కుమ్మర్లకు ఉచితంగా పోర్టర్ వీల్ పంపిణీకి కూటమి సర్కార్ సన్నాహాలు — మట్టిపాత్రల ఆరోగ్యంపై ప్రచారం
స్టీల్ . , అల్యూమినియం … తప్పితే ప్లాస్టిక్ . .. ఇంటికి అవసరమయ్యే వస్తువులు , వంట సామగ్రి ఎక్కువగా వీటితోనే . వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . మట్టి పాత్రలలో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మేలని శతాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు . అయితే రెండు , మూడు దశాబ్దాలుగా వాటి వినియోగం గణనీయంగా తగ్గింది . ఇటీవల కాలంలో జనంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మట్టి పాత్రలు వినియోగం క్రమంగా పెరుగుతోంది . మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది .

వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడేలా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సన్నద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వృత్తి పనివారికి శిక్షణతోపాటు వ్యాపార అవకాశాలకు తోడ్పాటు అందించనున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని మట్టిపాత్రల తయారీకి సాంకేతికతను జోడించి విద్యుత్‌తో నడిచే చక్రాన్ని (పోర్టర్ వీల్) కుమ్మర్లకు ఉచితంగా ఇస్తారు. ఆకట్టుకునేలా వివిధ పాత్రల తయారీకి పది రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మార్కెటింగ్ మెళకువలు కూడా నేర్పుతారు .
ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
స్టీల్ అల్యూమినియం పాత్రల్లో ఆహార పదార్థాలు వండడం అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయ్ . ఇది కూడా మట్టి పాత్రలు తమ ఆహార పదార్థాలు వండుకునేందుకు దోహదం చేస్తుంది . అలాగే మనం తీసుకునే పోషకాహార పదార్థాలకు ఎలాంటి హాని జరగకుండా మట్టి పాత్రల్లో వండిన ఆహారపుర్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి పోషక విలువలు త్వరగా అంది జీర్ణ వ్యవస్థ,మిటబాలిజం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ప్లాస్టిక్,అల్యూమినియం వాడకం ఎక్కువైంది. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నాం.
ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ తో పాటు ఇదీవర ఆర్గానిక్ ఫుడ్స్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
రాను రాను ఆహారపు అలవాట్లు మరాటమే కాదు.. ఆహారం తయారు చేసుకునే పాత్రలు కూడా మన ఆరోగ్యం పై అధికంగా ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో చాలావరకు మట్టి పాత్రలు ఉపయోగించి.. ఆ మట్టి పాత్రలోనే ఆహార పదార్థాలు తయారు చేసేవారు. ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ సెలవిస్తున్నారు .
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మట్టి పాత్రల తయారీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. నర్సీపట్నం మండలంలోని వేములపూడి ఖాదీ సొసైటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 120 మందిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
విక్రయాలకు సపోర్ట్ . .. : ఇప్పటివరకు కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికే ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికీ ఇవ్వాలని నిర్ణయించారు. మంజూరైన వాటిలో 80 కుమ్మర్లకు, 20 ఎస్సీలకు, 20 ఎస్టీలకు ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు తయారు చేసిన వస్తువులు కేవీఐసీ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో విక్రయించేలా అవకాశం కల్పిస్తారు. ..వీటోతోపాటు … వివిధ సంస్థల సహకారంతో కూడా అమ్మకలకు సపోర్ట్ ఇవ్వనున్నారు .



