ప్రతిరోజూ కొత్తగా 2,650 కొత్త వాహనాలు రోడ్డు మీదకు పరుగులు… బెంగళూరులో మొత్తం వాహనాలు కోటి 20 లక్షలు
బెంగళూరు ట్రాఫిక్ తో ఆ నగర ప్రజలకు , రోజు వచ్చిపోయే జనానికి నరకం కనిపిస్తోంది. వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నా . . అందుకు తగ్గట్లు రోడ్లను విస్తరించలేరు కదా …
కర్ణాటక స్టేట్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మహా నగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిడి . శాఖ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో వాహన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌తో పోలిస్తే 46 శాతం మేర పెరిగాయి. సెప్టెంబర్‌లో 56,831 వాహనాలు నమోదుకాగా, అక్టోబర్‌లో అది 86,014కు ఎగబాకింది. అంటే రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు 1,894 నుండి 2,774కి పెరిగాయి – ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యధిక నెలవారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు.ఈ పెరుగుదలలో ప్రధాన పాత్ర ద్విచక్ర వాహనాలదేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ సుమారు 1,900 బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అదనంగా రోజుకి 514 కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో నమోదైన వాహనాల మొత్తం సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. ఇందులో 83.8 లక్షల ద్విచక్ర వాహనాలు, 24 లక్షల కార్లు ఉన్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే ఓ ఏడాది కాలంలోనే బెంగళూరు రోడ్లు వాహనాలతో కిక్కిరిసి . .. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడం ఖాయం . స్కూల్స్ , కాలేజీలు టైమింగ్స్ లో మార్పులు చేపట్టడం , సాఫ్ట్ వేర్ ఆఫీసులు సమయాలలో మార్పులు వంటివి చేపట్టడం ద్వారా కొంతవరకు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవచ్చు . దీనికంటే ముందు వాహనాలు సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది .



