by Rama Chandra P | Jul 5, 2025 | పరిశీలన
ఈ నెలలో అన్నీ స్తబ్ద0గా ఉండటానికి కారణం తెలుసుకుందామా . ..
ఆషాఢ మాసం వచ్చిందంటే బట్టల షాపుల్లో భారీ డిస్కౌంట్స్ . ఇలా చాలా బిజినెస్ ల వారు డిస్కౌంట్ల మేళాలు పెట్టడం తెలుగు రాష్ట్రాలలో రెండు దశాబ్దాలుగా వస్తోంది . ఎందుకంటే ఈ నెలలో ఎక్కువ వ్యాపారాలు తగ్గుముఖం పడతాయి, డబ్బు చెలామణి తగ్గిపోతుంది అన్ని రంగాల్లో ఒక రకమైన స్తబ్దత ఆవరిస్తుంది. దీని వెనుక స్పష్టమైన మతపరమైన, సామాజిక, వ్యవసాయ ఆర్థిక కారణాలు ఉన్నాయి.
హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసాన్ని ‘శూన్య మాసం’గా పరిగణిస్తారు.
దీనికి ప్రధాన కారణాలు:
దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో దేవతలు యోగనిద్రలో ఉంటారని, వారి అనుగ్రహం పూర్తిగా ఉండదని ఒక నమ్మకం. అందువల్ల, వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, భూమి కొనుగోళ్లు వంటి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసే శుభకార్యాలను ఈ మాసంలో జరపరు. హిందూ కుటుంబాలలో ఇది సెంటిమెంట్
శుభకార్యాల ప్రభావం: పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరగనప్పుడు వాటిపై ఆధారపడిన అనేక వ్యాపారాలు సహజంగానే దెబ్బతింటాయి. బట్టల దుకాణాలు, బంగారం షాపులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, డెకరేషన్, రవాణా వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. ఇది మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని ఒక్కసారిగా తగ్గిస్తుంది.
వ్యవసాయ పనుల ముమ్మరం: ఆషాఢ మాసం వర్షాకాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది రైతులకు అత్యంత కీలకమైన సమయం. పెట్టుబడి అనంతరం విరామం: రైతులు అప్పటికే ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ఉంటారు. ఆషాఢ మాసంలో పొలం దున్నడం, నాట్లు వేయడం వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.
చేతిలో డబ్బు తక్కువ: వారి పెట్టుబడి అంతా భూమిలో ఉంటుంది. పంట చేతికి రావడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో రైతుల చేతిలో డబ్బు తక్కువగా ఉంటుంది. వారు అనవసర ఖర్చులు చేయరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముక కాబట్టి, వారి కొనుగోలు శక్తి తగ్గడం మొత్తం మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది.
వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం, అంటువ్యాధులు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు మరియు అనవసర ప్రయాణాలను, బయట తినడాన్ని మానుకుంటారు. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక రంగాలపై ప్రభావం చూపుతుంది.
ఆషాడ మాసంలో . .. (జులై ) వర్షాల కారణంగా ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి . ప్రజలు సొంత ఊళ్ళుమ్ ఇళ్లకే పరిమితం కావడానికి ఇది కూడా ఒక కారణం, తద్వారా వారి ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఆర్థిక చక్రంలో ఒక భాగం: ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం పండుగలకు, శుభకార్యాలకు పెట్టింది పేరు. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో మార్కెట్లో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజలు ఆషాఢంలో ఆదా చేసిన డబ్బును శ్రావణ మాసంలో ఖర్చు చేయడానికి మానసికంగా సిద్ధపడతారు. ఇలాంటి వాటిని బట్టే . .. కాబట్టి, ఆషాఢ మాసంలోని ఈ మందగమనం, రాబోయే పండుగల సీజన్‌కు ముందు వచ్చే ఒక సహజమైన ఆర్థిక విరామం లాంటిది.
ఆషాఢ మాసంలో కనిపించే ఆర్థిక మందగమనం కేవలం ఒక్క కారణం వల్ల ఏర్పడేది కాదు. శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాలు, వ్యవసాయ ఆధారిత జీవనశైలి, మరియు సహజమైన ఆర్థిక చక్రాలు అన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీస్తాయి. ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. శ్రావణం రాకతో మళ్లీ అన్ని రంగాల్లోనూ కొత్త కళ సంతరించుకుంటుంది
by Rama Chandra P | Jul 3, 2025 | ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి – టీడీపీ – వైసీపీ రాజకీయ క్రీడ
ఒక నాయకుడి కారు కింద పది కార్యకర్త చనిపోతే కారు సదరు నాయకుడిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం > >> అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . అయితే సింగయ్య కారుకిందపడినడిపుడు . .. కారు ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళితే ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు . కానీ చావు బతుకుల మధ్య ఉన్న సింగయ్యను పక్కనపడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు . సకాలంలో వైద్యం అందక సింగయ్య చనిపోయాడు .
