ఏప్రిల్ 25 శుక్రవారం, హైదరాబాద్‌లోని ‘’హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’ (HICC) భారత్ సమ్మిట్ 2025లో భాగంగా డైనమిక్ యువత-కేంద్రీకృత రాజకీయ చర్చకు ఆతిథ్యం ఇచ్చింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రగతిశీల పార్టీల సంఘంగా ప్రచారం చేయబడిన కార్యక్రమం. .. భారతదేశం, న్యూజిలాండ్ మరియు మలేషియా నుండి వచ్చిన ప్యానెలిస్టులు వ్యక్తిగత కథలను పంచుకున్నారు, సమ్మిళిత సంస్కరణలు, విద్యార్థుల ఎన్నికలు మరియు వాతావరణ చర్యల అవసరాన్ని హైలైట్ చేశారు. వారు ముందస్తు రాజకీయ భాగస్వామ్యం, పౌర బాధ్యత మరియు ఓటింగ్ వయస్సు తగ్గింపును నొక్కి చెప్పారు.
న్యూజిలాండ్‌లోని అతి చిన్న పార్లమెంటేరియన్లు మెరీనా హే మరియు అరీనా విలియమ్స్ నుండి మలేషియా తమిళ ప్రతినిధి లినేష్ సెల్యుండన్ మరియు పొన్నం ప్రభాకర్, బల్మూరి వెంకట్ మరియు వరుణ్ చౌదరి వంటి భారతీయ నాయకుల వరకు, ప్యానెల్ బలవంతపు వ్యక్తిగత ప్రయాణాలు మరియు పాలన యొక్క భవిష్యత్తు కోసం ధైర్యమైన ఆలోచనలను పంచుకుంది.
విద్యార్థి రాజకీయాలు, సమ్మిళిత సంస్కరణలు, వాతావరణ న్యాయం, రాజకీయ స్థలాల ప్రజాస్వామ్యీకరణ వంటి అంశాలను నొక్కి చెబుతూ, యువతరం పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించాలని ఈ సెషన్ పిలుపునిచ్చింది.
ఈ భావనను ప్రతిధ్వనిస్తూ, ప్రపంచం మారడాన్ని చూడాలనుకుంటే యువత తిరుగుబాటు చేయాలి, అధికారాన్ని ప్రశ్నించాలి మరియు కొత్త ఆలోచనలను తీసుకురావాలి అని అరీనా విలియమ్స్ నొక్కిచెప్పారు.
“రేపటి యువత మరియు రాజకీయాలు” అనే శీర్షికతో జరిగిన ఈ ప్రసంగానికి యూత్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ అల్లవారు మోడరేటర్‌గా వ్యవహరించారు మరియు వారు ఇలా అన్నారు: కార్యక్రమంలో వీరు పాల్గొని స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు .
ఈ సందేశానికి బలం చేకూరుస్తూ, బల్మూరి వెంకట్ నాయకత్వానికి తనదైన మార్గాన్ని పంచుకున్నారు. “నేను రాజకీయ కుటుంబం నుండి రాలేదు. విద్యార్థిగా, నేను NSUIలో చేరి నన్ను నేను నిరూపించుకున్నాను. అది నన్ను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన MLCగా మార్చడానికి దారితీసింది” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి ఎన్నికలను తిరిగి ప్రవేశపెట్టాలని వెంకట్ గట్టిగా వాదించారు, కొత్త రాజకీయ ప్రతిభను పెంపొందించడానికి ఇది చాలా అవసరమని అన్నారు. “కొత్త రక్తం అలా వస్తుంది. కొత్త నాయకులు అలా పుడతారు.”
