టిడ్ కో ఇళ్ళు పేదలకు ఇచ్చేది ఎప్పుడు

Abhi Correspondent

కూటమి అధికారం చేపట్టి 20 నెలలు కావస్తున్నా . .. పేదల కోసం నిర్మించిన టిడ్ కో ఇళ్ల పంపిణీ పై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు .

పేదల సొంతింటి కల సాకారం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. అంటూ ప్రతిసారి హడావుడి చేస్తున్నారు తప్ప ఆచరణంలో జాప్యం అవుతోంది . . టీడీపీ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బెటర్ . . ఇప్పటికే ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించింది.

టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు: కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. జనం నుంచి వ్యతిరేఖత వస్తున్నా నేపథ్యంలో వచ్చే ఏడాది 2026 జూన్ నాటికల్లా టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి0డి . ఇప్పటికే జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ స్థితిలో ఇళ్లు ఉన్నాయి? వాటి పూర్తికి ఎంత బడ్జెట్ అవసరం తదితర అంశాలతో పూర్తి నివేదికను అధికారులు సిద్ధం చేశారు.

You May Also Like…