తమ ఆమోదం ఉండాలంటున్న చైనా – అవసరంలేదన్న బౌద్ధ గురువు
దలైలామా . .. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ గురువు. బౌద్ధంలో కీలక , చారిత్రక వ్యవహారాలపై ఆయన తీసుకునే నిర్ణయాలకు బౌద్ధ సమాజం మద్దతుగా నిలవడం ఆనవాయితీ. అయితే దలైలామా వారసుడి ఎంపికపై చైనా నిర్ణయంతో తాజాగా వివాదం నెలకొంది .
” నా వారసుడిని నిర్ణయించే అధికారం నాకు మాత్రమే ఉంది..” అంటూ బౌద్ధ మత గురువు దలైలామ చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ”దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారంలో తప్పనిసరిగా మా ఆమోదముద్ర ఉండాల్సిందే…” అని చైనా స్పష్టంగా పేర్కొంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు . దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది . టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పుచేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ఉబలాటపడుతోంది.
దలైలామా పోస్టు తో ….
”15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది , దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉంటుంది . ..” అని సోషల్ మీడియాలో దలైలామా పోస్టు చేశారు . ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా వెంటనే విదేశాంగమంత్రితో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వాదనకు దిగింది . 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. తను తదనంతరం (మరణించిన తర్వాతే) తన వారసుడు వస్తారని దలైలామా స్పష్టం చేశారు. 2015లో ఈ ట్రస్ట్‌ను దలైలామా ఏర్పాటు చేశారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మతపెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు తేటతెల్లం చేసారు .
‘వారసుడి ఎంపిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని అనుసరించాల్సిందేనని మావో నింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ అర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది’ అని మావోనింగ్ అన్నారు. అయితే, మావోనింగ్ దలైలామా వ్యాఖ్యలకు ఇచ్చిన స్పందన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ట్రాన్స్‌క్రిప్ట్‌లో లేకపోవడం గమనార్హం.
లివింగ్ బుద్ధా పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్‌లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. ‘దలైలామ కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది. వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు, మత సంప్రదాయాల ఆధారంగా మాత్రమే జరగాలి’ అని ద్వారా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
అమ్మమ్మలు , నానమ్మల కాలంలో కాస్త అజీర్తిగా అనిపిస్తే… కాస్త వాము వేయండి .. అనేవారు . వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలలో తేలింది.
వాము . .. కేవలం వంటలలో రుచిని అందించడంతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది .
అజీర్తి, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు, అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుండి . వాములోని థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్, కడుపు ఇబ్బరం వంటివి . అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుండు , ఇది కడుపులోని ఆమ్లాలను తటస్థీకరించి, ఎసిడిటీ, గుండెల్లో మంటను తగ్గింస్తుంది . వాములో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు కండరాల నొప్పులు, కడుపు నొప్పి, తిమ్మిర్లను నియంత్రిస్తాయి .
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : వాములో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక ఓషధ గుణాలు వాములో ఉన్నాయి . దగ్గు , జలుబుతో బాధపడేవాళ్లు . .. కాసింత వామును నమిలితే ఉపశమనం కలుగుతుంది .
ఆస్తమా : ఇది శ్వాసనాళాలను సడలించి, గాలి ప్రవాహాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి ఇస్తుంది . వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది .
శ్వాసకోశ వ్యవస్థ : వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని థైమోల్ ముక్కు రంధ్రాలను శుభ్రం చేస్తుందని, శ్లేష్మాన్ని తొలగించడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుందని వివరించారు. ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం. ఆయాసం , విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగించే వారని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ స్పష్టం చేస్తుంది .
మౌత్ వాష్ నర్ గా ….వాము నూనెను టూత్‌పేస్ట్, మౌత్ వాష్‌ల్లో వాడతారని, ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి . . నోటి దుర్వాసన రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వాము వేసి మరిగించినా నీటిని గోరువెచ్చగా వేడి చేసుకోని, ఆ తర్వాత ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు దూరమవుతాయి .
బాలింతలకు మేలు! : గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుందని, అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా గర్భవతులు వామును రోజూ తీసుకుంటే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని పేర్కొన్నారు.
గ్యాస్ ట్రబుల్ : కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్యాస్ ట్రబుల్‌తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టిన నీరును గోరువెచ్చగా తాగితే పొట్టలోని గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా వాము పొడిని నమిలితే కూడా గ్యాస్ తగ్గిపోతుందని చెపుతున్నారు .
వాము ఆకులతో . .. వాము ఆకులతో బజ్జీలు వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి . వాము ఆకలి కాషాయం కొన్ని వ్యాధులకు పరిస్కారం చూపుతుంది .
హైదరాబాద్ లో పెట్టుబడులపైనే ఆసక్తి… ఓ సర్వేలో వెల్లడి.. ఏపీ రాజకీయాలపై నీలినీడలు
అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని కూటమి అదేపనిగా చెపుతున్నా … ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐ లు సైతం అమరావతిలో భూములు , స్థలాలు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.
వీడని జగన్ భయాలు: 175 అసెంబ్లీయే సీట్లకుగాను . . 164 చోట్ల కూటమి గెలుపొంది… జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినా ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంకా స్తబ్దన్గానే ఎందుకు ఉంది? కూటమి పాలనపై పెట్టుబడిదారులతో ఇంకా విశ్వాసం పెరగలేదా ? ”జగన్ అండ్ కో ఘోరంగా ఓటమిపాలైనా. రాష్ట్రంలో ఎక్కడ ఏ అరాచకాలకు పాల్పడతారోనన్న ఆందోళన ఇంకా కొన్ని వర్గాలలో ఉంది. దీనికి చంద్రబాబు జనంలో బలమైన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అమరావతిలో భూములు కొనుగోలు చేద్దామంటే . .. మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. కూటమి నేతలు మాటవరసకు భరోసా ఇస్తున్నా . .. జగన్ భయాలు మాత్రం మాలో ఇంకా పోవడంలేదు . ...” అని అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక NRI ‘అభిన్యూస్ ‘ ప్రతినిధితో తన అభిప్రాయం వెలిబుచ్చారు.
అమరావతిపై బాబు ఆటలు: 2014-2019 మధ్య అమరావతిని హంగులతో చూపించారు. కొంతవరకు పనులు చేసినా , ,, భారీ ప్రచారం దెబ్బకొట్టింది. చేసింది పావలా అయితే . ..రూపాయిన్నర పబ్లిసిటీ చేయడం అమరావతిపై నమ్మకంలేకుండా చేసింది. ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. అయితే ఇందులో అభివృద్ధి పనులు కనీసం 10-15 శాతం కూడా కాకుండానే . .. రెండో విడత విస్తరణ పేరుతో మరో 40 వేల ఎకరాల భూ సమీకరణకు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు , అమ్మకాలు లావాదేవీలలో స్తబ్దత ఏర్పడింది. కూటమి గెలుపుతో ఒక్కసారిగా జోరందుకున్న అమరావతి భూముల ధరలకు రెండోవిడత భూ సమీకరణ బ్రేక్ వేసింది.
పనులు అంతంతమాత్రం.. పబ్లిసిటీ మాత్రం.. చంద్రబాబుకు చేసిన దానికంటే ఎక్కువ చెప్పడం ముందు నుంచీ అలవాటు. ఇది కాస్త దెబ్బతీస్తుది.” కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది . . ఇంతవరకు గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్స్ అప్పగించలేదు. ఏడాది కాలం సరిపోలేదా ? ఇంత జాప్యం చేస్తుంటే జనంలో నమ్మకం ఎలా కలుగుతుంది.. ఈ ధోరణి మార్చుకోవాలి . …లేకపోతె అమరావతి వైపు పెట్టుబడులు వచ్చే పరిస్థితులు ఉండవు . ..” అని తుళ్లూరు ప్రాంతానికి చెందిన మురళి అనే యువకుడు అభిప్రాయపడ్డారు.
NRI ల పెట్టుబడులు హైదరాబాద్ లోనే . .. అమెరికా , బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా , కువైట్ , అబుదాబి , మస్కట్ , జర్మనీ , వంటి దేశాల్లో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)కు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఇది కూడా అమరావతిలో పెట్టుబడులు రాకపోవడానికి ఒక ప్రధాన కారనంగా చెప్పవచ్చు . కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ పెట్టుబుడులు పెట్టేందుకు హైదరాబాద్ నే మొదట ఎంపికగా ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. అయితే హైదరాబాద్ లో ఏడాదిన్నరగా రియల్ కుదేలైన కారణంగా అక్కడ కూడా పెట్టుబడులు ఆగాయి. కొంతమంది వారు పనిచేస్తున్న దేశాలలోనే ఇళ్ళు , భూములపై పెట్టుబడులు పెట్టడం ఇటీవల ఎక్కువయింది.
ఎన్ఆర్ఐ ల అనుమానాలను కూటమి సర్కార్ నివృత్తి చేయాలి. జగన్ వస్తే . . జగన్ వస్తే . … అనే స్లోగన్ కు మెజార్టీ ఎన్ ఆర్ ఐ లు భయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు , పవన్ వంటి నేతలు ఎన్ని చెప్పినా వాళ్లలో భరోసా కల్పించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారని ఒక సర్వేలో తేలింది. జగన్ పర్యటనల సందర్బంగా చేస్తున్న అరాచకాలకు కూడా జనంలోనూ , విదేశాలలో ఉండే మనవాళ్లలోనూ అనుమానాలు బలపడుతున్నాయి . దీనిపై పూర్తిగా కూటమి సర్కార్ వైఫల్యం అనే చెప్పలేం . .. జగన్ ధోరణిలో మార్పు రానంతవరకు . ..ఈ అనుమానాలు ఇలాగే కొనసాగుతాయి. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయ్ . దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .
విశాఖ తీరంలో 22 కిలోమీటర్ల మేర యోగాడే భారీ నిర్వహణ
విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు – ప్రతీ వెయ్యిమందికి ఒక బ్లాక్, బ్లాక్‌కు ఒక యోగా గురు – ఆంధ్ర వర్సిటీలో రోజుకు 200 మంది అధ్యాపకులకు యోగా శిక్షణ.
ఈ నెల 21నవిశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానితోపాటు 5 లక్షలు మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి, ఒక యోగా శిక్షకుణ్ని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్రా వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతోపాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్‌కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతోపాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకూ 22 కిలోమీటర్లు మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు.
విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో ఈ నెల 21న ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ‘యోగా సంగమం’ పేరుతో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు, 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు.
మతం కాదు . … చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు యోగా అనేది ఒక మతం కాదు, ఇది ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సును లక్ష్యంగా చేసుకునే జీవన విధానం. మనిషి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక జీవి, మన వేదాలలో చెప్పినట్లుగా యోగా ఈ మూడింటి మధ్య సమతుల్యతను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది . ఏరోబిక్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు శారీరక శ్రేయస్సును మాత్రమే నిర్ధారిస్తాయి. ఈ వ్యాయామాలు ఆధ్యాత్మిక లేదా ఆస్ట్రల్ బాడీ మెరుగుదలతో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంటాయి.
యోగా ఒక సాధన మాత్రమే కాదు, అది జీవన దృష్టికోణం. యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ సంస్కృతిని గర్వకారణంగా నిలుపుతోంది. యోగా భారతీయ సంస్కృతి, జీవన విధానంలో ఒక అమూల్యమైన వారసత్వం. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమేకాదు, ఆధ్యాత్మిక, మానసిక, శాస్త్రీయ, సాంస్కృతిక కోణాల నుండి మానవ జీవనాన్ని సమగ్రంగా సుసంపన్నం చేసే ఒక సంపూర్ణ జీవన శైలి. యోగాను సమగ్ర జీవన శైలిగా స్వీకరించడం ద్వారా వ్యక్తులు, సమాజం ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనాన్ని సాధించగలరు.
దేశమంతటా పాఠ్యాంశం – GSL తో ప్రారంభం..
శరీర నిర్మాణ శాస్త్రానికి, యోగ సాధనకు వున్న సంబంధాన్ని గుర్తించిన డాక్టర్ గన్ని భాస్కరరావు తమ GSL ఫిజియోథెరపీ, స్వతంత్ర ఫిజియో థెరపీ కాలేజీలలో ఒక సంవత్సరం యోగా కోర్సును 2017 సంవత్సరంలో ప్రారంభించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇవ్వడంతో దేశంలో మొదటి సారిగా పారామెడికల్ కోర్సులో యోగా ఒక సబ్జెక్టు అయ్యింది. వచ్చే సంవత్సరం నుంచి ఫిజియో ధెరపి రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్టుగా యోగాను చేరుస్తూ డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుపై ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ లో ప్రతి విద్యార్ధీ 21 రోజుల పాటు యోగ సాధన చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అకడమిక్ ప్రోగ్రాంలో చేర్చింది. అన్ని మెడికల్ కోర్సుల్లో యోగ సాధనను పాఠ్యాంశంగా చేర్చే విధంగా ఆయా విభాగాల అధికారులు జాతీయ స్ధాయిలో అకడమిక్ కేలెండర్లు రూపొందిస్తున్నారు. యోగ ను ఒక పాఠ్యాంశంగా ప్రారంభించడంలో రాజమండ్రి జిఎస్ఎల్ ఫిజియోథెరపీ ముందడుగు వేయగా ఇపుడు ఆ పాదముద్రలు దేశమంతటా విస్తరిస్తున్నాయి.
ఆధ్యాత్మిక కోణం
యోగా మూలాలు భారతీయ ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. పతంజలి రచించిన యోగసూత్రాలు యోగాను “చిత్తవృత్తి నిరోధః” (మనస్సు యొక్క చంచలత్వాన్ని నియంత్రించడం)గా నిర్వచించాయి. యోగా ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ద్వారా ఆత్మను శుద్ధి చేసి, దైవంతో ఐక్యతను సాధించే మార్గాన్ని చూపుతుంది. భగవద్గీతలో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ వంటి వివిధ యోగ మార్గాలను వివరించారు. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి దిశానిర్దేశం చేస్తాయి. యోగా ద్వారా వ్యక్తులు స్వీయ-అవగాహన, శాంతి, జీవన లక్ష్యాన్ని సాధించగలరు.
మానసిక కోణం
మానసిక ఆరోగ్యం కోసం యోగా ఒక శక్తివంతమైన సాధనం. ఆధునిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు సర్వసాధారణం. యోగా లోని ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలు నాడీ వ్యవస్థను శాంతపరచి, మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయి. శాస్త్రీయ అధ్యయనాలు యోగా కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను తగ్గించి, సంతోషాన్ని ప్రేరేపించే సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను పెంచుతుందని నిరూపించాయి. యోగా ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత కూడా మెరుగుపడతాయి. భారతీయ సంస్కృతిలో యోగా ఒక జీవన విధానంగా స్వీకరించబడినప్పటికీ, ఆధునిక జీవన శైలిలో దీని అవసరం మరింత పెరిగింది.
శారీరక కోణం
యోగా శారీరక ఆరోగ్యానికి ఒక సమగ్ర విధానం. ఆసనాలు శరీర సౌలభ్యాన్ని, బలాన్ని, సమతుల్యతను పెంచుతాయి. ప్రాణాయామం శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. యోగా రక్తప్రసరణ, జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుల నివారణలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ జీవనంలో యోగా శరీరాన్ని ఆలయంగా భావించి, దానిని ఆరోగ్యవంతంగా ఉంచే సాధనగా పరిగణించబడుతుంది. ఆధునిక కాలంలో ఫిట్‌నెస్ కేంద్రాలలో యోగా ప్రజాదరణ పొందడం దీని శారీరక ప్రాధాన్యతను సూచిస్తుంది.
శాస్త్రీయ కోణం
యోగా శాస్త్రీయ దృక్కోణంలో కూడా అత్యంత సమర్థవంతమైన సాధనగా గుర్తింపు పొందింది. ఆధునిక వైద్య శాస్త్రం యోగాను ఒక పరిపూరక చికిత్సగా గుర్తిస్తోంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ, మానసిక ఆరోగ్యంపై యోగా యొక్క ప్రభావాలను అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఉదాహరణకు, యోగా ద్వారా మెదడులోని హిప్పోకాంపస్, అమిగ్డాలా వంటి భాగాలు బలపడతాయని, ఇది జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణకు దోహదపడుతుందని తేలింది. యోగా యొక్క శాస్త్రీయ ఆధారం దానిని పాశ్చాత్య దేశాలలో కూడా ఒక గుర్తింపు పొందిన ఆరోగ్య సాధనగా మార్చింది. భారతదేశంలో యోగా శాస్త్రీయ అధ్యయనాలకు కేంద్రంగా మారిన సంస్థలు దీని ప్రాధాన్యతను మరింత బలపరుస్తున్నాయి.