అరీనా విలియమ్స్, MP, న్యూజిలాండ్
వరుణ్ చౌదరి, NSUI అధ్యక్షుడు
మెరీనా హే, MP, న్యూజిలాండ్
లీనేష్ సెల్లువాండన్, వైస్ చైర్మన్, DAPSY, మలేషియా
పొన్నం ప్రభాకర్, రవాణా మంత్రి, తెలంగాణ
బల్మూరి వెంకట్, MLC, తెలంగాణ
వంశీ కృష్ణ గడ్డం, MP, పెద్దపల్లి, తెలంగాణ
యువతరం గొంతుల అవసరం
యువత రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్యానెల్‌లోని సభ్యులందరూ తమ రాజకీయ ప్రయాణాలను ముందుగానే ప్రారంభించారు మరియు ఇప్పుడు తదుపరి తరం కూడా అదే చేయాలని కోరుతున్నారు.యువతపై దృష్టి సారించిన రాజకీయ ప్యానెల్ అంతటా ఒక శక్తివంతమైన సందేశం ప్రతిధ్వనించింది –
“రాజకీయాలకు అనేక ప్రతికూల అర్థాలు జతచేయబడ్డాయి. అయితే, ఇది చాలా సానుకూల పనులు చేయడానికి ఒక మార్గం” అని పెద్దపల్లి ఎంపీ వంశీ గడ్డం అన్నారు. యువత నడిచే మార్పు యొక్క సామర్థ్యాన్ని ఆయన నొక్కిచెప్పినప్పటికీ, సోషల్ మీడియా దుర్వినియోగానికి వ్యతిరేకంగా కూడా ఆయన హెచ్చరించారు, దీనిని పెరుగుతున్న ముప్పుగా అభివర్ణించారు. “రాజకీయాలకు యువ గొంతులు అవసరం” అని లీనేష్ సెల్లువాండన్ పునరుద్ఘాటించారు.
ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
స్వీట్ల0టే చచ్చేంత ఇష్టమా? మీరు ప్రత్యేకంగా స్వీట్స్ తినకుండానే రోజూ మీ శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువే షుగర్ తింటున్నారు. ఔను మీరు విన్నది నిజమే… కూల్ డ్రింకులు, కాఫీ, టీ లు, జ్యుస్ లు, బ్రెడ్, కేకులు వంటి వాటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక కేలరీలు చక్కెర అదనంగా మీ ఒంట్లో చేరుతోంది.. గమనించండి..
తియ్యదనం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో రకంగా తీపిని తమ బాడీలోకి పంపిస్తూనే ఉంటారు. అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే.. తీపి పదార్థం అనగానే ఎక్కువమందికి నోరూరడం సహజం. అయితే, దీని వల్ల బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువై . . అనేక ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుంది .
రోజులో ఎంత చక్కెర తీసుకోవాలి? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనేది పరిశీలిద్దాం… అధికంగా చక్కెర తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, రోజుకు ఎంత పరిమితి మోతాదులో చక్కర తీసుకోవాలి? అంతకంటే ఎక్కువ తీసుకుంటే డేంజరేనా? చక్కెర శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది కానీ, అది అధికమైతే ఒబెసిటీ, డయాబెటిస్, కేన్సర్ , గుండె జబ్బులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
అనారోగ్య సమస్యలెన్నో!
ఒక మనిషి సగటున రోజుకు 25-32 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. కానీ, ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారతీయలు వినియోగంలో మాత్రం ముందున్నారు. బిస్కెట్లు, కూల్‌డ్రింకులు, చాక్లెట్లు, స్వీట్లు, కేక్‌ల రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. శరీరానికి పెద్దగా అవసరం లేకున్నా అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, ఒబేసిటీ బారిన పడుతున్నారు.
‘’షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా బరువు పెరుగుతాం. ఇది గుండెపోటుకు దారి తీస్తుండి. దీనిపై చాలామంది అశ్రద్దగా, నిర్లక్షయంగా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు… ‘’ అని డాక్టర్ ఆదిత్య చౌతి చెబుతారు. ఆదిత్య బెంగళూరులోని ఇంటర్నల్ మెడిసిన్ ఫోర్టిస్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. షుగర్ ఫుడ్స్ తినడం వల్ల దంత సమస్యలు, క్యావిటీస్ వంటివి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలో మంట పెరగడానికి షుగర్ కారణమవుతుంది. అందుకే చక్కెరతో నిండిన ఆహారానికి బదులు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు ఆరోగ్యం బావుంటుందని ఈ డాక్టర్ గారు సూచిస్తున్నారు. .
రోజువారీ జీవనశైలి, ఆహార మార్పుల కారణంగా మన దేశంలో సగటున 11-12 శాతం మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నట్లు “ఐసీఎంఆర్-ఇండియా” అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లో 16శాతం, పల్లెల్లో 9శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారని గణాంకాలు ప్రకటించింది. ఫలితంగా పక్షవాతం, గుండెజబ్బులు, పెరలాసిస్, కేన్సర్ , అధిక రక్తపోటు జబ్బులెన్నో తరుముకొస్తున్నాయని చక్కెర వెనుకున్న చేదు నిజాలను వెల్లడింది.
15 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 30 గ్రాముల లోపు చక్కర తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఏజ్ గ్రూప్ చిన్నారులలో ఎక్కువమంది రోజుకి సరాసరి.. 50-75 గ్రాముల షుగర్ తినేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తాజా పండ్లు మేలు . . చక్కరెకు ఆల్టర్ నేటివ్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ మేలని చెపుతున్నారు . మోతాదులో షుగర్ న్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన మొత్తంలో నియంత్రణ ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు తగ్గించాలని, రోజూ సమతుల్య ఆహారంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అరటి , బొప్పాయి , దానిమ్మ , జామ , సీతాఫలం , రామాఫలం , లక్షణ ఫలం , వంటి దేశీయ పండ్లు మేలని ఇటీవల అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి .
అరెస్టులతో తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పరచవచ్చని లోకేష్ భావిస్తున్నారా ?
వైసీపీ హయాంలో భారీ దోపిడీ, అరాచకాలకు పాల్పడిన వారి అరెస్టులకు ముహూర్తం పెట్టారా ?
అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడి , అక్రమాలకు ఒడిగట్టిన బడాబాబులపై చర్యలు జాప్యం కావడంతో ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కేడర్ లో అసంతృప్తి చెలరేగింది. అడపా , దడపా చిన్న చిన్న అరెస్టులు చేసి తూతుమంత్రంగా చేతులు దులుపుకుంటున్నారన్న అక్కసుతో ఉన్న కేడర్ … వారం రోజులుగా జరుగుతున్న అరెస్టులతో సంతృప్తి చెందుతుందా? అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా సైన్యం ఆక్రోశం ఈ అరెస్టులతో కాస్త చల్లారుతుందా >
వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొంత మందికి కంటిమీద కునుకు కరువైంది . అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోంది . జగన్ అండ్ కో అండ చూసుకుని చెలరేగిపోయిన అరాచకవాదులు , అక్రమార్కులకు సెగ పుడుతోంది .
వరుసగా అరెస్టులు -చర్యలు
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అక్రమాలు , అరాచకాలు రాజ్యమేలాయి . పలు అధరాలు దొరికినా మొదట్లో కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరించారు . ఈ మెతక వైఖరితో ప్రధానంగా టీడీపీ కేడర్ , సొంత పార్టీకి వాలంటీర్ గా పనిచేస్తున్న సోషల్ మీడియా ఏకంగా చంద్రబాబుపైనే తిరుగుబాటు ప్రకటించింది . దీంతో గత్యంతరం లేక అరాచకుల అరెస్టులు మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది .
ఐదు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్ర హింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని కూటమి పార్టీలు టీడీపీ , జనసేన కేడర్ తో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమయింది. మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీనాధ్ అరెస్టు దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ పై చార్జెస్ వరకూ అన్నీ ప్రణాళికాబద్దంగా, క్రమబద్ధంగా.. చట్టబద్దంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకూ ఇవి సాగిపోతాయి.
పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో టెన్షన్: జగన్ సీఎంగా ఉన్నపుడు ఇంటెలెన్గ్స్ డీజీ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయులు అరెస్టుతో వైసీపీ అరాచకవాదులతోపాటు , అప్పట్లో ఆ ఆపార్టీకి తొత్తులుగా వ్యవహరించి , అక్రమాలలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వెన్నులో వణుకుపుడుతోంది .
ముంబై నటి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి , వేధింపులకు గురిచేసి , చివరికి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా ముంబై నుంచి చట్ట విరుధ్దగా తీసుకువచ్చి నిర్బంధించిన కేసులో ఆంజనేయులు అరెస్ట్ కావడం గమనార్హం . ఈ కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ , కాంతి రానా టాటా లు అరెస్ట్ కాకుండా తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు .
మద్యం కుంభకోణం కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , , అలియాస్ రాజ్ కసిరెడ్డి ని సిఐడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు . విచారణల్లో ఇప్పటికే అతను కీలక విషయాలు వెల్లడించినట్లు చెపుతున్నారు . ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి , మిదున్ రెడ్డి , మాజీ సీఎం జగమ్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైసీపీ వర్గాలే బాహాటంగా వెల్లడిచేస్తున్నాయ్ .
పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ అరెస్టు
మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను దహనం చేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏ మాత్రం ఊహించలేకపోయాడు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ ఫైళ్ల కాల్చివేతలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వచ్చాయి . అయితే డైరెక్ట్ గా పెద్దిరెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడానికి బలమైన అధరాలు దొరకలేదు . అయితే మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అరెస్ట్ చేసి జైలుకెస్తే , ,, కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది . బయటకు వచ్చి సదరు నేతలు , అధికారులే తొడకొట్టి కూటమి సర్కార్ నేతలతో ఆటలాడుకునే పరిస్థితి తలెత్తుతుంది . దీనిని దృష్టిలో పెట్టుకుని , చట్ట ప్రకారం బలమైన అధరాలు సేకరించిన తర్వాతే అరెస్టులు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు చెపుతున్నారు .
మాజీ మంత్రి కొడాలి నాని , మాజీ ఎమ్మెల్యే, జగన్ ముఖ్య అనుచరుడు, బియ్యం స్మగింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , అటవీ భూములను నకిలీ రికార్డులతో కానేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . .. ఇలా పలువురు కీలక నేతల అరెస్టులపై టీడీపీ , జనసేన కేడర్ ఎదురు చూస్తోంది . నెమ్మదిగా వీరంతా కూడా జైలుకెళ్లి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్ .
”ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమయింది . .” అని ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు . పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి వేటాడి భారత్ హతమారుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు.కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.
మూడు వేదికలు – ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా
మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది . మే 2వ తేదీన అమరావతికి వస్తున్నారు భారత్ ప్రధాని . రాజధాని అమరావతిలో 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.
లక్ష కోట్ల ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా . ..ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను పరిశీలించి ఖరారు చేసారు . దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
పటిష్టమైన వేదికలు . . ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.
జనం రాక కోసం . .రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఎన్10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు.
గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్‌ప్లాజా సమీపంలోని మురుగన్ హోటల్ వద్ద ఎన్‌హెచ్-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్‌హెచ్ బైపాస్ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్‌ఆర్ జంక్షన్, గోరంట్ల, లామ్-తాడికొండ క్రాస్‌రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్11, ఇ8, ఎన్10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.
హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు .
పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 98 శాతం , 99 శాతం మార్కులు సాధిస్తేనే అత్యంత ఘనతగా చెప్పుకుంటాం . అలాంటిది 600 కి 600 మార్కులు సాధించి కాకినాడ విద్యార్థి అత్యంత అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది . నేహంజని అనే కాకినాడకు చెందిన స్టూడెంట్ కి ఈ ఘనత దక్కింది . ఈ బాలిక కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతోంది.
మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.
ఇంతటి ఘనత సాధించిన ఈ చిన్నారులను అభినందించాల్సిందే . అలా అని అందరి పిల్లలూ ఈ మాదిరిగా మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం మాత్రం సరికాదని పేరెంట్స్ గుర్తించుకోవాలి . మార్కులు అవసరమే కానీ , అవి ఒక్కటే కొలమానం కాదని మర్చిపోకూడదు .
విజయసాయి రెడ్డి బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట . ఇలాంటి నేతలను చేర్చుకుంటే వాళ్లపై ఉన్న అవినీతి , అరాచక మచ్చలు తమ పార్టీపై పడతాయన్న భావం కొందరు అసలైన బీజేపీ నేతలలో ఉంది . అయితే ఏపీలో మన పార్టీ ప్రభావం ఎంత ? దీనిగురించి ఎన్నికల నాటికీ జనం మర్చిపోతారులే . . అని వైసీపీకి మద్దతుగా నిలిచే ఒకరిద్దరు బీజేపీ నేతలే అధిష్టానానికి రికమండ్ చేస్తున్నారట .
