59 ఎకరాలు – వెయ్యి కోట్ల దోపిడీ.. అంటూ ఇన్విస్టిగేటివ్ స్టోరీ.
ద వైర్ ప్రస్తావించిన అంశాలు ఇవే . ..
విశాఖపట్నం ఐటి హిల్ నం 3లో రూ 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం టీసిఎస్ ముందుకు వచ్చింది . 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది . ఐటి కంపెనీ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
ఇక్కడికి సమీపంలో ఐటి పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి కేటాయించారు. దాంతోపాటు ఐపి కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ(ఎఐ) డేటా సెంటర్ ఏర్పాటుకు 5,728 కోట్ల పెట్టుబడితో ఉర్సా క్టస్టర్స్ కంపెనీ ముందుకొచ్చిందన్నది ప్రభుత్వం వాదన. ఆ సెంటర్ ఏర్పాటుకోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలూ, అనుబంధ షరతులూ, పెనాల్టీ క్లాజులు గురించిన పూర్తి నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. రావల్సిన వివరాలు ఎలా ఉన్నా రెండు నెలల ముందు పెట్టిన ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ, ఎవరితో మదింపు చేయించింది, ఈ మదింపు నివేదిక సారాంశం ఏంటి, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్ద్ధ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించటానికి, ఒప్పించటానికి ఉర్సా కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏమిటనే విషయాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. …
ద వైర్ రాసిన కధనం ప్రకారం . … మూడు నెలలు కూడా పూర్తికాని కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన 59 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి . దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తింది . ఖరీదైన భూమిని ఊరు – పేరు లేని కంపెనీకి కట్టబెట్టడంపై కూటమి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దీనిపై టీడీపీ , జనసేన కేడర్ లో సైతం అనుమానాలు రేకెత్తే రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి .