గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొడుతున్న వైసీపీ

వరల్డ్ ఫెమస్ టెక్నీకల్ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ ను అడ్డుకునే కుట్రకు వైసీపీ నేతలు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కొందరు రైతుల ఫోర్జరీ సంతకాలతో, చనిపోయిన రైతు పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. గూగుల్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వవద్దని . . మిగతా రైతులనూ రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులిస్తామని ప్రలోభపెడుతున్నాయి. దీని పై స్థానిక తహసీల్దార్‌ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారు.

రిటైర్డ్ ఐఏఎస్‌ బినామీతో కంప్లీన్ట్ . : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ-పట్టా భూముల్ని కొనేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ పేరుతో డీ పట్టా భూముల విక్రయాలకు తెర తీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఐఏఎస్‌ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ కూడా కూటమి సర్కార్ పక్కపెట్టింది . ఆయన తరఫున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించి, వారితో ఒప్పందాలు చేసుకొని డీ పట్టా భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తర్లువాడలో 308 ఎకరాల్ని గూగుల్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 200 ఎకరాల డీ పట్టా, శివాయ్‌ జమేదార్‌ భూములను రైతులకు పరిహారమిచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తోంది. ఆ బినామీ గుప్పిట్లో పెట్టుకున్న 76 ఎకరాలు కూడా ఆ భూముల్లో ఉన్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియనే అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులో కేసు వేయించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీపట్టా భూముల కొనుగోలులో దళారిగా వ్యవహరించి, ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా ఆ దళారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్న వారిపై, రైతుల సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ పకడ్బందీగా వ్యవహరించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి .

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

తులసి బాసో .. ఈ వరి పురాతనమైనది

ఒకసారి నాటితే . .. మూడుసార్లు కోసుకోవచ్చు . . దేశీయ వెరైటీ

తులసి బాసో ….. ఇది ఒక సంప్రదాయ వరి రకం. రామాయణ కాలం నుంచీ ఈ వరి భారతదేశంలో సాగుచేశారని చెపుతారు .

ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఈ అరుదైన వరి రకాన్ని సాగుచేస్తున్నారు . ఒకసారి నాట్లు వేసుకుంటే మూడుసార్లు పంట తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొంతమంది రైతులు ఇలాంటి అరుదైన దేశీయ వంగడాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు. వీరు మన సాంప్రదాయ విత్తనాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పాలి .

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆర్గానిక్ మేళాలలో లేదా విత్తన మేళాలలో కలుసుకొని అరుదైన వరి వంగడాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

ఆ ప్రయత్నంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి ఈ అరుదైన వరి వంగడాన్ని అలాంటి రైతుల వద్ద సేకరించి, ఇప్పుడు ఒక ఎకరా తులసి బాసో పంట వేసినట్లు చెప్పారు .

తులసి బాసో పరిమళభరితమైన వరి రకం. “తులసి లాంటి సువాసన గల బియ్యం” అని అర్థం. అంటే సెంటెడ్ రకం. బాస్మతి లాగా మంచి సువాసన వస్తుంది. చిట్టి ముత్యాలులాగా చాలా చిన్న గింజ. తినడానికి చాలా మధురంగా ఉంటూ, ఎంత తిన్నా వెగటు అనిపించదు. భుక్తాయాసం రాదు.ఎక్కువ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బియ్యంగా గుర్తించబడింది. చిన్నపిల్లల ఎదుగుదలకు కావలసిన మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్న బియ్యం. దేవాలయాలలో ప్రసాదాలకు, పాయసాలకు చాలా అనువైన రకం. రోజువారి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉండటం వలన ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా చెప్తారు. ముడి బియ్యంగా తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

తులసి బాసో పంట కాలం 135 రోజులు. ఖరీఫ్ కి మాత్రమే అనువైన రకం అంటే రోహిణి కార్తెలో వేసుకోగలిగితే మొదటి పంట 135 రోజులకి వస్తుంది. తరువాత 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మూడో పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సహజంగా ప్రధాన పంటను కోసిన తర్వాత రెండవసారి మూడోసారి కోసినప్పుడు గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ దీని గింజ పరిమాణం తగ్గదు. సువాసన, పరిమళం పెరుగుతుంది. మొదటి కోతకి, రెండవ కోతకి సువాసన పెరుగుతుంది. రెండవ కోతతో పోల్చుకుంటే మూడోసారి కోతకు వచ్చినప్పుడు అందులో సువాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులు విత్తనానికి వినియోగపరిచేటువంటి వాళ్ళు మొదటి కోతలో ఉన్న పంటను మాత్రమే విత్తనానికి వినియోగించాలి.

రెండవ పంట మూడో పంట విత్తనానికి వినియోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి పూర్తిస్థాయిలో మనం చూస్తే 135 రోజుల తర్వాత ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల్ వస్తుంది. రెండవ కోతకి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది. మూడవకోతకి ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనిని పండించవచ్చు. పంట ఒరగదు. ఎంతటి గాలులకైనా తట్టుకొని నిలబడుతుంది. తుఫాన్లు సైతం తట్టుకొని నిలబడి ఉండే రకం. అన్ని ప్రాంతాల వారు ఈ రకాన్ని పండించుకోవచ్చు.

ఇలాంటి అరుదైన వరి రకాలు సేకరించి,పండిస్తున్న అభ్యుదయ రైతు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డిని ప్రక్రుతి సాగు రైతులే కాదు . .. అందరూ అభినందించాల్సిందే .

విత్తనాల కొరకు ఈ రైతును మీరు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తూ పండించే విధానం, రైతులకు వివరిస్తారు. ఈ రైతుని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6300027502, 9440809364

మావోయిస్టుల అలజడి

మావోయిస్టుల అలజడి

ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు – ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత జోరుగా సాగుతోంది. 2027 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్నది కేంద్ర సర్కార్ నిశ్చయం . ఇందులో భాగంగా వరుసగా మావోయిస్టుల ఏరివేత సాగుతోంది . స్వచ్చందంగా లొంగిపోవాలని ఇప్పటికే సర్కార్ అల్టిమేటం జారీచేసింది . లొంగకపోతే మట్టుపెడతామని వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఏరివేత శరవేగంగా సాగుతోంది . ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్‌ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్‌ బృందాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు అనుచరులు ఎన్‌కౌంటర్ అయిన కొద్ది సేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాల సోదాలు చేపట్టారు.

“మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” -మహేష్ చంద్ర లడ్హా, ఇంటెలిజెన్స్ ఏడీజీ

ఈనాడు.. ఎందుకు ఇలా చేస్తోంది . …

ఈనాడు.. ఎందుకు ఇలా చేస్తోంది . …

కంటెంట్ కాపీ.. ఇది పెద్ద విషయం ఏమీ కాదు . .. కానీ ఎందుకు అంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ?

సోషల్ మీడియా వేగంగా పరిగెడుతున్న కాలం ఇది. ఒకరి కంటెంట్ మరొకరు కాపీ కొట్టడం , మార్పులు చేసి వాడుకోవడం . . సహజాతి సహజంగా సాగిపోతున్న రోజులు . దీనిని పెద్దగా పట్టించుకునేవారు కూడా లేరనే చెప్పాలి .

ఈనాడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లను ఉపయోగించుకుని వాటిని షేర్ చేస్తుంటే ఆ క్రెడిట్ ఈనాడు వాళ్ళకే వెళుతుంది కదా . .. అలాంటిది ఎందుకు వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఈనాడు పత్రికలో సెల్ఫ్ యాడ్ ఇచ్చారో జర్నలిస్ట్ వర్గాలలో చర్చ నడుస్తోంది .

తెలుగు వార్తాపత్రికలలో అత్యంత ఆదరణ ఉన్న పత్రిక ఈనాడు . విస్తృతంగా ప్రసారం అయ్యే ఈనాడు, పాఠకులను మరియు సోషల్ మీడియా వినియోగదారులను ఇలా హెచ్చరించడంలో ఉద్దేశ్యం అర్ధం కావడంలేదు .

ఈనాడు యాజమాన్యంలోని రామోజీ గ్రూప్ కంపెనీ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ నోటీసు, అనుమతి లేకుండా వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన వార్తా కథనాలు లేదా ఇ-పేపర్ కంటెంట్‌ను షేర్ చేస్తే కాపీరైట్ చట్టం కింద చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది.

సంక్షిప్తంగా, ఫార్వార్డింగ్, స్క్రీన్‌షాట్‌లు లేదా “ఈనాడు హెడ్‌లైన్‌లతో శుభోదయం” సందేశాలు ఉండకూడదు.

ఈ వైఖరి చాలా ఇతర ప్రచురణలు చేసే దానికి ఎంత విరుద్ధంగా ఉందో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆచరణాత్మకంగా నేడు ప్రతి డిజిటల్ వార్తా సంస్థ కథనాల పైభాగంలో లేదా దిగువన సులభమైన షేర్ బటన్‌లను అందిస్తుంది, పాఠకులను ఈ పదాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. అయితే, ఈనాడు ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈదుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ హెచ్చరిక ఈనాడు దాని కంటెంట్ ఆన్‌లైన్‌లో ఎలా ప్రసారం చేయబడుతుందో లేదా అర్థం చేసుకోబడుతుందో దానిపై గట్టి నియంత్రణను ఉంచడానికి మార్గం కావచ్చు, ముఖ్యంగా రాజకీయ చర్చలు తరచుగా కథనాలను ఆకారంలో లేని సమయంలో.

అయితే, ఒక కథనం ప్రచురించబడిన తర్వాత, అది సహజంగానే ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తుందని విమర్శకులు ఎత్తి చూపారు, అక్కడ పాఠకులు మరియు వ్యాఖ్యాతలు చర్చించడానికి, విశ్లేషించడానికి మరియు విభేదించడానికి కూడా స్వేచ్ఛగా ఉంటారు.

సోషల్ మీడియా ఈ చర్యపై తనదైన శైలిని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పవనాలు మారుతున్నాయని ఈనాడు పెరుగుతున్న భయాన్ని ఈ హెచ్చరిక ప్రతిబింబిస్తుందని చాలా మంది వినియోగదారులు చమత్కరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ఆ బృందం కఠినమైన రోజులు ఎదురుచూస్తుందని సూచిస్తూ, పత్రిక ఆందోళనను ఇది వెల్లడిస్తుందని కొందరు పేర్కొన్నారు.

టీడీపీ , కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చినా . .. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన , అరాచకాలకు పురిగొల్పింది ఆ పార్టీ కీలక నేతలపై చర్యలు తీసుకోకపోవడం ఈనాడుకు కోపం తెప్పిస్తోంది . పైగా జగన్ సీఎంగా ఉన్నపుడు హవా కొనసాగించిన అధికారులలో ఇంకా కొందరు కూటమి పాలనలో సైతం కీ రోల్ పోషిస్తున్నారు . దీనిపై కూడా ఈనాడు అక్కసు వెళ్లగక్కుతోంది .

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, అసంతృప్తి పూర్తిగా తొలగిపోయినట్లు కనిపించడం లేదు. జగన్ ఆన్‌లైన్ సైన్యం – వెక్కిరించడానికి మరియు మీమ్‌లకు – పెరగడం ఈనాడును అంచున ఉంచిందని, డిజిటల్ రంగంలో దాని ప్రభావం జారిపోతుందనే ఆందోళనతో ఉందని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు .

బెంగళూరు ట్రాఫిక్‌తో నరకం ..

బెంగళూరు ట్రాఫిక్‌తో నరకం ..

ప్రతిరోజూ కొత్తగా 2,650 కొత్త వాహనాలు రోడ్డు మీదకు పరుగులు… బెంగళూరులో మొత్తం వాహనాలు కోటి 20 లక్షలు

బెంగళూరు ట్రాఫిక్ తో ఆ నగర ప్రజలకు , రోజు వచ్చిపోయే జనానికి నరకం కనిపిస్తోంది. వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నా . . అందుకు తగ్గట్లు రోడ్లను విస్తరించలేరు కదా …

కర్ణాటక స్టేట్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మహా నగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిడి . శాఖ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో వాహన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌తో పోలిస్తే 46 శాతం మేర పెరిగాయి. సెప్టెంబర్‌లో 56,831 వాహనాలు నమోదుకాగా, అక్టోబర్‌లో అది 86,014కు ఎగబాకింది. అంటే రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు 1,894 నుండి 2,774కి పెరిగాయి – ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యధిక నెలవారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు.ఈ పెరుగుదలలో ప్రధాన పాత్ర ద్విచక్ర వాహనాలదేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ సుమారు 1,900 బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అదనంగా రోజుకి 514 కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో నమోదైన వాహనాల మొత్తం సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. ఇందులో 83.8 లక్షల ద్విచక్ర వాహనాలు, 24 లక్షల కార్లు ఉన్నాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే ఓ ఏడాది కాలంలోనే బెంగళూరు రోడ్లు వాహనాలతో కిక్కిరిసి . .. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడం ఖాయం . స్కూల్స్ , కాలేజీలు టైమింగ్స్ లో మార్పులు చేపట్టడం , సాఫ్ట్ వేర్ ఆఫీసులు సమయాలలో మార్పులు వంటివి చేపట్టడం ద్వారా కొంతవరకు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవచ్చు . దీనికంటే ముందు వాహనాలు సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది .