నిజాయితీకి నిలువెత్తు రూపం . . మోక్షగుండం

నిజాయితీకి నిలువెత్తు రూపం . . మోక్షగుండం

ఇంజనీరింగ్ నైపుణ్యంలోనే కాదు . . నైతిక విలువల్లోనూ ఆణిముత్యం విశ్వేశ్వరరావు

2017 ఆగష్టులో జూబ్లీ హిల్ల్స్ పబ్లిక్ స్కూలు విద్యార్థులను ఉద్దేశించి పూజ్య గురువులు చేసిన ప్రసంగములో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ ని గురించిన విశేషములు, శ్రీ విశ్వేశ్వరయ్య గారి జన్మదినము సందర్భముగా…

…ఆ రోజులలో ప్రభుత్వ ఇంజినీర్లు ఎన్నో గ్రామాలలో తిరిగి, వారి నివేదికలు చేతితో వ్రాసి, తయారు చేసి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన పరిస్థితి. ఒకానొక సమయములో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామములో ఒక నివేదిక తయారు చేయటము కొరకు ఆ గ్రామములోని ఒక పెద్ద మనిషి ఇంటిలో బస చేసారు. పగలంతా తిరిగి, అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనము చేసి, రాత్రికి నివేదిక తయారు చెయ్యటానికి ఉద్యుక్తులయ్యారు విశ్వేశ్వరయ్య గారు. ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్తు లేదు. కానీ ఆ నివేదిక వ్రాయటము వాయిదా వేస్తే తాను ఎమైనా మరచిపోతానేమోనని తన సంచీలోనుంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుగులో తన నివేదిక పూర్తి చేసారు వారు.

సహజముగానే పుస్తక పఠనాసక్తులయిన విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పి మరొక కొవ్వొత్తిని వెలిగించి, దాని వెలుగులో తన పుస్తక పఠన చేయసాగారు. ఇది చూచిన ఆ ఇంటి పెద్దాయన విశ్వేశ్వరయ్య గారి వద్దకు వెళ్ళి – “అయ్యా…ఈ రెండు కొవ్వొత్తులు ఏమిటి? ఒక కొవ్వొత్తి ఆర్పి, రెండవ కొవ్వొత్తి కాంతి లో ఎందుకు చదువుతున్నారు?” అని కుతూహలముగా అడిగారు. “నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వము వారు విద్యుత్తు లేనప్పుడు నా ఉద్యోగ ధర్మములో ఉపయోగపడుతుందని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది నా ఉద్యోగము కాదుగా…నాకు ఆసక్తయిన పుస్తక పఠనము. దీనికి వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వ వనరులు దుర్వినియోగ పరచటమవుతుంది కదా…బాధ్యతగల పౌరులుగా మనము అది చేయకూడదు. అందుకే, నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుతా…” అని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు. విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ పెద్దాయన అబ్బురపడ్డారు…

విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ…కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.

ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కూడా తరచూ మోక్షగుండం విశ్వేశ్వరరావు గురించి , అయన నైతికత గురించి చెపుతూ ఉంటారు .

రాజకీయ లబ్ది కోసమే జగన్ . … విజయమ్మ పిటిషన్

రాజకీయ లబ్ది కోసమే జగన్ . … విజయమ్మ పిటిషన్

షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్‌ పిటిషన్‌ – రాజకీయ మైలేజీకి జగన్ కుటుంబ వివాదాన్ని వాడుకోవడం బాధాకరం – చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన వైఎస్ విజయమ్మ

” వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి . . షర్మిలతో ఉన్న దీర్ఘకాల వైరుధ్యాలు, రాజకీయ కలహాల కారణంగానే జగన్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌-NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ;; అని అతని తల్లి , వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అన్నాచెల్లెలి వివాదాల్లో తాను ఇరుక్కుపోయానని ఈ మేరకు చెన్నై నేషనల్‌ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(NCLAT)కి నివేదించారు. రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని వాపోయారు.

ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ను జగన్‌ ఆశ్రయించడానికి కారణం చెల్లి షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలోని ఎన్‌సీఎల్‌ఏటీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్‌లో వాటాల బదలాయింపు, రిజిస్టర్‌లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వెలిబుచ్చారు.

జగన్ రాజకీయ ప్రాపకం కోసమే : కుటుంబ వివాదానికి కార్పొరేట్‌ రంగు పులిమి వాటిని జగన్‌ తన రాజకీయ మేలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్‌డీడ్‌లు కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కార్పొరేట్‌ వివాదానికి సంబంధించినది కాదని అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుద్ధ్యాల ఫలితమేనని విజయమ్మ తేల్చిచెప్పారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్‌ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనన్నారు.

అది చట్టవిరుద్ధం : విజయమ్మ, జనార్దన్‌రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్‌ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్‌లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్‌ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ(NCLAT)లో విజయమ్మ అప్పీల్‌ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్‌ ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది.

అప్పుడే రాజీనామా : సరస్వతి పవర్‌లో తాను ప్రధాన వాటాదారునేనని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన అప్పీలులో విజయమ్మ స్పష్టం చేశారు. వాటాల బదలాయింపునకు ముందు తనకు 48.99 శాతం వాటాలున్నట్లు పేర్కొన్నారు. 2021 జులై 26న జగన్‌ 74 లక్షల 26 వేలు, భారతీరెడ్డి 40 లక్షల 50 వేల వాటాలను ప్రేమతో తన పేరిట గిఫ్ట్‌డీడ్‌లు ఇచ్చారని వివరించారు. 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పదవికి జగన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. గిఫ్ట్‌ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్‌ కోర్టులోనూ జగన్ సవాల్ చేయలేదని విజయమ్మ పేర్కొన్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్‌లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్ పెండింగులో ఉండగా ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే సెటిల్‌ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. సభ్యుల రిజిస్టర్‌పై యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని విజయమ్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులతో జగన్, భారతి, క్లాసిక్‌ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే తనకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుందని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీకి విజయమ్మ నివేదించారు.

ఇరుగు – పొరుగు తలనొప్పులు . .. ఇండియా ఏమి చేయాలి ?

ఇరుగు – పొరుగు తలనొప్పులు . .. ఇండియా ఏమి చేయాలి ?

నేపాల్: యువత ఆగ్రహం, రాజకీయ అనిశ్చితి

మనం బాగుంటే సరిపోదు . ఇరుగు పొరుగు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి అలజడులు , అశాంతి మన పక్కన ఉన్నా మనకు కూడా మనఃశాంతి కరువవుతుంది . ఇది కుటుంబాలకే కాదు . . దేశాలకు వర్తిస్తుంది .

నేపాల్‌లో చెలరేగిన యువత నిరసనలు, ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం తక్షణ కారణమైనప్పటికీ, అసలు కారణాలు నిరుద్యోగం, అవినీతి, పాలన వైఫల్యం. ఈ “జెన్-జీ” నిరసనల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య, ఖాట్మండు మేయర్ బలేంద్ర షా ఒక కొత్త నాయకుడిగా ఆవిర్భవించారు.

నేపాల్‌లో అస్థిరత అంటే, భారత్‌కు తలనొప్పే. మనకు నేపాల్‌తో స్వేచ్ఛా సరిహద్దు ఉంది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడితే, ఆ ప్రదేశాన్ని చైనా తన పలుకుబడి పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఇది భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం.

భారతదేశం ఒక సంక్లిష్టమైన, చారిత్రాత్మకమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. అయితే, గడిచిన ఏడాది, రెండేళ్లలో ఈ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. పాకిస్థాన్ నుంచి మాల్దీవుల వరకు, దాదాపు ప్రతి పొరుగు దేశం తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక పతనం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, జాతి ఘర్షణలు మన సరిహద్దుల వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ అల్లకల్లోలం కేవలం వారి అంతర్గత సమస్య మాత్రమే కాదు, భారతదేశ జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.

పాకిస్థాన్: ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, దాని రాజకీయ, భద్రతా పరిస్థితి మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంది. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని రాజకీయంగా పక్కన పెట్టడంతో దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ అస్థిరతే ఉగ్రవాదులకు వరంగా మారింది. ముఖ్యంగా, తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులు తీవ్రమయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలోనే పాకిస్థాన్‌లో 200లకు పైగా ఉగ్రదాడులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పాకిస్థాన్ అస్థిరత భారత్‌కు ఎప్పుడూ ముప్పే. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పినట్లు, “పాకిస్థాన్ అనుసరిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధ తంత్రం” భారత్ భద్రతకు రెండో అతిపెద్ద ముప్పు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగితే, అది కశ్మీర్‌లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక పతనం అంచున ఉన్న అణ్వస్త్ర దేశం పక్కన ఉండటం, వ్యూహాత్మకంగా భారత్‌కు పెను సవాలు.

బంగ్లాదేశ్: రాజకీయ శూన్యత, మతతత్వం

ఒకప్పుడు స్థిరంగా కనిపించిన బంగ్లాదేశ్, ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. 2024 “జూలై విప్లవం” తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మే 2025లో, హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. ఈ రాజకీయ శూన్యత భద్రతా వ్యవస్థను బలహీనపరిచింది. ఇదే అదనుగా అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మళ్లీ బలపడుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులు బలపడటం భారత్‌కు మంచిది కాదు. ఇది పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా సమస్యలను సృష్టిస్తుంది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లు పునరుజ్జీవం పొందే ప్రమాదం ఉంది. దీనికి తోడు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఉన్న పది లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థుల సమస్య ఉంది. నిధుల కొరతతో వారి శిబిరాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇది అక్రమ వలసలను, మానవ అక్రమ రవాణాను పెంచుతోంది.

శ్రీలంక: ఆర్థిక పునరుజ్జీవనం, జాతి విభేదాలు

2022లో ఘోరమైన ఆర్థిక పతనం తర్వాత, శ్రీలంక నెమ్మదిగా కోలుకుంటోంది. 2025 నాటికి విదేశీ మారక నిల్వలు 6.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది. కానీ, రాజకీయంగా పరిస్థితి సున్నితంగానే ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) ప్రభుత్వం, తమిళ మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. దీనివల్ల జాతి విభేదాలు చాప కింద నీరులా ఉన్నాయి.

శ్రీలంకలో భారత్‌కు అతిపెద్ద ఆందోళన చైనా ప్రభావం. ఆర్థిక సహాయం పేరుతో చైనా, శ్రీలంకలో వ్యూహాత్మకంగా పాగా వేస్తోంది. హంబన్‌తోటలో చైనాకు చెందిన సినోపెక్ నిర్మిస్తున్న 3.7 బిలియన్ డాలర్ల ఆయిల్ రిఫైనరీ, హిందూ మహాసముద్రంలో భారత నౌకా భద్రతకు ప్రత్యక్ష సవాలు.

మాల్దీవులు: చైనా నీడ నుంచి బయటకు..

అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు “ఇండియా ఔట్” ప్రచారంతో అధికారంలోకి వచ్చినప్పుడు, మాల్దీవులు పూర్తిగా చైనా వైపు వెళ్లిపోతుందని భావించారు. కానీ, 2025 మధ్య నాటికి పరిస్థితి అనూహ్యంగా మారింది. జూలై 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన, సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భారత్ సుమారు 560 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని, రక్షణ సహకారాన్ని ప్రకటించింది. ఇది చైనాకు వ్యూహాత్మక చెక్ పెట్టింది.

హిందూ మహాసముద్రంలో మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకమైనవి. అక్కడి ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా మారితే, మన సముద్ర భద్రతకు పెను ముప్పు. ప్రస్తుతం సంబంధాలు మెరుగుపడటం ఒక మంచి పరిణామం, కానీ ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం.

భూటాన్: చైనాతో సరిహద్దు చర్చలు

ప్రశాంతంగా కనిపించే భూటాన్‌లో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, దానివల్ల “బ్రెయిన్ డ్రెయిన్”. రెండోది, చైనాతో జరుగుతున్న సరిహద్దు చర్చలు. డోక్లాం పీఠభూమికి బదులుగా, ఉత్తరాన ఉన్న కొన్ని లోయలను తీసుకోవాలని చైనా భూటాన్‌పై ఒత్తిడి తెస్తోంది.

ఈ ప్రభావం అత్యంత తీవ్రమైనది. డోక్లాం పీఠభూమి, భారత్ యొక్క “సిలిగురి కారిడార్” (చికెన్స్ నెక్) భద్రతకు అత్యంత కీలకం. ఒకవేళ డోక్లాం చైనా చేతికి వెళ్తే, ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశంతో ఉన్న కీలకమైన మార్గంపై చైనా నేరుగా నిఘా పెట్టగలదు. ఇది భారతదేశ భద్రతకు పెను ప్రమాదం.

సరిహద్దుల వెంబడి రగులుతున్న ఈ సంక్షోభాలు, భారతదేశ విదేశాంగ, భద్రతా విధాన రూపకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శరణార్థుల ప్రవాహాన్ని నియంత్రించడం, చైనా వ్యూహాత్మక విస్తరణను అడ్డుకోవడం, అదే సమయంలో ఈ దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించడం ఒక కత్తి మీద సాము లాంటిది. రాబోయే కాలంలో, భారత్ మరింత చురుకైన, దృఢమైన, వ్యూహాత్మక విదేశాంగ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చాణక్యుడి  వ్యాపార వ్యూహాలు — లాభాలు అదరహో…

చాణక్యుడి వ్యాపార వ్యూహాలు — లాభాలు అదరహో…

కౌటిల్యుడిని ఫాలో అయితే విజయమే… బిజినెస్ లో దూసుకుపోవడమే . ..

ఎవరైనా కాస్త తెలివిగా ఉంటే ”చాణుక్యుడు ‘ ‘ అనడం పరిపాటి. అంటే చాణుక్యుడు అంటే తెలివితేటలకు. వ్యూహాలకు పెట్టింది పేరు . అలాంటి చాణుక్యుడి సూత్రాలు పాటిస్తే బిజినెస్ లో కూడా దూసుకుపోవడమే . .. కౌటిల్యుడు . .. అదేనండీ చాణుక్యుడు మరో పేరు . .. అయన చెప్పిన వ్యాపార సూత్రాలు తెలుసుకుందామా . ….

 మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన గురువుగా చాణక్యుడికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆర్థికవేత్తగా, రాజకీయ వ్యూహకర్తగా ఆయనకు ఆయనే సాటి. ఇంతటి ఘనత కలిగిన చాణక్యుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో అర్థశాస్త్రాన్ని రచించారు. ఈ పురాతన గ్రంథాన్ని 15 పుస్తకాలుగా విభజించారు. ఈ అర్థశాస్త్రంలో స్టేట్‌క్రాఫ్ట్, గవర్నెన్స్, ఎకనామిక్స్, డిప్లొమసీకి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. 

 క్రీస్తు పూర్వం చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం వ్యూహాత్మక జ్ఞానానికి శాశ్వతమైన గని వంటిది . ఆధునిక వ్యాపారపు సంక్లిష్ట, పోటీతత్వ వాతావరణానికి దోహదపడే ఎన్నో టిప్స్ అర్థశాస్త్రంలో ఉన్నాయి. మన దేశంలోని ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలు కూడా అర్థశాస్త్ర సూత్రాలను ఫాలో అవుతుంటారు. వాటిని తమ కంపెనీ రూల్స్‌లో అమలు చేస్తుంటారు. మన దేశ సైన్యంలోని ఉన్నతాధికారులకు చాణక్యుడు చెప్పిన వ్యూహ రచనా నైపుణ్యాలను చెపుతూ ఉంటారు .

దూరదృష్టి :వ్యాపార రంగంలో ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలంటే క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని అర్థశాస్త్రం చెబుతోంది. వ్యాపారంలో ఉండే రిస్క్‌ను ముందస్తుగా మదింపు చేసుకోవడం, దానికి అనుగుణంగా చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని చాణక్యుడు సూత్రీకరించారు . చాణక్యుడి అర్థశాస్త్రం నుంచి వ్యూహాత్మక ఆలోచనా విధానం, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు క్లారిటీగా నేర్చుకోవచ్చు. నేటి అధునాతన బిజినెస్‌లకు కూడా ఈ టిప్స్‌ పనికొస్తాయి. కౌటిల్యుని ప్రకారం, వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసే సామర్థ్యం తప్పకుండా వ్యాపారికి ఉండాలి. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ముందుగానే వ్యూహరచన చేసుకోవాలి.

నైతికత :వ్యాపార వ్యవహారాలలో నైతికతకు ప్రధమంగా చోటు ఉండాలని చాణక్యుడు అంటారు. వ్యాపార లావాదేవీలు, వ్యాపార నిర్వహణలో చిత్తశుద్ధి, నిజాయితీ, న్యాయబద్ధత ఉండాలని ఆయన బోధించారు. ఇవి అన్ని కాలాలకూ వర్తించే రూల్స్. కార్పొరేట్ నైతికతల గురించి నేటి కాలంలోనూ ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ సూత్రాలు స్థిరమైన, ప్రసిద్ధ వ్యాపారాలకు పునాదిగా నిలుస్తాయి

నాయకత్వం :వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగాలంటే సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. తన సంస్థలో మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు వ్యాపారి ప్రయత్నించాలి. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించాలి. వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తన ఉద్యోగులు, వాటాదారుల సంక్షేమానికి తగిన ప్రణాళికను అమలు చేయాలి. అంతేకాదు వ్యాపారం చేసేవారికి కచ్చితంగా నైతికత ఉండాలని కౌటిల్యుడు స్పష్టం చేశారు. నేటి వ్యాపారులు కూడా వీటిని అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఆర్థిక నిర్వహణ :వ్యాపారం విజయవంతంగా నిర్వహించాలంటే . .. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. వనరుల కేటాయింపు, ఉత్పత్తి లక్ష్యం, రాబడి విశ్లేషణ, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక విధానాల రూపకల్పనపై వ్యాపారికి అవగాహన ఉండాలి. వివేకంతో వ్యవహరిస్తూ, సమర్థవంతమైన వనరుల నిర్వహణ చేపడితే వ్యాపారికి లాభాలు తథ్యమని చాణక్యుడు క్లారిటీ ఇస్తారు . ఈ ఆర్ధిక నిర్వహణ మేరకే ఏ వ్యాపారమైనా ముందుకు సాగుతుంది .

దౌత్యం :దౌత్యానికి, చర్చలకు మధ్య భేదం ఉంటుంది. ఇవి రెండూ ఒకటేనని మనం భావించకూడదు. దౌత్యం, చర్చల మధ్యనున్న సూక్ష్మభేదాలను చాణక్యుడు అర్థశాస్త్రంలో నిశితంగా వివరించాడు. పొత్తులు పెట్టుకోవడానికి, విభేదాలను పరిష్కరించుకోవడానికి సంబంధించిన సూత్రాలను కూడా అర్ధశాస్త్రంలో ఆయన ప్రస్తావించారు. ఆనాడు చాణక్యుడు వివరించిన చర్చల వ్యూహాలు, సూత్రాలు నేటి వ్యాపారాలకు కూడా వర్తిస్తాయి. వీటిని వినియోగిస్తే కంపెనీల చర్చలు, వ్యాపార విలీనాలు, భాగస్వామ్యాలను సులువుగా చేసుకోవచ్చు. మానవ మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా, తప్పకుండా చాణక్యుడి బోధనలను చదవాల్సిందే.

వ్యూహాల్లో మార్పు :నేటి ప్రపంచం వేగంగా మారుతోంది. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో బోధించారు. దీని వల్ల మార్కెట్‌పై పట్టును కొనసాగించవచ్చని తెలిపారు. నేటి వ్యాపార సిద్ధాంతాలు కూడా ఇదే విధమైన భావనతో ముందుకు సాగుతున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ నియమాలనే అనుసరిస్తుంటాయి. వీటిని పాటిస్తే ఎవరైనా బిజినెస్ లో రాణించవచు . సాటి వ్యాపారుకంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు .

డయాబెటీస్ కంట్రోల్ …. ఫుడ్ ఎంచుకోవడంలోనే..

డయాబెటీస్ కంట్రోల్ …. ఫుడ్ ఎంచుకోవడంలోనే..

అన్నం, రోటీ, చికెన్, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు .. – ఏ క్రమం మధుమేహం మరియు ఊబకాయాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది?
భోజనమ్ సరిగ్గా క్రమం చేయడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకునే మరియు రక్తంలో చక్కెరను నిర్వహించే విధానాన్ని మార్చవచ్చని.. కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణులు సూచిస్తున్న ప్రకారం, భోజనం సరిగ్గా క్రమం చేయడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానం మరియు రక్తంలో చక్కెరను నిర్వహించే విధానం మారుతాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుందని, మధుమేహ నివారణ మరియు నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుందని మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .

ఆహార క్రమము కూడా ముఖ్యమే . ..

మెరుగైన ఆరోగ్యానికి రహస్యం మీరు తినే ఆహారాలలో మాత్రమే కాకుండా, మీరు వాటిని తినే క్రమంలో కూడా ఉంటుందని మీకు తెలుసా? అధ్యయనాల నుండి వచ్చిన ఆధారాల ఆధారంగా, పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, భోజనాన్ని సరిగ్గా క్రమం చేయడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకునే మరియు రక్తంలో చక్కెరను నిర్వహించే విధానం మారుతుంది ..

“మనం వేర్వేరు ఆహారాలను తినే క్రమం రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయ్ . .” అని హైదరాబాద్ కి చెందిన పోషకాహార నిపుణులు డాక్టర్ గౌతమ్ కృష్ణ చెపుతున్నారు .

“ఆహార క్రమం అని పిలువబడే ఈ భావన, కార్బోహైడ్రేట్ల ముందు ఫైబర్ మరియు ప్రోటీన్ తినడం గ్లూకోజ్ స్పైక్‌లను మందగించగలదని, ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుందని మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో మెరుగైన సంఖ్యలకు మద్దతు ఇస్తుందని సూచిస్తుంది” అని ఆయన జోడించారు.

ఆర్డర్ ఎందుకు ముఖ్యం?
కొచ్చికి చెందిన ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ ఒక సాధారణ ఉదాహరణతో ఇలా వివరించారు: “మనం అవసరమైన దానికంటే ఎక్కువ తినేలా చేసేది, ముఖ్యంగా మనం ఆకలిగా ఉన్నప్పుడు, త్వరగా మరియు త్వరగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం.”

“సలాడ్లు, ప్రోటీన్ మరియు బియ్యం లేదా రోటీ వంటి కార్బోహైడ్రేట్లు అనే మూడు ఎంపికలు మీ ముందు ఉండగా భోజనం కోసం కూర్చోవడాన్ని ఊహించుకోండి. మీరు ముందుగా కార్బోహైడ్రేట్లను ఎంచుకుంటే, మీరు అవసరమైన దానికంటే ఎక్కువ తినవచ్చు. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉంటుంది మరియు ఆహారం కోసం ఆరాటపడుతుంది. చాలా కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా ప్రాసెస్ చేయబడినవి, సంతృప్తిని కలిగించవు, అంటే మీరు మరింత ఎక్కువగా తింటూ ఉంటారు,” అని ఆయన అన్నారు.

“చివరికి, మీరు అదనపు కార్బోహైడ్రేట్లను తీసుకుంటారు మరియు అదనపు కేలరీలు కొవ్వుగా మార్చబడతాయి మరియు శరీరంలోని వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి” అని ఆయన పేర్కొన్నారు .

డాక్టర్ టి . రామరాజు …. ఆహారం తీసుకోవడం నియంత్రించడంలో ఎలా సహాయపడుతుందో మరింత వివరించాడు: “ఇప్పుడు అదే భోజనాన్ని ఒక గిన్నె సలాడ్లతో ప్రారంభించడాన్ని ఊహించుకోండి, వీటిలో ఎక్కువగా ఫైబర్ మరియు నీరు ఉంటాయి. వీటిని నెమ్మదిగా ముందుగా తీసుకోవడం ద్వారా, సంతృప్తి ప్రతిస్పందన ప్రారంభమవుతుంది, కాబట్టి మీరు తరువాత ఏమి తినరు.”

“సలాడ్ల తర్వాత గుడ్లు, శనగపప్పు, పప్పు, మాంసం లేదా చేప వంటి ప్రోటీన్లు తీసుకుంటే, మీకు అవసరమైన పోషకాలు లభిస్తాయి మరియు మీరు కార్బోహైడ్రేట్లను చేరుకునే సమయానికి, మీ శరీరానికి అవసరమైన వాటిని మాత్రమే తింటారు. అందువల్ల, మీరు ముందుగా సలాడ్లు తింటే మొత్తం కేలరీల తీసుకోవడం తక్కువగా ఉంటుంది. జీవితకాలంలో గుణించబడిన ఈ అలవాట్లు శరీర బరువులో గణనీయమైన తేడాలను సూచిస్తాయి,” అని తెలిపారు .

తినడానికి సరైన క్రమం
రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఆహారం తీసుకునే క్రమం
రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఆహారం తీసుకునే క్రమం

ఆహార పదార్థాలను ఎలా క్రమం చేయాలో అయ్యంగార్ వివరించారు:

ఫైబర్: కూరగాయలు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ముందుగా తీసుకోవాలి ఎందుకంటే అవి గ్యాస్ట్రిక్ ఖాళీ చేయడాన్ని నెమ్మదిస్తాయి మరియు గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి ప్రవేశించే రేటును తగ్గిస్తాయి.

ప్రోటీన్ మరియు కొవ్వు: అవి రెండవ ప్రాధాన్యతగా ఉండాలి, ఎందుకంటే అవి GLP-1 (గ్లూకాగాన్ లాంటి పెప్టైడ్-1) వంటి హార్మోన్లను ప్రేరేపిస్తాయి, ఇవి జీర్ణక్రియను మరింత నెమ్మదిస్తాయి, గ్లూకోజ్ పెరుగుదలను మితంగా పెంచుతాయి మరియు సంతృప్తిని మెరుగుపరుస్తాయి.

కార్బోహైడ్రేట్లు: చివరిలో తినేటప్పుడు, పిండి పదార్థాలు మరియు చక్కెరలు మరింత నెమ్మదిగా శోషించబడతాయి, దీని వలన రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ స్పైక్‌లు తగ్గుతాయి.

కుబోటా మరియు ఇతరుల (2020) క్రమబద్ధమైన సమీక్షను ఆయన ఎత్తి చూపారు, ఇది కార్బోహైడ్రేట్ల ముందు ప్రోటీన్, కొవ్వు లేదా ఫైబర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా తగ్గుతాయని మరియు HbA1c (గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) మెరుగుపడుతుందని కనుగొంది.

“పిండి పదార్థాల కంటే ముందు ఫైబర్ (కూరగాయలు) తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది, కానీ ఇది Glp-1 స్రావాన్ని పెంచదు, పిండి పదార్థాల కంటే ముందు ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వులను తీసుకోవడం లాంటిది కాదు. ఇది అధ్యయనంలో గుర్తించబడింది. కాబట్టి కూరగాయలు, కొవ్వు-ప్రోటీన్లు మరియు తరువాత కార్బోహైడ్రేట్ల కలయిక కూరగాయలు మరియు కార్బోహైడ్రేట్ల కంటే మంచిది, ”అని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి .

చెన్నై కి చెందిన పోషకాహార నిపుణురాలు డాక్టర్ సౌందర్య ..శరీరంలో క్రమం ఎలా పనిచేస్తుందో వివరించారు: “పిండి పదార్థాలు వాటి గ్లైసెమిక్ సూచికను బట్టి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. ప్రోటీన్ మరియు కొవ్వు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, స్థిరమైన లేదా ఆలస్యమైన గ్లూకోజ్ విడుదలకు కారణమవుతాయి. ఫైబర్ గ్లూకోజ్‌ను పెంచదు కానీ శోషణను నెమ్మదిస్తుంది ద్వారా నియంత్రణను మెరుగుపరుస్తుంది.”

“ఆహార క్రమం ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ప్రతి భోజనంలో మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేనప్పటికీ, ‘ముందుగా కూరగాయలు మరియు ప్రోటీన్లు మరియు తరువాత కార్బోహైడ్రేట్లు’ అనే సాధారణ అలవాటు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో చాలా సహాయపడుతుంది,” అని అన్నారు.
మధుమేహం మరియు ఊబకాయానికి వ్యతిరేకంగా ఒక సాధనం

“ఆహార క్రమం ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది మరియు ఇప్పటికే నిర్ధారణ అయిన వారిలో డయాబెటిస్‌ను బాగా నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది” అని డాక్టర్ వీర్రాజు వివరించారు.

అయితే, అతను అతిగా తినకుండా ఉండేందుకు కూడా హెచ్చరించాడు: “కార్బోహైడ్రేట్లను తగ్గించడం మంచిది. కీటో డైట్ తీసుకోవడం లేదా కార్బోహైడ్రేట్లను 10 శాతానికి తగ్గించడం నిస్సందేహంగా త్వరిత ఫలితాలను ఇస్తుంది, కానీ స్థిరత్వం ఒక సమస్య. దీనికి పరిష్కారం తీవ్రంగా తగ్గించడం కాదు, కానీ దాదాపు 10 శాతం కార్బోహైడ్రేట్లను తగ్గించి, పనీర్, టోఫు, శనగ, పచ్చి శనగ వంటి మొక్కల ప్రోటీన్లతో పాటు గుడ్డు, చికెన్ మరియు చేప వంటి జంతు ప్రోటీన్లతో భర్తీ చేయడం.”

“ఆకుకూరలతో ప్రారంభించి, తరువాత ప్రోటీన్ మరియు చివరకు బియ్యం లేదా రోటీ వంటి జంతువుల ప్రోటీన్‌తో క్రమాన్ని మార్చడం అనేక విధాలుగా సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. ప్రోటీన్ గొప్ప సంతృప్తి విలువను కలిగి ఉంటుంది; ఇది స్వయంచాలకంగా కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గిస్తుంది. ఫైబర్ మరియు ప్రోటీన్ కూడా కడుపు మరియు ప్రేగులలో ఒక పొరను ఏర్పరుస్తుంది, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్‌లో వచ్చే చిక్కులను నివారిస్తుంది, ”అని డాక్టర్ మదన్ మోహన్ జోడించారు.

పిడికిలి గింజలతో ఒక ఆచరణాత్మక చిట్కా
డాక్టర్ మోహన్ కూడా ఆహారం తీసుకోవడం నియంత్రించడానికి ఒక ఉపాయాన్ని పంచుకున్నారు: “మీరు పిడికిలి గింజలు – పిస్తాపప్పులు, బాదం లేదా వేరుశనగలు అయినా – మీ ప్రధాన భోజనానికి ఒక గంట ముందు తింటే, అది చాలా సహాయపడుతుంది. గింజల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచవు మరియు అవి HDL కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి. మీరు వాటిని ఇంతకు ముందు తీసుకున్నందున, మీకు పెద్దగా ఆకలిగా అనిపించదు మరియు సంతృప్తి మెరుగుపడుతుంది..