్తే

మన తరువాతీ తరాన్ని మనం కాపాడుకోగలుగుతాం . (ప్రక్రుతి వ్యవసాయ రైతు . .. విజయా … గారి వాల్ నుంచి )

లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

(కామినేని-బాలకృష్ణ-చిరంజీవి వివాదం కథ)

ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రజల్ని నమ్మించడానికి “ఏ ఒక్కరినీ వొదిలేది లేదు” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పదే పదే చేసే చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూనే వున్నాయి. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తగ్గలేదన్న నివేదికలను ఈ వైఫల్యాలు దృవపరస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ “కామినేని శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ – చిరంజీవి” వివాదం.

ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఒక రాజకీయ వ్యూహం బెడిసికొట్టి, దాన్ని ప్రారంభించిన వారికే ఇబ్బందికరంగా మారిన ఉదంతం ఇది.

2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి శాసనసభను వేదికగా చేసుకుంది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించడానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని గుర్తుచేశారు.

చంద్రబాబుకి, చిరంజీవికి ఎన్ టి ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కామినేని ఉభయకుశలోపరి అన్నట్టుగా

చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్‌ను అహంకారిగా చిత్రీకరిస్తూ, అదే సమయంలో కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని హీరోగా ప్రశంసించడం ఆయన ఉద్దేశం.

కామినేని మాటలు ముగియకముందే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. జగన్‌ను ఎవరూ నిలదీయలేదని కామినేని వాదనను ఖండించారు. అంతటితో ఆగకుండా, జగన్‌ను “సైకోగాడు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. ఇది మిత్రపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. జగన్‌కు ప్రధాన విమర్శకుడిగా తనకున్న ఇమేజ్‌కు, కామినేని వ్యాఖ్య భంగం కలిగిస్తుందని బాలకృష్ణ భావించి ఉండవచ్చు. ఏమైనా ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు, కూటమిలోని సమన్వయ లోపాన్ని బయటపెట్టాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లౌక్యంగా ముగింపు పలికారు. ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఏమాత్రం అవమానించలేదని, సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జగన్ – చిరంజీవి దంపతులను భోజనానికి ఆహ్వానించి సాదరంగా గౌరవించారు. తరువాత సినిమా రంగం ప్రతినిధులతో కలిసి చిరంజీవి వెళ్ళినపుడు జగన్ వీరిని పట్టించుకోనట్టు వ్యవహరించి తన ఆధిక్యత చూపించారు. ఇందులో చిరంజీవి పాక్షిక వాస్తవాన్ని మాత్రమే అశ్వద్ధామ హత: కుంజర అన్నట్టు ప్రస్తావించి అంతేకాకుండా, తన చొరవ వల్లే సినిమా టికెట్ ధరలు పెరిగాయని, అది బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” చిత్రానికి కూడా మేలు చేసిందని సున్నితంగా గుర్తుచేశారు. ప్రత్యక్ష దాడికి దిగకుండా, వాస్తవాలతోనే ఆయన బాలకృష్ణకు సమాధానమిచ్చారు. తనను ఒక రాజకీయ పావుగా వాడుకోవడాన్ని నిరాకరిస్తూ, తన గౌరవాన్ని, స్వతంత్రతను చాటుకున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదం కూటమి ఐక్యతకు నష్టం చేస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ద్వారా వివాదాన్ని తుంచేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరిస్తూ, రికార్డుల నుంచి తొలగించాలని పెద్దరికంతో హుందాగా స్పీకర్‌ను కోరారు. స్పీకర్, కామినేని, బాలకృష్ణ ఇద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ వివాదాన్ని వైఎస్ఆర్సిపి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయని, వారు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తమ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఈ వ్యూహం పూర్తిగా విఫలమైంది. చిరంజీవి ప్రకటనతో, ఈ కథనంలో “బాధితుడు” లేకుండా పోయారు. కూటమి నాయకత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో, వైఎస్ఆర్సిపి ప్రచారానికి ఆయుష్షు లేకుండా పోయింది.

ఈ సంఘటన వైఎస్ఆర్సిపికి రాజకీయంగా నష్టాన్నే మిగిల్చింది. ఎలాగంటే ఈ వివాదం కూటమిలోని బలహీనతను కాకుండా, సంక్షోభాన్ని పరిష్కరించగల వారి నాయకత్వ బలాన్ని ప్రదర్శించింది. చిన్న సమస్యపై అతిగా దృష్టి పెట్టడం ద్వారా, వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని ప్రజలకు మరోసారి బోధపడింది. ఈ వివాదం, సినీ పరిశ్రమతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణాత్మక గతాన్ని ప్రజలకు తిరిగి గుర్తు చేసింది. ఇది వారికి “బూమరాంగ్” అయింది.

భారత్‌పై   బిల్ గేట్స్  ప్రశంసలు .. ఎందుకు >?

భారత్‌పై బిల్ గేట్స్ ప్రశంసలు .. ఎందుకు >?

  • ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అవుతుందంటూ కితాబు
  • ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి మద్దతుగా గేట్స్ ప్రకటన
  • భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మేలు చేస్తాయని వ్యాఖ్య

. ”ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోంది .., అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉంది … అని బిల్ గేట్స్ కొనియాడారు. భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సులేట్ జనరల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్ మాట్లాడుతూ… “ఈ రోజు భారత్ ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి, మెరుగుపరిచే పరిష్కారాలను అందిస్తోంది. ‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధనలో భారత్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. గాంధీజీ ఆశయాలైన సమానత్వం, గౌరవం తమ ఫౌండేషన్ పనికి పునాది వంటివని గేట్స్ పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. వాషింగ్టన్, సియాటిల్ నగర ప్రభుత్వాల నుంచి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ‘ప్రస్తుత ప్రపంచంలో గాంధీ విలువల ప్రాముఖ్యత’ అనే అంశంపై యూఎస్ గ్లోబల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు జొనాథన్ గ్రానోఫ్ ప్రత్యేక ప్రసంగం చేశారు.

బెల్వ్యూ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, సియాటిల్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

“అల్లం” రెగ్యులర్ గా  తింటే ఏమవుతుంది?

“అల్లం” రెగ్యులర్ గా తింటే ఏమవుతుంది?

వైద్య పరిశోధనల్లో స్పష్టమైన బెనిఫిట్స్ ఇవే . ..

రెగ్యులర్ గా వంటకాల్లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంలో వాపు, మంట లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు, వికారాన్ని తగ్గించే శక్తి పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్, అలర్జీ వంటి వాటిని అదుపులో ఉంచేందుకు అల్లం బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .

జీర్ణక్రియకు సహాయపడుతుంది : అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, జీర్ణాశయం నుంచి ఆహారం వేగంగా కదలడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అజీర్ణం , కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు. అలాగే, గర్భధారణ సమయంలో వచ్చే ఉదయపు వికారం, ప్రయాణంలో వచ్చే మోషన్ సిక్‌నెస్, కీమోథెరపీ తర్వాత వచ్చే వికారాన్ని తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది .

ఇందులో జింజెరోల్‌ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని, ఇవి బాడీ పెయిన్స్, వాపును తగ్గిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కారణంగా వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ అనారోగ్యాల లక్షణాలను తగ్గించడంలో, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్​లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వైద్య శాస్త్రంలో అనేక బెనిఫిట్స్ కూడా అల్లం లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది .

వాతావరణ  మార్పులపై ఈ   అధ్యయనం అమోఘం

వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం అమోఘం

2058లో తలెత్తబోయే దుష్ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ తో స్టడీ

ఎన్జీటీ సూచనలతో అమరావతిలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం – వచ్చే నెల చివరికి నివేదిక సిద్ధం

” వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది . రాజధాని అమరావతిలో రానున్న దశాబ్దాలలో ఎదురు కాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి …. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచన మేరకు రాజధాని నగరానికి సంబంధించి వాతావరణ మార్పులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా సంభవించే దుష్ఫలితాలను నివారించేందుకు CRDA తయారు చేయిస్తోంది. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బహుళ జాతి సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ లోకల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇనీషియేటివ్స్‌- ఇక్లీ(ICLEI) ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధ్యయనం సాగుతోంది. అక్టోబరు చివరి నాటికి పూర్తి నివేదికను సమర్పించనుంది.

అమరావతి వాతావరణంపై విశ్లేషణ : రాజధాని అమరావతి నగరంలో వాతావరణంపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి గత వాతావరణ గణాంకాలను ఇక్లీ సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వాయు నాణ్యతపై ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా 0.22 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర పెరుగుదల కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రతి దశాబ్దానికి 0.32 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గణాంకాలు వివిరించారు . 2015 – 2024 కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా 4.5 మిల్లీమీటర్ల చొప్పున వార్షిక వర్షపాతం పెరుగుతోంది. పెరుగుదల ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో కనిపించింది. వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి. ప్రతి దశాబ్దానికి 2.6 రోజుల చొప్పున తరుగుదల నమోదైంది. కానీ వర్ష తీవ్రత మాత్రం పెరుగుతోంది.

2058 నాటికి వాతావరణ మార్పులు : రాజధానికి సంబంధించి నీటి సరఫరా, వృథా నీరు, వర్షపు నీరు, ఘన వ్యర్థాలు, రవాణా, విద్యుత్తు, భవనాలు, ఆరోగ్యం, హరితం, జీవవైవిధ్యం, గాలి నాణ్యత అంశాలపై ఇక్లీ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వనుంది. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతికి మొదటి దశలో 386 MLD నీరు, వైకుంఠపురం నుంచి రెండో దశలో 539 MLD చొప్పున 2058 నాటికి మొత్తం 925 MLD నీరు అవసరమవుతుందని అంచనా. 15 శాతం మేర నీటి నష్టాలు ఉంటాయని లెక్కగట్టారు.

2058 నాటికి వృథా నీరు 723 MLD వస్తుందని, ఈ నీటిని శుద్ధి చేసేందుకు 12 STPలు, 1 CETP నిర్మించాల్సి ఉంది. శుద్ధి చేసిన నీటిలో పచ్చదనం కోసం వినియోగించుకోవచ్చు. రాజధాని నగరంలో 2058 నాటికి రోజుకు 3,956 టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉంది. ఇందులో తడి చెత్త 2,028 టన్నులు కాగా, పొడి చెత్త 1,436 టన్నులు. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో విద్యుత్తు వినియోగం 220.5 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌. 2058 నాటికి డిమాండ్‌ 10,756 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌కు చేరుకోవచ్చని అధ్యయనంలో గుర్తించారు. సౌరవిద్యుత్తు డిమాండ్‌ 7,954 మిలయన్‌ కిలోవాట్‌ అవర్‌గా ఉంటుందని అంచనా.

అమరావతిలో సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీలు : అమరావతిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీల సెంటిగ్రేడ్‌. రాజధానిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేయాలన్నది బృహత్‌ ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి పచ్చదనం పెంచితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర తగ్గే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. పచ్చదనం తక్కువగా ఉన్న అనంతవరం, లింగాయపాలెం, నేలపాడు, వెంకటపాలెం, నవులూరులో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తేలింది.

H- 1బీ వీసాలకు ప్రత్యామ్నామ్మ్ ఏమిటి

H- 1బీ వీసాలకు ప్రత్యామ్నామ్మ్ ఏమిటి

అమెరికా చదువులలో ఉన్న యువత ఆందోళన… ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో టెన్షన్

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలని కళలు కంటున్నా యువత కలలకు బ్రేక్ పడినట్లవుతోంది . టెక్‌ సంస్థలకు కూడా విదేశీ నిపుణులను అమెరికాలోని శాఖల్లో నియమించుకోవాలన్న కష్టతరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టెక్‌సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి. దీంతో ఇప్పడు అందరీ దృష్టి ఎల్‌-1, ఓ-1 పడింది. అసలు ఈ వీసాలు ఏంటి? వాటి ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి హెచ్‌-1బీ వీసా కీలకమార్గంగా ఉంది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును రూ.లక్ష డాలర్లకు ట్రంప్ సర్కార్ పెంచింది. దీంతో ఫీజు భారం ఎక్కువగా మారడంతో టెక్‌ కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఎల్‌-1, ఓ-1 వీసాలపై పడ్డాయి. పెరిగిన హెచ్‌-1బీ వీసా ఫీజుతో పోల్చుకుంటే వీటి ఫీజులు చాలావరకు అందుబాటులో ఉన్నాయి. అటు దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కుడా హెచ్‌-1బీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నా వీటి ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. ఓ-1 వీసా కోసం 12 వేల డాలర్లు ఖర్చవుతుంది. వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసినవారిలో 93శాతం మందికి లభించింది. అదే హెచ్‌-1బీకి వచ్చిన దరఖాస్తుల్లో 73శాతం తిరస్కరణకు గురయ్యాయి.

ఎల్‌-1 వీసాలను బహుళజాతి సంస్థలు తమ విదేశీ శాఖల నుంచి అమెరికాలోని శాఖల్లో పనిచేయడానికి ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఎగ్జిక్యుటివ్స్‌, మేనేజర్లకు ఎల్‌-1ఏ, ఆ రంగంలో నిపుణులకు ఎల్‌-1బీ రకం వీసాలను జారీ చేస్తారు. అయితే ఎల్‌-1ఏ వీసా పొందే ఉద్యోగి సంస్థకు సంబంధించిన విదేశీ శాఖలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. అది కూడా ధరఖాస్తు చేసే నాటికి ముందు మూడేళ్లలో కనీసం ఏడాదైన పని చేసి ఉండాలి. కంపెనీ పేరంట్‌-సబ్సిడరీ బ్రాంచ్‌కి సంబంధం ఉండాలి. ఈ వీసా వస్తే భవిష్యత్తులో EB-1C గ్రీన్‌ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆర్థికఏడాదిలో అమెరికా జారీ చేసిన ఎల్‌-1 వీసాల్లో 26శాతం భారతీయులకు దక్కాయి. ఓ-1 వీసాలు ఆర్ట్స్‌, సైన్స్‌, విద్యారంగం, వ్యాపారం, అథ్లెటిక్స్‌ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే నాన్‌ఇమిగ్రెంట్‌ వీసా. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడ రంగంలోని వారికి ఓ-1ఏ వీసాలుజారీ చేస్తారు. కళలు, సినిమా, టెలివిజన్‌ రంగంలోని వారికి ఓ-1బీ జారీ చేస్తారు. దీనికి ఉన్న 8 ప్రమాణాల్లో కనీసం మూడింటినైనా అందుకోగలగాలి. ఈ వీసాను తొలుత మూడేళ్లకు జారీ చేసినా ఆ తర్వాత ఏడాది చొప్పున ఎంతకాలమైనా పొడిగిస్తారు. పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతేడాది 19,457 వీసాలను అమెరికా జారీ చేసింది. కాకపోతే హెచ్‌-1బీని భర్తీ చేసే స్థాయిలో ఇది ఉండదు. ఈ వీసా కోసం ఆయా రంగాల్లో అత్యంత నిష్ణాతుడిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

తిరుమల ప్రతిష్ఠకు కవచం: నకిలీ వార్తలపై  ఉక్కుపాదం

తిరుమల ప్రతిష్ఠకు కవచం: నకిలీ వార్తలపై ఉక్కుపాదం

చివరికి దేవుడ్ని కూడా వదలడంలేదు సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ . ఇపుడు అలాంటి దుర్మార్గులకు టీటీడీ ఉక్కుపాదం మోపబోతోంది .

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తితిదే కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఇకపై తితిదేపై నకిలీ వార్తలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు

బ్రహ్మోత్సవాల సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు తితిదే పటిష్టమైన చర్యలు చేపట్టింది. తితిదే విజిలెన్స్ విభాగం, తిరుపతి పోలీసులు సంయుక్తంగా ఒక “ప్రత్యేక సామాజిక మాధ్యమ బృందాన్ని” ఏర్పాటు చేశారు. ఈ బృందం 24 గంటలూ సామాజిక మాధ్యమాలను పర్యవేక్షిస్తుంది. నకిలీ వార్తలను గుర్తించి, వాటిని వ్యాప్తి చేసే వారిపై దృష్టి సారిస్తుంది.

గత అనుభవాలతో కఠిన నిర్ణయం

గతంలో తితిదే అనేక దుష్ప్రచారాలను ఎదుర్కొంది. శ్రీవారి ఆభరణాల్లో ఒకటైన పింక్ డైమండ్ మాయమైందని జరిగిన ప్రచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణలో ఆ ఆరోపణలు అవాస్తవమని తేలింది. అలాగే, తితిదే నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లిస్తున్నారని, అన్యమత ప్రచారం జరుగుతోందని తరచూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. శ్రీవారి దర్శనం, వసతి పేరుతో భక్తులను మోసగించే నకిలీ వెబ్సైట్ల బెడద కూడా తీవ్రంగా ఉంది. ఇలాంటి నిరాధార ఆరోపణలు, మోసాలు సంస్థ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగించాయి. ఈ నేపథ్యంలోనే తితిదే ఇప్పుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.

చట్టపరమైన చర్యలు గ్యారెంటీ

తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని తితిదే ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అసత్య ప్రచారం చేసే వారిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద కేసులు నమోదు చేస్తారు. ప్రజా శాంతికి భంగం కలిగించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై చర్యలు ఉంటాయి.

ఈ కొత్త విధానం ద్వారా తితిదే రెండు లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. ఒకటి, దుష్ప్రచారం చేయాలనుకునే వారికి ఇదొక బలమైన హెచ్చరిక. రెండు, భక్తులకు సరైన, అధికారిక సమాచారం మాత్రమే చేరేలా చూడటం. తిరుమల పవిత్రతను కాపాడటంలో, భక్తులను మోసాల నుంచి రక్షించడంలో తితిదే రాజీపడబోదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగ దైవంపై ఇష్టానుసారం సోషల్ మీడియా వికృత చేష్టలకు ఇక చెక్ పడినట్లే భావించాలి .