ఒక కార్యక్రమంలో జగన్ ని చూసేందుకు వచ్చి జగన్ కారు కిందపడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు . సింగయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వార్తలలో నిలిచింది. పైకి చూస్తే, ఇది ఒక ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తుంది. నాగరిక సమాజంలో పలకరింపు, పరామర్శ, ఓదార్పు అనేవి మానవత్వానికి ప్రతీకలు. అయితే, ఈ సంఘటనను కేవలం మానవతా కోణంలోనే కాకుండా, దాని వెనుక ఉన్న పోలీసు కేసు, నైతిక బాధ్యతల నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
సింగయ్య మరణానికి కారణమైన ప్రమాదంపై నమోదైన కేసులో జగన్ రెండవ ముద్దాయి (A2). కారు కింద పడిన వ్యక్తిని పట్టించుకోకుండా, పక్కకు లాగి ముందుకు సాగిపోవడం “ఉద్దేశం లేని హత్య” (Culpable Homicide not amounting to Murder) కిందకు వస్తుందని, వాహన యజమానిగా ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేరమని పోలీసులు అభియోగం మోపారు.
జగన్ పై చర్యలు వద్దన్నారు . . సరే.. పిలిపించుకుని మాట్లాడటం సబబేనా?
ఈ అభియోగాన్ని కేసును పూర్తిగా కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) జగన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ, న్యాయమూర్తి “తొందరపాటు చర్యలు తీసుకోవద్దు” అని పోలీసులను ఆదేశించారు. దీని అంతరార్థం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జగన్‌ను అరెస్టు చేయరాదని! అయితే, అతడిని విచారించవచ్చో లేదో అనే విషయంలో స్పష్టత లోపించింది. చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టే, ఏమి చేయకూడదో ముద్దాయికి కూడా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయం కదా! దీన్నే ఊళ్ళలో ఏమీ చదువుకోని వారు కూడా “తల్లీ బిడ్డల న్యాయం” అంటారు. సమధర్మాన్ని సూచించే తల్లీబిడ్డల న్యాయం కోర్టులో కూడా కనబడాలి కదా!
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో, ముద్దాయి సాక్షులను లేదా బాధితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే, ప్రాసిక్యూషన్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది న్యాయ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం. జగన్ విషయంలో, ఆయన ఇంకా కేసు నుండి బయటపడలేదు. న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదు. అలాంటి సున్నితమైన దశలో, కేసులో బాధితులైన సింగయ్య కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
ఈ ప్రాథమిక విషయాన్ని విస్మరించి, బాధితులతో సమావేశమవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది బాధితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో లేదా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు, నిందితుడికి లభించిన తాత్కాలిక రక్షణను బాధితులను ప్రలోభపెట్టడానికో, ప్రభావితం చేయడానికో వాడుకోకూడదు.
న్యాయస్థానాలు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ నిర్ణయాలు కేవలం సాంకేతికంగానే కాకుండా, న్యాయాన్ని అందించేవిగా, ధర్మాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చట్టం (Law): సమాజ క్రమానికి రూపొందించిన నియమాల సమాహారం. న్యాయం (Justice): ఆ చట్టం ద్వారా సాధించాల్సిన అంతిమ లక్ష్యం. ధర్మం (Dharma): చట్టం మరియు న్యాయానికి ఆత్మ వంటిది. ఇది నైతికత, నీతి, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంటుంది.