ఆవిర్భావం నుంచీ సాయిరెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డికి నమ్మకమైన సహాయకుడిగా ఇన్నాళ్లూ వ్యవహరించారు. 2019 లో అధికారంలో ఉన్నపుడు వైసీపీలో విజయసాయి నెంబర్-2 గా వెలుగోదరు. జగన్కి- అతనికి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ… ఈ సంవత్సరం జనవరిలో, విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
కాకినాడ పోర్టు కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ మరియు వైఎస్‌ఆర్‌సిపి పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో ఉన్న విజయసాయి రెడ్డి క్రియాశీల రాజకీయాలను విడిచిపెట్టి, జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్‌ఆర్‌సిపికి దూరమై, తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినా . .. విజయసాయి రెడ్డి మాటలను జనం నమ్మలేదు . ఒకే చాయిస్: విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక చాయిస్ బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అతనిపై ఈడీ , సీబీఐ కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా బీజేపీ యేతర పార్టీ గురించి ఊహించడానికే సాహసించలేని పరిస్థితి.
“ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాషాయ పార్టీ కూడా ఆయనను స్వాగతించడానికి చాలా ఆసక్తిగా ఉంది. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. విజయసాయి రెడ్డి చేరిక టిడిపితో ఉన్న ముఖ్యమైన పొత్తులో చికాకు కలిగించకూడదని బిజెపి కోరుకుంటోంది” అని విజయసాయి రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు.
“ఇక మిగిలి ఉన్నది నాయుడు నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) మాత్రమే.” అనేది సదరు నేత అభిప్రాయం .
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఓ స్పెషల్ లేడీ కమాండో స్పెషల్ టీమ్ ఫామ్ చేసారు. ఆమధ్య నలుగురు తునికాకు కూలీలు దట్టమైన అడవిలో తప్పిపోతే తనే రంగంలోకి దిగి ఆమె కాపాడిన తీరు ఇంకా ఎవరూ మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఈ ఇనీషియేటివ్ ద్వారా అందరి అభినందనలు అందుకుంటున్నారు.
దేశంలోని త్రివిధ దళాలలో స్పెషల్ కమాండో ఫోర్సులు, ఆర్మీ కమాండోలు, నేవీలో మార్కోస్, అలాగే ఎన్‌ఎస్జీ, ఎస్‌పీజీ వంటి అత్యుత్తమ బలగాలు, గ్రేహౌండ్స్ వంటి రాష్ట్ర బలగాలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనతో ‘టీం శివంగి’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్‌కు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు.
మహిళలకు శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, రన్నింగ్ రేసులు, వర్టికల్ రోప్ క్లైంబింగ్, డిఫెన్స్ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాల వినియోగం, అన్ని రకాల ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాల ఫైరింగ్, నిర్వహణ, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేని నావిగేషన్, ఆకస్మిక వ్యూహాలు, శత్రు కదలికల అంచనా, అడవిలో సంకేతాలను అర్థం చేసుకోవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడులు, ఎదురు దాడులపై]పర్‌ఫెక్ట్ శిక్షణ అందించారు.
ఒక్కొక్కరిని ఒక్కో విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. కొంతమందికి యుద్ధ తంత్రాలపై, మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్, ఇంకొంతమందికి ఫైరింగ్, మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్‌గా రూపొందించారు.
59 ఎకరాలు – వెయ్యి కోట్ల దోపిడీ.. అంటూ ఇన్విస్టిగేటివ్ స్టోరీ.
ద వైర్ ప్రస్తావించిన అంశాలు ఇవే . ..
విశాఖపట్నం ఐటి హిల్ నం 3లో రూ 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం టీసిఎస్ ముందుకు వచ్చింది . 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది . ఐటి కంపెనీ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
ఇక్కడికి సమీపంలో ఐటి పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి కేటాయించారు. దాంతోపాటు ఐపి కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ(ఎఐ) డేటా సెంటర్ ఏర్పాటుకు 5,728 కోట్ల పెట్టుబడితో ఉర్సా క్టస్టర్స్ కంపెనీ ముందుకొచ్చిందన్నది ప్రభుత్వం వాదన. ఆ సెంటర్ ఏర్పాటుకోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలూ, అనుబంధ షరతులూ, పెనాల్టీ క్లాజులు గురించిన పూర్తి నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. రావల్సిన వివరాలు ఎలా ఉన్నా రెండు నెలల ముందు పెట్టిన ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ, ఎవరితో మదింపు చేయించింది, ఈ మదింపు నివేదిక సారాంశం ఏంటి, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్ద్ధ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించటానికి, ఒప్పించటానికి ఉర్సా కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏమిటనే విషయాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. …
ద వైర్ రాసిన కధనం ప్రకారం . … మూడు నెలలు కూడా పూర్తికాని కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన 59 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి . దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తింది . ఖరీదైన భూమిని ఊరు – పేరు లేని కంపెనీకి కట్టబెట్టడంపై కూటమి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దీనిపై టీడీపీ , జనసేన కేడర్ లో సైతం అనుమానాలు రేకెత్తే రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి .
‘కమ్మ ‘ కులానికి చంద్రబాబు ”మేళ్లు ‘ ‘ చేయకపోయినా విమర్శలు ఎందుకు ? రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించేది సొంత కులంలోనే ఎక్కువ – అరాచకాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబును తూర్పారబెడుతున్న తెలుగు తమ్ముళ్లు – టీడీపీ మద్దతు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా
చంద్రబాబూ ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది
గొప్ప పరిపాలనా దక్షుడు – రాజకీయ చాణక్యుడు – గ్రేట్ విజనరీ – అభివృద్ధి విధాత . .. ఇలాంటి ఎన్నో గొప్ప పదాలు , పోలికలు చంద్రబాబుకి మణిహారాలు. ఈ తరం నేతలలో చంద్రబాబు నిస్సందేహంగా పరిపాలనా దక్షుడే. అకుంఠిత దీక్ష , కష్టపడే తత్త్వం , అధికారులు , ఉద్యోగులను పరుగులు పెట్టించే నైజం ఈయనిది. ప్రత్యేకంగా కులాలపై ప్రేమ ఉండదు. అయినా చంద్రబాబుకి ”కమ్మ ‘ ‘ ముద్ర ఎందుకు పడుతుంది. లేని అపఖ్యాతిని ఎందుకు మూటకట్టుకోవాల్సి వస్తోంది? సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .
టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు .. పై ఎప్పుడూ కమ్మ ముద్ర పడలేదు . బడుగు , బలహీనవర్గాల అజెండాతో పార్టీని స్థాపించారు . అంత సిన్సియర్ గా పాలన సాగించారు . పాలన వ్యవహారాలలో ఎన్టీఆర్ కంటే మెరుగ్గా చేసినా , రాజకేయం ఈ విషయంలో చంద్రబాబులో అంత సిన్సియారిటీ కనిపించదు
స్వయంకృతమే:
2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రులుగా సుజనా చౌదరి , అశోక్ గజపతి ఉన్నారు . వీరిలో అశోక్ గజపతిరావు మంచి పేరున్న నేత. విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడిగా అశోక్ గజపతి ఖ్యాతిపొందారు . అలాంటి నేతను పక్కన పెట్టి . .. లాబీయిస్టుగా పేరొందిన సుజనా చౌదరిని రాజకీయంగా ముందు పెట్టారు. కేంద్రంలో ప్రాధాన్యత తీసుకువచ్చారు.
చంద్రబాబు చేసిన ఈ పనికి అప్పట్లో రాష్ట్రంలోనూ , కేంద్రంలోనూ ‘కమ్మ ముద్ర ‘ తెచ్చుకున్నారు .
2014-2019 సమయంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉత్తరప్రదేశ్ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి ఏఎస్ రాజమౌళిని డిప్త్యూటేషన్ పై తీసుకువచ్చారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అనే కమ్మ కులానికి చెందిన అడ్వొకేట్ ని అడ్వొకేట్ జనరల్ చేశారు . మళ్ళీ పదేళ్ల తర్వాత 2024 జూన్ లో అధికారంలోకి వచ్చినపుడు ఇదే చేసారు . (రాజమౌళి , దమ్మాలపాటి లకు మళ్ళీ అవే పదవులు ఇచ్చారు )
ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి (టీడీపీ కోటాలో ) రామ్మోహన్ నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు . రామ్మోహన్ నాయుడు తన పని తాను చేసుకుంటుండగా , పెమ్మసాని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు పార్టీ కేడర్ నుంచే ఫిర్యాదులు వస్తున్నాయ్ . చంద్రబాబుకి కమ్మ ఫీలింగ్ పెద్దగా లేకపోయినా . . ఇలాంటి నాయకులు చేస్తున్న హంగామాకి కమ్మ కులంపై ముద్రపడింది .
నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి కట్టబెట్టారు . ఇతను వైసీపీ నుంచి వచ్చిన నేత . అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు . అలాంటి నేతకు కీలక పదవి ఇవ్వడంపై చంద్రబాబుపై పార్టీలో కమ్మ ముద్ర ఖచ్చితంగా పడుతుంది .
అనంతపురం అసెంబ్లీకి దగ్గుబాటి ప్రసాద్ అనే రియల్టర్ ని తెచ్చి పెట్టారు . అతను చేసే అరాచకాలకు పార్టీకి చెడ్డపేరు వస్తుంది . ఈ పేరు కమ్మ కులానికి ఆపాదించేందుకు వైసీపీ ఎలాగూ ప్రయత్నం చేయడం సహజం. అంతకుముందున్న ప్రభాకర్ చౌదరికి కమ్మ మార్క్ కంటే అందరివాడు అనే పేరుంది . అలాంటి వారిని పక్కనపెట్టి బెంగుళూరు రియల్టర్ ని తెచ్చి పార్టీకి చెడ్డ పేరు, కులం ముద్ర రావడానికి పరోక్ష0గా చంద్రబాబు కారణమవుతున్నారని అక్కడ ప్రచారం సాగుతోంది .
బాబు పీఎస్ , పీఏ , సెక్రెటరీ . . అంతా కమ్మవారే . ..
సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరి కృష్ణ కపర్తి, పీఏ రాజగోపాల్ , కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి కమ్మవారు. టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో కార్యకలాపాలు పర్యవేక్షించే టీడీ జనార్దన్, లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారి రాజేష్ కమ్మవారు కావడం గమనార్హం . అయితే .. ఇందులో కొందరు ఆర్బాటం చేయడం , చంద్రబాబుకి తాము అత్యంత దగ్గరి మనుషులం అని బిల్డప్ ఇవ్వడం వంటి కారణాలు … చంద్రబాబుకి ”కమ్మ ముద్ర ‘ను అంటిస్తున్నాయ్ .
రాజశేఖర్ రెడ్డి , జగన్ ల కంటేనా ? ”తమ పాలనా కాలంలో సొంత కులానికి భారీగా మేళ్లు చేయలేదు . దోపిడీకి సహకరించలేదు . రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రులుగా ఉన్నపుడు సొంత కులం వారికి భారీగా దోచిపెట్టారు . అయినా వారి కంటే చంద్రబాబుకే ఎక్కువ కుల ముద్ర వస్తుందంటే అది కమ్మవారికున్న శాపమే తప్ప మరేమీ కాదు . .” అని ఓ టీడీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు .
యనమల లాంటి వాళ్ళు ‘కమ్మ ‘ వాళ్లను దోపిడీదారులుగా చిత్రీకరించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోరు. కనీసం వివరణ కూడా అడగడానికి సాహసించరు . దివీస్ కంపెనీ మురళిపై యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు కులం పేరుతొ చేసారు. దీనిపై పార్టీ కూడా యనమల వివరణ తీసుకోలేదంటే . .. కమ్మ కులం దోపిడీపై యనమల చేసిన ఆరోపణలు నిజమన్న అభిప్రాయం సమాజంలో చాలామందికి వస్తుంది. ఇలాంటి వాటిని కట్టడి చేయడంలో చంద్రబాబు అసమర్దుడన్న పేరు ఉంది.
ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీ హయాంలో విద్యుత్ కాంట్రాక్టులలో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షిర్డీ సాయి , పోలవరంలో దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి , రాయలసీమలో కారుచౌకగా భూములు కొట్టేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో … ఈ కంపెనీలు ఏవీ కమ్మ వారివి కావు . అయినా వీరిని ప్రోత్సహిస్తున్నారు . దీనిపై జనంలో పెద్దగా చర్చ ఉండదు . చర్చకు వస్తే . .. మాత్రం వారి నుంచి మామూలు అందుకుంటున్నారన్న ఆరోపణలు తెరమీదకు తెస్తారు.
పరిపాలనలో సమర్థులైన వారిని ఈనాడులో మేనేజర్లుగా పెట్టుకునేవారు రామోజీరావు . వాళ్లలో మెజార్టీ కమ్మ వారు ఉండేవారు. అంతమాత్రాన ఈనాడులో కమ్మ వారిదే హవా . . అంటే కరెక్ట్ కాదు కదా .. అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నా . .. సోషల్ మీడియాను కట్టడి చేయలేక . .. వైసీపీ అరాచకవాదులు , అబద్దాలతో బూకరించేవారికి సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వలేక కమ్మ ముద్ర వేసుకుంటున్నారు .