సాంస్కృతిక కోణం
యోగా భారతీయ సంస్కృతిలో ఒక అవిభాజ్య అంశం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలలో యోగా సూచనలు కనిపిస్తాయి. ఇది భారతీయ జీవన విధానంలో శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయాన్ని సాధించే మార్గంగా పరిగణించబడుతుంది. గురుకుల విద్యా విధానంలో యోగా ఒక అంతర్భాగంగా ఉండేది. అయితే, ఆధునికీకరణ, పాశ్చాత్య ప్రభావాల కారణంగా యోగా సాంస్కృతిక జీవనంలో కొంత వెనుకబడింది. దీనిని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) ఒక మైలురాయిగా నిలిచింది, ఇది భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది.
యోగా విస్తరణ ఆశాజనకంగా ఉంది. 2015లో ఐక్యరాష్ట్ర సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం దాని ప్రపంచ గుర్తింపుకు నాంది. ప్రధాని నరేంద్ర మోది యోగాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ప్రచారం చేయడం అంతర్జాతీయ గుర్తింపునకు ఒక కారణం. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు పరిపూర్ణ ఆరోగ్యానికి ఆయన యోగ సాధన ముఖ్యకారణమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు.
యోగా ఒక అభ్యాసంగా అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంది, ఇది ఒక వ్యక్తిని శారీరకంగా మరియు మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అది మీ రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని పెంచడం అయినా, యోగా పనిచేసే కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.
యోగాతో బోలెడన్ని ప్రయోజనాలు:
మెరుగైన రక్త ప్రసరణ: యోగా మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని అర్థం శరీరమంతా ఆక్సిజన్ మరియు పోషకాలను బాగా రవాణా చేయడం. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు మరియు మెరిసే చర్మాన్ని కూడా సూచిస్తుంది.
భంగిమను మెరుగుపరుస్తుంది: యోగా ఎలా నియంత్రించాలో మరియు సమతుల్యతను ఎలా నేర్పుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా, మీ శరీరం స్వయంచాలకంగా సరైన భంగిమను తీసుకుంటుంది. మీరు నమ్మకంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తారు.
మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మీ మానసిక స్థితి తక్షణమే మెరుగుపడుతుంది ఎందుకంటే ఇది మీ శరీరానికి ఉత్తేజకరమైన శక్తిని ఇస్తుంది.
రక్తపోటు తగ్గుతుంది: రోజూ యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను సాధ్యం చేస్తుంది, దీని వలన శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.
అకాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది: సమయానికి ముందే కాకుండా అందంగా వృద్ధాప్యాన్ని ఎందుకు నిర్వహించకూడదు? అవును, యోగా విషాన్ని మరియు ఫ్రీ రాడికల్స్‌ను నిర్విషీకరణ చేయడానికి మరియు తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఇతర ప్రయోజనాలతో పాటు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. యోగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, ఇది వృద్ధాప్యాన్ని అధిగమించే మరో అంశం.
ఒత్తిడిని తగ్గిస్తుంది: మీరు యోగా మ్యాట్ మీద ఉన్నప్పుడు, మీరు సాధనపై దృష్టి పెడతారు. దీని అర్థం మీ దృష్టి అంతా చేతిలో ఉన్న విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది మరియు మీ మనస్సు దానిని పీడిస్తున్న ఒత్తిడి మరియు ఇబ్బందులను నెమ్మదిగా తొలగిస్తుంది.
పల్స్ రేటు తగ్గుదల: యోగా శరీర ఒత్తిడిని తగ్గించడం ద్వారా శరీరాన్ని సులభతరం చేస్తుంది. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు, పల్స్ రేటు తగ్గుతుంది. తక్కువ పల్స్ రేటు అంటే మీ గుండె తక్కువ బీట్స్ వ్యవధిలో ఎక్కువ రక్తాన్ని పంప్ చేసేంత బలంగా ఉందని సూచిస్తుంది.
బలాన్ని పెంచుతుంది: శారీరకంగా బలాఢ్యులుగా తయారవ్వడానికి యోగా ఎంతో మెరుగైన సాధనం . శరీర బరువు ఎక్కువ ఉన్నవారిలో కేలరీలు యోగాతో కరుగుతాయి .
ఆందోళన వదులుతుంది : శరీరాన్ని మెలి తిప్పడం, వంగడం వంటివాటివల్ల ఆందోళన తగ్గుతుంది . యోగాతో శ్వాసను నియంత్రించడం వల్ల ఆందోళనను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది .
తగ్గిన శ్వాస రేటు: యోగాలో నియంత్రిత శ్వాస ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తులను వాటి పూర్తి సామర్థ్యానికి నింపడం, తద్వారా అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
డిప్రెషన్ తో పోరాడుతుంది: మీరు యోగా సాధన చేసినప్పుడు, అణచివేయబడిన భావాలు బయటపడతాయి. మీరు విచారంగా అనిపించినప్పటికీ, ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. యోగాతో క్రమంగా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది . ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
సమతుల్యత : యోగా సమతుల్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది మరియు మీ శరీరంపై నియంత్రణ సాధించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల తరగతిలో భంగిమలను సమతుల్యం చేసుకునే మరియు తరగతి వెలుపల బాగా దృష్టి పెట్టే మీ సామర్థ్యం పెరుగుతుంది.
అవయవాల ఉద్దీపన: మీరు యోగా సాధన చేసినప్పుడు అంతర్గత అవయవాలు మసాజ్ చేయబడతాయి, తద్వారా వ్యాధులకు మీ నిరోధకత పెరుగుతుంది. అలాగే, మీరు మీ శరీరానికి అనుగుణంగా మారిన తర్వాత, సంవత్సరాల సాధన తర్వాత, మీ శరీరం సరిగ్గా పనిచేయకపోతే మీరు తక్షణమే చెప్పగలుగుతారు.
రోగనిరోధక శక్తి పెంపు : యోగా శరీరంలోని ప్రతి కణాన్ని నయం చేయడానికి మరియు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నప్పుడు, మీ శరీరం స్వయంచాలకంగా మరింత రోగనిరోధక శక్తిని పొందుతుంది. తద్వారా, రోగనిరోధక శక్తి పెరుగదానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని అనేక పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయ్ .
మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే ‘టీ’ పడాల్సిందే. అయితే రెగ్యులర్ గా తాగే టీ వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . దీంతో ఇటీవల పలువురు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నారు . .
డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుందని, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందని అనుకుంటారు. కానీ, గ్రీన్ టీని పరిమితి మించి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరం ఉండటం మంచిదని పేర్కొన్నారు.
గుండె జబ్బుల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ సమస్య రాకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం గుండె జబ్బులకి ప్రధాన కారణాలు. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్‌లో ప్లేక్ ఫార్మ్ అయ్యి గుండె జబ్బులకీ స్ట్రోక్‌కీ దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.
గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతాయని ఒక పరిశోధనలో తేలిందట . దీని వల్ల వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, బీపీ పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని ”నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ”పరిశోధనలో స్పష్టమయింది . అంతేకాకుండా పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
తలనొప్పి : గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయని నిపుణులు తెలిపారు. అందులో తలనొప్పి మొదటిది, అంతేకాకుండా నిద్రలేమి, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని వివరించారు.
గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే, ఏ హెల్త్ కండిషన్‌కి అయినా సరే ఇదో మ్యాజిక్ క్యూర్ అని అనుకోరాదు. కాబట్టి, మంచి ఆరోగ్యం కోసం మీ రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి.
గ్రీన్ టీ ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అధిక మోతాదులో తీసుకున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యంతో ఉన్నవారు కూడా రోజుకు 2-3 కప్పులు మించి గ్రీన్ టీ తీసుకోవద్దని సూచిస్తున్నారు.