by Srinivas Vedulla | Apr 21, 2025 | ఆంధ్రప్రదేశ్
59 ఎకరాలు – వెయ్యి కోట్ల దోపిడీ.. అంటూ ఇన్విస్టిగేటివ్ స్టోరీ.
ద వైర్ ప్రస్తావించిన అంశాలు ఇవే . ..
విశాఖపట్నం ఐటి హిల్ నం 3లో రూ 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం టీసిఎస్ ముందుకు వచ్చింది . 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది . ఐటి కంపెనీ ఏర్పాటు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది.
ఇక్కడికి సమీపంలో ఐటి పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి కేటాయించారు. దాంతోపాటు ఐపి కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ(ఎఐ) డేటా సెంటర్ ఏర్పాటుకు 5,728 కోట్ల పెట్టుబడితో ఉర్సా క్టస్టర్స్ కంపెనీ ముందుకొచ్చిందన్నది ప్రభుత్వం వాదన. ఆ సెంటర్ ఏర్పాటుకోసం ఈ భూమిని కేటాయించింది. అయితే భూమి కేటాయింపు వివరాలూ, అనుబంధ షరతులూ, పెనాల్టీ క్లాజులు గురించిన పూర్తి నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. రావల్సిన వివరాలు ఎలా ఉన్నా రెండు నెలల ముందు పెట్టిన ఈ కంపెనీకి అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ, ఎవరితో మదింపు చేయించింది, ఈ మదింపు నివేదిక సారాంశం ఏంటి, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన అనుభవం, సామర్ద్ధ్యం విషయంలో ప్రభుత్వాన్ని నమ్మించటానికి, ఒప్పించటానికి ఉర్సా కంపెనీ చేసిన ప్రయత్నాలు ఏమిటనే విషయాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. …
ద వైర్ రాసిన కధనం ప్రకారం . … మూడు నెలలు కూడా పూర్తికాని కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన 59 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి . దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తింది . ఖరీదైన భూమిని ఊరు – పేరు లేని కంపెనీకి కట్టబెట్టడంపై కూటమి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దీనిపై టీడీపీ , జనసేన కేడర్ లో సైతం అనుమానాలు రేకెత్తే రీతిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి .
by Srinivas Vedulla | Apr 18, 2025 | ఆంధ్రప్రదేశ్
వైసీపీ అధికారంలో ఉన్న్డపుడు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆ పార్టీ MLC అనంతబాబు అలియాస్ అనంత ఉదయ భాస్కర్ పై ఉచ్చు బిగుస్తోంది . – కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది .
వీధి సుబ్రహ్మణ్య0. ఒకప్పుడు అనంత్ బాబు కారు డ్రైవర్. ఉద్యోగం మానేసిన తర్వాత అతన్ని హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్లు YSRCP MLC అనంతబాబుపై ప్రధాన అభియోగం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయ అనుచరుడిగా పేరొందిన అనంతబాబు తూర్పు మన్యంలో రెండున్నర దశాబ్దాలుగా అరాచకాలకు పాల్పడుతున్నా అతనికి అన్ని పార్టీలలోనూ ఉన్న బంధు గతం కాపలా కాస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి .
కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.
కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్ డెలివరీ చేశారన్న నేరారోపణలపై నమోదైన కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
తన మాజీ డ్రైవర్‌ను తానే హత్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తరువాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసు అధికారులు చక్రం తిప్పారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి . . ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పొందిన అనంతబాబు రెండేళ్లుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
లోతైన విచారణకు డిమాండ్ . .. సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్ 14న అనుబంధ ఛార్జిషీట్ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్ వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చేలా హత్య జరిగినప్పుడు అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారో పోలీసులు తేల్చడానికి ప్రయత్నించలేదు . ఘటనా స్థలంలో ఎవరున్నారో టవర్ లోకేషన్, గూగుల్ టేక్‌అవుట్, సీసీ ఫుటేజీలతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్‌మెన్లనూ సమగ్రంగా విచారించలేదు. దీనిపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయ్ .
.
సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీసు అధికారులు, గత ప్రభుత్వం సహకరించిందని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. యువకుడి శరీరంపై 31, అంతర్గతంగా మరో మూడు గాయాలు చేయడం ఒక్కరివల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో మరింతమంది ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు విచారణ చేయలేదన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తానని ముప్పాళ్ల సుబ్బారావు ‘అభిన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు .
by Srinivas Vedulla | Apr 17, 2025 | ఆంధ్రప్రదేశ్
గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో గందరగోళం..
మరో 44 వేల ఎకరాలు తీసుకుంటే,, ఈ భూములు ఎవరు కొంటారు ? రెండవ దఫా భూ సమీకరణ చేపడతారన్న భయంతో ముందు తీసుకున్న భూముల లావాదేవీలపై స్తబ్దత
అమరావతి రైతులతో కూటమి సర్కార్ ఆటలాడుకుంటోంది. గతంలో సమీకరించిన 33 వేల ఎకరాల రైతులకు పూర్తిగా ప్లాట్స్ కేటాయింపు ప్రక్రియ జరగకుండానే . . రెండో దఫా పూలింగ్ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
గందరగోళంలో రియల్ ఎస్టేట్ : అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టడానికి కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తున్న వార్తలు రావడంతో ఈ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వేల ఎకరాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరో 44 వేల ఎకరాల సమీకరణ చేస్తే . .. ఈ ప్రాంతంలో భూముల ధరల గణనీయంగా తగ్గుతాయన్న అంచనాలు వస్తున్నాయ్ . ఈ ప్రభవవంతో 2nd పేజ్ – లాండ్ పూలింగ్ లీకులు వచనప్పటి నుంచి 29 గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలపై నీలినీడలు అలుముకున్నాయి .
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరిస్తే.. విజయవాడ సమీపంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది . దీనికి 1200 ఎకరాల భూమి గతంలో సేకరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించాలంటే . . దీనికే మరో 2 వేల ఎకరాల భూసమీకరన్ చేస్తే సరిపోతుంది. రాజధాని భూ సమీకరణ ప్యాకేజ్ టైప్ లో చేస్తే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు . చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఐటీ , AI వంటి కార్యాలయాలు ఉంటె బాగుంటుంది . ఇదే విమానాశ్రయం సమీపంలో, లేదా విమానాశ్రయానికి చేర్చి . . మరో 4,5 వేల ఎకరాల భూమి తీసుకునే విధానాన్ని చంద్రబాబు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆందోళనలో అమరావతి రైతులు : ”చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలయింది . ఆరేడు నెలలుగా రైతుల ప్లాట్లలలో మొలిచిన తుప్పలనే ఇంకా తొలగించలేకపోయారు . అలాంటిది మిగిలిన నాలుగేళ్లలో ఏమి చేయగలరు ? ఎంతవరకు చేయగలరు ? కొత్త నగరం నిర్మించాలంటే కావాల్సిన ప్రాధమిక రహదారులు శరవేగంగా నిర్మిస్తే అభివృద్ధి దానంతట అదే నడుస్తుంది . ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోవడంలేదు . విశ్వ నగరం నిర్మిస్తా . .. అంటూ ప్రగల్బాలు పలుకడం మానుకోవాలి . ” అంటూ తుళ్లూరుకు చెందిన చాగంటి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు .
”ల్యా0డ్ పూలింగ్-2 అంశం తెరపైకి తేవడం వల్ల . .. ఇపుడిపుడే నడుస్తున్న అమరావతి రియల్ ఎస్టేట్ పై పిడుగుపడినట్లయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత పెరుగుతుంది. విశ్వాసం కోల్పోయి తర్వాత అమరావతిని , రాష్ట్రాన్నీ ముంచేస్తారన్న భయం కలుగుతుంది . .. ‘ అని వెలగపూడి కి చెందిన ”శివన్నారాయణ అనే ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేసారు .
చంద్రబాబు నుంచి అమరావతిని కాపాడాలి : ‘ గతంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి అమరావతికి విముక్తి కలిగించాలని ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాం. ఎన్నో ఆందోళనలు చేసాం . చంద్రబాబు వచ్చారని ఎంతో సంబరపడ్డాం . కానీ ఇతని పిచ్చి ఆలోచనలు చూస్తుంటే వీళ్ళే అమరావతిని ముంచేస్తారనిపిస్తోంది . .” అని వడ్లమానుకు చెందిన రాజధాని ఉద్యమ మహిళా నాయకురాలు చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 14, 2025 | ఆంధ్రప్రదేశ్
34 వేల ఎకరాలు సరిపోదట .. మరో 44,670 ఎకరాలు భూమి సమీకరిస్తారట. వేల రైతు కుటుంబాలతో చంద్రబాబు ‘రిస్క్ గేమ్ ‘ ఆడటం ఎంతవరకు కరెక్ట్ ?
Chandrababu is working to sink Amaravati. If this trend continues, Andhra Pradesh will also sink.
అమరావతిలో గతంలో సేకరించిన భూములనే ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కనీసం 10 శాతం పనులు కూడా చేపట్టలేదు. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హడావుడి చేసి . .. అభాసుపాలయ్యారు. 2019-2024 మధ్య సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అరాచకాలను తరిమికొట్టాలని కంకణం కట్టుకున్న జనం ప్రత్యామ్నయంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , బీజేపీ కూటమిని గద్దెనెక్కించారు. కూటమి బలం కంటే . . జగన్ అరాచకాలకు భయపడి కూటమికి ఓట్లేసి గెలిపించిన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్నిక అది .. ఈ మాత్రం చంద్రబాబు అండ్ కో కు బుర్ర, బుద్ధి లేకుండా ఉన్నాయా ? ”అమరావతిలో అనుకున్న పనులేవీ ఇంకా ఆరంభించనేలేదు . . ఉన్న భూములు సరిపోవని , మరో భారీ భూసేకరణకు సిద్ధం కావడం చూస్తుంటే అమరావతిని చంద్రబాబు ముంచేలా కనిపిస్తున్నాడు.. అమరావతినే కాదు . .చంద్రబాబు పాలన ఇదే ధోరణితో సాగితే ఆంధ్రప్రదేశ్ నే ముంచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు . …
మెజార్టీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేసేలా కనిపిస్తోంది. ”అమరావతిని విశ్వ నగరం’గా తీర్చిదిద్దుతానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు . … ప్రకటనలంత బలంగా పనులు మాత్రం చేయించుడలేకపోతున్నారు. కూటమి అధికారం చేపట్టి పది నెలలు దాటుతున్నా . .. 2016 లో రాజధాని కోసం భూములు సేకరించిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తయారు చేసి ఇవ్వలేకపోయారు.
అమరావతిలో గతంలో సమీకరించిన భూములకు సైతం చెప్పుకోదగ్గ ధర పలకడంలేదు. కొర్ కేపిటల్ లో మాత్రం కొంతవరకు నడుస్తోంది. (90 శాతం మందికి 2018-2019లో ఇచ్చారు . వాటిని జగన్ సర్కార్ నిర్వాకంతో తుప్పలు మొలిపించి చెల్లాచెదురు చేశారు . . . వాటిని క్లియర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది)
”అమరావతి భూ సమీకరణ వరల్డ్ రికార్డ్. 34 వేల ఎకరాల భూమిని 29,650 మంది రైతుల నుంచి సమీకరించి . . సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రూపొంచాలని ప్లాన్ చేశారు ” నిజంగా ఇది చారిత్రాత్మకం . అయితే రెండో విడత భూ సమీకరణ అంత ఆషామాషీగా ఉండదు . ..
ఉన్న భూములలోనే మొదలెట్టలేదు . . 44,670 ఎకరాలు ఏంచేస్తారు ?
ఇప్పటికే 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. ప్రభుత్వ , అటవీశాఖకు చెందిన భూములు మరో 4,500 ఎకరాల వరకు ఉంది . మరో 3,500 ఎకరాలు సేకరించాలని గత0లోనే భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. 2016లో భూములు సమీకరణ చేసినా . .. … టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే నిర్మించగలిగారు. సచివాలయం నిర్మించినా , , దానికి తాత్కాలికం అని పేరు పెట్టడంతో అది కూడా చంద్రబాబు ఖాతాలోకి రాలేదు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి . .. అమరావతిపై కక్ష కట్టారు . మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి తెచ్చి . . అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
10 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అమరావతిపై ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంతవరకు ఓకే . పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు . గతంలో ఎమ్మెల్యే , ఎంఎల్సీ క్వాటర్స్ నిర్మాణాలు జరిగాయి. మిగిలిన పనులు ఫిబ్రవరి , మార్చి నెలల్లో మొదలుపెట్టారు . ఇంకొన్ని పనులు ప్రధాని మోడీ చేతులమీదుగా పునఃప్రారంభించిన తర్వాత చేపట్టనున్నారు .
పెట్టుబడిదారులు , పారిశ్రామికవేత్తలు చంద్రబాబును నమ్మడంలేదు: 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వ్యవహారశైలి దేశవ్యాప్తంగా అభాసుపాలయ్యేలా నడిచింది. ఇటీవల తానూ మారానని . . మారిన చంద్రబాబును చూస్తారంటూ పదేపదే ప్రకటలు చేస్తూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజలను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు కాలం చెల్లింది … ఇచ్చిన హామీలు సైతం ”తూచ్ ‘ చెప్పే నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. అలాంటి నేత ఇపుడు రెండో దఫా భూ సమీకరణలో భూములు ఇస్తే . . ఆ రైతులకు భరోసా ఏమిటి ? 2029 లో మరోమారు . .. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఉందా ? రాకపోతే మా పరిస్థితి ఏమిటి ? మేమిచ్చిన భూములలో అభివృద్ధి జరగకపోతే . . మేము ఏమి చేయాలి ? ఆ గ్యారెంటీ చంద్రబాబు ఇస్తారా ? అంటూ రాజధాని ప్రాంత రైతాంగం ప్రశ్నిస్తున్నారు .
రెండేళ్లలో అభివృద్ధి శరవేగంగా చేసి . . ప్రజలను , రాజధాని ప్రాంత వాసులలో నమ్మకం కలిగించడంతోపాటు , బీజేపీ కేంద్ర పెద్దలతో భరోసా ఇప్పించి . . అపుడు భూ సమీకరణకు సన్నాహాలు చేసుకుంటే మంచిది. చంద్రబాబుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లిన ఈ తరుణంలో భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు .
అమరావతి ప్రాంతంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, ఇన్నర్ , అవుటర్ రింగ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.
వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44,670 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రుపొంచిందించి.
ప్రస్తుత0 ఉన్న భూముల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేసిన తర్వాత , చేస్తున్న తరుణంలో భూ సమీకరణ అంటే జనం హర్షిస్తారు తప్ప . .. ఆలూ – చూలు – -లేకుండా తగనమ్మ . .. అంటే జనం ఛీ కొట్టే పరిస్థితి తలెత్తుతుందని చంద్రబాబు తెలుసుకుంటే అమరావతి భవిష్యత్తుకు మేలు జరుగుతుంది . లేదంటే అమరావతిని చేతులారా చంద్రబాబే ముంచేసే దుస్థితి ఎదురవుతుంది .
రాజధాని కోసం అవసరాల రీత్యా రెండో విడత భూ సమీకరణ చేస్తున్నామని ముందే సర్కార్ ప్రకటిస్తే బాగుండేది . అలా కాకుండా . . ఈనాడులో రైతులే తమ భూములను సమీకరించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు కధనాలు రాయించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి . చంద్రబాబు సర్కార్ పై నీలినీడలు అలుముకుంటున్నాయి . తర్వాత ఎలాగూ , ,, సిఆర్డిఏ కమిషనర్ భూ సమీకరణపై ప్రకటన చేశారు . ఈ దొంగాట వల్ల రైతులు , ప్రజలలో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ”అమరావతిని కొండవీటి వాగు , మద్దూరు వాగు ముంచేస్తాయనుకున్నారు . కానీ వాటి ముంపు సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ వాగులు వల్ల ముంపు ఆపిన చంద్రబాబు నిర్వాకమే అమరావతిని ముంచే పరిస్థితి తలెత్తుతుంది . ..” అని ఓ టీడీపీ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.
రైతుల ప్లాట్స్ అప్పగించాలి . . కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది . ఇంకా రైతులకు ఇవ్వాల్సిన రితనబుల్ ప్లాట్స్ అప్పగించలేదు . కనీసం వాటి సరిహద్దులు నిర్ణయించలేదు . ఇలా కాలయాపన చేస్తూ పొతే . . అమరావతి ఇరవై ఏళ్లకు కూడా పూర్తీ కాదు . . ,, – మాగంటి మురళీకృష్ణ . రైతు – తుళ్లూరు .
నవనాగరాలు పూర్తీ చేసి . . తర్వాత విస్తరణకు వెళ్ళాలి . . అమరావతిలో చంద్రబాబు ప్లాన్ చేసిన నవనాగరాల నిర్మాణం పూర్తిచేసిన తర్వాత 44 వేల ఎకరాల విస్తరణకు వెళ్ళాలి . కానీ ఏమీలేకుండానే భూ సమీకరణ అంటూ హంగామా చేయడం చంద్రబాబు విరమించుకోవాలి . – ఎం నాగేంద్ర ప్రసాద్ . – మంగళగిరి
జగన్ మళ్ళీ గెలిస్తే.? ఆంధ్రప్రజల గ్రహపాటు బాగాలేక పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే . .. ఏంటి పరిస్థితి. దీనిపై చంద్రబాబు , ఎలాంటి హామీ ఇస్తారు? మోడీతో హామీ ఇప్పించినా ఇక్కడ రైతులు , ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరు. చంద్రబాబు అమరావతితో ఆటలాడకుండా . .. ముందు ఉన్న భూములలో అభివృద్ధి చేసి . . తర్వాత విడతలవారీగా అవసరమైన భూములు సమీకరించుకోవాలి . – జి . సుందరరావు , అమరావతి .
by Srinivas Vedulla | Apr 9, 2025 | ఆంధ్రప్రదేశ్
”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .
కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .