by Srinivas Vedulla | Apr 17, 2025 | జాతీయం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు దూరంగా భారత్- డైరెక్టర్ మరియా నీరా కీలక వ్యాఖ్యలు
“గుండె జబ్బులు, కేన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్‌లు (NCDs) రావడానికి వాయు కాలుష్యం ఒక కారణం. సెప్టెంబర్‌లో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై లోతుగా చర్చ జరుగుతుంది. వాయు కాలుష్యంపై మనం పోరాడుతున్నప్పుడు, NCDల ముప్పు కూడా తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు WHO మార్గదర్శకాల కంటే చాలా దారుణమైన గాలి నాణ్యతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాలు మరింత దారుణమైన స్థాయికి చేరుకున్నాయి” – – డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ వింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira)
భారత దేశంలో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన సాధారణ ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వంట చేసుకోవడానికి కాలుష్య కారకాలైన కట్టెలు, పిడకలను ఉపయోగిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira), ఆందోళన వ్యక్తం చేసారు . భారత్‌లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు అవసరమని నీరా సూచించారు .
డాక్టర్ నీరా ఇటీవల పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . .. , గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఎల్‌పీజీ సబ్సిడీ వంటి పథకాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. “పథకాల నుంచి మంచి ఫలితాలను చూశాం. కానీ 41% భారతీయ గృహాలు ఇప్పటికీ బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.” అని స్పష్టం చేసారు .
by Srinivas Vedulla | Apr 16, 2025 | సినిమా
2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
ఆ స్టార్ సూర్య అని ఇటీవల ప్రచారం సాగుతోంది. నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.
by Srinivas Vedulla | Apr 15, 2025 | జనరల్
ఏకకాలంలో 50వేల మందితో భోజనాలు- ఉజ్జయినిలోని నాగర్ భోజ్ భండారా వరల్డ్ రికార్డు- 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌తో నోరూరించే వంటకాలతో పసందైన విందు
వెయ్యి మందికి భోజనాలు పెట్టాలంటేనే పెద్ద హంగామా చేయాలి. పదిమంది ఆ పనిలో నాలుగైదు రోజులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి . అలాంటిది ఏకంగా 50 వేల మందికి ఏకకాలంలో భోజనాలు పెట్టడమంటే మాటలా … అందుకే ఇది వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
ఆంజనేయ స్వామి జయంతి సందర్బంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని.. అంబాపూర్‌లో ఈ ఘనత చోటుచేసుకుంది . ఆ ఊరిలో ఉన్న పురాతన ‘జై వీర హనుమాన్’ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్తానం సంపాదించింది. ఈ కార్యక్రమానికి ‘నాగర్ భోజ్’ అని పేరు పెట్టారు . ఇందులో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది వాలంటీర్లు , కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.
ఆహార పదార్దాల తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించారు.
— సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది.
-ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.
by Srinivas Vedulla | Apr 14, 2025 | ఆంధ్రప్రదేశ్
34 వేల ఎకరాలు సరిపోదట .. మరో 44,670 ఎకరాలు భూమి సమీకరిస్తారట. వేల రైతు కుటుంబాలతో చంద్రబాబు ‘రిస్క్ గేమ్ ‘ ఆడటం ఎంతవరకు కరెక్ట్ ?
Chandrababu is working to sink Amaravati. If this trend continues, Andhra Pradesh will also sink.
అమరావతిలో గతంలో సేకరించిన భూములనే ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కనీసం 10 శాతం పనులు కూడా చేపట్టలేదు. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హడావుడి చేసి . .. అభాసుపాలయ్యారు. 2019-2024 మధ్య సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అరాచకాలను తరిమికొట్టాలని కంకణం కట్టుకున్న జనం ప్రత్యామ్నయంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , బీజేపీ కూటమిని గద్దెనెక్కించారు. కూటమి బలం కంటే . . జగన్ అరాచకాలకు భయపడి కూటమికి ఓట్లేసి గెలిపించిన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్నిక అది .. ఈ మాత్రం చంద్రబాబు అండ్ కో కు బుర్ర, బుద్ధి లేకుండా ఉన్నాయా ? ”అమరావతిలో అనుకున్న పనులేవీ ఇంకా ఆరంభించనేలేదు . . ఉన్న భూములు సరిపోవని , మరో భారీ భూసేకరణకు సిద్ధం కావడం చూస్తుంటే అమరావతిని చంద్రబాబు ముంచేలా కనిపిస్తున్నాడు.. అమరావతినే కాదు . .చంద్రబాబు పాలన ఇదే ధోరణితో సాగితే ఆంధ్రప్రదేశ్ నే ముంచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు . …
మెజార్టీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేసేలా కనిపిస్తోంది. ”అమరావతిని విశ్వ నగరం’గా తీర్చిదిద్దుతానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు . … ప్రకటనలంత బలంగా పనులు మాత్రం చేయించుడలేకపోతున్నారు. కూటమి అధికారం చేపట్టి పది నెలలు దాటుతున్నా . .. 2016 లో రాజధాని కోసం భూములు సేకరించిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తయారు చేసి ఇవ్వలేకపోయారు.
అమరావతిలో గతంలో సమీకరించిన భూములకు సైతం చెప్పుకోదగ్గ ధర పలకడంలేదు. కొర్ కేపిటల్ లో మాత్రం కొంతవరకు నడుస్తోంది. (90 శాతం మందికి 2018-2019లో ఇచ్చారు . వాటిని జగన్ సర్కార్ నిర్వాకంతో తుప్పలు మొలిపించి చెల్లాచెదురు చేశారు . . . వాటిని క్లియర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది)
”అమరావతి భూ సమీకరణ వరల్డ్ రికార్డ్. 34 వేల ఎకరాల భూమిని 29,650 మంది రైతుల నుంచి సమీకరించి . . సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రూపొంచాలని ప్లాన్ చేశారు ” నిజంగా ఇది చారిత్రాత్మకం . అయితే రెండో విడత భూ సమీకరణ అంత ఆషామాషీగా ఉండదు . ..
ఉన్న భూములలోనే మొదలెట్టలేదు . . 44,670 ఎకరాలు ఏంచేస్తారు ?
ఇప్పటికే 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. ప్రభుత్వ , అటవీశాఖకు చెందిన భూములు మరో 4,500 ఎకరాల వరకు ఉంది . మరో 3,500 ఎకరాలు సేకరించాలని గత0లోనే భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. 2016లో భూములు సమీకరణ చేసినా . .. … టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే నిర్మించగలిగారు. సచివాలయం నిర్మించినా , , దానికి తాత్కాలికం అని పేరు పెట్టడంతో అది కూడా చంద్రబాబు ఖాతాలోకి రాలేదు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి . .. అమరావతిపై కక్ష కట్టారు . మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి తెచ్చి . . అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
10 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అమరావతిపై ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంతవరకు ఓకే . పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు . గతంలో ఎమ్మెల్యే , ఎంఎల్సీ క్వాటర్స్ నిర్మాణాలు జరిగాయి. మిగిలిన పనులు ఫిబ్రవరి , మార్చి నెలల్లో మొదలుపెట్టారు . ఇంకొన్ని పనులు ప్రధాని మోడీ చేతులమీదుగా పునఃప్రారంభించిన తర్వాత చేపట్టనున్నారు .
పెట్టుబడిదారులు , పారిశ్రామికవేత్తలు చంద్రబాబును నమ్మడంలేదు: 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వ్యవహారశైలి దేశవ్యాప్తంగా అభాసుపాలయ్యేలా నడిచింది. ఇటీవల తానూ మారానని . . మారిన చంద్రబాబును చూస్తారంటూ పదేపదే ప్రకటలు చేస్తూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజలను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు కాలం చెల్లింది … ఇచ్చిన హామీలు సైతం ”తూచ్ ‘ చెప్పే నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. అలాంటి నేత ఇపుడు రెండో దఫా భూ సమీకరణలో భూములు ఇస్తే . . ఆ రైతులకు భరోసా ఏమిటి ? 2029 లో మరోమారు . .. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఉందా ? రాకపోతే మా పరిస్థితి ఏమిటి ? మేమిచ్చిన భూములలో అభివృద్ధి జరగకపోతే . . మేము ఏమి చేయాలి ? ఆ గ్యారెంటీ చంద్రబాబు ఇస్తారా ? అంటూ రాజధాని ప్రాంత రైతాంగం ప్రశ్నిస్తున్నారు .
రెండేళ్లలో అభివృద్ధి శరవేగంగా చేసి . . ప్రజలను , రాజధాని ప్రాంత వాసులలో నమ్మకం కలిగించడంతోపాటు , బీజేపీ కేంద్ర పెద్దలతో భరోసా ఇప్పించి . . అపుడు భూ సమీకరణకు సన్నాహాలు చేసుకుంటే మంచిది. చంద్రబాబుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లిన ఈ తరుణంలో భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు .
అమరావతి ప్రాంతంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, ఇన్నర్ , అవుటర్ రింగ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.
వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44,670 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రుపొంచిందించి.
ప్రస్తుత0 ఉన్న భూముల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేసిన తర్వాత , చేస్తున్న తరుణంలో భూ సమీకరణ అంటే జనం హర్షిస్తారు తప్ప . .. ఆలూ – చూలు – -లేకుండా తగనమ్మ . .. అంటే జనం ఛీ కొట్టే పరిస్థితి తలెత్తుతుందని చంద్రబాబు తెలుసుకుంటే అమరావతి భవిష్యత్తుకు మేలు జరుగుతుంది . లేదంటే అమరావతిని చేతులారా చంద్రబాబే ముంచేసే దుస్థితి ఎదురవుతుంది .
రాజధాని కోసం అవసరాల రీత్యా రెండో విడత భూ సమీకరణ చేస్తున్నామని ముందే సర్కార్ ప్రకటిస్తే బాగుండేది . అలా కాకుండా . . ఈనాడులో రైతులే తమ భూములను సమీకరించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు కధనాలు రాయించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి . చంద్రబాబు సర్కార్ పై నీలినీడలు అలుముకుంటున్నాయి . తర్వాత ఎలాగూ , ,, సిఆర్డిఏ కమిషనర్ భూ సమీకరణపై ప్రకటన చేశారు . ఈ దొంగాట వల్ల రైతులు , ప్రజలలో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ”అమరావతిని కొండవీటి వాగు , మద్దూరు వాగు ముంచేస్తాయనుకున్నారు . కానీ వాటి ముంపు సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ వాగులు వల్ల ముంపు ఆపిన చంద్రబాబు నిర్వాకమే అమరావతిని ముంచే పరిస్థితి తలెత్తుతుంది . ..” అని ఓ టీడీపీ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.
రైతుల ప్లాట్స్ అప్పగించాలి . . కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది . ఇంకా రైతులకు ఇవ్వాల్సిన రితనబుల్ ప్లాట్స్ అప్పగించలేదు . కనీసం వాటి సరిహద్దులు నిర్ణయించలేదు . ఇలా కాలయాపన చేస్తూ పొతే . . అమరావతి ఇరవై ఏళ్లకు కూడా పూర్తీ కాదు . . ,, – మాగంటి మురళీకృష్ణ . రైతు – తుళ్లూరు .
నవనాగరాలు పూర్తీ చేసి . . తర్వాత విస్తరణకు వెళ్ళాలి . . అమరావతిలో చంద్రబాబు ప్లాన్ చేసిన నవనాగరాల నిర్మాణం పూర్తిచేసిన తర్వాత 44 వేల ఎకరాల విస్తరణకు వెళ్ళాలి . కానీ ఏమీలేకుండానే భూ సమీకరణ అంటూ హంగామా చేయడం చంద్రబాబు విరమించుకోవాలి . – ఎం నాగేంద్ర ప్రసాద్ . – మంగళగిరి
జగన్ మళ్ళీ గెలిస్తే.? ఆంధ్రప్రజల గ్రహపాటు బాగాలేక పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే . .. ఏంటి పరిస్థితి. దీనిపై చంద్రబాబు , ఎలాంటి హామీ ఇస్తారు? మోడీతో హామీ ఇప్పించినా ఇక్కడ రైతులు , ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరు. చంద్రబాబు అమరావతితో ఆటలాడకుండా . .. ముందు ఉన్న భూములలో అభివృద్ధి చేసి . . తర్వాత విడతలవారీగా అవసరమైన భూములు సమీకరించుకోవాలి . – జి . సుందరరావు , అమరావతి .
by Srinivas Vedulla | Apr 14, 2025 | జనరల్
ఏ దేశానికీ సుంకాల నుంచి మినహాయింపు లేదని ట్రంప్ స్పష్టం- చైనా విషయంలో ఇక తగ్గేదిలేదని మరోమారు ప్రకటన
“అమెరికా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు కలిగిన, నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి మినహాయింపు లభించదు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎలాంటి టారిఫ్ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు అన్నీ 20% ఫెంటనిల్ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్ బకెట్‌లోకి మారాయి.” – డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వాళ్ళ చేతిలో బందీలుగా ఎందుకు ఉండాలి ?
“నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సెమీకండెక్టర్లు సహా, అమెరికా ప్రజలకు అవసరమైన ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలించాం. దీనిని బట్టి దేశీయంగా వాటిన్నింటినీ ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి, గతంలో ఇతర దేశాలు ఎలా వ్యవహరించాయో చూశాం. ముఖ్యంగా చైనా, అమెరికా పట్ల ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే, మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా, బలమైందిగా మార్చబోతున్నాం.అప్పుడు మాత్రమే మనం చైనా కబంద హస్తాల్లో బందీగా మారకుండా ఉంటాం. డ్రాగన్ అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని బాగా వాడుకొంటోంది. దానిని నేను కొనసాగనీయను. ఇక ఆ రోజులు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను నియంత్రణ వల్ల భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
అమెరికాలో తయారీపై ఫోకస్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై చైనాతో సహా పలు దేశాలపై ఆధారపడుతూ వస్తుంది . ఇకపై వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడంపై దృష్టిపెట్టినట్లు లుట్నిక్ చెప్పారు. “మాకు సెమీకండక్టర్లు, చిప్స్, ఫ్లాట్ ప్యానల్స్ చాలా అవసరం. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇకపై మాకు అవసరమైన వస్తువుల కోసం, ఆగ్నేయాసియాపై ఆధారపడదల్చుకోలేదు. అందుకే వారిని రివెంజ్ టారిఫ్‌ల నుంచి మినహాయించి, సెమీకండక్టర్ పన్నుల పరిధిలోకి తీసుకొద్దామని ట్రంప్ అంటున్నారు. బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సెమీకండక్టర్ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది” అని లుట్నిక్ పేర్కొన్నారు.
by Srinivas Vedulla | Apr 14, 2025 | పరిశీలన
‘మోదీ నా స్నేహితుడు . .’ అంటూనే ట్రంప్ మనపై భారీగా సుంకాల భారం మోపుతున్నాడు
భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులపై 27 శాతం సుంకాలు వహించారు ట్రంప్. అయితే మనదేశం నుంచి అమెరికాకు గతంలో పప్పు ధాన్యాలు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. ఇటీవల కాలంలో మనమే ఇతర దేశాల నుంచి పప్పు ధాన్యాల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ట్రంప్ సుంకాలు మనదేశంలో పప్పు ధాన్యాల సాగుచేసే రైతాంగంపై ఏ మాత్రం పడటంలేదనే చెప్పాలి . ఎందుకంటే మనం సాగుచేసే పప్పులు మనకే సరిపోవడంలేదు .
ఆస్ట్రేలియా , తాంజానియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది . మనదేశంలో సాగవుతున్న కొన్ని పప్పు ధాన్యాలను మాత్రం కొద్దిగా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు . ఇవి పెద్దగా ప్రభావవంతమైన ఎగుమతి కాదనే చెప్పాలి .
”భారతదేశం అధిక సుంకాలను విధిస్తోంది. ఇది భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా వారిని నిరోధిస్తుంది;; అనిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు . భారతదేశంతో వ్యవసాయ వాణిజ్యానికి సంబంధించి అనేక ఇతర దేశాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన చేస్తున్న అభియోగాలలో వాస్తవం ఎంత ?
భారతదేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి 2013-14 ఆర్థిక సంవత్సరం (FY)లో 19.25 మిలియన్ మెట్రిక్ టన్నుల (MT) నుండి 2014-15లో 17.3 మిలియన్ MTకి పడిపోయింది. 2014-15 మరియు 2015-16లో తరువాతి కరువు సంవత్సరాల కారణంగా ఇది మరింత తగ్గింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం భారతదేశం పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ పప్పుధాన్యాల దిగుమతులు ఆగలేదు.
2014-15లో 4.5 మిలియన్ టన్నులుగా ఉన్న పప్పుధాన్యాల దిగుమతిని 2015-16లో 5.8 మిలియన్ టన్నులకు ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్-జూలై, 2016లో, భారతదేశం ₹6,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో దాదాపు 1.26 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంది. 2017లో దిగుమతులు 6.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2018లో 5.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగాయి. 2023-24లో దిగుమతులు 4.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు కొనసాగాయి. దిగుమతులను నిరంతరం పెంచుతూ సేకరణ పరిమితులపై ఆంక్షలు విధించడం ద్వారా అదనంగా కొనసాగుతోంది.
తూర్, మసూర్ మరియు ఉరద్ పప్పుల విషయంలో, వాస్తవ ఉత్పత్తిలో 25 శాతం సేకరణ పరిమితిని 2023-24 మరియు 2024-25 సంవత్సరాలకు మాత్రమే ఎత్తివేశారు .
పెరుగుతున్న పప్పుధాన్యాల ధరలు, డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరం అంచనావేయాలి. పప్పుధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం, తప్పనిసరి దిగుమతులు మరియు సేకరణపై పరిమితులను ప్రస్తావించకుండా, ప్రభుత్వం 2015-16లో దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ఉత్పత్తి 163.23 లక్షల టన్నుల నుండి 2023-24లో 244.93 లక్షల టన్నులకు పెరిగిందని క్రమం తప్పకుండా ప్రకటిస్తోంది. ఈ ప్రకటన క్షేత్ర స్థాయి లెక్కలకు సరిపోవడంలేదు. దిగుమతులపై ఆధారపడి వ్యతిరేక మార్గాన్ని తీసుకున్నప్పటికీ, భారతదేశం స్వావలంబన సాధిస్తున్నామని చేస్తున్న ప్రకటనలపై అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి .
2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ పప్పుధాన్యాల దిగుమతులు గత ఆరు సంవత్సరాలలో అత్యధిక స్థాయికి 84 శాతం పెరిగాయి. పప్పుధాన్యాల దిగుమతి 2014 మరియు 2015లో సుంకం లేకుండా ఉంది, దీని ఫలితంగా 2016-17లో రికార్డు స్థాయిలో 6.6 మిలియన్ మెట్రిక్ టన్నులు దిగుమతి అయ్యాయి.
పప్పుధాన్యాల దిగుమతులు ప్రధానంగా కెనడా, మయన్మార్, ఆస్ట్రేలియా, మొజాంబిక్ మరియు టాంజానియా నుండి వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కెనడా నుండి ఎర్ర కాయధాన్యాలు (మసూర్) దిగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా 1.2 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి . “భారతదేశంలో పప్పుధాన్యాలు మరియు తినదగిన నూనెలను ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగం దిగుమతి చేసుకుంటుంది” అని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, వినియోగదారుడిగా, ఇప్పుడు దిగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ పప్పు ధాన్యాల వినియోగంలో దాదాపు 27 శాతం భారతదేశం వాటా కలిగి ఉంది. ప్రపంచంలోని పప్పు ధాన్యాలలో భారతదేశం దాదాపు 25 శాతం ఉత్పత్తి చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
by Srinivas Vedulla | Apr 13, 2025 | ఆరోగ్యం
సూర్యకాంతి నుండి విటమిన్ డి లభిస్తుంది . ఈ విషయం చాలామందికి తెలుసు కదా . . అయినా 82 శాతం మందిలో ‘విటమిన్ డి’ లోపం ఎందుకు?
భారతదేశంలో సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ఉష్ణమండల దేశం. 8-9 గంటలపాటు సూర్యుడు మనల్ని వెన్నంటే ఉంటాడు. అయినా ఎక్కుమందిలో విటమిన్ డి లోపం ఎందుకు ఏర్పడుతుంది?
ఈ వైరుధ్యం ప్రధానంగా ఆధునిక జీవనశైలి, సన్‌స్క్రీన్‌ల వాడకం పెరగడం, UVB కిరణాలను నిరోధించే వాయు కాలుష్యం మరియు శరీర దుస్తులు ధరించడం.. వంటివి కారణాలుగా చెపుతున్నారు . -కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, మానసిక స్థితి నియంత్రణలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం కారణంగా బలహీనమైన ఎముకలు, అలసట, కండరాల నొప్పి, తక్కువ రోగనిరోధక శక్తి వంటివీ కారణమవుతున్నాయి .
పెద్దలలో, విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమలేసియా అనే సమస్య వస్తుంది. దీనిలో భాగంగా, మన ఆహారంలో కాల్షియం శోషణ లేకపోవడం వల్ల, ఎముకలు సులభంగా విరగడం, కండరాలు, కీళ్ళు మరియు కీళ్లలో నొప్పి, బలహీనమైన దంతాలు మరియు రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక సమస్యలు సంభవిస్తాయి.
- విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి కొన్ని నియమాలు – ఇంకొన్ని చిట్కాలు
- ప్రతిరోజూ సూర్యకాంతిలో కనీసం 20 నిమిషాలపాటు ఉండండి. మీ చర్మపు రంగును బట్టి, మీ ముఖం, చేతులు మరియు కాళ్ళను ఉదయం 8–10 గంటల మధ్య 10 నుండి 30 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేయండి.
- ఈ సమయంలో సన్‌స్క్రీన్‌ను వాడకండి . ఎందుకంటే ఇది విటమిన్ డి ఉత్పత్తికి అవసరమైన UVB కిరణాలను అడ్డుకుంటుంది. క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్‌కు గురికావడం వల్ల చర్మం సహజంగా విటమిన్ D3ని సంశ్లేషణ చేస్తుంది.
- . మీ ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు, అంటే ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు, నారింజ రసం, తృణధాన్యాలు తీసుకోండి. భారతదేశంలో, అనేక ప్యాక్ చేసిన పాల ఉత్పత్తులు మొక్కల ఆధారిత పాలు ఇప్పుడు ఫోర్టిఫైడ్ గా వస్తున్నాయి, ఇది ముఖ్యంగా శాఖాహారులకు ఉపయోగకరమైన ఆహార వనరు.
ఊబకాయం ఉన్నవారిలో కూడా విటమిన్ డి ఉత్పత్తి సరిగ్గా జరగదు. మన చర్మంలోని మెలనోసైట్లు (చర్మ రంగుకు కారణమైన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి) సూర్యునిలోని UV కిరణాలను గ్రహిస్తాయి, విటమిన్ డి ఉత్పత్తిని నిరోధిస్తాయి. అందుకే, సూర్యకాంతి ఉన్నప్పటికీ, మన దేశంలో విటమిన్ డి లోపం చాలా ఎక్కువగా ఉంటుంది.
- వారానికోసారి కొవ్వు చేపలు తినండి సాల్మన్, సార్డిన్స్ మరియు మాకేరెల్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డి యొక్క అద్భుతమైన సహజ వనరులు.
- . అవసరమైనప్పుడు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి. వైద్యులు తరచుగా వారానికి లేదా నెలవారీ మోతాదులలో విటమిన్ డి 3 సప్లిమెంట్లను (కొలెకాల్సిఫెరోల్) సూచిస్తారు.
- గర్భిణీ తల్లికి విటమిన్ డి లోపం ఉంటే, పుట్టబోయే బిడ్డకు ఆ లోపం వచ్చే అవకాశం ఉంది. నవజాత శిశువులలో విటమిన్ డి లోపం సరిదిద్దకపోతే, ఎముకలు మరియు కండరాలు బలహీనపడతాయి మరియు దాని ప్రభావాలు జీవితాంతం ఉంటాయని మర్చిపోకండి .
by Srinivas Vedulla | Apr 13, 2025 | అభిప్రాయం
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై గంటల వ్యవధిలోనే చర్యలు
భువనేశ్వరి, చంద్రభాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ , హోంమంత్రి అనిత, తదితరులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేశారా ?
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ని పార్టీ నుంచి సస్పండ్ చేసి , , వెంటనే అరెస్ట్ చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడ్డారని ప్రజలలో మంచి పేరు సంపాదించారు. ఈ ఎపిసోడ్ లో పార్టీకి కూడా మైలేజ్ వచ్చింది. ఇంతవరకు ఒకే . కిరణ్ ని అరెస్ట్ చేయడం , సస్పండ్ చేయడం లో ఎవరికీ అభ్య0తరాలు లేవు . ‘తప్పు చేస్తే తమవాడైన వదిలేది లేదు . ‘ అనే సంకేతం పార్టీకి , ప్రభుత్వానికి మంచిదే . కానీ , అరాచకాలు చేసిన అవతలివాళ్ళను మాత్రం వదిలేస్తాం . . మనవాళ్లయితే లోపలేస్తాం . . అన్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు ధోరణి.. అంటూ టీడీపీ సీనియర్ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయ్ .
అంతకుముందు . .. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. తప్పు తెలుసుకుని తర్వాత క్షమాపణ కూడా చెప్పలేదు . భారతిపై వ్యాఖ్యలు చేసిన కిరణ్ తప్పు తెలుసుకుని ”అలా మాట్లాడటం తప్పే ‘ ‘ అని లెంపలేసుకున్నాడు . అయినా అరెస్ట్ చేశారు . తప్పు అని చెప్పినా వదలమని కాదు . గతంలో భువనేశ్వరి , వంగలపూడి అనిత , చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ వంటి నేతలపై అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డారు . ఒకరోజు , రెండు రోజులు కాదు . . నెలల తరబడి జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు . చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు . అరాచకవాదుల ఆట కట్టిస్తాడనుకున్నారు . కానీ ఒకరిద్దరిని లోపలేశారు . చేతులు దులుపుకున్నారు . . అన్నట్లు చేస్తున్నారు . వైసీపీ అరాచకవాదులు ఇంకా పదుల సంఖ్యలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై చర్యలకు కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడానికి కారణాలపై టీడీపీ , జనసేన కేడర్ లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి . వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నే ఉంది .
by Srinivas Vedulla | Apr 12, 2025 | జనరల్
చంద్రుడిపై నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగించే ఐడియా ఇస్తే .. రూ.25 కోట్లు బహుమతి : నాసా ప్రకటన
చంద్రుడిపై దాగి ఉన్న విశ్వ రహస్యాలను శోధించేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు.
రూ.25 కోట్ల ఆఫర్
చంద్రుడిపైనే ఉండిపోయిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాలని ‘నాసా ‘ దృష్టి సారించింది . ” లూనా రీసైకిల్” పేరిట ఒక ఛాలెంజ్‌ను ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు సృజనాత్మక ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి సుమారు . .. రూ.25 కోట్లు వరకు బహుమతి మనీ అందజేస్తామని చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది . శాస్త్రవేత్తలతోపాటు , సృజన శీలురూ బుర్రలకు పదునుపెట్టండి . .. పాతిక కోట్లు గెలుచేసుకోండి .
by Srinivas Vedulla | Apr 12, 2025 | జాతీయం, పరిశీలన
అన్నాడీయంకె తో చేతులు కలిపిన బీజేపీ – 2026 ఎన్నికల కోసం ఏడాది ముందే రంగంలోకి . ,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరియు మిత్ర పక్ష పార్టీలతో కలిసి పోటీ చేయడానికి ఎఐఎడిఎంకె తిరిగి ఎన్డీఏలోకి చేరింది. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే సీట్ల భాగస్వామ్యం మరియు ప్రభుత్వ కూర్పు వంటి విధానాలను తరువాత చర్చిస్తారు.
తమిళనాడు లో బీజేపీకి 3 శాతం కూడా ఓట్లు లేవు. అయినా 2026 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో కాలుమోపెందుకు , 2029 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదిలో బలోపేతం అయ్యే సంకల్ప0తో కమలనాధులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు . 2024 లో ఆంధ్రప్రదేశ్ లో సైతం . .. 2 శాతం ఓట్లులేని బీజేపీ 8 అసెంబ్లీ , నాలుగు లోక్ సభ సీట్లను గెలుపొందడం ద్వారా తమ సత్తా చాటుకుంది .
తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె ఇతర మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తాయి.
చెన్నైలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా బిజెపి-ఎఐఎడిఎంకె కూటమి పునరుద్ధరణను ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హాజరైనప్పటికీ, విలేకరుల సమావేశంలో మాత్రం అంతా ఆయన మౌనంగానే ఉన్నారు.
ఓ పన్నీర్‌సెల్వం మరియు ఇతర ఎఐఎడిఎంకె వర్గాలతో సాధ్యమయ్యే సంబంధాలపై వ్యాఖ్యానించడానికి అమిత్ షా కూడా నిరాకరించారు. “ఎఐఎడిఎంకె అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. ఎన్నికలకు సంబంధించిన విషయాల విషయానికొస్తే, చర్చలు మరియు నిర్ణయాలు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో తీసుకోబడతాయి” అని ఆయన అన్నారు.
అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాతే ఈ కూటమి ఏర్పడిందా అని అడిగినప్పుడు, షా మాట్లాడుతూ, “అందులో కొంచెం కూడా నిజం లేదు ఎందుకంటే అన్నామలై ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మరియు అందుకే ఆయన నా పక్కనే కూర్చున్నారు” అని అన్నారు.
అన్నామలై పనితీరు శైలి, దివంగత జె. జయలలితతో సహా అన్నామలై నాయకులను విమర్శించడం వల్లే ఆయన 2023 సెప్టెంబర్‌లో రెండు పార్టీలు విడిపోయేలా చేశారు.
తరువాత చర్చించే అంశాలు
పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య మరియు ప్రభుత్వ కూర్పు – కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత – తరువాత చర్చిస్తామని షా అన్నారు. “వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.
డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను సనాతన ధర్మం, త్రిభాషా విధానం మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను మళ్లిస్తున్నారని బీజేపీ నాయకుడు అన్నారు.
నీట్ అంశంపై, డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికి తన సమస్యలను ఉపయోగిస్తోందని షా అన్నారు.
బిజెపి ఎల్లప్పుడూ తమిళ ప్రజలను, తమిళ రాష్ట్రాన్ని మరియు తమిళనాడును గౌరవిస్తుందని హోంమంత్రి అన్నారు.
“ఆ గౌరవం మరియు తమిళ వారసత్వాన్ని గౌరవిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్టించారు. కానీ డిఎంకె దానిని తప్పుగా సూచిస్తోంది” అని ఆయన మండిపడ్డారు .
“మేము తిరుక్కురల్‌ను వివిధ ప్రపంచ భాషలలోకి అనువదిస్తున్నాము, ఇది ఇప్పటికే 63 భాషలలోకి అనువదించబడింది. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమిళనాడులో శాస్త్రీయ తమిళంలో పరిశోధనలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ తమిళ సాహిత్య పండితుల రచనలను కూడా ప్రచురించారు. నేడు, తమిళనాడులోని యువత తమిళంలో ఐఎఎస్ మరియు ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలు రాయగలరు. కానీ కేంద్రంలో డిఎంకె కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాలేదు” అని కూడా ఆయన అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఆయా రాష్ట్ర భాషలలో వైద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుందని షా అన్నారు. “గత మూడు సంవత్సరాలుగా, నేను తమిళనాడును సందర్శించిన ప్రతిసారీ, నేను దీని గురించి ఎంకె స్టాలిన్‌ను కోరుతున్నాను. అయితే, ఈ కోర్సులు ఇప్పటికీ తమిళంలో అందించడం లేదు” అని ఆయన అమిత్ షా చేసిన ఆరోపణలను ఈ సందర్బంగా గుర్తుచేసుకోవాలి .
డీఎంకేపై షా నిప్పులు చెరిగారు
డీఎంకే తన ఎక్సైజ్ విధానం ద్వారా ₹39,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఉచిత ధోతీ పంపిణీ మరియు 100 రోజుల ఉపాధి పథకం MGNREGA కూడా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన అన్నారు.
“డీఎంకే ఇసుక అవినీతి మరియు విద్యుత్ అవినీతితో సహా వివిధ అవినీతి కార్యకలాపాలకు పాల్పడింది. వారు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు” అని ఆయన అన్నారు.
ఏఐఏడీఎంకే నాయకులు కేపీ మునుసామి, ఎస్పీ వేలుమణి మరియు తంగమణి కూడా ఎడప్పాడితో ఉన్నారు.
మార్చి 25న ఎడప్పాడి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలోని షా నివాసంలో ఆయనను సందర్శించిన తర్వాత తమిళనాడులో సంబంధాలను పునరుద్ధరించే చర్యలు బహిరంగంగా వెలువడ్డాయి.