సమాజాన్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకులు ఈ “ధర్మాన్ని” నిలబెట్టడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించాలి. వారి ప్రవర్తన సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ, ప్రస్తుత సంఘటనలో ఆ బాధ్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కోర్టు ఆదేశాలు, తీర్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులకు లభించే ఊరటలపై సామాన్యులలో సైతం చర్చ జరుగుతోంది. “పోలీసుల కాళ్లు కట్టేసి, దొంగతోపాటు పరుగెత్తమన్నట్లుంది తీర్పు,” లేదా “ఈ కోర్టులో ఇలాగే ఉంటుంది, పై కోర్టులో చూడాలి” వంటి వ్యాఖ్యలు ప్రజాబాహుళ్యంలో వినిపిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ “అప్‌డేటెడ్” ప్రజల అభిప్రాయాలను, వారిలోని నైతిక ఆక్రోశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
న్యాయవ్యవస్థ ప్రాథమికంగా చట్టానికి బాధ్యత వహిస్తుంది, కానీ ఆ చట్టాన్ని న్యాయాన్ని సాధించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ మొత్తం ప్రక్రియ “ధర్మం” అనే ఉన్నతమైన నైతిక చట్రంలో జరిగినప్పుడే దానికి సార్థకత. రానురాను ఆ సమతూకం దెబ్బతినడమే నేటి అసలు విషాదం.
అయితే ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి వైపు తప్పులేదంటూ తటస్థ వైఖరి ముసుగు వేసుకున్న కొందరు మేధావులు వాదిస్తున్నారు . ఒక మనిషిని కారు గుద్ది ప్రమాదంలో ఉంటె . .. అది తెలిసి కూడా వదిలేసి వెళ్లిపోవడం మానవత్వమా ? సదరు మేధావులు చెప్పాలి .
by Rama Chandra P | Jul 2, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండవ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు , స్థానికులకు ఇచ్చే బెనిఫిట్స్ గురించి ప్రభుత్వం విధివిధానాలు వెల్లడించింది .
రాజధాని మలివిడత భూసమీకరణ నిబంధనలు విడుదల – ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూసమీకరణ నిబంధనలు-2025గా ప్రభుత్వ ఉత్తర్వులు
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతోపాటు ఇతర ఆవరసరాలకు సంబందించి భూ సేకరణ ప్రక్రియ మొదలెట్టారు . మేరకు సీఆర్‌డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూసమీకరణకు సంబంధించిన నిబంధనల్ని సర్కార్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 217 చదరపుకిలోమీటర్ల పరిధిలోని రాజధానికి మినహా, మిగతా సీఆర్‌డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూసమీకరణ నిబంధనల్నే దాదాపుగా సీఆర్‌డీఏ ప్రాంతానికీ వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్‌లో భూసమీకరణలో భూములిచ్చే రైతులకూ వర్తింపజేయబోతున్నారు.
పట్టా భూములకు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ప్రతి ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్ స్థలాలు ఇవ్వనున్నారు. వివిధ కేటగిరీల అసైన్డ్ భూములకు, అభ్యంతరంలేని, అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నవారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు.
తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు.
భూసమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్ ఉంటే కుటుంబానికి గరిష్ఠంగా లక్షన్నర వరకు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తారు. భూసమీకరణ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తారు. అవసరమైన చోట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడి ప్రజలకు ట్రాక్టర్లు, నిర్మాణరంగానికి ఉపయోగపడే యంత్రసామగ్రి ఉంటే ప్రభుత్వం లేదా సీఆర్‌డీఏ చేపట్టే ప్రాజెక్టుల్లో వాటిని వినియోగించుకుంటారు. వారికి అద్దెచెల్లిస్తారు. ప్రైవేట్ భూముల్లోని టేకు చెట్లు నరికి, విక్రయించుకునేందుకు ట్రాన్సిట్ పర్మిషన్ జారీ చేస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడే నాటికే పంటలు ఉంటే ఫలసాయం తీసుకునేందుకు అనుమతిస్తారు.
కృష్ణా నది ఒడ్డు వెంబడి ఉన్న, 50 అడుగుల్లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న, ఏడాది పొడవునా వివిధ రకాల పంటలు పండే వాటిని జరీబు భూములుగా పరిగణిస్తారు. మెట్ట భూములతో పోలిస్తే వాటి విలువ ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ఎక్కువ ప్యాకేజీ ఇస్తోంది. భూములిచ్చిన రైతులకు స్థలాల్ని భూసమీకరణ తుది నోటిఫికేషన్ వెలువడిన 12 నెలలకు అప్పగిస్తారు.
తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది.
by Rama Chandra P | Jul 1, 2025 | ఆంధ్రప్రదేశ్
ఏమిటి? ఈ క్వాంటం వ్యాలీ హడావుడి. చంద్రబాబు నాయుడు తరచూ చెపుతున్న దీని గురించి చాలామందికి తెలియదు . గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటుంటే కూడా చంద్రబాబు విజన్ ను అర్ధం చేసుకోకుండా కువిమర్శలు చేసిన వారి నోళ్లు మూయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ హబ్ . క్వాంటం టెక్నాలజీలో పరిశోధన, ఇన్నొవేషన్ & స్కిల్స్ డెవలప్‌మెంట్‌కు ప్రపంచస్థాయి సెంటర్!
వీటి గురించి తెలుసుకుంటే … ఎవరైనా అడిగితె చెప్పడానికి ఉంటుంది . …
ఎందుకు?
– ఫ్యూచర్-రెడీ: క్వాంటం కంప్యూటర్లు వైద్యం, సెక్యూరిటీ, AIలో విప్లవం తెస్తాయి!
– ఆర్థిక పురోగతి: హై-టెక్ ఉద్యోగాలు, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షిస్తుంది.
– స్థానిక ప్రయోజనాలు:
–
వ్యవసాయం: నీటి/భూమి ఉపయోగ ఆప్టిమైజేషన్.
–
పోర్ట్‌లు (విశాఖ, కృష్ణపట్నం): కార్గో లాజిస్టిక్స్ స్మార్ట్‌గా నిర్వహణ.
–
ఆరోగ్యం: వైరస్‌లకు మందులు వేగంగా కనుగొనడం.
AP ప్రత్యేకత
– IIIT శ్రీ సిటీ, IIT తిరుపతితో కలిసి పని.
– తెలుగు యువతకు క్వాంటం స్కిల్స్ శిక్షణ. ఇవన్నీ సవ్యంగా జరిగితే రానున్న ఐదారేళ్లలో . …
– “డిజిటల్ ఆంధ్ర” నిజం అవుతుంది!
క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ గురించి . .. సామన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే. 90వ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే కూడా మెజార్టీ జనానికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్న వారే. ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది.
అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీని డీప్‌టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ దీని అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఐటీ సాఫ్ట్‌వేర్ సేవలకు భిన్నంగా కటింగ్-ఎడ్జ్ పరిశోధన, హార్డ్‌వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు గాను అమరావతిలో ఈ కేంద్రం కానుందని సర్కార్ చెబుతోంది.
అమరావతిలో 50 ఎకరాలను ప్రభుత్వం క్వాంటా0 వ్యాలీ కోసం కేటాయించింది. 2026 జనవరి 1 వ తేదీన వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నెల 30న క్వాంటం మిషన్ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్‌షాప్‌ను సర్కార్ నిర్వహిస్తోంది. రూ.4000ల కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది.
డీప్‌టెడ్ వ్యాలీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 1.5 మిలియన్ ఉన్నతస్థాయి ఉద్యోగాలు భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఆంచనా వేస్తోంది. క్వాంటం సైంటిస్టులు, రీసెర్చర్లు, క్వాంటం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, క్వాంటం హార్డ్‌వేర్ ఇంజినీర్లు, క్వాంటం-అవేర్ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, డొమైన్ నిపుణులు, సిస్టమ్ ఇంజినీర్లు, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అమెరికా యూనివర్సిటీలో . ..
అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్‌లో భాగం కానుంది. 2023-2024 నుంచి 2030-2031 మధ్య 8 ఏళ్లలో రూ.6300 కోట్లకు పైగా జాతీయ క్వాంటం మిషన్ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డీప్‌టెక్ రీసెర్చ్ పార్క్‌కు సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది.
క్వాంటం కంప్యూటింగ్ మార్కెట్ 2024లో 71.4 మిలియన్ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్ డాలర్లకు చేరే ఛాన్స్ ఉంది . ఈ అవకాశాన్ని అందింపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటం లీడర్‌గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తోంది.
దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ 156-క్యూబిట్ క్వాంటం సిస్టమ్-2ను ఐబీఎం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎల్ అండ్ టీ సంస్థ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే క్వాంటం కంప్యూటింగ్ సేవలు, హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్‌లను టీసీఎస్ అందించనుంది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, తయారీ రంగాల్లో క్వాంటం సామర్థ్యాలను టీసీఎస్ అనుసంధానిస్తుంది.
by Rama Chandra P | Jun 28, 2025 | ఆంధ్రప్రదేశ్
ఇలాంటివి ప్రజాస్వామ్య ధిక్కారం కింద పరిగణించాల్సిందే ….
‘అభిప్రాయ సేకరణ ‘ స్కాన్ చేయమంటే ఎంతమంది వైసీపీ బ్యాచ్ ని నమ్ముతారు ?
గంజాయి స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం . . వారికి మాత్రం వైసీపీ అధినేత జగన్ పరామర్శలు . .. ఎక్కడికిపోతున్నాం . .. అంటూ సమాజం లో కొన్ని వర్గాలు ఆ పార్టీని , సదరు నేతను ఛీత్కరించుకుంటున్నా ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు .
వైఎస్ఆర్‌సీపీ “రీకాల్” కార్యక్రమం రాజకీయ దాడిగా కనిపిస్తున్నప్పటికీ, శాసనసభ బహిష్కరణ, చట్టవ్యతిరేక ఆరోపణలు, సమీక్షా రాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సరిదిద్దకపోతే, పార్టీ రాజకీయంగా మరింత బలహీనపడే అవకాశం ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ప్రకటించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో” కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు1 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్ఆర్‌సీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు వారాల పాటు ఇంటింటికీ వెళ్లి, క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతలకు ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తూ, ప్రజాతీర్పును అవమానిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం చవిచూసింది. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు సాధించి, రాష్ట్రంలోని 13 జిల్లాలకు 8 జిల్లాల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈ ఓటమి తర్వాత పార్టీలో సమగ్ర సమీక్ష జరగలేదు. ఓటమికి కారణాలను విశ్లేషించడం, లోపాలను సరిదిద్దుకోవడం జరగలేదు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మొక్కుబడి ప్రకటన కూడా చేయలేదు. బదులుగా, “రీకాల్” కార్యక్రమం పేరుతో ప్రతిపక్షంపై దాడిని ఉధృతం చేసింది. ఈ వైఖరి పార్టీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేని అసమర్థతను సూచిస్తుంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా, శాసనసభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారి బాధ్యత. అయితే, ఈ బాధ్యతను విస్మరించి, సభను బహిష్కరించడం ద్వారా ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. శాసనసభ బహిష్కరణ ద్వారా పార్టీ తన రాజకీయ అసమర్థతను బహిర్గతం చేసుకుంటోంది, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోంది.
గతంలో నిర్వహించిన “గడపగడపకూ” కార్యక్రమం ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, అది విఫలమైంది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిరస్కరించి, వైఎస్ఆర్‌సీపీని ఓడించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, “రీకాల్” కార్యక్రమంతో మళ్లీ ప్రతిపక్షంపై దూషణలకు దిగింది. ఈ వైఖరి వైఎస్ఆర్ సిపి వ్యూహాత్మక లోపాన్ని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని లోటును బయటపెడుతోంది.
వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలకు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటువంటి చర్యలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, శాసనసభ బహిష్కరణ ద్వారా వైఎస్ఆర్‌సీపీ ఈ బాధ్యతను విస్మరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో “రీకాల్” ప్రకటించడం పార్టీ నైతిక అర్హతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు పార్టీ వైఖరిపై బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో జగన్ నిర్ణయాలపై విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు నిశ్శబ్దం వహించడం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తుంది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్యకర్తలు జగన్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతివిశ్వాసం, పోల్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలు ఓటమికి కారణమని ఆరోపించారు. అయినప్పటికీ, ఈ అసంతృప్తిని పరిష్కరించే చర్యలు తీసుకోలేదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సవాలు చేయకపోతే, పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సర్వోన్నతం. ఓడిన పార్టీలు తమ లోపాలను సమీక్షించుకుని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలి. అయితే, వైఎస్ఆర్‌సీపీ ఈ మార్గాన్ని విస్మరించి, శాసనసభను బహిష్కరించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, “రీకాల్” ద్వారా ప్రతిపక్షంపై దూషణలకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. “గడపగడపకూ” కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో, “రీకాల్” కూడా విఫలమైతే, పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. ఈ వైఖరి పార్టీ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు .. అంటూ పలువురు జగన్ అంటే ఇష్టపడే వాళ్ళు సైతం సూచిస్తున్నారు . అయినా అతని వైఖరిలో మార్పు వస్తుందని భావించడం వీరి అమాయకత్వమే అవుతుంది .
కూటమి హామీలపై వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయాలని జగన్ ఆదేశం. స్థానికంగా వైసీపీ చోటా నేతలు ఈ పనిని చేయ్యపట్టాల్సి ఉంటుంది . అయితే ఇప్పటికే జనంలో స్థానిక వైసీపీ వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం గురించి తెలిసిందే. ఈ ప్రభావంతో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అభాసుపాలవుతుందని మెజార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .