గ్రీన్ టీ .. బెనిఫిట్స్ తెలుసా ?

Abhi Correspondent

June 15, 2025

మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే ‘టీ’ పడాల్సిందే. అయితే రెగ్యులర్ గా తాగే టీ వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . దీంతో ఇటీవల పలువురు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నారు . .

డయాబెటిస్ కంట్రోల్​లో ఉంటుందని, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్​ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందని అనుకుంటారు. కానీ, గ్రీన్ టీని పరిమితి మించి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరం ఉండటం మంచిదని పేర్కొన్నారు.

గుండె జబ్బుల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ సమస్య రాకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం గుండె జబ్బులకి ప్రధాన కారణాలు. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్‌లో ప్లేక్ ఫార్మ్ అయ్యి గుండె జబ్బులకీ స్ట్రోక్‌కీ దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.

 గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతాయని ఒక పరిశోధనలో తేలిందట . దీని వల్ల వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, బీపీ పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని ”నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ”పరిశోధనలో స్పష్టమయింది . అంతేకాకుండా పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

తలనొప్పి : గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయని నిపుణులు తెలిపారు. అందులో తలనొప్పి మొదటిది, అంతేకాకుండా నిద్రలేమి, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని వివరించారు.

గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే, ఏ హెల్త్ కండిషన్‌కి అయినా సరే ఇదో మ్యాజిక్ క్యూర్ అని అనుకోరాదు. కాబట్టి, మంచి ఆరోగ్యం కోసం మీ రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి.

గ్రీన్ టీ ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అధిక మోతాదులో తీసుకున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యంతో ఉన్నవారు కూడా రోజుకు 2-3 కప్పులు మించి గ్రీన్ టీ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

You May Also Like…