అమరావతి ల్యా0డ్ పూలింగ్.. రైతులకు ఇచ్చే బెనిఫిట్స్

Rama Chandra P

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండవ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు , స్థానికులకు ఇచ్చే బెనిఫిట్స్ గురించి ప్రభుత్వం విధివిధానాలు వెల్లడించింది .

రాజధాని మలివిడత భూసమీకరణ నిబంధనలు విడుదల – ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత భూసమీకరణ నిబంధనలు-2025గా ప్రభుత్వ ఉత్తర్వులు

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతోపాటు ఇతర ఆవరసరాలకు సంబందించి భూ సేకరణ ప్రక్రియ మొదలెట్టారు . మేరకు సీఆర్‌డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూసమీకరణకు సంబంధించిన నిబంధనల్ని సర్కార్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 217 చదరపుకిలోమీటర్ల పరిధిలోని రాజధానికి మినహా, మిగతా సీఆర్​డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూసమీకరణ నిబంధనల్నే దాదాపుగా సీఆర్​డీఏ ప్రాంతానికీ వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్​లో భూసమీకరణలో భూములిచ్చే రైతులకూ వర్తింపజేయబోతున్నారు.

పట్టా భూములకు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్‌ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ప్రతి ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్‌ స్థలాలు ఇవ్వనున్నారు. వివిధ కేటగిరీల అసైన్డ్‌ భూములకు, అభ్యంతరంలేని, అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నవారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు.

తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్‌ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు.

భూసమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ ఉంటే కుటుంబానికి గరిష్ఠంగా లక్షన్నర వరకు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తారు. భూసమీకరణ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తారు. అవసరమైన చోట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడి ప్రజలకు ట్రాక్టర్లు, నిర్మాణరంగానికి ఉపయోగపడే యంత్రసామగ్రి ఉంటే ప్రభుత్వం లేదా సీఆర్‌డీఏ చేపట్టే ప్రాజెక్టుల్లో వాటిని వినియోగించుకుంటారు. వారికి అద్దెచెల్లిస్తారు. ప్రైవేట్ భూముల్లోని టేకు చెట్లు నరికి, విక్రయించుకునేందుకు ట్రాన్సిట్‌ పర్మిషన్‌ జారీ చేస్తారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వెలువడే నాటికే పంటలు ఉంటే ఫలసాయం తీసుకునేందుకు అనుమతిస్తారు.

కృష్ణా నది ఒడ్డు వెంబడి ఉన్న, 50 అడుగుల్లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న, ఏడాది పొడవునా వివిధ రకాల పంటలు పండే వాటిని జరీబు భూములుగా పరిగణిస్తారు. మెట్ట భూములతో పోలిస్తే వాటి విలువ ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ఎక్కువ ప్యాకేజీ ఇస్తోంది. భూములిచ్చిన రైతులకు స్థలాల్ని భూసమీకరణ తుది నోటిఫికేషన్‌ వెలువడిన 12 నెలలకు అప్పగిస్తారు. 

తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్‌ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది.

You May Also Like…