ఇదేం భాష … గుంటూరు మేయర్ పై హైకోర్టు ఆగ్రహం

” అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా?. నగర ప్రధమ పౌరుడు మాట్లాడేది ఇలాగేనా?. సేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప.. అసభ్యకర భాషతో కాదు. మురికి భాషను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలని అనుకోకూడదు. అసభ్యకర భాష వాడిన వారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందే. రాజకీయ పార్టీలు అవతలి వారి విధానాలు, పాలసీలను విమర్శించాలే కానీ , ఇలా వ్యక్తిగత దూషణాలేంటి ? . ప్రజాస్వామ్యంలో మేయర్ వాడిన పదజాలాన్ని అంగీకరించలేం. నగర … Read more

Ram Gopal Varma: హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ వినతి

‘వ్యూహం’ సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల వ్యంగ ఫొటోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానపై టీడీపీకి చెందిన మండల స్థాయి నేత కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం జరగాల్సిన పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని … Read more

Gachibowli: ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనలకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు.  మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. … Read more

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సీరియస్

లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వాకింగ్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా తరలించారు. దీనిపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం … Read more

Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’  అని పేర్కొన్నారు.   ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more

85 వేల కోట్ల పెట్టుబడి వస్తే . . ఆంధ్రా అవుతుందీ ….

ఇపుడు జరిగిన ఒప్పందాల పెట్టుబడులు ఈ రెండు , మూడేళ్ళలో వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న గుజరాత్ ను తలదన్నే రీతిలో ముందుకు సాగిపోతాం మనము కూడా . … అయితే ఒప్పందం జరిగిన తర్వాత వదిలేయకుండా పట్టుదలతో ఫాలో అప్ చేసే అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించాలి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34 వేల ఉద్యోగాలు కల్పించే … Read more

వాట్సాప్ లో మెసేజ్ చేసి డుమ్మా కొట్టాడు వర్మ . .

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్​ లను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వర్మ మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉన్న ఆర్జీవీ గైర్హాజరయ్యారు. వ్యూహం సినిమా … Read more

Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం .. భయం భయంగా జనం . ..

దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 … Read more

Ellections: ఇద్దరికంటే ఎక్కువమంది పిల్ల‌లున్నా ఎన్నిక‌ల్లో పోటీకి అర్హత‌

ఇక‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్నా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవకాశం. చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నాలుగు రోజుల క్రితం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. తాజాగా సోమ‌వారం బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే  ఆమోదం … Read more

Rushikonda: రిషికొండపై చర్చ

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో రాజధాని ఏర్పాటులో భాగంగా రుషికొండపై నిర్మించిన భవనంపై శాసనసభలో మంగళవారం చర్చ చేపట్టనున్నారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే దానిపై పలువురు సభ్యులు ఇప్పటికే సభలో ప్రశ్నలు అడిగారు. దీనికి తోడు సోమవారం సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. టిక్నో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అలాగే రుషికొండ, ఇసుక, మద్యం విక్రయాల్లో జరిగిన కుంభకోణం పైన స్వల్ప … Read more